నేత్రమనోహరం.. మహా రథోత్సవం | maha rathothsavam in anantapur | Sakshi
Sakshi News home page

నేత్రమనోహరం.. మహా రథోత్సవం

Published Sun, Aug 21 2016 11:06 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

నేత్రమనోహరం.. మహా రథోత్సవం - Sakshi

నేత్రమనోహరం.. మహా రథోత్సవం

అనంతపురం కల్చరల్‌ : అనంతపురంలో జరుగుతున్న మంత్రాలయ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాల్లో ఆదివారం మహా రథోత్సవం నేత్రమనోహరంగా సాగింది. సోసలే వ్యాసరాజ పీఠాధిపతులు విద్యామనోహర తీర్థులు, విజయ తీర్థులు రథాన్ని ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. వేదపురోహితులు మంత్రోచ్ఛారణల నడుమ చిన్నారులు కోలాటం, భక్తిగీతాలు, ఆటపాటలతో ముందుకు నడిచారు.

అంతకు ముందు మొదటిరోడ్డులోని మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠంలో పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సంతర్పణ జరిగింది. సాయంత్రం అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలకు పురాణేతిహాసాలపై నిర్వహించిన క్విజ్‌ ఆసక్తికరంగా సాగింది. కార్యక్రమంలో యశోదమ్మ, గీతాలక్ష్మీ, రాఘవేంద్రజోషి,  శ్రీనివాసాచార్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement