Madhu Yakshi Goud
-
కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణ చేపడతాం: మధుయాష్కీ
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. త్వరలోనే కేసీఆర్ ఫామ్ హౌస్‌పై విచారణ చేసి అవినీతిని వెలికితీస్తామని హెచ్చరిక చేశారు. దీంతో, తెలంగాణలో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. కాగా, మధు యాష్కీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్ఎస్ నేతలు గుంట నక్కలా వేచి చూస్తున్నారు. కానీ, మా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. అనేక మంది విపక్ష ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. నేను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. పార్టీ గెలుపు కోసం పనిచేస్తాను. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష పదవి ప్రస్తుతం ఖాళీగా లేదు. అధిష్టానం బాధ్యతలు ఇస్తే నిర్వహిస్తాను’ అని స్పష్టం చేశారు. -
స్టాంపింగ్ తంటా.. మధు యాష్కీ ట్వీట్ వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు స్టాంప్ వేయడానికి ఉపయోగించే సిరా నాణ్యతపై ఆందోళకర విషయం వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు వేసే స్టాంపింగ్ తరువాత తన చేతిపైవచ్చిన కెమికల్ రియాక్షన్ గురించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధుయాష్కీగౌడ్ ట్వీట్ చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఉపయోగిస్తున్న ఇంక్ కారణంగా తన చేతికి ఇన్ఫెక్షన్ వచ్చిందంటూ కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ట్యాగ్ చేశారు. దీన్ని పరిశీలించాలంటూ సంబంధిత ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందిస్తూ హర్దీప్ పూరి ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. మంత్రి సత్వర స్పందనపై మధు యాష్కీ సంతోషం వ్యక్తం చేశారు. తనలాంటి అనుభవం మరో ప్రయాణికుడికి రాకూడదని కోరుకున్నారు. అటుఈ అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ స్పందించిన ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినందుకు మధుయాష్కీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కరోనా మహమ్మారి విలయంతరువాత విదేశీ విమాన ప్రయాణీకులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల క్వారంటైన్ నిబంధనల కనుగుణంగా కొన్ని విమానాశ్రయాలలో స్టాంపింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా గడిచిన 24 గంటల్లో 74,441 కరోనా కేసులతో, ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 66,23,815కు చేరింది. మరణించిన వారి సంఖ్య 1,02,695 గా ఉంది. Dear @HardeepSPuri Ji, can you please look into the chemical being used at Delhi airport for stamping on passengers coming from abroad? Yesterday I was stamped at @DelhiAirport and this is how my hands look now. pic.twitter.com/Gt1tZvGc8L — Madhu Goud Yaskhi (@MYaskhi) October 4, 2020 -
హ్యాట్రిక్ రేసులో ఐదుగురు వీరులు
సాక్షి డెస్క్, నిజామాబాద్ : ఎన్నికలలో వరుసగా మూడుసార్లు గెలవడం అరుదు. ఇలా గెలిస్తే హ్యాట్రిక్ సాధించారంటాం. ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నవారిలో పలువురు అభ్యర్థులు ఈ అరుదైన ఘనత సాధించడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. నిజామాబాద్ అర్బన్‌నుంచి రెండుసార్లు గెలిచిన యెండల లక్ష్మీనారాయణ సైతం హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి పోటీ చేస్తున్నాయి. అయితే ఈసారి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాకుండా నిజామాబాద్ పార్లమెంట్ స్థానంనుంచి బరిలో ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సైతం ఈ ఘనత సాధించడానికి ఒక్క విజయం దూరంలోనే ఉన్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ నమోదు చేసిన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి నాలుగో విజయం కోసం మరోసారి బోధన్నుంచే బరిలో నిలిచారు. ఈయన 1999 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. -
అభివృద్ధికి సంకేతం..తెలంగాణ
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం దేశంలో అభివృద్ధికి సంకేతంగా నిలవాలని జిల్లా విజిలెన్స్ మాని టరింగ్ సభ్యులు ఆకాంక్షించారు. అరవై ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరిస్తోందన్నారు. ఇక అన్ని పార్టీలు, సభ్యులు కలిసికట్టుగా తెలంగాణ అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. శనివారం స్థానిక ప్రగతిభవన్‌లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సభలో ఆద్యంతం తెలంగాణ రాష్ట్రంపై చర్చ జరిగింది. సమావేశం ప్రారంభానికి ముందు కమిటీ సభ్యులు, జిల్లా కలెక్టర్, అధికారులు తెలంగాణ అమరువీరులకు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కమిటీ ైచె ర్మన్, ఎంపీ మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్నారు. సీమాంధ్రులు తెలంగాణ నిధులను దోచుకున్నారని ఆరోపించారు. శుక్రవారం కేబినెట్ ఆమోదింపజేసిన కేంద్రీయ విశ్వవిద్యాలయం విషయంలో కూడా అడ్డుతగిలారన్నారు. తాను స్వయంగా కేంద్రమంత్రి పల్లంరాజుతో కలిసి విద్యాలయంపై చర్చించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పుంజుకుంటుందన్నారు. రాష్ట్రపతి పాలనలో కలెక్టర్ జిల్లా అభివృద్ధికి కృషిచేస్తారనే నమ్మకం తనకుందన్నారు. ఎన్నికలపై తమ దృష్టి ఉంటుందని, జిల్లా అభివృద్ధికి కలెక్టర్, జేసీ ఇతర ఉన్నతాధికారులు కృషిచేస్తారని ఆశిస్తున్నామన్నారు. అభివృద్ధే నా నినాదం జిల్లా అభివృద్ధే నా నినాదం. గత న వంబర్ నుంచి జిల్లా లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. నిర్మల్ అభియాన్ కింద 1.20లక్షల మరుగుదొడ్ల ని ర్మాణానికి మంజూరు ఇచ్చాం. ఇప్పటికీ 93 వేలు ప్రారంభిం చి, 24 వేలు పూర్తి చేశాం. 30 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందించాం. ప్రభుత్వ పథకాల శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలకు ప్రొటోకాల్ నిబంధనలను అధికారులకు పంపించాం. పీఓపీ కింద అత్యంత పేదలైన 1.33 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుం బాల సర్వే నిర్వహిం చాం. ఇందులో రేషన్ కార్డులు కలిగిన 10 వేల కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేశాం. ఎన్నికల కోడ్ దగ్గర ఉన్నందున జిల్లాలో చేపట్టిన పనులలో అధికారులు పురోగతి సాధించాలి. జిల్లా అభివృద్ధితోపాటు ఎన్నికలను కూడా సమర్థవంతంగా న్విహించడానికి కృషిచేస్తాం. - పి.ఎస్.ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ -
నిండు సభలో బూతు పురాణం
-
మర్యాద మంటగలిపారు
లోక్‌సభలో కాంగ్రెస్, టీడీపీ ఎంపీల బూతుపురాణం నిండుసభలో పరస్పరం దాడులకు సిద్ధపడ్డ వైనం నివ్వెరపోయిన స్పీకర్... నిర్ఘాంతపోయిన సభ్యులు సీమాంధ్ర సభ్యులపై మరో ఐదు రోజుల సస్పెన్షన్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువైన పార్లమెంటులో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎంపీలు పరస్పర దూషణలతో ముష్టియుద్ధాలకు సిద్ధమవటంతో లోక్‌సభ యావత్తూ నివ్వెరపోయింది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీల ఎంపీలు సోమవారం సమైక్య రాష్ట్రం నినాదాలతో ఆందోళనలకు దిగటం.. అందులో టీడీపీ ఎంపీ పి.శివప్రసాద్ సభలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మాస్కు ధరించి పద్యాలు పాడటం.. దీనికి కాగ్రెస్ ఎంపీలు తీవ్ర ఆగ్రహించి ఆయనపైకి దూసుకురావటం.. ఇదిచూసి దిగ్భ్రాంతి చెందిన స్పీకర్.. సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయటం.. సభను అర్థంతరంగా వాయిదావేసి వెళ్లిపోవటం.. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు పరస్పరం బూతులు తిట్టుకుంటూ కొట్టుకునే వరకూ వెళ్లటం.. అన్నీ చకచకా జరిగిపోయాయి. సోమవారం లోక్‌సభ సమావేశం కాగానే.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నలుగురు టీడీపీ సభ్యులతో పాటు ఐదుగురు సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ సభ్యులు కూడా స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు మొదలుపెట్టారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్ అకస్మాత్తుగా ఇందిరాగాంధీ మాస్క్ ధరించి ఆమె ఆత్మ తనను ఆవహించినట్లుగా నటిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఉద్దేశించి పద్యాలు పాడటం ప్రారంభించారు. స్పీకర్ మీరాకుమార్ ఆగ్రహం వ్యక్తంచేయటంతో ఆయన మాస్క్ తొలగించినప్పటికీ తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలతో పాటు ప్రభుత్వ చీఫ్‌విప్ సందీప్‌దీక్షిత్.. ఆగ్రహావేశాలతో శివప్రసాద్ వైపుకు దూసుకెళ్లారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన స్పీకర్ వెల్‌లో ప్రవేశించిన 9 మందిని మరో ఐదు రోజుల పాటు సస్పెండ్ చేసి సభను వాయిదా వేశారు. సభ వాయిదా పడిన తర్వాత కూడా టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు పరస్పరం అసభ్యపదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగారు. పరస్పరం ముష్టియుద్ధానికి సిద్ధపడ్డారు. కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ చీఫ్‌విప్ సందీప్దీక్షిత్లను పాలకపక్ష సీనియర్ నాయకులు అడ్డుకోగా.. కాంగ్రెస్ సభ్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న శివప్రసాద్‌కు సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్‌యాదవ్ తదితర ప్రతిపక్ష నాయకులు సర్దిచెప్పాల్సి వచ్చింది. తమ సుదీర్ఘ పార్లమెంటరీ జీవితంలో ఇంతటి చౌకబారు ప్రవర్తన, పార్లమెంట్ ప్రతిష్టను దిగజార్చే సంఘటనను గతంలో ఎన్నడూ చూడలేదని ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, బీజేపీ సీనియర్ నాయకుడు యశ్వంత్‌సిన్హా, సీపీఐ పక్ష నాయకుడు గురుదాస్ దాస్‌గుప్తా, తదితరులు ఆ తర్వాత సెంట్రల్హాల్లో ఎదురైన రాష్ట్ర ఎంపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.మరోవైపు రాజ్యసభలో కూడా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ ఎంపీలు వై.ఎస్.చౌదరి, సి.ఎం.రమేష్‌లు ఆందోళనకు దిగటంతో చైర్మన్ అన్సారీ వారిపై ఒక రోజు సస్పెన్షన్ విధించారు. స్పీకర్‌కు పరస్పరం ఫిర్యాదులు సభామర్యాదలను మంటగలిపిన శివప్రసాద్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, కాంగ్రెస్ అధ్యక్షురాలిపై వ్యక్తిగత విమర్శలు చేసిన మిగిలిన టీడీపీ సభ్యులపై చర్య తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్‌విప్ సందీప్‌దీక్షిత్, తెలంగాణ ఎంపీలు స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. లోక్‌సభలో టీడీపీ సభ్యుడిపై అసభ్య పదజాలంతో దాడి చేయడానికి ప్రయత్నించారంటూ ప్రభుత్వ ఛీఫ్‌విప్ సందీప్ దీక్షిత్‌పై ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, బీజేపీ సీనియర్ నాయకుడు షానవాజ్ హుస్సేన్‌లు కూడా స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కాగా, టీడీపీ సీమాంధ్ర పార్టీ ఎంపీలకు దమ్ము, ధైర్యం ఉంటే ముందుగా విభజనపై వైఖరేంటో ఆ పార్టీ అధినేత చంద్రబాబును నిలదీయాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు హితవు పలికారు. సీమాంధ్ర టీడీపీ ఎంపీలు కవ్వింపు చర్యలకు దిగుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు.