main canal
-
ప్రకాశం: జిల్లాకు 2,250 క్యూసెక్కుల నీటి సరఫరా
సాక్షి, ప్రకాశం(త్రిపురాంతకం) : నాగార్జున సాగర్ ప్రధాన కాలువ ద్వారా జిల్లాకు 2,250 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. సాగర్ ప్రధాన కాలువ ద్వారా జిల్లాకు నీటి సరఫరా క్రమేనా పెరుగుతోంది. దాంతో మేజర్లకు అవసరమైన మేర నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో డ్యాములు నిండి వరద నీరు ప్రవహించడంతో ప్రధాన కాలువకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి చెరువులు నింపాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇదే విధంగా మేజర్లకు పూర్తిగా నీరు విడుదల చేయాలన్న డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతోంది. పూర్తిగా నీటిని విడుదల చేస్తే త్వరితగతిన నారుమళ్లు పోసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే నారుమళ్లు పెంచిన రైతులు వరినాట్లను పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని రైతులు, రైతు సంఘ ప్రతినిధులు సాగర్ అధికారులను కోరుతున్నారు. -
దండు కదిలింది !
- ప్రధాన కాల్వ అడ్డుకట్ట తొలగించిన 400 మంది రైతులు - అన్నదాతలకు మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి సంఘీభావం జన్నారం : కడెం ప్రాజెక్ట్ నుంచి ప్రధాన కాలువ ద్వారా 28 డిస్ట్రిబ్యూటరీ వరకు నీరు అందడం లేదని, దీంతో తమ పొలాలు ఎండిపోతున్నాయంటూ దండేపల్లి మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గురువారం జన్నారం మండలం కామన్పల్లి ప్రాంతంలో 13 డిస్ట్రిబ్యూటరీకి వెళ్లేతూము వద్ద ఆ ప్రాంత రైతులు బండరాళ్లతో అడ్డుకట్ట వేశారు. దీంతో తమకు నీరు రావడం లేదని ఆగ్రహించిన దండేపల్లికి చెందిన 400 మంది రైతులు దండులా కదిలివచ్చారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి అధ్వర్యంలో అడ్డుకట్టను తొలగించారు. కడెం ఆయక ట్టులో నీరున్న తగినంత విడుదల కాకుండా వారబందీ ద్వారా కేవలం 4 ఫీట్లు విడుదల చేయడం వల్లే నీళ్లు జన్నారం మండల వరకైనా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దండేపల్లి మండలం అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి , తాళ్లపేట్ సర్పంచ్ లింగరావు, గూడెం ఎంపీటీసీ సభ్యులు ముత్తే నారాయణ పాల్గొన్నారు. మేదరిపేటలో సాగునీటి కోసం రాస్తారోకో దండేపల్లి : కడెం ఆయకట్టు కింద ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు సాగునీరందక ఎండిపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి డిమాండ్ చేశారు. కడెం ఆయకట్టు కింద పంటలకు సాగునీరు సక్రమంగా అందడం లేదని, నీటి గేజ్‌ను పెంచాలని మండల రైతులు గురువారం కడెం ప్రాజెక్టుకు తరలి వెళ్లారు. దారిలో మండలంలోని మేదరిపేట వద్ద రైతులు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. రైతుల ఆందోళనకు కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు. కడెం ప్రాజెక్టు వద్ద రైతుల ఆందోళన కడెం: కడెం ప్రాజెక్టు ద్వారా తమ పంట పొలాలకు నీరందించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆయకట్టు పరిధిలోని దండేపల్లి,తాళ్లపేట,లక్సెట్టిపేట, తపాలాపూర్,రోటిగూడెం ప్రాంతాలకు చెందిన వందలాది మంది రైతులు ఇక్కడికి తరలివచ్చారు. సాగు నీరులేక తమ పంటలు ఎండిపోతున్నాయని వారు అధికార్లతో చెప్పారు. అయితే రైతులు వచ్చారనే సమాచారంతో ప్రాజెక్టు డీఈ నూరుద్దీన్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. రైతులతో పాటు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవింద రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. రైతుల తరఫున ఆయన ప్రాజెక్టు డీఈతో మాట్లాడి ఆయకట్టు పరిస్థితిని వివరించారు.గతంలో కడెంలో జరిగిన నీటి సంఘాల సమావేశంలో చేసిన తీర్మానం ప్రకారం ఆయకట్టు కిందనున్న డీ-28 వరకు నీటిని విడుదల చేయాలన్నారు.నీరివ్వకుంటే ఊర్కోమని,నీరిచ్చేదాకా ఇక్కడే ఉంటామని రైతులు భీష్మించారు. దీంతో ప్రాజెక్టు డీఈ నూరుద్దీన్ ఇక్కడి పరిస్థితిని ఈఈ వెంకటేశ్వర్‌కు వివరించారు. నీటి విడుదలపై రెండు రోజుల్లో తగు నిర్ణయం తీసుకుంటామని వారు రైతులకు హామీ ఇచ్చారు.దీంతో స్పందించిన రైతులు ఇచ్చిన హామీని నిలుపుకోవాలని అధికారులకు సూచించి నిరసన విరమించారు. 400 మంది రైతులు నిరసనలో పాల్గొన్నారు. 28వ డిస్ట్రిబ్యూటరీ దాకా నీళ్లిస్తాం దండేపల్లి : కడెం ప్రాజెక్టు నీటిని 28వ డిస్ట్రిబ్యూటరీ కాల్వ వరకూ నీటిని అందిస్తామని ఎమ్మెల్యే దివాకర్‌రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయకట్టు కింద నెలకొన్న సాగు నీటి ఇబ్బందులను నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లానన్నారు. ప్రధాన కాల్వలకు నీటి గేజిని సుమారు 7 ఫీట్లకు పైగా పెంచి విడుదల చేస్తామన్నారు. కాల్వలో నీటికి అడ్డుకట్టలు వేయకుండా చూడాలని అధికారులకు సూచించామన్నారు. గూడెం ఎత్తిపోతల నీటిని శుక్రవారం నుంచి రెండు మోట్లార్ల ద్వారా విడుదల చేస్తామన్నారు. -
టీడీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యం
శాసనసభలో వైఎస్ఆర్సీపీ సభ్యుల ధ్వజం నికర జలాలు రాకుండా పోయింది మీ హయాంలోనే హంద్రీ నీవా మెయిన్ కెనాల్ తక్షణమే పూర్తిచేయండి మండిపడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట 2016కల్లా హంద్రీ నీవా పూర్తిచేస్తామన్న మంత్రి దేవినేని సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్ల తెలుగుదేశం పాలనలో సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని కరువు కాటకాల్లోకి నెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో సాగునీటి ప్రాజెక్టులపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. తొలుత రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ తన నియోజక వర్గం సాగు, తాగునీటికి కటకటలాడుతోందని, హంద్రీ నీవా మెయిన్ కెనాల్ పనుల ను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కెనాల్‌కి సంబంధించి ఇప్పటివరకూ ఏఏ పనులు కొనసాగించారో చెప్పాలని ప్రశ్నించారు. మదనపల్లి, పుంగనూరు బ్రాంచ్ కెనాల్లు పూర్తిచేయడంపై తమకేమీ అభ్యంతరం లేదని, కానీ ముందుగా మెయిన్ కెనాల్ పనులు పూర్తిచేయాలన్నారు. పుంగనూరు, మదనపల్లి బ్రాంచ్ కెనాల్లు తక్షణమే పూర్తిచేయాలని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డిలు డిమాండ్ చేశారు. 1,500 అడుగులు బోర్లు వేసినా నీళ్లు లేవని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ కెనాల్లు పూర్తిచేయడం వల్ల లక్షలాది ఎకరాలు సాగు అవుతుందని పేర్కొన్నారు. దీనికి నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా బదులిస్తూ, అప్పటి వైఎస్ ప్రభుత్వం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించలేకపోవడం వల్లే నికర జలాలు కోల్పోయామని చెప్పారు. పులివెందుల రైతులు తమ ప్రాంతానికి నీళ్లివ్వాలని కోరడంతో కుప్పం నియోజకవర్గానికి ఆపైనా సరే పులివెందులకు నీళ్లు ఇవ్వాలని సీఎం చెప్పారని పేర్కొన్నారు. హంద్రీ నీవా సుజల ప్రాజెక్టు రెండో దశకు ఇప్పటివరకూ రూ. 2,893 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా రూ. 1,216 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు. హెచ్ఎన్ఎస్ఎస్ రెండో దశకు ఇంకా 5,481 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని దేవినేని ఉమా సమాధానమిచ్చారు. 2015-16 నాటికి హంద్రీ నీవా మెయిన్ కెనాల్ పనులు పూర్తిచేస్తామన్నారు. ఇళ్లు మేం కడితే కిటికీలు పెట్టి షోకులా? నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ సభ్యులు తీవ్రంగా ఆక్షేపించారు. 1994 నుంచి 2004 వరకూ అస్యూర్డ్ వాటర్(నికరజలాలు) రాకపోవడానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని గడికోట శ్రీకాంతరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నీ 70 శాతానికి పైగా మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయన్నారు. ఇళ్లు మేము పూర్తిచేస్తే, కిటికీలు మీరు పెట్టుకుని షో చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రాకముందే ఆలమట్టి ఎత్తు పెంచారని, అప్పట్లో కర్ణాటకకు సరైన కౌంటర్ ఇవ్వలేక ఇప్పుడు బురదజల్లే కార్యక్రమం చేపట్టారని దుయ్యబట్టారు. -
ప్రధాన కాలువ.. పారేదెలా!
