machilipatnam beach
-
Fact Check: బైక్‌పై బాలుడి మృతదేహం వార్తల్లో అసలు వాస్తవం ఇదీ..
సాక్షి, కృష్ణాజిల్లా: మచిలీపట్నం బీచ్‌లో మృతి చెందిన బాలుడిని ద్విచక్రవాహనంపై తరలించారని, పోలీసులు సరిగా స్పందించలేదన్న వార్తల్లో వాస్తవం లేదని కృష్ణాజిల్లా పోలీసులు వెల్లడించారు. పోలీసులు వాహనం ఏర్పాటు చేయలేదని చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసినా, పోలీసు శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు బాలుడి మృతిపై కృష్ణాజిల్లా పోలీసు కార్యాలయం ఓ ప్రకటన చేసింది. పోలీసుల ప్రకటన ప్రకారం.. గొడుగు పేటకు చెందిన గోళ్ల నవీన్ కుమార్ అనే బాలుడు తన స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర స్నానానికి మంగినపూడికి ఆదివారం వెళ్ళాడు. ఈ క్రమంలో అలల ఉధృతికి సముద్రంలో గల్లంతయ్యాడు. తనతో కలిసి స్నానానికి వెళ్లిన మరో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరుకుని.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడే విధుల్లో ఉన్న స్థానిక రాబర్ట్ సన్ పేట ఇన్స్పెక్టర్, బందరు తాలూకా, ఆర్ పేట ఎస్ఐలు, మెరైన్ ఎస్ఐ, సిబ్బంది బీచ్‌లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడు గల్లంతైన సమాచారం తల్లిదండ్రులకు తెలియపరిచారు. చీకటి పడే వరకు గాలించినా ఫలితం లేకపోయింది. సోమవారం తెల్లవారుజాము నుంచి గాలింపును తిరిగి కొనసాగించారు. పెదపట్నం, ఇంతేరు చిన్న గొల్లపాలెం వరకు ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. మరోవైపు.. పెదపట్నం బీచ్ ఒడ్డుకు బాలుడి మృతదేహం కొట్టుకు వచ్చిందని స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన పోలీసు వారికి సమాచారం ఇవ్వకుండా సంఘటన స్థలానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై బాలుడి మృదేహాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. బాలుడు మృతదేహం పెదపట్నం బీచ్ వద్ద లభ్యమైందని పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ద్విచక్ర వాహనంపై వస్తున్న బాధిత కుటుంబాన్ని ఆపి ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి బాలుడి మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ క్రమంలో పోలీసు వారు సరైన గాలింపు చర్యలు చేపట్టలేదని, మృతదేహాన్ని తరలించడానికి సైతం వాహనం ఏర్పాటు చేయలేదని, సామాజిక మాధ్యమాల వేదికగా కొంతమంది అసత్యాలను ప్రచారం చేశారు. గాలింపు చర్యలు వేరు వేరు ప్రాంతంలో జరగటం వలన పెదపట్నం బీచ్ వద్దకు చేరుకునే సరికి సమయం పట్టింది గాని, ఇందులో పోలీసు వారు సరిగా స్పందించలేదన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఇలాంటి అసత్య ఆరోపణలు ప్రచారం చేసిన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవడం తప్పదని పోలీసులు హెచ్చరించారు. పోలీసు వారిని సంప్రదించి ఎలాంటి వివరణ తీసుకోకుండా తమప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించాలని చూస్తే చర్యలు తప్పవని బందరు డీఎస్పీ మాసుం భాష హెచ్చరించారు. ఇదీ చదవండి: Fact Check: 'ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం దారుణం' -
ఒడ్డుకు రాగానే ఫోన్ చేస్తానన్నావు కదమ్మా!
కృష్ణా (మచిలీపట్నంటౌన్): సరదాగా బీచ్‌లో గడుపుదామని వచ్చిన విద్యార్థినులను రాకాసి అలలు మింగేశాయి. మచిలీపట్నానికి చెందిన కళ్లేపల్లి పూజిత (22), ఏలూరు జిల్లా గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన ప్రమీలారాణి జాస్మిన్(22), అదే మండలం గరగపర్రు గ్రామానికి చెందిన దత్తల ఆశాజ్యోతి భీమవరంలోని విష్ణు కాలేజీలో బీ–ఫార్మసీ చదువుతున్నారు. ఈ నెల 21వ తేదీతో ఫైనల్ ఇయర్ పరీక్షలు ముగియటంతో జాస్మిన్, ఆశాజ్యోతి కలసి స్నేహితురాలు పూజితతో మచిలీపట్నం వచ్చారు. పూజిత ఇంటి వద్ద ఆదివారం ఉల్లాసంగా గడిపారు. సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో బీచ్‌కు చేరుకున్నారు. స్నానం చేస్తుండగా ఒక్కసారిగా రాకాసి అల దాడితో ముగ్గురూ నీళ్లలోకి వెళ్లిపోయారు. స్థానికులు వెంటనే గమనించి ఆశాజ్యోతిని రక్షించగలిగారు. పూజిత, జాస్మిన్లను మెరైన్ పోలీసులు గాలించి ఒడ్డుకు చేర్చినా, అప్పటికే వారిరువురు మృతి చెందారు. రూరల్ ఎస్ఐ జి.వాసు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను 108లో బందరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు పంచనామా నిర్వహించారు. ఒడ్డుకు రాగానే ఫోన్ చేస్తానన్నావు కదమ్మా! అమ్మా! నేను బీచ్‌లో స్నానానికి వెళుతున్నా.. ఒడ్డుకు రాగానే నేనే ఫోన్ చేస్తా... ఈలోపు నువ్వు చేయొద్దని చెప్పావు... సముద్రంలోకి వెళ్లి మాయ మైపోయావా అమ్మా..అంటూ జాస్మిన్ తల్లి కాకర్ల సుభాషిణి భోరున విలపించటం చూపరులను కలచివేసింది. జాస్మిన్ మృతి వార్త తెలిసిన ఆమె తల్లిదండ్రులు అగస్టీన్, సుభాషిణి, సోదరుడు రాజు హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. జాస్మిన్ తండ్రి పిప్పర లోని పెంతెకోస్తు చర్చి పాస్టర్. తల్లిదండ్రులిద్దరూ తమ కుమార్తెను తలుచుకుంటూ రోదించటం స్థానికులను కంట తడి పెట్టించింది. కానరాని లోకాలకు తరలిపోయావా తల్లీ! బీచ్‌లో తమ కుమార్తె పూజిత, ఆమె స్నేహితురాలు జాస్మిన్ మృతి చెందిన వార్త తెలుసుకున్న పూజిత తండ్రి కృష్ణవరప్రసాద్, తల్లి లక్ష్మి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కుప్పకూలిపోయారు. పూజిత మృతదేహంపై పడి భోరున విలపించారు. బందరు మండలం గుండుపాలెంకు చెందిన కృష్ణవరప్రసాద్ పది ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ కుమార్తెను చదివిస్తున్నారు. పెద్దకుమార్తెకు పెళ్లి చేశారు. కుమారుడు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. స్వగ్రామం గుండుపాలెం నుంచి కొన్నేళ్ల క్రితం నగరంలోని పరాసుపేటకు వచ్చి నివసిస్తున్నారు. శనివారం చివరి పరీక్ష కావటంతో కృష్ణవరప్రసాద్ భీమవరం కారు వేసుకుని వెళ్లి కుమార్తె పూజితతో పాటు ఆమె స్నేహితురాళ్లు జాస్మిన్, ఆశాజ్యోతిలను బందరు తీసుకువచ్చారు. జూన్ 1న కోయంబత్తూరు ఇంటర్వ్యూకు వెళ్లేవాళ్లం పూజిత, నేను జూన్ 1న కోయంబత్తూరుకు ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళ్లేవాళ్లం. మేమిద్దరం క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యాం. ఈలోగా ఇలా జరిగింది. కలిసి ఆనందంగా గడిపిన మా ముగ్గురిలో ఇద్దరు మృతి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. – ఆశాజ్యోతి, మృత్యుంజయురాలు -
తప్పతాగి మహిళలతో అసభ్యంగా ప్రవర్తన
-
బందర్ బీచ్‌లో భారీ అగ్నిప్రమాదం
-
బందర్ బీచ్‌లో భారీ అగ్నిప్రమాదం
మచిలీపట్టణం : కృష్ణా జిల్లా మచిలీపట్టణం మంగినపూడి బీచ్‌లోని వైఎస్సార్ పిషర్మెన్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా గురువారం ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. వివరాలు..తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ నుంచి వలస వచ్చిన మత్స్య కారులు మంగినపూడి బీచ్‌లోని వైఎస్సార్ పిషర్మెన్ కాలనీలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో కాలనీలోని 250 గుడిసెలకు గానూ 200 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది.