l&t metro rail
-
అమ్మకానికి ఎల్&టి మెట్రోరైల్ భూములు?
-
సిప్లా- తేజస్ నెట్వర్క్స్ .. అదుర్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో దేశీ ఫార్మా రంగ దిగ్గజం సిప్లా లిమిటెడ్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. మరోపక్క డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ లిమిటెడ్ నుంచి ఆర్డర్‌ను పొందినట్లు బ్రాడ్‌బ్యాండ్ సేవల కంపెనీ తేజస్ నెట్వర్క్స్ వెల్లడించింది. దీంతో రెండు కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. ఫలితంగా భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. సిప్లా లిమిటెడ్ షేరు 52 వారాల గరిష్టానికి చేరగా.. తేజస్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకడం విశేషం! ఇతర వివరాలు చూద్దాం.. సిప్లా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో సిప్లా నికర లాభం 27 శాతం పెరిగి రూ. 566 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 9 శాతం బలపడి రూ. 4346 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. దేశీ బిజినెస్ 10 శాతం వృద్ధితో రూ. 1608 కోట్లకు చేరినట్లు సిప్లా పేర్కొంది. వర్ధమాన మార్కెట్లలో అమ్మకాలు మరింత అధికంగా 64 శాతం జంప్‌చేసి రూ. 457 కోట్లను తాకినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో సిప్లా షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం దూసుకెళ్లింది. రూ. 793కు చేరింది. ఇది 52 వారాల గరిష్టం కాగా.. గత 6 నెలల్లో ఈ షేరు 74 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. తేజస్ నెట్వర్క్స్ మౌలిక సదుపాయాల దిగ్గజం ఎల్అండ్టీ కన్స్ట్రక్షన్ నుంచి GPON ఆధారిత ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్రొడక్టుల సరఫరా కోసం ఆర్డర్ లభించినట్లు తేజస్ నెట్వర్క్స్ తాజాగా పేర్కొంది. రూ. 66 కోట్ల విలువైన ఈ ఆర్డర్లో భాగంగా గరిష్ట పనితీరు చూపగల మెట్రో ఇథర్నెట్ స్విచెస్‌ను సైతం సరఫరా చేయవలసి ఉంటుందని తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో తేజస్ నెట్వర్క్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 64 సమీపంలో ఫ్రీజయ్యింది. -
మెట్రో నష్టాన్ని చెల్లించండి!
సాక్షి, హైదరాబాద్: మూడు నెలలుగా డిపోలకే పరిమితమైన మెట్రో రైళ్లతో నిర్మాణ సంస్థకు వాటిల్లిన నష్టాన్ని పరిహారంగా అందజేయాలని మెట్రో నిర్మాణ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈమేరకు ఎల్అండ్టీ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసినట్లు సమాచారం. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ..హైదరాబాద్ మెట్రో రైలు సంస్థలు అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ అనధికారికంగా విషయం బయటకు పొక్కడం గమనార్హం. నిర్మాణ ఒప్పందం ప్రకారం మెట్రో నిర్మాణానికి నిర్మాణ సంస్థ చేసిన వ్యయాన్ని..సుమారు 35 ఏళ్లపాటు ప్రయాణికుల చార్జీలు, వ్యాపార, వాణిజ్య ప్రకటనలు, వాణిజ్య స్థలాలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించని పక్షంలో కనీసం 3 నెలలపాటు జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు మెట్రో నిర్వహణ ఒప్పందాన్ని మరో 4–6 నెలల పాటు పెంచాలని లేఖలో కోరినట్లు సమాచారం. ఈ ఏడాది మార్చి 22 నుంచి మెట్రో రైళ్లు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, జేబీఎస్–ఎంజీబీఎస్, ఎల్బీనగర్–మియాపూర్ మూడు రూట్లలో 69 కి.మీ మార్గంలో మెట్రో అందుబాటులో ఉన్న విషయం విదితమే. నిత్యం 4 లక్షల మంది..సెలవురోజుల్లో ç 4.5 లక్షల మంది మెట్రో జర్నీ చేసేవారు. దీంతో ప్రయాణికుల చార్జీలు, వ్యాపార, వాణిజ్య ప్రకటనల ద్వారా నిర్మాణ సంస్థకు ప్రతినెలా రూ.50 కోట్లు రెవెన్యూ ఆదాయం లభించేది. గత 3 నెలలుగా ఆదాయం లేకపోవడంతో రూ.150 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. మెట్రో స్టేషన్లు, డిపోలు, రైళ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు వెరసి సంస్థకు నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతుండటం గమనార్హం. నాడు నిర్మాణ వ్యయం..నేడు నిర్వహణ వ్యయం.. మెట్రో ప్రాజెక్టు సాకారం అయ్యేందుకు 2011 నుంచి 2017 వరకు ప్రస్థానం కొనసాగింది. ఆస్తుల సేకరణ, న్యాయపర చిక్కులు, రైట్ ఆఫ్ వే సమస్యల కారణంగా ప్రాజెక్టు నిర్మాణం రెండేళ్లు ఆలస్యమైంది. దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.14 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. పెరిగిన నిర్మాణ వ్యయాన్ని చెల్లించాలని కూడా గతంలో నిర్మాణ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పట్లో లేఖ రాసిన విషయం విదితమే. తాజాగా నిర్వహణపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్న సంస్థ నిర్వహణ భారాన్ని పరిహారంగా చెల్లిం చాలని కోరడం గమనార్హం. కాగా దేశ రాజధాని ఢిల్లీ..మన పొరుగునే ఉన్న చెన్నై, బెంగళూరు, ముంబై మహానగరాల్లో మెట్రో ప్రాజెక్టులను అక్కడి ప్రభుత్వాలు, ప్రత్యేక కార్పొరేషన్ల ద్వారా నిర్వహిస్తున్నాయి. కానీ నగరంలో చేపట్టిన మెట్రో ప్రాజెక్టు పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యం తో ప్రపంచం లోనే అతిపెద్దది కావడం విశేషం. ఈ నేపథ్యంలో నష్టాన్ని ప్రభుత్వం కూడా భరించాలని ఈ సంస్థ కోరుతుండటం గమనార్హం. నష్టాల బాట ఎన్నాళ్లో? లాక్‌డౌన్‌కు ముందు లాభం..నష్టం లేని స్థితికి చేరుకుంటున్న తరుణంలో కోవిడ్ విసిరిన పంజాకు మెట్రో నిర్మాణ సంస్థ కుదేలైపోయింది. లాక్డౌన్ పేరుతో భారీ నష్టాన్ని మూటగట్టుకుంటోంది. సంస్థ కోరినట్లుగా పరిహారం చెల్లిస్తుందా..నిర్వహణ గడు వు పొడిగిస్తుందా అన్న విషయం తేలాల్సి ఉంది. -
‘ఎల్ అండ్ టీ’కి అవార్డు
సాక్షి, హైదరాబాద్: ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంస్థ (ఎంఆర్హెచ్ఎల్) అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘డైనమిక్ సీఐవో స్మార్ట్ ఇన్నోవేటర్ అవార్డు’ను అందుకుంది. క్లౌడ్ ఆధారిత మానవ వనరుల వ్యవస్థ ‘డారి్వన్ బాక్స్ హెచ్ఆర్ఎంఎస్’ను అమలు చేసినందుకుగాను ఈ అవార్డును అందుకుంది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఎంటర్ప్రైజ్ ఇన్నోవేషన్ సదస్సు–2019లో ఎల్ అండ్ టీ ఎంఆర్హెచ్ఎల్ తరఫున ఐటీ, ఎంటర్ప్రైజెస్ హెడ్ అనిర్బన్ సిన్హా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ ఎంఆర్హెచ్ఎల్ ఎండీ అండ్ సీఈఓ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ఈ అవార్డు తమ సంస్థకు ఎంతో గర్వకారణమని అన్నారు. అత్యుత్తమ శ్రేణి సాంకేతికతను అందించ డంతో పాటు, వినియోగంలోనూ తమ నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనమని కొనియాడారు. -
ఉద్యోగాల పేరుతో టోకరా
ఉప్పల్: ఎల్అండ్టీ మెట్రో రైల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఉప్పల్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఉప్పల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన వెలగపూడి రామకృష్ణ హైదరాబాద్‌లోని అంబర్పేట్ తిలక్‌నగర్‌లో ఉంటూ పలు విభాగాల్లో పబ్లిక్ రిలేషన్ అఫీసర్‌గా పని చేస్తున్నాడు. అతను నిజామాబాద్ జిల్లా ఫతేనగర్‌కు చెందిన చిల్లా మహాలక్ష్మి, మిషన్ భగీరథలో డీఈగా పని చేస్తున్న తన బావ బండారు లక్ష్మణ్‌రావు, హైకోర్టు న్యాయవాది గడ్డం శ్రీధర్‌రెడ్డి కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఎల్‌అండ్‌టిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని తెలుగు రాష్ట్రాలకు చెందిన 161 మంది నిరుద్యోగులకు ఎర వేశారు. వారి నుంచి రూ 80 లక్షలు వసూలు చేశారు. రామకృష్ణ వారిలో కొందరిని నకిలీ ఆర్డర్ కాపీలు తయారు చేసి ఇచ్చాడు. దిల్సుఖ్నగర్ త్రివేణినగర్‌కు చెందిన లావణ్య అనే యువతి ఫిర్యాదు చేయడంతో ఈ నెల 9న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఉప్పల్ పోలీసులు గురువారం రామకృష్ణ, మహాలక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిపై నగరంలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో 15 కేసులు ఉన్నట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు గడ్డం శ్రీధర్‌రెడ్డి, బండారు లక్ష్మణ్‌రావు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి కారు, రెండు సెల్ఫోన్లు, నకిలీ ఆర్డర్ కాపీలు, రూ రూ.70వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
ఆగిన మెట్రో రైలు పనులు
రాజధాని నగరంలో ట్రాఫిక్ సమస్యలను తీరుస్తుందని ఆశిస్తున్న మెట్రో రైలుకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. సుల్తాన్ బజార్, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో భూగర్భ మెట్రోరైలు నిర్మాణం చేపట్టాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన షరతు ఇప్పటికే కొంత అయోమయం సృష్టించగా, ఇప్పుడు ఎల్అండ్టీ మెట్రో రైల్ సంస్థకు, కాంట్రాక్టర్లకు మధ్య మరో వివాదం మొదలై.. అది కాస్తా ముదిరింది. తమకు డబ్బులు చెల్లించలేదంటూ కాంట్రాక్టర్లు ఎల్అండ్ టీ మెట్రో రైలు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇదే కారణంతో ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న ఉప్పల్-మెట్టుగూడ మార్గంలోని పనులను నిలిపివేశారు.