నేడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు రాక
అనంతపురం సెంట్రల్ : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సోమవారం జిల్లాకు రానున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిలమత్తూరు మండలంలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల పరిశీలనకు ఆయన వెళ్లనున్నారని పేర్కొన్నారు. చిలమత్తూరు మండలంలోని కొడికొండ చెక్‌పోస్టు ప్రాంతంలో 2008లో రైతుల నుంచి బలవంతంగా సేకరించిన 8,844 ఎకరాలు నాలెడ్జ్ హబ్‌కు ప్రభుత్వం అప్పగించిందనీ, అయితే సదరు సంస్థ ఒక పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. పైగా ఆ సంస్థ ఈ భూములను తాకట్టు రూ.700 కోట్లు వరకూ రుణం పొందినట్లు తెలిపారు. ఇప్పటికీ అనేక మంది రైతులకు పరిహారం అందలేదనీ, ఈ సందర్భంగా ఈ భూనిర్వాసితులను పరామర్శించేందుకు మధు జిల్లా వస్తున్నట్లు రాంభూపాల్ తెలిపారు.