Maharudra Satha Chandi Yagam
-
పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ నిర్వహించిన శ్రీ మహారుద్రసహిత ద్విసహస్ర చండీయాగం నేటితో పరిసమాప్తమైంది. తాడేపల్లిలో 23 మాసాలుగా కొనసాగుతున్న యాగం పూర్ణాహుతితో సంపూర్ణమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆయన చేతుల మీదుగా పూర్ణాహుతి జరిగింది. ఈ సందర్భంగా పండితులు సీఎం జగన్‌కు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి పండితులకు శాలువా కప్పి, కంకణం తొడిగి సత్కరించారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయదుందుభి మోగించాలని, ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని 2017 జూలై 29 నుంచి 2019 జూన్ 29 వరకు ఈ చండీయాగాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రుద్రయాగ దీక్ష పరిపూర్ణమైన సందర్భంగా సోమవారం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
శతచండీ యాగంలో రాంచరణ్ దంపతులు
-
శతచండీ యాగంలో రాంచరణ్ దంపతులు
పూర్ణాహుతి, హోమం నిర్వహణ మహాదేవునికి అభిషేకాలు దోమకొండ: నిజామాబాద్ జిల్లా దోమకొండ గడికోటలోని మహాదేవుని ఆలయంలో జరిగిన మహారుద్ర శత చండీయాగంలో గురువారం ప్రముఖ సినీహీరో రాంచరణ్‌తేజ పాల్గొన్నారు. పది రోజులుగా జరుగుతున్న చండీయాగం ముగింపు కార్యక్రమం, పూర్ణాహుతి గురువారం నిర్వహించారు. దీనికి రాంచరణ్‌తేజ తన భార్య ఉపాసనతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. దాదాపు గంటపాటు ఆయన పూర్ణాహుతి, మహారుద్ర శతచండీ యాగంలో పాల్గొని పూజలు చేశారు. మహాదేవుని ఆలయంలో ప్రత్యేకంగా శివుడికి రుద్రాభిషేకం చేశారు. యాగం ముగింపులో పాల్గొని పూజలు చేయడం సంతోషంగా ఉందని రాంచరణ్ తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25 మంది పండితులు ఈ యాగంలో పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు గడికోట వారసులైన రిటైర్డ్ ఐఏఏస్ అధికారి కామినేని ఉమాపతిరావు, ఆయన భార్య పుష్పమ్మ, అపోలో ఆస్పత్రుల డెరైక్టర్ శోభన, జాతీయ అర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి కామినేని అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచరణ్ దోమకొండ గ్రామ పంచాయితీ వారికి 16 చెత్త బండ్లను పంపిణీ చేశారు. గ్రామ అభివృద్ధికి తమవంతు సహకారం అందజేస్తామన్నారు.