రష్యాలో తక్కువకే ఎంబీబీఎస్ కోర్సు | Low-cost MBBS course in Russia | Sakshi
Sakshi News home page

రష్యాలో తక్కువకే ఎంబీబీఎస్ కోర్సు

Published Tue, Apr 19 2016 3:21 AM | Last Updated on Tue, Oct 16 2018 2:57 PM

Low-cost MBBS course in Russia

తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ కోర్సు
కొరుక్కుపేట: తక్కువ ఖర్చుతో వైద్య విద్యనభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు రష్యాలో విశ్వవిద్యాలయాలు ఆహ్వానం పలుకుతున్నట్లు ఆ దేశానికి చెందిన రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు తెలిపారు. పశ్చిమ దేశాలతో పోల్చుకుంటే తమ దేశంలో ఎంబీబీఎస్ విద్యకు అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని వారు తెలిపారు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో వారు మట్లాడుతూ ప్రపంచస్థాయి విద్యకు పేరుగాంచిన రష్యాలో ఎంబీబీఎస్ కోర్సు చేసిన విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా వైద్యసేవలందిస్తున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో కూడిన ఎంబీబీఎస్ కోర్సు కోసం చాలామంది భారతీయ విద్యార్థులు రష్యన్ వైద్య విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రష్యాలో 57 మెడికల్ వర్సిటీలు ఉన్నాయని నాణ్యమైన విద్యకు ప్రామాణికంగా నిలిచాయని తెలిపారు. పన్నెండు వర్సిటీల్లో ఆంగ్లంలో ఎంబీబీఎస్ విద్యా బోధన అందజేస్తున్నట్టు వెల్లడించారు. అన్ని వర్సిటీలు డబ్ల్యూహెచ్‌ఓ, యూఎస్‌ఏ, యూకే, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, భారత్, కెనడాలకు చెందిన మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందినాయన్నారు.  

రష్యన్ మీడియంలోనూ విద్యార్థులు కోర్సు చేయవచ్చని వివరించారు. కోర్సు పూర్తయిన తర్వాత ఇండియన్ ఎంబీబీఎస్‌కు సమానమైన  ఎండీ డిగ్రీని ప్రదానం చేస్తారని తెలిపారు. అర్హతగల విద్యార్థులకు ఉచిత ట్యూషన్, వసతితోపాటు స్కాలర్‌షిప్ అందజేస్తామన్నారు.  విద్యార్థులు ప్లస్‌టూలో కనీసం 50 శాతం మార్కులు సంబంధిత సబ్జెక్టుల్లో పొందినవారు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు కనీసం 40శాతం మార్కులతో పాసై ఉండాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు రష్యా ఎడ్యుకేషన్, 38 ఫస్ట్ ఫ్లోర్, 113/52 అంకుర్ ప్లాజా, జీఎన్‌చెట్టి రోడ్డు, టీనగర్, చెన్నైను సంప్రదించవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement