malkan giri
-
పాముకు ఊపిరి ఊది ప్రాణం నిలిపిన యువకుడు, వీడియో వైరల్
భువనేశ్వర్: శ్వాస అందక.. ఎవరైనా ప్రాణాపాయ స్ధితిలో ఉంటే నోట్లో నోరు పెట్టి ఊపిరి అందించడం చూసివుంటాము. అయితే, జంతువులు, సరిసౄపాలకు ఆ సమస్య వస్తే సాయం అందించేదెవరు? వాటి ప్రాణం నిలిపేదెవరు? ముఖ్యంగా విష సర్పాలు కనిపిస్తేనే అంత దూరం పరుడెత్తడం మానవ నైజం. కానీ, ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఓ యువకుడు ఏకంగా ప్రాణాపాయంలో ఉన్న పాముకు ఊపిరి ఊది ప్రాణం పోసాడు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మల్కన్‌గిరిలోని నౌగుడా గ్రామంలో ఓ ఇంట్లో పాము చొరబడింది. దానిని చూసి స్థానికులు వణికిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్ స్నేహాశీష్ అనే యువకుడికి సమాచారం ఇచ్చారు. అతడు స్థానికంగా పాములను పట్టి అడవుల్లో వదిలిపెడుతుంటాడు. ఇంట్లోకి చొరబడిన పామును చాకచక్యంగా పట్టి బయటకు తీసుకొచ్చాడు. అది దాదాపు 10 అడుగుల పొడవు ఉంది. కానీ ఆ పాము అపస్మారక స్థితికు చేరుకుంది. శ్వాస అందక పాము విలవిల్లాడుతోందని గుర్తించిన.. స్నేహాశీష్ ఊపిరి ఊదితే బతుకుతుందని అనుకున్నాడు. కానీ, పాము ఊపిరి ఊదడం ఎలా అని చూస్తుండగా.. అక్కడ ఓ స్ట్రా కనిపించింది. దాన్ని తీసుకుని పాముని పట్టుకుని దాని నోట్లోకి స్ట్రా పెట్టి ఊపిరి ఊదాడు. అలా కొన్నిసార్లు చేసినా పాము కదల్లేదు. దాదాపు 15 నిమిషాలపాటు స్నేహాశీష్ పాముకు ఊపిరి అందిస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఆ పాము స్పృహలోకి వచ్చింది. పాముకు ప్రాణాపాయం తప్పిందనుకున్న తర్వాత సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఇక పాముకు ప్రాణం పోసిన యువకుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి:Odisha: హిజ్రాలకు పోలీసు ఉద్యోగాలలో అవకాశం.. -
మల్కాన్‌గిరి మలాలా
విద్య, ఆరోగ్యం, అభివృద్ధి కోసం చొరవ చూపుతూ ‘మల్కాన్‌గిరి మలాలా’ అని ప్రశంసలు పొందుతున్న కుసుమానీ.. మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్నారు! అయినప్పటికీ ఆమె వెనకడుగు వేయడం లేదు. మావోయిస్టులు కూడా ఆమెకు ఏదైనా జరిగితే ప్రజా ఉద్యమం వస్తుందనే సందేహంతో ముందడుగు వేయడం లేదు. ఒడిశాలోని మల్కాన్‌జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ‘స్వాభిమాన్ ఆంచల్’కు రెండు నెలల క్రితమే తొలిసారి మొబైల్ ఫోన్లు, కమ్యూనికేషన్ల నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. నేటికీ ఆ ప్రాంతంలో పిల్లలు బడికి వెళ్లాలంటే ముళ్ల మీద నడకే. కొత్తగా వచ్చిన సమాచార సదుపాయాన్ని ఆసరాగా చేసుకుని ఆ ముళ్లను ఇప్పుడు నల్లేరుగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు కుసుమానీ ఖిల్లా. ఈ ప్రాంతంలోని పిల్లలకు, టీచర్లకు స్వేచ్ఛగా చదువుకోగలిగే, స్వేచ్ఛగా చదువు చెప్పగలిగే పరిస్థితులు కల్పించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను గత మంగళవారం అర్థించారు కుసుమాని. ఆ పరిణామంతో ఆమెలోని ధైర్యాన్ని, పట్టుదలను చూసిన ఆ ప్రాంతీయులు ఆమెను ‘మలాలా ఆఫ్ స్వాభిమాన్ ఆంచల్’ అంటూ అభినందిస్తున్నారు. పాకిస్తాన్లో బాలికలు, మహిళల విద్య కోసం గళమెత్తిన మలాలా తాలిబన్ తుపాకీ తూటాలకు గురై, పునర్జన్మ ఎత్తి, ఆడపిల్లల చదువు కోసం ఒక ఉద్యమకారిణిగా పని చేసింది. అందుకే కుసుమానీ ఖిల్లాను మలాలాతో పోల్చుతున్నారు. కుసుమానీ కరోనా వారియర్ కూడా. ‘‘కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కుసుమానీ ప్రజలలో తీసుకువచ్చిన చైతన్యం కారణంగా అక్కడ ఒక్కరు కూడా కోవిడ్ కారణంగా మరణించలేదు’’ అని నవీన్ పట్నాయక్ కూడా ఆమెను ప్రశంసించారు. అంతేకాదు, కాన్ఫరెన్సింగ్‌లో ఆమెను ఆంచల్ ప్రాంత విషయాలు అడిగి మరీ తెలుసుకున్నారు. కుసుమానీ పట్టభద్రురాలు. మల్కాన్‌గిరిలోని ‘బలిమెల కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ చదువుకున్నారు. కమ్యూనికేషన్ కనెక్టివిటీ వచ్చాక గత రెండు నెలల్లోనూ స్వాభిమాన్ ఆంచల్‌లో బిఎస్ఎఫ్ జవాన్లు, రాష్ట్ర పోలీసుల నిరంతర పర్యవేక్షణలో నాలుగు సెల్ టవర్ల నిర్మాణం జరిగింది. ఆ సదుపాయం కారణంగానే సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడగలిగారు కుసుమానీ. -
మల్కన్‌గిరిలో మావోయిస్టు లొంగుబాటు
ఒడిశా: మల్కన్‌గిరి ఎస్పీ మిత్రభాను మహాపాత్రా ఎదుట జిల్లా పోలీసు కార్యాయలంలో దేబా మధి(34) అనే మావోయిస్టు మంగళవారం లొంగిపోయాడు. మల్కన్‌గిరి డివిజన్ పరిధిలోని ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీలో కలిమెల ఏరియా కమిటీ సభ్యుడిగా దేబ మధి పని చేశాడు. మొత్తం పది కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇతనిపై రూ. లక్ష రివార్డు ఉంది. -
టీడీపీ నేతలకు భద్రత పెంపు
గుంటూరు: ఏవోబీ ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. దీంతో ఆ ప్రాంత ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు అదనపు భద్రతను కేటాయించింది. ఏపీ మంత్రులు ప్రత్తి పాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబుకు భద్రతను పెంచారు. మంత్రుల ఇళ్ల దగ్గర కూడా అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అదే విధంగా మావోయిస్టు సానుభూతిపరుల కదలికలపై అధికారులు నిఘాను పెంచారు. కాగా నల్లమలలో కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం తగు చర్యలు తీసుకుంటోంది. ఎటువంటి ప్రతీకార చర్యలకు పాల్పడకుండా ఏవోబీలో ప్రత్యేక బలగాలను రంగంలో దింపుతున్నారు. -
ఏవోబీలో మళ్లీ ఎన్కౌంటర్
మల్కన్ గిరి: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఎదురు కాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కాగా ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 30కి చేరింది. చిత్రకొండ బ్లాక్ కటాఫ్ ఏరియాలోని రాంఘట్, పనసపుట్ట మధ్య కూంబింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు కాల్పులు జరపటంతో ప్రతిగా పోలీసు బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్కౌంటర్లో మృతి చెందినవారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ఏఓబీ బంద్ హింసాత్మకం
- ఇద్దరు గిరిజనులను చంపిన మావోయిస్టులు మావోయిస్టులు పిలుపు నిచ్చిన ఏఓబీ బంద్ హింసాత్మకంగా మారింది. మల్కాన్ గిరి జిల్లా చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు కాల్చి చంపారు. మృతులు చిత్రకొండ ప్రాంతానికి చెందిన సర్పంచ్‌లు జయరామ్‌కొర, సాదుమ్‌కొరలుగా పోలీసులు గుర్తించారు. అయితే, దీనికి సంబంధించి మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. కాగా..: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని ఏజెన్సీ ప్రాంతంలో బంద్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు జరిపాలనే ప్రభుత్వ నిర్ణయంపై మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు కూంబింగ్‌లు, తనిఖీలతో అప్రమత్తమయ్యారు. ఆర్టీసీ బస్సులు మండల కేంద్రాలకే పరిమితమయ్యాయి. దుకాణాలను వ్యాపారులు మూసేశారు. అయితే, పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాల్లోని దుకాణాలను పోలీసులు తెరిచిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
కళాకారుల వాహనం బోల్తా
ఇద్దరు మృతి మృతులు, క్షతగాత్రులు దారకొండ వాసులు సీలేరు, న్యూస్‌లైన్ : వారంతా గిరిజన నిరుపేద కుటుంబానికి చెందినవారు. ప్రభుత్వం చేయూత లేక పొట్టకూటి కోసం తమ పాటలనే రూపకాలుగా మలచి ఊరూరూ తిరుగుతూ నాటకాలు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ రోడ్డు ప్రమాదం వారి బతుకులపై పిడుగుపాటుగా పరిణమించింది. నమ్ముకున్న కుటుంబాలకు కన్నీటిని మిగిల్చింది. జీకే వీధి మండలం దారకొండ గ్రామానికి చెందిన 40మంది కళాకారుల బృందం ఒడిశాలో ఒక జాతరలో నాటక ప్రదర్శనకు గురువారం సాయంత్రం వ్యాన్‌లో బయలుదేరారు. రాష్ట్ర సరిహద్దు దాటాక ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా వర్కిల్ సమీపంలో వీరి వాహనం ప్రమాదానికి గురయింది. ఎదురుగా సైకిల్‌పై వస్తున్న బాలుడిని తప్పించే ప్రయత్నంలో వ్యాన్ బోల్తాపడింది. వాహనం సైకిల్‌పై వస్తున్న బాలుడిపైనే పడడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. జీపులో ప్రయాణిస్తున్న గోపి కూడా దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో 30మందికి తీవ్రగాయాలు కావడంతో మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరు అక్కడ చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు శుక్రవారం ఆస్పత్రికి తరలివెళ్లారు. మృతదేహాలకు ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మద్యం మత్తులో పదిహేనేళ్ల డ్రైవర్! వాహనం నడపడంలో నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని విదితమవుతోంది. 10మంది ప్ర యాణికులు పట్టే టాటా ఏస్ వ్యాన్‌లో 40మం ది కళాకారులు కిక్కిరిసి బయలుదేరారు. అయి తే వాహనం నడుపుతున్న డ్రైవర్‌కు నిండా 15 సంవత్సరాలు లేవని, అతడు మద్యం మత్తులో ఉన్నాడని తెలుస్తోంది. అధ్వానంగా ఉన్న రోడ్డుపై వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే వాహన యజమాని, డ్రైవర్ పరారయ్యారు. -
విధ్వంసానికి సిద్ధం?
=మావోయిస్టుల కద(న)ం =అదనపు బలగాలు మోహరించాలన్న కేంద్ర నిర్ణయంపై ఆగ్రహం =ఏవోబీలోకి భారీగా రానున్న బలగాలు =ఇప్పటికే మల్కన్‌గిరి జిల్లాలో వంతెన పేల్చివేత =ఈస్ట్ డివిజన్‌లోనూ విధ్వంసాలకు పాల్పడే అవకాశం అదనపు బలగాలను పంపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మావోయిస్టులు మరింత చెలరేగిపోయేట్టు కనిపిస్తోంది. దళసభ్యుల హింసాత్మక కార్యకలాపాలకు పగ్గాలు వేయాలన్న లక్ష్యంతో ప్రభావిత ప్రాంతాల్లోకి 40 వేల మంది కేంద్ర బలగాలను పంపాలని యూపీఏ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దాంతో మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మల్కన్‌గిరి జిల్లాలో వంతెనను పేల్చేయడం భావి పరిణామాలకు అద్దం పడుతోంది. ఈస్ట్ డివిజన్‌లోనూ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొయ్యూరు, న్యూస్‌లైన్: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం ప్రస్తుతం ఉన్న బలగాలకు అదనంగా 40 వేల మంది పోలీసులను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రంగంలోకి దించుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై భగ్గు మంటున్న మావోయిస్టులు ప్రతీకార చర్యలకు సిద్ధపడేట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండడంతో కేంద్రం సీఆర్పీఎఫ్ బలగాలను కూంబింగ్‌కు పంపుతోంది. దీనికి నిరసనగా మావోయిస్టులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఒడిశా మల్కన్‌గిరి జిల్లా పోతేరు నది వద్ద వంతెనను పేల్చేశారు. ఈ ప్రాంతం విశాఖ జిల్లాకు సరిహద్దుగా ఉంది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో భాగంగా ఉన్న మల్కనగిరి, కోరాపుట్ ప్రాంతాల్లో మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో మావోయిస్టులకు పట్టున్న ఏవోబీలో వారి దూకుడు ఎలా ఉంటుందోనన్న సందేహం వ్యక్తమవుతోంది. ఏవోబీలో మావోయిస్టులకు పగ్గాలు వేయడం కష్టంగా ఉన్న సంగతి తెలిసిందే. దాంతో వారిని అదుపు చేయడానికి ప్రభుత్వం అదనపు బలగాలను పంపుతోంది. ఇప్పటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో మరింత హింస చెలరేగే అవకాశం కనిపిస్తోంది. కీలకంగా మారిన ఏవోబీ ఆంధ్ర, ఒడిశాలను పెనవేసుకుని నాలుగు డివిజన్లతో ఉన్న ఏవోబీ ప్రాంతం కీలకంగా ఉంది. మావోయిస్టులకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంది. దీంతో పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నా మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం కోరాపుట్,ఈస్టు డివిజన్, మల్కనగిరి పేరిట మావోయిస్టుల కేంద్ర ప్రాంతీయ కమాండ్ (సీఆర్సీ)లున్నాయి. వాటిలో ఒడిశావైపు ఉన్నవి చురుకుగా ఉన్నాయి. ఈస్టు డివిజన్లో రవి మిలటరీ వింగ్ కమాండర్‌గా సీఆర్సీకి నేతృత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మావోయిస్టులు ఈస్టుడివిజన్లో భాగంగా ఉన్న విశాఖ మన్యంలో విధ్వంసాల కన్నా ఇన్ఫార్మర్లను హతమార్చడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఏడాది మొత్తంలో ఆరుగురిని చంపేశారు. జూన్, జూలై, డిసెంబర్లో ఇన్ఫార్మర్లపై దృష్టి పెట్టారు. రానున్న రోజుల్లో వీరి వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి. ఏవోబీలో పదివేల మంది వరకు బలగాలు ఏవోబీలో ప్రస్తుతం సుమారు ఏడువేల మంది పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వారికి తోడుగా కేంద్రం నుంచి వచ్చే బలగాలు మరో మూడు వేల వరకు ఉండనున్నాయి. సరిహద్దులో మల్కన్‌గిరిని ఆనుకుని ఉన్న జిల్లాలోని సీలేరు నుంచి పాడేరు వరకు కేంద్ర భద్రత బలగాలు,ఏపీఎస్పీ పోలీసులు, గ్రేహౌండ్స్ కలిసి ప్రస్తుతం వెయ్యి మంది వరకు ఉన్నారు. అదే విధంగా కోరాపుట్‌ను ఆనుకుని ఉన్న విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లోనూ మరో 1,200 మంది సరిహద్దు వెంబడి కూంబింగ్ చేస్తున్నారు. ఒడిశా మల్కనగిరి జిల్లాలో 33 సరిహద్దుభద్రత బలగాలు(బీఎస్ఎఫ్), కోరాపుట్‌లో 25 క్యాంప్‌లున్నాయి. వీరు కాకుండా ప్రస్తుతం కేంద్రం నుంచి వచ్చే బలగాలు మరో మూడు వేల మంది వరకు ఉండే అవకాశం ఉందని పోలీసు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.