
టీడీపీ నేతలకు భద్రత పెంపు
ఏవోబీ ఎన్‌కౌంటర్ నేపథ‍్యంలో టీడీపీ నేతలకు హోంశాఖ అదనపు భద్రతను కేటాయించింది.
ఏపీ మంత్రులు ప్రత్తి పాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబుకు భద్రతను పెంచారు. మంత్రుల ఇళ్ల దగ్గర కూడా అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అదే విధంగా మావోయిస్టు సానుభూతిపరుల కదలికలపై అధికారులు నిఘాను పెంచారు. కాగా నల్లమలలో కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం తగు చర్యలు తీసుకుంటోంది. ఎటువంటి ప్రతీకార చర్యలకు పాల్పడకుండా ఏవోబీలో ప్రత్యేక బలగాలను రంగంలో దింపుతున్నారు.