maha rudrabhishekam
-
ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మహారుద్రాభిషేకం..
-
అద్భుతాభిషేకం!
-
దేవుడికీ తప్పని ‘కే ట్యాక్స్’
నరసరావుపేట ఈస్ట్ (గుంటూరు): లోక కల్యాణార్థం తలపెట్టిన మహా రుద్రాభిషేకానికీ టీడీపీ నాయకుల గ్రహణం తప్పలేదు. ప్రతి పనికి ‘కే ట్యాక్స్’ వసూలు చేస్తున్న నేతలు దేవుడినీ వదిలి పెట్టలేదు. కాసులిస్తేనే రుద్రాభిషేకానికి అనుమతి అంటూ మోకాలడ్డటంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మహా రుద్రాభిషేకం వాయిదా పడింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి రోడ్డులోని స్టేడియంలో శివభక్తుల ఆధ్వర్యంలో ఆదివారం మహా రుద్రాభిషేకం తలపెట్టారు. మహా శివలింగానికి భక్తులే స్వయంగా అభిషేకాలు చేసుకునేలా రుద్రాభిషేకం ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. ఇందుకోసం రెండు నెలల నుంచి నరసరావుపేట పట్టణం, పరిసర ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉన్నట్టుండి రుద్రాభిషేకాన్ని వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు ఆదివారం ప్రకటించారు. కాగా.. రుద్రాభిషేకం నిర్వహించేందుకు సత్తెనపల్లి రోడ్డులోని స్టేడియం సరైందని నిర్ణయించి, సంబంధిత కమిటీ ప్రతినిధులతో అప్పట్లోనే ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు కొంత రుసుం కూడా చెల్లించారు. నెలన్నర తరువాత స్టేడియం కమిటీలో కీలక వ్యక్తి రంగంలోకి దిగి ముందుగా అనుకున్న రుసుం కంటే అదనంగా చెల్లిస్తేనే కార్యక్రమం నిర్వహించుకునేందుకు అనుమతిస్తామని చెప్పటంతో నిర్వాహకులు కంగుతిన్నారు. కార్యక్రమం జరిగే ఆదివారంతో పాటు ముందు రెండు రోజులు, తర్వాత రెండు రోజులు స్టేడియంకు ఫీజు చెల్లించాలని చెప్పటంతో అందుకు కూడా నిర్వాహకులు అంగీకారం తెలిపినట్టు తెలిసింది. ఆ మొత్తంతోపాటు మరికొంత ముట్టజెప్పనిదే కార్యక్రమం జరగనిచ్చేది లేదని కీలక వ్యక్తి అడ్డం తిరగటంతో నిర్వాహకులలో ఆందోళన మొదలైంది. సదరు వ్యక్తి రాజ్యాంగ పదవిలో ఉన్న కీలక నేతకు అనుంగు శిష్యుడు కావటంతో మిగిలిన నాయకులు సైతం నోరు మెదపటం లేదు. కాగా, రుద్రాభిషేకం నిర్వాహకుడు టీడీపీ నేత వేధింపులు భరించలేక అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్టు చెబుతున్నారు. కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించేందుకు విరాళాలు ఇచ్చిన దాతలు మధ్యవర్తిత్వం నెరిపేందుకు ప్రయత్నించి విఫలమైనట్టు తెలుస్తోంది. మహా రుద్రాభిషేకాన్ని తిరిగి ఎప్పుడు జరిపేది త్వరలో ప్రకటిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. -
శివ పంచాక్షరితో మారుమోగిన కృష్ణాతీరం
విజయవాడ(భవానీపురం): హరోం హర..ఓం నమశ్శివాయి అంటూ శివభక్తుల శివ పంచాక్షరితో కృష్ణాతీరం మారుమోగింది. శివ పంచాక్షరితో తానుకూడా తన్మయం చెందినట్లు కృష్ణమ్మ అలలతో సవ్వడి చేసింది. ఒక వైపు శంఖనాదం, మరోవైపు డమరుక నాదంతో భక్తులు పులకించిపోయారు. వేదికపై శరీరమంతా చితాభస్మం కలిగిన గుంటూరుకు చెందిన శివ భక్తులు బాబా, ఆయన శిష్య బృందం చేస్తున్న శివ ఘోషకు భక్తులు తమ గొంతులను కలిపారు. కార్తీకమాస సందర్భంగా భవానీపురానికి చెందిన శ్రీకన్యకా పరమేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక పున్నమి ఘాట్లో నిర్వహించిన మహారుద్రాభిషేకం వైభవంగా జరిగింది. శివునికి ప్రీతకరమైన విశేష ద్రవ్యాలతో, పుణ్యనదీ జలాలతో రుద్రుని అభిషేకించారు. విశేషంగా భోళాశంకరుడికి చేసిన భస్మాభిషేకం భక్తులను పరవసింపచేసింది. అభిషేకాలను భక్తులు దగ్గరగా తిలకించేందుకు నిర్వాహాకులు పలుచోట్ల ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నగర మేయర్ కోనేరు శ్రీధర్, టీడీపీ ఫ్లోర్ లీడర్ గుండారు హరిబాబు, కార్పొరేటర్ యేదుపాటి రామయ్య విచ్చేసి వేదికపై ఏర్పాటు చేసిన శివలింగానికి పూజలు నిర్వహించారు. నిర్వాహకులు 70 కిలోల స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని వేలం వేయగా కలిదిండి శార రూ.3,20116లకు పాడుకుంది. ఈ మొత్తాన్ని గుంటూరులో నిర్మించనున్న కోటిలింగాల క్షేత్రం నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామగ్రిని అందించాల్సిందిగా నిర్వాహకులు కోరారు.