Low-cost
-
జియో : 10 కోట్ల లోకాస్ట్ స్మార్ట్ ఫోన్లు
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనానికి నాంది పలకనుంది. భారీ ఎత్తున లోకాస్ట్ స్మార్ట్ఫోన్ల తయారీకి సిద్ధమవుతోంది. తాజా నివేదికల ప్రకారం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లోగూగుల్ ఆండ్రాయిడ్ ద్వారా తక్కువ రేటుతో కూడిన 10 కోట్ల స్మార్ట్ఫోన్ల తయారు చేయనుంది. అంతేకాదు ఈ స్మార్ట్ఫోన్లలో డేటాప్యాక్ లను కూడా అందించాలని భావిస్తోంది. బిజినెస్ స్టాండర్డ్ కథనం ప్రకారం డేటా ప్యాక్‌లతో కూడిన100 మిలియన్లకు పైగా ఫోన్లను 2020 డిసెంబర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయనుంది. జియో కోసం "4 జీ లేదా 5 జీ" స్మార్ట్ఫోన్లకోసం గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)ను నిర్మిస్తోందని ఇటీవల రిలయన్స్ అధినేత బిలియనీర్ ముకేశ్ అంబానీ ప్రకటించడం గమనార్హం. (రిలయన్స్ రిటైల్‌లో: కేకేఆర్ భారీ పెట్టుబడి) తద్వారా దేశీయ టెలికాం రంగంలోకి సునామీలా దూసుకొచ్చిన ముకేశ్ అంబానీ సారధ్యంలోని జియో స్మార్ట్‌ఫోన్ తయారీ విభాగంలోతన ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రణాళికలను రచిస్తోంది. కాగా ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్ తన డిజిటల్ యూనిట్లో 4.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు జూలైలో రిలయన్స్ ప్రకటించింది. జియో ప్లాట్‌ఫామ్‌లలో దాదాపు 33 శాతం వాటా విక్రయం ద్వారా 1.52 ట్రిలియన్ డాలర్లు (20.22 బిలియన్ డాలర్లు) మేర పెట్టుబడులను సాధించింది. ఫేస్బుక్, ఇంటెల్, క్వాల్కమ్‌లతో సహా ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి భారీ పెట్టుబడులను సాధించిన సంగతి తెలిసిందే. -
చిన్నతరహ పరిశ్రమలకు తక్కువ ధరలో యాప్స్
-
రష్యాలో తక్కువకే ఎంబీబీఎస్ కోర్సు
తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ కోర్సు కొరుక్కుపేట: తక్కువ ఖర్చుతో వైద్య విద్యనభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు రష్యాలో విశ్వవిద్యాలయాలు ఆహ్వానం పలుకుతున్నట్లు ఆ దేశానికి చెందిన రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు తెలిపారు. పశ్చిమ దేశాలతో పోల్చుకుంటే తమ దేశంలో ఎంబీబీఎస్ విద్యకు అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని వారు తెలిపారు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో వారు మట్లాడుతూ ప్రపంచస్థాయి విద్యకు పేరుగాంచిన రష్యాలో ఎంబీబీఎస్ కోర్సు చేసిన విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా వైద్యసేవలందిస్తున్నట్లు తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో కూడిన ఎంబీబీఎస్ కోర్సు కోసం చాలామంది భారతీయ విద్యార్థులు రష్యన్ వైద్య విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రష్యాలో 57 మెడికల్ వర్సిటీలు ఉన్నాయని నాణ్యమైన విద్యకు ప్రామాణికంగా నిలిచాయని తెలిపారు. పన్నెండు వర్సిటీల్లో ఆంగ్లంలో ఎంబీబీఎస్ విద్యా బోధన అందజేస్తున్నట్టు వెల్లడించారు. అన్ని వర్సిటీలు డబ్ల్యూహెచ్ఓ, యూఎస్ఏ, యూకే, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, భారత్, కెనడాలకు చెందిన మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందినాయన్నారు. రష్యన్ మీడియంలోనూ విద్యార్థులు కోర్సు చేయవచ్చని వివరించారు. కోర్సు పూర్తయిన తర్వాత ఇండియన్ ఎంబీబీఎస్‌కు సమానమైన ఎండీ డిగ్రీని ప్రదానం చేస్తారని తెలిపారు. అర్హతగల విద్యార్థులకు ఉచిత ట్యూషన్, వసతితోపాటు స్కాలర్షిప్ అందజేస్తామన్నారు. విద్యార్థులు ప్లస్‌టూలో కనీసం 50 శాతం మార్కులు సంబంధిత సబ్జెక్టుల్లో పొందినవారు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు కనీసం 40శాతం మార్కులతో పాసై ఉండాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు రష్యా ఎడ్యుకేషన్, 38 ఫస్ట్ ఫ్లోర్, 113/52 అంకుర్ ప్లాజా, జీఎన్‌చెట్టి రోడ్డు, టీనగర్, చెన్నైను సంప్రదించవచ్చన్నారు. -
రీ...టర్న్!
ఫ్లిప్‌కార్ట్‌కు టోకరా వేసిన యువకుడు దాదాపు రెండేళ్లుగా రూ.లక్షల్లో మోసం వనస్థలిపురం పోలీసులకు సంస్థ ఫిర్యాదు అదుపులో నిందితుడు వీర రాఘవరెడ్డి తక్కువ ధరకు వస్తువులంటూ ఇంటర్నెట్లో ప్రకటనలు ఇవ్వడం... వీటిని నమ్మి... ఆన్లైన్లో డబ్బు చెల్లించిన వారికి రాళ్లు.. సబ్బు బిళ్లలు పార్శిల్లో పంపి మోసం చేయడం..వంటి కేసులు ఎన్నో చూశాం. వనస్థలిపురం ఠాణా పరిధిలో దీనికి భిన్నమైన ‘సీన్’ వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్లో వ్యాపారం చేసే ప్రముఖ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కే ఓ యువకుడు టోకరా వేశాడు. దాదాపు రెండేళ్లలో రూ.10 లక్షలకు పైగా స్వాహా చేశాడు. ఈ మోసగాడిని గుర్తించిన సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. - తుర్కయంజాల్ వృత్తిరీత్యా హార్డ్‌వేర్ ఇంజినీరైన వీర రాఘవరెడ్డి (25) సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్లలో నివసిస్తున్నాడు. వివిధ పేర్లు, చిరునామాలతో ఆయన అనేక సిమ్‌కార్డులు తీసుకున్నాడు. ఇంటర్నెట్లో వివిధ పేర్లతో ఈ-మెయిల్ ఐడీలు సృష్టించాడు. ఆన్లైన్లో వ్యాపారం నిర్వహించే ఫ్లిప్‌కార్ట్‌కు గడిచిన రెండేళ్లుగా కంప్యూటర్ మదర్‌బోర్డులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఆర్డర్ చేస్తున్నాడు. ఈ సంస్థ వినియోగదారులకు ఇచ్చే ‘ఈజీ రిటర్న్’ సదుపాయాన్ని తనకు అనుకూలంగా వినియోగించుకున్నాడు. ఆర్డర్... రిటర్న్.. రాఘవరెడ్డి ఫ్లిప్‌కార్ట్‌కు వివిధ ప్రాంతాల బోగస్ చిరునామాను డెలివరీ అడ్రస్‌గా ఇచ్చేవాడు. ఒక్కోసారి ఒక్కో ఈ-మెయిల్ ఐడీ వినియోగించి ఆర్డర్ చేస్తూ వేర్వేరు ఫోన్ నెంబర్లు, అడ్రస్ ఇస్తూ వచ్చాడు. పార్శిల్ తీసుకువచ్చిన డెలివరీ బాయ్స్‌కు ఈ చిరునామా దొరక్కపోవడంతో రాఘవరెడ్డిని ఫోన్లో సంప్రదించేవారు. దీంతో వారి వద్దకే వె ళ్లి వస్తువులు తీసుకునేవాడు. ఆ మదర్ బోర్డుల్లో ఉండే విలువైన చిప్స్‌ను కాజేసి, బోర్డు సరిగ్గా పని చేయట్లేదంటూ సంస్థకు రిటర్న్ చేసి మరోటి తెప్పించుకునేవాడు. డెలివరీ బాయ్స్‌ను అప్రమత్తం చేసి... సుమారు రెండేళ్ల పాటు వీర రాఘవరెడ్డి ఆటలునిరాటంకంగా సాగాయి. ఇదే పంథాను అనుసరిస్తూ దాదాపు రూ.10 లక్షలకు పైగా విలువైన చిప్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను కాజేశాడు. రెండేళ్లుగా బోగస్ చిరునామాలతో సాగిన ‘ఆర్డర్-డెలివరీ-రిటర్న్’ అంశాన్ని ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఉన్నతోద్యోగి వీరేందర్ కుమార్ ఇటీవల గుర్తించారు. తన డెలివరీ బాయ్స్ అందరినీ అప్రమత్తం చేసి మోసగాడిని పట్టుకునేందుకు రంగంలోకి దింపారు. వనస్థలిపురం చిరునామా ఇచ్చి... వీర రాఘవరెడ్డి తాజాగా మరోసారి మరికొన్ని వస్తువులను ఆన్లైన్లో ఫ్లిప్‌కార్ట్‌కు ఆర్డర్ ఇచ్చాడు. వీటిని డెలివరీ చేయడానికి వనస్థలిపురంలోని చిరునామా ఇచ్చాడు. ఈ ‘ఆర్డర్గాడే’ మోసగాడని గుర్తించిన సంస్థ డెలివరీ బాయ్స్ ద్వారా వలపన్నింది. సుష్మా థియేటర్ సమీపంలోని చిరునామాలో డెలివరీ తీసుకున్న రాఘవరెడ్డి... వాటి చిప్స్‌ను తస్కరించి... వస్తువులు బాగాలేవంటూ పాత పాటే పాడి రిటర్న్ చేశాడు. పోలీసుల అదుపులో నిందితుడు... డెలివరీ బాయ్స్ నిఘాతో వీర రాఘవరెడ్డే మోసగాడని గుర్తించిన ఫ్లిప్‌కార్ట్ నిర్వాహకులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను వివిధ కోణాల్లో విచారిస్తున్న పోలీసులు... రికవరీ పైనా దృష్టి పెట్టారు. ఇదే పంథాలో మరేదైనా కంపెనీని మోసం చేశాడా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.