నిజాంసాగర్, న్యూస్‌లైన్: నిజాంసాగర్ ప్రాజెక్టు చివరాయకట్టుకు సాగునీరు అందడం కలగానే మిగులుతోంది. ఏళ్లు గడుస్తున్నా ప్రధాన కాలువ ఆధునికీకరణ పనుల్లో పురోగతి లేకపోవడమే ఇందుకు కారణంగా రైతులు ఆవేదన చెందుతున్నారు. నిధులు ఉన్నా నిష్ర్పయోజనంగా మారుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. నిజాం కాలంలో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ బలహీనంగా మారింది. కాలువ గట్టుకు ఏర్పాటు చేసిన బండరాళ్లు అక్కడక్కడా తొలగిపోయాయి. ప్రాజెక్టు నిర్మించిన సమయం లో 3 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా 155 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువను బలపర్చారు. అయితే ఎప్పటికప్పుడు సరైన మరమ్మతులు చేయని కారణంగా క్రమక్రమంగా కాలువ నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 1,800 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని కూడా తట్టుకోలేక పోతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన ప్రతిసారి ఎక్కడో ఒకచోట గండ్లు పడుతూ వేలాది ఎకరాలకు అందాల్సిన సాగు నీరు వృథా అవుతోంది. చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు చేరడం లేదు. ప్రధాన కాలువ ఈ దుస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో ఆధునికీకరణ పనుల కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008-09లో రూ. 549.5 కోట్లను మంజూరు చేశారు. ఆధునికీకరణ కోసం వచ్చిన నిధులను జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు 15 ప్యాకేజీలుగా విభజించారు. రెండు ప్యాకేజీలు మాత్రం ప్రాణహిత చేవెళ్ల పథకం పనుల్లోకి వెళ్లగా 13 ప్యాకేజీల్లో ప్రధాన కాలువ ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. అయితే పనులు అనుకున్నంత మేర సాగడం లేదు. అన్ని ప్యాకేజీల్లో ప్రధాన కాలువకు సిమెంట్ లైనింగ్ చేయాల్సి ఉంది. కాగా 1,2, ప్యాకేజీలతో పాటు మరికొన్ని ప్యాకేజీల్లో సిమెంట్ లైనింగ్ పనులు ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. ఆయా ప్యాకేజీల్లో కట్టబలోపేతం, ముళ్ల పొదల తొలగింపు పనులు ఆసంపూర్తిగానే ఉన్నాయి. మిగతా ప్యాకేజీల్లో సుమారు 4 నుంచి 6 కిలోమీటర్ల మేర సిమెంట్ లైనింగ్ పనులు మాత్రం జరిగాయి. ఆయా ప్యాకేజీల్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు మాత్రం రూ. 250 కోట్ల మేర డబ్బులు చెల్లించారు. ఇదిలా ఉండగా ప్రస్తుత రబీ సీజన్లో చివరి ఆయకట్టు వరకు రైతన్నలు పంటల సాగు కోసం సమాయత్తమవుతున్నారు. ప్రధాన కాలువ మొదటి ఆయకట్టు ప్రాంతంలో పటిష్టంగా లేకపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరందడం కష్టంగా మారనుంది.