MAHESWARA Rao
-
హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా మరో ముగ్గురు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా మహేశ్వరరావు కుంచం, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణ రంజన్ నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ ముగ్గురి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లు వీరు అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. తరువాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు. హైకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా, ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తితో కలిపి 26 మంది ఉన్నారు. ఈ ముగ్గురి నియామకంతో ఆ సంఖ్య 29కి చేరింది. దీంతో మరో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ గుహనాథన్ నరేందర్‌కు ఉత్తరాఖండ్ సీజేగా పదోన్నతి కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది.పంపింది ఆరుగురి పేర్లు..హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని కొలీజియం ఈ ఏడాది మే15న ఆరుగురు న్యాయవాదులు మహేశ్వరరావు, ధనశేఖర్, గుణ రంజన్, ఇడంకంటి కోటిరెడ్డి, గోడె రాజాబాబు, గేదెల తుహిన్ కుమార్ పేర్లను న్యాయమూర్తుల పోస్టులకి సిఫారసు చేసింది. ఈ సిఫారసులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన కొలీజియం చర్చించింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేసి, ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా ఉన్న వారి నుంచి కూడా కొలీజియం అభిప్రాయాలు తీసుకుంది. అనంతరం హైకోర్టు ప్రతిపాదించిన ఆరుగురిలో మహేశ్వరరావు, ధనశేఖర్, గుణ రంజన్‌కు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. వారిని న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేస్తూ ఈ నెల 15న తీర్మానం చేసింది. వీరి నియామకాన్ని ఆమోదించిన కేంద్రం.. వారి పేర్లను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడంతో వారి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ ముగ్గురు ఎప్పుడు ప్రమాణం చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. శనివారం లేదా సోమవారం ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది.మహేశ్వరరావు కుంచంకుంచం కోటేశ్వరరావు, సుశీలమ్మ దంపతులకు 1973 ఆగస్టు 12న తిరుపతిలో జన్మించారు. తండ్రి కోటేశ్వరరావు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. తండ్రి ఉద్యోగ రీత్యా మహేశ్వరరావు అనంతపురంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 1998లో తిరుపతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1998 నుంచి 2001 వరకు అనంతపురం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2001 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్ వద్ద ఆరు నెలల పాటు జూనియర్‌గా ప్రాక్టీస్ చేశారు. అనంతరం స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో పట్టు సాధించారు. ముఖ్యంగా సివిల్ కేసుల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరిస్తున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, యునైటెడ్ ఇండియా ఇన్సూ్యరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా ఇన్సూ్యరెన్స్ కంపెనీ, శ్రీరాం గ్రూప్ ఆఫ్ కంపెనీలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.చల్లా గుణరంజన్చల్లా చంద్రమ్మ, నారాయణ దంపతులకు 1976 జూలై 12న జన్మించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి స్వస్థలం. తండ్రి నారాయణ కూడా న్యాయవాదే. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఈయనకు సోదరుడి వరుస అవుతారు. గుణరంజన్ 2001లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సోదరుడైన కోదండరామ్ వద్దే జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. కోదండరామ్ జడ్జి అయిన తరువాత ఆయన ఆఫీసును గుణ రంజన్ విజయవంతంగా నడిపించారు.సుప్రీంకోర్టులో ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో, పలు ట్రిబ్యునళ్ల ముందు పలు కేసుల్లో వాదనలు వినిపించారు. పర్యావరణ, విద్యుత్, ఆర్బిట్రేషన్, కంపెనీ లా, దివాళా, పన్నుల చట్టాలతో పాటు సివిల్, క్రిమినల్ కేసుల్లో మంచి పట్టు సాధించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. పలు సంస్థలకు న్యాయ సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు.తూట చంద్ర ధనశేఖర్తూట శైలజ, చంద్రశేఖరన్ దంపతులకు 1975 జూన్ 10న జన్మించారు. తిరుపతి జిల్లా సత్యవేడు స్వస్థలం. తండ్రి చంద్రశేఖరన్ గతంలో చిత్తూరు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేశారు. సత్యవేడు జూనియర్ కాలేజీలో విద్యను అభ్యసించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో చదివారు. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో లా పూర్తి చేశారు. ధనశేఖర్ 1999లో హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పరాంకుశం వేణుగోపాల్ వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2019లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ తరఫున వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా జీపీగా కొనసాగుతున్నారు. పలు సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. -
హైకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు న్యాయవాదులు
సాక్షి, అమరావతి /సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టులకు ముగ్గురు న్యాయవాదుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల కొలీజియం మంగళవారం తీర్మానం చేసింది. హైకోర్టులో న్యాయవాదులుగా వ్యవహరిస్తున్న మహేశ్వరరావు కుంచం, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్ కొలీజియం సిఫారసు చేసిన వారిలో ఉన్నారు. ఈ ముగ్గురి పేర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన తరువాత ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరతాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం వారి పేర్లను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. మహేశ్వరరావు కుంచంకుంచం కోటేశ్వరరావు, సుశీలమ్మ దంపతులకు 1973 ఆగస్టు 12న తిరుపతిలో జన్మించారు. తండ్రి కోటేశ్వరరావు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. తండ్రి ఉద్యోగ రీత్యా మహేశ్వరరావు అనంతపురంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 1998లో తిరుపతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1998 నుంచి 2001 వరకు అనంతపురం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2001 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్ వద్ద ఆరు నెలల పాటు జూనియర్‌గా ప్రాక్టీస్ చేశారు. అటు తరువాత నుంచి సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో పట్టు సాధించారు. ముఖ్యంగా సివిల్ కేసుల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరిస్తున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, శ్రీరాం గ్రూప్ ఆఫ్ కంపెనీలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.తూట చంద్ర ధనశేఖర్తూట శైలజ, చంద్రశేఖరన్ దంపతులకు 1975 జూన్ 10న జన్మించారు. తిరుపతి జిల్లా సత్యవేడు స్వస్థలం, తండ్రి చంద్రశేఖరన్ గతంలో చిత్తూరు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేశారు. సత్యవేడు జూనియర్ కాలేజీలో విద్యను అభ్యసించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో చదివారు. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయవాద విద్య పూర్తి చేశారు. ధనశేఖర్ 1999లో హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పరాంకుశం వేణుగోపాల్ వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2019లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ తరఫున వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా జీపీగా కొనసాగుతున్నారు. పలు సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.చల్లా గుణ రంజన్చల్లా చంద్రమ్మ, నారాయణ దంపతులకు 1976 జూలై 12న జన్మించారు. తాడిపత్రి స్వస్థలం. తండ్రి నారాయణ కూడా న్యాయవాదే. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ సోదరుడి వరుస అవుతారు. గుణ రంజన్ 2001లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సోదరుడు కోదండరామ్ వద్దే జూనియర్‌గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. సుప్రీంకోర్టుతోపాటు ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో, పలు ట్రిబ్యునళ్ల ముందు అనేక కేసుల్లో వాదనలు వినిపించారు. పర్యావరణ, విద్యుత్, ఆర్బిట్రేషన్, కంపెనీ లా, దివాళా, పన్నుల చట్టాలతో పాటు సివిల్, క్రిమినల్ కేసుల్లో మంచి పట్టు సాధించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. సీజే నేతృత్వంలో కొలీజియం సమావేశం..ఈ ఏడాది మే 15వ తేదీన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని కొలీజియం మొత్తం ఆరుగురు న్యాయవాదుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. మహేశ్వరరావు, ధనశేఖర్, చల్లా గుణరంజన్, ఇడంకంటి కోటిరెడ్డి, గోడ రాజాబాబు, గేదెల తుహిన్ కుమార్ పేర్లను సుప్రీంకోర్టుకు పంపింది. కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా వారి వివరాలు సేకరించింది. కేంద్ర న్యాయశాఖ ఇటీవల వారి పేర్లను సుప్రీంకోర్టుకు పంపింది. దీనిపై చర్చించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన కొలీజియం మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైంది. గతంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసి ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొనసాగుతున్న నలుగురి అభిప్రాయాలు కూడా అంతకు ముందే తీసుకుంది. వారందరూ కూడా న్యాయమూర్తుల పోస్టులకు ముగ్గురు తగిన వారని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కొలీజియం సమావేశంలో మహేశ్వరరావు, ధనశేఖర్, గుణ రంజన్ పేర్లకు ఆమోదం తెలిపింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఆ ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులుగా అన్ని రకాలుగా అర్హులని స్పష్టం చేసింది.ప్రస్తుతం ఏపీ హైకోర్టులో సీజేతో సహా 26 మంది న్యాయమూర్తులు ఉన్నారు. తాజాగా సుప్రీంకోర్టు సిఫారసు చేసిన ముగ్గురి పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరుకుంటుంది. వాస్తవానికి హైకోర్టు కొలీజియం ఆరుగురు న్యాయవాదుల పేర్లతోపాటు ముగ్గురు న్యాయాధికారుల పేర్లను కూడా హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ అవధానం హరిహరనాథ శర్మ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు, శ్రీకాకుళం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా పేర్లను సిఫారసు చేసింది. అయితే ఈ ముగ్గురి విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం ఏం నిర్ణయం తీసుకున్నదీ తెలియరాలేదు. -
కలుషితాహారంతో 150 మందికి అస్వస్థత
=ఫ్లోరా పాఠశాల హాస్టల్లో ఘటన =వాంతులు, విరోచనాలతో తల్లడిల్లిన విద్యార్థులు ఉయ్యూరు, న్యూస్‌లైన్ : అంగలూరు ఘటన జరిగిన మరుసటిరోజే హాస్టళ్లలో నిర్వాకం మరోసారి వెలుగుచూసింది. ఈసారి ఇది ప్రైవేటు పాఠశాల కావడం గమనార్హం. ఉయ్యూరులోని ఫ్లోరా పాఠశాల హాస్టల్ విద్యార్థులు కలుషితాహారం గురువారం అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో 200 మంది విద్యార్థులు ఉండగా 150 మంది వాంతులు, విరోచనాలు, తీవ్ర జ్వరంతో తల్లడిల్లిపోయారు. హాస్టల్ వార్డెన్ యాజమాన్యానికి సమాచారం అందించటంతో ఘటన వెలుగు చూడకుండా రహస్యంగా వైద్య సేవలు అందిస్తున్నారు. పట్టణంలోని మసీదు సెంటర్లో, కాటూరు రోడ్డులోని పిల్లల ప్రవేట్ వైద్యశాలల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వీరికి చికిత్స చేయిస్తూ పాఠశాల వాహనాల్లో తరలించేస్తూ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుండగా ఈ విషయం వెలుగుచూసింది. ఆస్పత్రికి చేరుకున్న విలేకర్లతో యాజమాన్యం నీరు కలుషితమవడం వల్ల జ్వరాలు వచ్చాయని నమ్మబలికే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న తహశీల్దార్ మహేశ్వరరావు విద్యార్థుల పరిస్థితి ఆరా తీసి వారినుంచి వివరాలు సేకరించారు. ఉప్మా, పులిహోర, చికెన్, మజ్జిగ ఆహారంగా తీసుకున్నామని వారు వివరించారు. ఆ తర్వాత విరోచనాలు అయ్యాయని, ఆ తర్వాత వాంతులు, జ్వరం వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తహశీల్దార్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ శివరామకృష్ణతో చర్చించగా పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన వివరించారు. అనంతరం పాఠశాల హాస్టల్లో ఉన్న అస్వస్థతకు గురైన విద్యార్థులను తహశీల్దార్ మహేశ్వరరావు, పట్టణ ఎస్సై శివప్రసాద్‌లు పరిశీలించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ శ్యామలాదేవిని వివరణ కోరారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తీవ్ర జ్వరంతో.. ఒకే బెడ్‌పై... ఆస్పత్రుల్లో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా కనిపించింది. 103, 104 డిగ్రీల జ్వరంతో గజగజ వణుకుతూ ఒకే బెడ్‌పై ఇరుక్కుని పడుకుని మరీ చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గుైరె న విషయాన్ని యాజమాన్యం వారి తల్లిదండ్రులకు రాత్రి 8.30 గంటలైనా తెలియజేయలేదు. తహశీల్దార్ విచారణలో ఈ విషయాలన్నీ వెలుగు చూశాయి. దీంతో ఒక్కసారిగా వార్డెన్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం తమాషాగా ఉందా.. తల్లిదండ్రులకు చెప్పామంటూ తప్పడు సమాచారం చెబుతావా.. అరెస్ట్ చేయిస్తా ఏమనుకుంటున్నావో’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి రావాల్సిందిగా ఆదేశించారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఫోన్లో సమాచారం అందించారు. విద్యార్థుల నుంచి వారి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు తీసుకొని వారితో మాట్లాడించారు. ఏ భయం లేదు తామున్నామంటూ భరోసా ఇచ్చారు. మరోపక్క విషయం వెలుగు చూడటంతో యాజమాన్యం ఆస్పత్రిలో విద్యార్థులను దొడ్డిదారిన తరలించేందుకు యత్నించింది. పాఠశాలకు చెందిన బస్సుల్లో మెల్లగా ఒక్కొక్కరిని హాస్టల్‌కు తరలించింది. ఉయ్యూరు పరిసర గ్రామాల విద్యార్థులను వారి ఇళ్లకు పంపినట్లు సమాచారం. అందుబాటులో లేని అధికారులు... మరోపక్క పలువురు అధికారులు పత్తా లేరు. కమిషనర్ బాలాజీ, పబ్లిక్ హెల్త్ ఏఈఈ కరుణాకరబాబు, విద్యాశాఖ అధికారులు రాత్రి 9.30 గంటలైనా ఘటనాస్థలికి చేరుకోలేదు. కంటికి రెప్పలా కాపాడండి : సురేష్‌బాబు సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు ఆస్పత్రికి చేరుకొని విద్యార్ధులను పరామర్శించారు. అధికారులు, వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం పాఠశాల హాస్టల్‌కు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించి కంటికి రెప్పలా కాపాడాలని సూచించారు.