maha rathothsavam
-
నేత్ర మనోహరం.. మహా రథోత్సవం
అనంతపురం కల్చరల్: మూడు రోజులుగా అత్యంత వైభవంగా సాగుతున్న మంత్రాలయ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు గురువారం మహా రథోత్సవంతో ముగిశాయి. వివిధ రకాల సుగంధ పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామివారు పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగునా మడుగు రథానికి భక్తులు నీరాజనాలర్పించారు. వేదపురోహితులు మంత్రోచ్ఛారణతో ముందుకు సాగుతుండగా చిన్నారులు కోలాటం, భక్తిగీతాలు, ఆటపాటలతో రథం ముందు ఆనందోత్సాలతో నడిచారు. రాఘవేంద్రస్వామి పాత్రధారి వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. అంతకుముందు మొదటిరోడ్డులోని మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠంలో ప్రాతఃకాల నిర్మాల్య విసర్జన, అష్టోత్తర పారాయణం, పంచామృతాభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం ప్రత్యేక పుష్పాలంకారం, తులసీ అర్చన, హస్తోదకం, మహామంగళ హారతి, తీర్థ ప్రసాద వినియోగం జరిగాయి. -
నేత్రమనోహరం.. మహా రథోత్సవం
అనంతపురం కల్చరల్ : అనంతపురంలో జరుగుతున్న మంత్రాలయ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాల్లో ఆదివారం మహా రథోత్సవం నేత్రమనోహరంగా సాగింది. సోసలే వ్యాసరాజ పీఠాధిపతులు విద్యామనోహర తీర్థులు, విజయ తీర్థులు రథాన్ని ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. వేదపురోహితులు మంత్రోచ్ఛారణల నడుమ చిన్నారులు కోలాటం, భక్తిగీతాలు, ఆటపాటలతో ముందుకు నడిచారు. అంతకు ముందు మొదటిరోడ్డులోని మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠంలో పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సంతర్పణ జరిగింది. సాయంత్రం అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలకు పురాణేతిహాసాలపై నిర్వహించిన క్విజ్ ఆసక్తికరంగా సాగింది. కార్యక్రమంలో యశోదమ్మ, గీతాలక్ష్మీ, రాఘవేంద్రజోషి, శ్రీనివాసాచార్ తదితరులు పాల్గొన్నారు.