
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ నిర్వహించిన శ్రీ మహారుద్రసహిత ద్విసహస్ర చండీయాగం నేటితో పరిసమాప్తమైంది. తాడేపల్లిలో 23 మాసాలుగా కొనసాగుతున్న యాగం పూర్ణాహుతితో సంపూర్ణమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆయన చేతుల మీదుగా పూర్ణాహుతి జరిగింది. ఈ సందర్భంగా పండితులు సీఎం జగన్‌కు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి పండితులకు శాలువా కప్పి, కంకణం తొడిగి సత్కరించారు.
కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయదుందుభి మోగించాలని, ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని 2017 జూలై 29 నుంచి 2019 జూన్ 29 వరకు ఈ చండీయాగాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రుద్రయాగ దీక్ష పరిపూర్ణమైన సందర్భంగా సోమవారం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment