ప్రైవేట్‌పరం చేస్తే ప్రతిఘటిస్తాం
గోవాడ సుగర్స్ చైర్మన్ మల్లునాయుడు
సీఎంను సైతం ధిక్కరిస్తాం
అధ్యయన కమిటీకి స్పష్టీకరణ
చోడవరం: అధ్యయన కమిటీ పేరుతో గోవాడ సుగర్స్‌ను ప్రై వేట్‌పరం చేయాలని ఆలోచన చేస్తే పార్టీలకతీతంగా ప్రతిఘటిస్తామని గోవాడ సుగర్స్ చైర్మన్ గూనూరు మల్లునాయుడు హె చ్చరించారు. రాష్ట్రంలో చక్కెర ఫ్యాక్టరీల పనితీరుపై నియమిం చిన అధ్యయన కమిటీ శుక్రవా రం గోవాడ సుగర్స్‌లో రైతుల తో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటువంటి నిర్ణయమే తీసుకుంటే సీఎం చంద్రబాబును సైతం ధిక్కరిస్తామని ఉద్వేగంతో మాట్లాడారు. టీడీపీ అనుకూల పాలక వర్గం అయినా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీకి ఎటువంటి సహకారం అందించడం లేదని ఆయన ఆవేశంగా అన్నారు. హుద్‌హుద్ తుపాను నష్టాన్ని పరిశీలించి వెళ్లిన మంత్రులు ప్రభుత్వ పరంగా ఎటువంటి సాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఫ్యాక్టరీల పనితీరు విషయంలో మాత్రమే అధ్యయనం చేసేందుకు బృందం వస్తుందని తమకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు. నష్టలలో ఉన్న వాటిని పెద్ద ఎత్తున సహాయం చేస్తున్న ప్రభుత్వం తమను మాత్రం ఆదుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు రైతుల మద్దతు లభించింది. వ్యాట్ రద్దు, కోజనరేషన్ పవర్ ధర పెంపు వంటి విషయాలలో ప్రభుత్వం నుంచి అనుకూల నిర్ణయం కోసం చూడాలని ఆయన అధ్యయన బృందాన్ని కోరారు.
అధ్యయన బృందానికి కార్మికుల వినతి
అధ్యయన బృందానికి సుగర్ ఫ్యాక్టరీ కార్మికుల తరపున వర్క్ మెన్ డెరైక్టర్ శ్రీనివాసరాజు. గుర్తింపు యూనియన్ నాయకుడు కె. భాస్కరరావు వినతిపత్రం సమర్పించారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్, డైలీవేజ్ కార్మికులు, సీజనల్‌కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వివరించారు. ఫ్యాక్టరీపై ప్రభుత్వం విధించిన వ్యాట్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని, కోజనరేషన్ ధరలను పెంచాలని, దీనివల్ల ఫ్యాక్టరీపై ఆర్థికభారం తగ్గుతుందని ఫలితంగా లాభాలు పెరుగుతాయని అన్నారు.
ప్రభుత్వం స్పందించాలి
సుగర్ ఫ్యాక్టరీలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చ ర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అ ధ్యయన బృందం ముందు రైతులు ముక్త కంఠంతో నినదించారు.మాజీ ఎమ్మెల్యే, ైవె ఎస్సార్‌సీపీ నాయకుడు గూనూరు ఎ ర్రునాయుడు(మిలట్రీ నాయుడు) మా ట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం సుగర్ ఫ్యాక్టరీపై విధించిన వ్యాట్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీపై వ్యాట్ ట్యాక్స్ వి ధించడం వల్ల ఫ్యాక్టరీపై సుమారు రూ.8 కోట్లు భారం పడుతోందని ఆవేదన వ్య క్తం చేశారు. మొలాసిస్, విద్యుత్ తక్కువ టారిఫ్ వల్ల ఫ్యాక్టరీ నష్టపోతోందన్నారు. ఫ్యాక్టరీ కో జనరేషన్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌కు ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.2.83ను పెంచాలని వారు డిమాండ్ చేశారు. చీపురుపల్లి సూర్యనారాయణ, గూనూరు సూర్యనారాయణ, భీశెట్టి సిం హాచలం, ఏడువాక సత్యారావు తదితర రైతులు పాల్గొన్నారు. రైతులు అభిప్రాయాలు బృందం సభ్యులు భరద్వాజ్, గురువారెడ్డి నమోదు చేసుకున్నారు.