mallunayudu
-
ప్రైవేట్‌పరం చేస్తే ప్రతిఘటిస్తాం
గోవాడ సుగర్స్ చైర్మన్ మల్లునాయుడు సీఎంను సైతం ధిక్కరిస్తాం అధ్యయన కమిటీకి స్పష్టీకరణ చోడవరం: అధ్యయన కమిటీ పేరుతో గోవాడ సుగర్స్‌ను ప్రై వేట్‌పరం చేయాలని ఆలోచన చేస్తే పార్టీలకతీతంగా ప్రతిఘటిస్తామని గోవాడ సుగర్స్ చైర్మన్ గూనూరు మల్లునాయుడు హె చ్చరించారు. రాష్ట్రంలో చక్కెర ఫ్యాక్టరీల పనితీరుపై నియమిం చిన అధ్యయన కమిటీ శుక్రవా రం గోవాడ సుగర్స్‌లో రైతుల తో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటువంటి నిర్ణయమే తీసుకుంటే సీఎం చంద్రబాబును సైతం ధిక్కరిస్తామని ఉద్వేగంతో మాట్లాడారు. టీడీపీ అనుకూల పాలక వర్గం అయినా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీకి ఎటువంటి సహకారం అందించడం లేదని ఆయన ఆవేశంగా అన్నారు. హుద్‌హుద్ తుపాను నష్టాన్ని పరిశీలించి వెళ్లిన మంత్రులు ప్రభుత్వ పరంగా ఎటువంటి సాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఫ్యాక్టరీల పనితీరు విషయంలో మాత్రమే అధ్యయనం చేసేందుకు బృందం వస్తుందని తమకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు. నష్టలలో ఉన్న వాటిని పెద్ద ఎత్తున సహాయం చేస్తున్న ప్రభుత్వం తమను మాత్రం ఆదుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు రైతుల మద్దతు లభించింది. వ్యాట్ రద్దు, కోజనరేషన్ పవర్ ధర పెంపు వంటి విషయాలలో ప్రభుత్వం నుంచి అనుకూల నిర్ణయం కోసం చూడాలని ఆయన అధ్యయన బృందాన్ని కోరారు. అధ్యయన బృందానికి కార్మికుల వినతి అధ్యయన బృందానికి సుగర్ ఫ్యాక్టరీ కార్మికుల తరపున వర్క్ మెన్ డెరైక్టర్ శ్రీనివాసరాజు. గుర్తింపు యూనియన్ నాయకుడు కె. భాస్కరరావు వినతిపత్రం సమర్పించారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్, డైలీవేజ్ కార్మికులు, సీజనల్కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వివరించారు. ఫ్యాక్టరీపై ప్రభుత్వం విధించిన వ్యాట్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని, కోజనరేషన్ ధరలను పెంచాలని, దీనివల్ల ఫ్యాక్టరీపై ఆర్థికభారం తగ్గుతుందని ఫలితంగా లాభాలు పెరుగుతాయని అన్నారు. ప్రభుత్వం స్పందించాలి సుగర్ ఫ్యాక్టరీలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చ ర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అ ధ్యయన బృందం ముందు రైతులు ముక్త కంఠంతో నినదించారు.మాజీ ఎమ్మెల్యే, ైవె ఎస్సార్సీపీ నాయకుడు గూనూరు ఎ ర్రునాయుడు(మిలట్రీ నాయుడు) మా ట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం సుగర్ ఫ్యాక్టరీపై విధించిన వ్యాట్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీపై వ్యాట్ ట్యాక్స్ వి ధించడం వల్ల ఫ్యాక్టరీపై సుమారు రూ.8 కోట్లు భారం పడుతోందని ఆవేదన వ్య క్తం చేశారు. మొలాసిస్, విద్యుత్ తక్కువ టారిఫ్ వల్ల ఫ్యాక్టరీ నష్టపోతోందన్నారు. ఫ్యాక్టరీ కో జనరేషన్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌కు ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.2.83ను పెంచాలని వారు డిమాండ్ చేశారు. చీపురుపల్లి సూర్యనారాయణ, గూనూరు సూర్యనారాయణ, భీశెట్టి సిం హాచలం, ఏడువాక సత్యారావు తదితర రైతులు పాల్గొన్నారు. రైతులు అభిప్రాయాలు బృందం సభ్యులు భరద్వాజ్, గురువారెడ్డి నమోదు చేసుకున్నారు. -
‘గోవాడ’ రైతులకు చేదు కబురు
మద్దతుధరపై నిరాశమిగిల్చిన యాజమాన్యం నిరసన వ్యక్తం చేసిన రైతులు ఫ్యాక్టరీలో అవినీతి ఆరోపణలపై విచారణకు ఎమ్మెల్యే డిమాండ్ చోడవరం : గోవాడ సహకార చక్కెరమిల్లు మహాజనసభ సభ్యరైతులను నిరాశపరిచింది. గిట్టుబాటు ధర కోసం ఆశగా ఎదురుచూసిన రైతన్నలకు యాజమాన్యం ప్రకటన తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. రానున్న సీజన్‌కు సంబంధించి మద్దతు ధర ప్రకటించకపోగా, గతేడాది సరఫరా చేసిన చెరకు టన్నుకు రూ.2350 మాత్రమే చెల్లిస్తామని చైర్మన్ గూనూరు మల్లునాయుడు తెలిపారు. గోవాడ సుగర్స్ 44వ మహాజన సభ ఫ్యాక్టరీ ఆవరణంలో సోమవారం జరిగింది. తొలుత 2013-14 నివేదికను ఎమ్డీ వి.వి.రమణరావు చదివి వినిపించారు. అనంతరం 2014-15 అంచనా నివేదికను వివరించారు. అధ్యక్షోపన్యాసంలో చైర్మన్ మల్లునాయుడు మాట్లాడుతూ ఫ్యాక్టరీ అభివృద్ధికి చేపట్టిన చర్యలను వివరించారు. ఫ్యాక్టరీని 4వేల టన్నులకు విస్తరిస్తున్నామన్నారు. మార్కెట్లో పంచదారకు ధర ఆశాజనకంగా లేకపోవడంతో గిట్టుబాటు ధర ఎక్కువగా ఇవ్వలేకపోతున్నామన్నారు. ఫ్యాక్టరీలో లోపాలు, మద్దతు ధరపై పలువురు రైతులు సభలో మాట్లాడారు. మా డుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ మద్దతు ధరను రూ.2800కు మించి చెల్లించాలన్నారు. మదుపులు బాగా పెరిగిపోయినందున కనీసం రూ.2600లయినా ఇవ్వాలన్నారు. మూడేళ్ల కిందట టన్నుకు రూ.2500లు ఇవ్వాలని ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారని, అధికారంలో ఉన్న వీరు ఇప్పుడు మద్దతు ధర కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల న్నారు. మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మాట్లాడుతూ ప్రస్తుతం 5వేల టన్నుల కెపాసిటీకి ఫ్యాక్టరీని ఆధునీకరించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న మిషనరీని సక్రమంగా వినియోగించుకుంటే సరిపోతుందన్నారు. చంద్రబాబు గతంలో సుగర్ ఫ్యాక్టరీలను అమ్మేయాలని చూశారని, వైఎస్ రాజశేఖరరెడ్డి చెరకు రైతులను ఆదుకొని ఫ్యాక్టరీలను నిలి పారన్నారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏటా టన్నుకు రూ.200లు చొప్పున రైతులకు ప్రోత్సాహకం ఇచ్చిందని, అధికార పార్టీ పాలకవర్గం, ఎమ్మెల్యేలు సీఎంపై ఒత్తిడి తెచ్చి దానిని కొనసాగించాలన్నారు. ఈ సీజన్‌కు టన్నుకు రూ. 2800 మద్దతు ధర ఇవ్వాలన్నారు. కో-జనరేషన్ ద్వారా ప్రభుత్వానికి అమ్మే కరెంటు ధర పీపీని రద్దు చేసి యూనిట్‌కు రూ. 9 ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ధర్మశ్రీ చెప్పారు. ప్రతి పక్షాలు ఎప్పుడూ ప్రభుత్వంపై పోరాటం చేయాలని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు. అవినీతి అరోపణలపై విచారణ చేపట్టాలి: ఎమ్మెల్యే రాజు గోవాడ సుగర్ ప్యాక్టరీలో అవినీతి చోటుచేసుకుం దంటూ పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై విచారణ కమిటీ వేయాలని చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు డిమాండ్ చేశారు. ఆరోపణలు నివృత్తిచేసుకోకపోతే పాలకవర్గానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ఇందుకు తక్షణం కమిటీని వేయాలన్నారు. టన్నుకు రూ.2500 మద్దతు దర ఇవ్వాలని డిమాండ్ చేశారు. తీర్మానాలు : మహాజనసభలో పలు తీర్మానాలు చేశారు. 2013-14 క్రషింగ్ సీజన్‌కు టన్నుకు రూ.2350 మద్దతు ధరను చైర్మన్ మల్లునాయుడు ప్రకటించారు. రోజువారీ క్రషింగ్ సామర్థ్యం పెంచేం దుకు రూ.24కోట్లతో ఆధునికీకరణకు ప్రతిపాదన, కరెంటు పీపీ రద్దు, పంచదార అమ్మకాలపై వ్యాట్ రద్దు, మొలాసిస్ అమ్మకాలపై అదనపు పన్ను రద్దు, ఫ్యాక్టరీ ప్రాంగణాన్ని గ్రీన్ బెల్టుగా రూపొందించే పనులకు సమావేశంలో ఆమోదం తెలిపారు. రైతులకు ప్రోత్సాహకాలు : మునుపెన్నడూలేని విధంగా సభ్యరైతులకు ఫ్యాక్టరీ నిధులతో ఒకొక్కరికి ఒక స్టీల్ క్యారేజ్‌ను ప్రోత్సాహకంగా అందజేసింది. వీటిని సభలో నాయకులు రైతులకు అందజేశారు. ఉత్తమ రైతులకు సత్కారం : ఫ్యాక్టరీ పరిధిలో ఆధునికీకరణ పద్ధతులు పాటిస్తూ మంచి దిగుబడి సాధించిన ఇద్దరు రైతులను సభలో సత్కరించారు. వారాడకు చెందిన యడ్ల తాతయ్యలు, సింహాద్రిపురం శివారుకు చెందిన సబ్బవరపు వెంకటరమణలను సన్మానించారు.