madhukarreddy suicide
-
మధుకర్‌రెడ్డి భార్య ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ఇటీవల అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లావాసి మధుకర్ రెడ్డి భార్య స్వాతి ఆత్మహత్యకు యత్నించింది. కొత్తపేట సౌభాగ్య పురంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటున్న స్వాతి గురువారం అర్ధరాత్రి హార్పిక్ తాగింది. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన వైద్యం నిమిత్తం కొత్తపేట లోని ఓమ్ని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. మధుకర్‌రెడ్డి మరణానికి కారణం స్వాతిఅని ఆరోపిస్తూ అతని కుటుంబసభ్యులు స్వాతిపై దాడికి పాల్పడిన విషయం విదితమే. -
‘కొట్టినా, తిట్టినా..మధుకర్ అంటే చాలా ఇష్టం’
భువనగిరి: అమెరికాలో వారం రోజుల కింద ఆత్మహత్య చేసుకున్న ఎన్నారై మధుకర్‌రెడ్డి ఆత్మహత్య వివాదంలో అతడి భార్య స్వాతి స్పందించారు. తనపై మధుకర్ రెడ్డి తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. భార్యాభర్తల మధ్య జరిగిన ఫోన్‌కాల్స్ రికార్డులను స్వాతి బుధవారం మీడియాకు వివరించారు. మధుకర్ రెడ్డి చివరిసారి మాట్లాడిన ఫోన్‌కాల్ రికార్డును స్వాతి..మీడియాకు వినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ మధ్య గొడవలు చాలా చిన్నవని, తన భర్త ఎప్పుడూ కొట్టడం, తిట్టడం చేసేవాడని...అయినా మధుకర్‌రెడ్డి అంటే తనకు చాలా ఇష్టమన్నారు. తన భర్త పెళ్లయిన నాటి నుంచే డిప్రెషన్లో ఉన్నాడని, భార్యభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకున్నా, మధు బంధువులే అతడిని తప్పుదోవ పట్టించారన్నారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న గొడవలు తప్పా మేమిద్దరం అన్యోన్యంగానే ఉండేవాళ్లమని అయితే ఆస్తుల కోసం మధుకర్‌రెడ్డి తల్లిదండ్రులు తమ మధ్య సమస్యలు సృష్టించారని స్వాతి ఆరోపించారు. గత రెండు నెలల నుంచి మధుకర్ రెడ్డి తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లాడని స్వాతి అన్నారు. డిప్రెషన్ వల్లే తనను కొట్టి ఆ తరువాత క్షమాపణ కోరే వాడని తెలిపారు. మధుకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోకుండా తానే వేధింపులకు పాల్పడ్డానని అతని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రవీందర్ రెడ్డి అనే వ్యక్తి తమని చాలా డిస్టర్బ్ చేశాడని, తన గురించి అతడు ఇక్కడ చెడుగా చెప్పేవాడని అన్నారు. ఈ విషయం తెలిసి మధు వారితో మాట్లాడటం మానేశారని స్వాతి తెలిపారు. మధు వాళ్ల అన్నకు రూ.40 లక్షలు, అక్కకు రూ.30 లక్షలు ఇచ్చారని, ఆర్థిక సమస్యలు కూడా మధును వేధించాయన్నారు. గత రెండు వారాలుగా మధు తనపై చాలా ప్రేమ చూపించాడని, చనిపోయే రోజు మధ్యాహ్నం 2 గంటలకు తాను ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. సాయంత్రం 5.30 గంటలకు ఇంటికి వచ్చేసరకి మధు ఉరి వేసుకుని ఉన్నాడన్నారు. తన భర్త మృతదేహాన్ని కూడా చూడనివ్వలేదని, తనపై భర్త కుటుంబసభ్యులు దాడికి పాల్పడ్డారన్నారు. తనకు రక్షణ లేదని, తన పాపకు ఏమవుతుందోననే భయంగా ఉందన్నారు. తనతో పాటు, తన కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని స్వాతి కోరారు. ఉద్యోగం పోతుందనే భయం మధుకు మొదలైందని తెలిపింది. డిప్రెషన్లో ఉన్న తన భర్త ట్రీట్మెంట్ తీసుకున్నట్లు చెప్పింది. కొంతకాలంగా తన భర్త మూడీగా ఉన్నాడని, ఈ విషయాన్ని తన అత్తమామలకు కూడా చెప్పినట్లు తెలిపింది. మానసిక ఒత్తిడి, ఉద్యోగ భయం, కుటుంబ సభ్యుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని స్వాతి వెల్లడించింది. గతంలో మధుకర్ రెడ్డి పంపిన ఈ మెయిల్‌ను ఆమె మీడియాకు చూపించింది. కాగా భర్త భౌతికకాయాన్ని చూసేందుకు వెళ్లిన స్వాతిపై ఆమె అత్తమామలు, బంధువులు దాడి చేసిన విషయం తెలిసిందే. -
'నా కూతురు ఆరేళ్లుగా నరకం అనుభవించింది'
భువనగిరి: అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుకర్‌రెడ్డి అంత్యక్రియల సందర్భంగా మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యాదాద్రి జిల్లా భువనగిరిలో మధుకర్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన అతని భార్య స్వాతిపై భర్త తరఫు బంధువులు దాడి చేశారు. మధుకర్ మృతికి భార్యే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడిని అన్యాయంగా పొట్టనపెట్టుకుందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్వాతి తనకు ప్రాణహాని ఉందంటూ తల్లిదండ్రులతో కలిసి భువనగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భర్త మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన తన కుమార్తెపై దాడి చేయడం సరికాదని స్వాతి తల్లి అన్నారు. తన కూతురు గత ఆరేళ్లుగా నరకం అనుభవిస్తోందని ఆమె ఆరోపించారు. పాప కోసం సర్దుకుపోవాలంటూ ఇన్ని రోజులు తన కూతురికి చెప్పుకుంటూ వచ్చానన్నారు. అయితే అల్లుడి ఆత్మహత్యతో గత ఆరు రోజులుగా తమ కూతురు గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరంగా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవద్దని స్వాతి తల్లి హితవు పలికారు. తన అల్లుడిది హత్యో, ఆత్మహత్యో త్వరలోనే తేలుతుందని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. కాగా భువనగిరి మండలం మద్దెలగూడేనికి చెందిన స్వాతితో మధుకర్‌రెడ్డి వివాహం జరిగింది. కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వీరి దాంపత్య జీవితం కొంతకాలం పాటు సాఫీగా సాగింది. అనంతరం వీరికి శర్మిష్ట జన్మించింది. ప్రస్తుతం పాపకు నాలుగు సంవత్సరాలు. కొంత కాలంగా దంపతుల మధ్య కలహాలు ఏర్పడినట్లు సమాచారం. కుటుంబ కలహాలతోనే మనస్తాపం చెందిన మధుకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. -
భువనగిరికి మధుకర్‌రెడ్డి మృతదేహం
-
భువనగిరికి మధుకర్‌రెడ్డి మృతదేహం
హైదరాబాద్ : కాలిఫోర్నియా రాష్ట్రంలో టిక్కీ ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఆత్మహత్య చేసుకున్న గూడూరు మధుకర్ రెడ్డి మృతదేహాన్ని కుటుంభసభ్యులు యాదగిరి గుట్ట మండలం భువనగిరికి తీసుకువచ్చారు. ఈ నెల 4వ తేదీన మధుకర్‌రెడ్డి అమెరికాలో బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లి బోరున విలపించారు. మృతుడి మృతదేహానికి బంధువులు, ఎన్ఆర్ఐలు, గ్రామస్తులు నివాళులర్పించారు. అనంతరం సొంత వ్యవసాయ భూమిలో మధుకర్ అంత్యక్రియలు జరిగాయి. మధుకర్‌రెడ్డి భార్య స్వాతిపై దాడి మరోవైపు మధుకర్‌రెడ్డి భౌతికకాయాన్ని చూసేందుకు వచ్చిన అతని భార్యపై బంధువులు దాడి చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మధుకర్‌రెడ్డికి భార్య, కూతురు ఉన్నారు. దాడి నేపథ్యంలో తమకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలంటూ భువనగిరి పోలీసు స్టేషన్లో మధుకర్ భార్య స్వాతి, ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అమెరికాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య మమ్మీ.. నన్ను క్షమించు...