అభివృద్ధికి సంకేతం..తెలంగాణ | the symble of telangana is development | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి సంకేతం..తెలంగాణ

Published Sun, Mar 2 2014 4:06 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM

the symble of telangana is development

 కలెక్టరేట్,న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం దేశంలో అభివృద్ధికి సంకేతంగా నిలవాలని  జిల్లా విజిలెన్స్ మాని టరింగ్ సభ్యులు ఆకాంక్షించారు. అరవై ఏళ్ల పోరాట ఫలితంగా  తెలంగాణ రాష్ట్రం అవతరిస్తోందన్నారు.  ఇక అన్ని పార్టీలు, సభ్యులు కలిసికట్టుగా  తెలంగాణ అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. శనివారం స్థానిక ప్రగతిభవన్‌లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సభలో ఆద్యంతం తెలంగాణ రాష్ట్రంపై చర్చ జరిగింది. సమావేశం ప్రారంభానికి ముందు కమిటీ సభ్యులు, జిల్లా కలెక్టర్, అధికారులు తెలంగాణ అమరువీరులకు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కమిటీ ైచె ర్మన్, ఎంపీ మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్నారు.  సీమాంధ్రులు తెలంగాణ నిధులను దోచుకున్నారని ఆరోపించారు.

 శుక్రవారం కేబినెట్ ఆమోదింపజేసిన కేంద్రీయ విశ్వవిద్యాలయం విషయంలో కూడా అడ్డుతగిలారన్నారు. తాను స్వయంగా కేంద్రమంత్రి పల్లంరాజుతో కలిసి విద్యాలయంపై చర్చించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పుంజుకుంటుందన్నారు. రాష్ట్రపతి పాలనలో కలెక్టర్ జిల్లా అభివృద్ధికి కృషిచేస్తారనే నమ్మకం తనకుందన్నారు. ఎన్నికలపై తమ దృష్టి ఉంటుందని, జిల్లా అభివృద్ధికి కలెక్టర్, జేసీ ఇతర ఉన్నతాధికారులు కృషిచేస్తారని ఆశిస్తున్నామన్నారు.
 
 అభివృద్ధే నా నినాదం
 జిల్లా అభివృద్ధే నా నినాదం. గత న వంబర్ నుంచి జిల్లా లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. నిర్మల్ అభియాన్ కింద 1.20లక్షల మరుగుదొడ్ల ని ర్మాణానికి మంజూరు ఇచ్చాం. ఇప్పటికీ 93 వేలు ప్రారంభిం చి, 24 వేలు పూర్తి చేశాం. 30 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందించాం.  ప్రభుత్వ పథకాల శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలకు ప్రొటోకాల్ నిబంధనలను అధికారులకు పంపించాం. పీఓపీ కింద అత్యంత పేదలైన 1.33 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుం బాల సర్వే నిర్వహిం చాం. ఇందులో రేషన్ కార్డులు కలిగిన 10 వేల కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేశాం. ఎన్నికల కోడ్ దగ్గర ఉన్నందున జిల్లాలో చేపట్టిన పనులలో అధికారులు పురోగతి సాధించాలి.  జిల్లా అభివృద్ధితోపాటు ఎన్నికలను కూడా సమర్థవంతంగా న్విహించడానికి కృషిచేస్తాం. - పి.ఎస్.ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement