malyadri
-
ఈవీఎంలతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం
-
భర్త రాసినట్లుగానే లేఖలు రాసి..
బంజారాహిల్స్: భార్యా, భర్తల మధ్య విభేదాలు సృష్టించి ఆమెను తనకు అనుకూలంగా మార్చుకోవాలని, ఇందుకోసం తన క్రిమినల్ బ్రెయిన్‌తో ఓ వివాహిత జీవితంతో చెలగాటమాడిన నిందితుడు మాల్యాద్రిని మరింత సమాచారం కోసం కస్టడీలోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు గురువారం తిరిగి జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్, వెంకటేశ్వరనగర్‌కు చెందిన మాల్యాద్రి అపో ఆస్పత్రిలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. శ్రీకృష్ణానగర్‌లోని ఓ ఇంటికి వెళ్లిన మాల్యాద్రి వివాహితతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని పథకం వేసిన అతను భర్తను అడ్డు తొలగించుకునేందుకు ఓ ముఠాకు సుపారీ ఇచ్చాడు. ఆమెపై భర్తకు అనుమానం కలిగేలా ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఉద్యోగం పేరిట బోగస్ అపాయింట్మెంట్ లెటర్ సృష్టించాడు. ఎల్వీ ప్రసాద్ హెచ్ఆర్ మాట్లాడుతున్నట్లుగా తానే ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి ఆమె భర్త రాసినట్లుగా కొన్ని లేఖలు రాసి ఆమె క్యారెక్టర్‌పై అనుమానాలు రేకెత్తించాడు. అపోలో ఆస్పత్రికి కూడా లేఖలు రాసి తనకు సంబంధాలు ఉన్నాయంటూ ఆమె భర్త రాసినట్లుగానే లేఖలు రాసి ఇద్దరి మధ్య చిచ్చుపెట్టాడు. దానిని తనకు అనుకూలంగా మార్చుకొని భర్త ఆమెను వెళ్లగొడితే తనతో పాటు ఉంచుకోవాలని పక్కా పథకం వేశాడు. అయితే చివరకు పోలీసులకు చిక్కాడు. అపోలో, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రుల నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, భర్త రాసినట్లుగా లేఖలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 20న నిందితుడిని అరెస్ట్ చేశారు. మరింత సమాచారం రాబట్టేందుకు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నాడు. ఆమెను దక్కించుకునేందుకే సదరు వివాహిత భర్తను హత్య చేయాలని సుపారి ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. బోగస్ పత్రాలు సృష్టించినట్లు అంగీకరించాడు. -
వివాహితపై కన్నేసి.. భారీ స్కెచ్
బంజారాహిల్స్ : ఇబ్బందుల్లో ఉన్న ఓ వివాహిత అవసరాలను ఆసరాగా చేసుకొని ఆమెపై కన్నేసిన ఓ కామాంధుడు ఆమె భర్తను హతమార్చేందుకు సైతం కుట్రపన్ని పోలీసులకు చిక్కిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 14 వెంకటేశ్వరనగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంతానికి చెందిన మాల్యాద్రి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో స్పెషల్ క్వాలిటీ మెయింటెనెన్స్ విభాగంలో పని చేస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు. గత ఏడాది సెప్టెంబర్ 2న శ్రీకృష్ణానగర్‌కు చెందిన ఓ వివాహిత, తన భర్త జారిపడటంతో కాలు విరిగిపోగా అంబులెన్స్ కోసం అపోలో ఆస్పత్రికి ఫోన్ చేసింది. ఆ సమయంలో ఫోన్ లిఫ్ట్ చేసిన మాల్యాద్రి అంబులెన్స్‌తో పాటు అక్కడికి వచ్చాడు. అప్పటినుంచి ఆమెతో పరిచయం పెంచుకున్న అతను ప్రతి రోజూ ఫిజియోథెరపిస్ట్‌ను తీసుకొచ్చి సదరు యువతి భర్తకు మసాజ్‌లు చేయిస్తూ అక్కడే ఎక్కువసేపు గడిపేవాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఎమ్మెస్సీ నర్సింగ్‌తో పాటు మూడు పీజీలు చేసిన మీ భార్యకు అపోలో ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె భర్తకు చెప్పాడు. వివరాలు నమోదు పేరుతో ఆమె ఫోన్ తీసుకొని భార్య, భర్తలకు తెలియకుండా ఓ యాప్‌ను క్రియేట్ చేశాడు. దీని ద్వారా భార్య, భర్తలు ఏం మాట్లాడుకునేది, ఆమె ఎక్కడికి వెళ్లేది తెలుసుకునేవాడు. ఆమెకు అపోలో ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పించిన మాల్యాద్రి ఆమెను లోబరచుకునేందుకు భర్తకు ఆమెపై అనుమానాలు కలిగేలా ప్రవర్తించడమేగాక, భర్త పేరుతో ఆస్పత్రికి లేఖలు రాశాడు. నాలుగు రోజుల క్రితం తన భార్యా, పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని మనిద్దరి మధ్య వివాహేతర సంబంధం తెలిసిపోయిందని వివాహితకు చెప్పడంతో ఆమె భయంతో పుట్టింటికి వెళ్లిపోయింది. శాశ్వతంగా ఆమె భర్త అడ్డు తొలగించుకోవాలనుకున్న అతను నందినగర్‌కు చెందిన రామారావు అనే వ్యక్తిని కలిసి గత శుక్రవారం ఆమె భర్తను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చాడు. అయితే సదరు వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో దీనిపై ఆరా తీసిన పోలీసులు గడిచిన ఎనిమిది నెలలుగా సదరు దంపతుల మానసిక వేదనను తెలుసుకున్నారు. నిందితుడు మాల్యాద్రిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె భర్తను హత్య చేసి ఆమెను శాశ్వతంగా తన వద్దే ఉంచుకోవాలని పథకం వేసినట్లు చెప్పాడు. ఇందులో భాగంగా పది రోజుల ముందే ఆమె భర్తకు స్లో పాయిజన్ ఇచ్చినట్లు అంగీకరించాడు. ఒకవేళ హత్యాపథకం పారకపోతే అతడిని మంచానికే పరిమితం చేసి ఆమెను శాశ్వతంగా తనతో పాటు ఉంచుకోవాలనుకున్నట్లు తెలిపాడు. అతని పాచిక పారకపోవడంతో పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354, 354(ఏ), 469, 506, 509 కింద కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకం
– అదనపు ఎస్పీ మాల్యాద్రి – ఘనంగా హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం అనంతపురం సెంట్రల్ : శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని ఎస్పీ మాల్యాద్రి అభిప్రాయపడ్డారు. మంగళవారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో 54వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత హోంగార్డుల ప్లటూన్ల నుంచి ఏఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1963లో మొట్టమొదటి సారిగా మహారాష్ట్రలో ప్రారంభమై హోంగార్డుల వ్యవస్థ దేశవ్యాప్తంగా విస్తరించిందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హోంగార్డుల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలందించడం జరుగుతోందని వివరించారు. సాధారణ పరిస్థితుల నుంచి క్లిష్ట పరిస్థితుల వరకూ హోంగార్డుల సేవలు కీలకమయ్యాయని సూచించారు. నేరాల నియంత్రణ, ఛేదింపు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ముఖ్యుల, ప్రముఖుల బందోబస్తు తదితర సందర్భాల్లో హోంగార్డులు సేవలు ప్రశంసనియ్యమన్నారు. అనంతరం క్రీడల్లో విజేతలైన హోంగార్డులకు బహుమతులు అందజేశారు. షాట్‌పుట్ మహిళా విభాగంలో ప్రతిభ కనబరిచిన షామినా, నిర్మల, రేణుకాబాయిలకు బహుమతులు అందజేశారు. అనంతరం నగరంలో హోంగార్డులు భారీ ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ పరేడ్ మైదానం వద్ద అదనపు ఎస్పీ మాల్యాద్రి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కోర్టురోడ్డు, టవర్‌క్లాక్, సుబాష్రోడ్డు, సప్తగిరిసర్కిల్ మీదుగా పోలీస్ హెడ్క్వాటర్స్ వరకూ ర్యాలీ సాగింది. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, ఆర్ఐలు మోసెస్బాబు, వెంకటేశ్వరరావు, ఆర్ఎస్ఐలు నిరంజన్, జాఫ్ర్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
మంత్రిని ప్రశ్నిస్తే... ఎంపీగారికి కోపం వచ్చింది
హైదరాబాద్: బ్యాంకులకు బకాయిపడినట్లు వస్తున్న వార్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక శాఖ సహాయమంత్రి సుజనాచౌదరి స్పష్టం చేశారు. ఈ అంశంపై ఏ విషయమైనా కావాలనుకుంటే కంపెనీ ప్రతినిధులను కలుసుకోవాలని ఆయన తెలిపారు. శుక్రవారం నగరంలోని సీసీఎంబీ ప్రాంగణంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని... మొక్కలు నాటారు. అనంతరం సుజనా చౌదరి విలేకర్లతో మాట్లాడుతూ.. దేశంలో శాస్త్ర సాంకేతిక రంగం మరింత ప్రగతి సాధించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. మంత్రి పదవి చేపట్టిన మీరు బ్యాంకులకు బకాయిలు పడినట్లు మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయని వాటిపై మీ స్పందన ఏమిటని విలేకర్లు సుజనాచౌదరిని ప్రశ్నించారు. దీనిపై సుజనాపై విధంగా స్పందించారు. సుజనా చౌదరిపై విలేకర్లు ప్రశ్నలు సంధిస్తున్న సమయంలో అక్కడే ఉన్న బాపట్ల టీడీపీ ఎంపీ మాల్యాద్రి అసహనానికి గురైయ్యారు. మీరు ఏ పత్రిక నుంచి వచ్చారు? ఎందుకు ప్రశ్నలు వేస్తున్నారంటూ విలేకర్లపై బెదిరింపు ధోరణితో వ్యవహారించారు. మాల్యాద్రి తీరుపై విలేకర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్యాద కోల్పోవద్దంటూ మాల్యాద్రికి విలేకర్లు హితవు పలికారు. -
కామన్వెల్త్ చాంపియన్ శిరీషకు ఘన సన్మానం
కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కామన్వెల్త్ చాంపియన్ శిరీషను ఆదర్శంగా తీసుకుని పతకాల పంట పండించాలని వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులకు జెడ్పీ సీఈఓ మాల్యాద్రి సూచించారు. కడపలోని వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్లో స్పెషలాఫీసర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో మూడు స్వర్ణపతకాలు సాధించిన జిల్లా క్రీడాకారిణి శిరీషను శుక్రవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీఈఓ మాట్లాడుతూ క్రీడాకారులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు నిరంతర సాధన చేయాలన్నారు. స్పోర్ట్స్ స్కూల్లో జెడ్పీ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. వల్లూరు మండల అభివృద్ధి నిధుల నుంచి ఆమెకు రూ.10 వేలు నగదు ప్రోత్సాహం అందజేస్తామని ప్రకటించారు. జిల్లా క్రీడాకారిణి అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయమని స్పోర్ట్స్ స్కూల్ స్పెషలాఫీసర్ కొనియాడారు. పట్టుదలతో మంచి ఫలితాలు సాధించిన శిరీష ఒలంపిక్స్‌లో పతకం సాధించాలని ఆకాంక్షించారు. శిరీషకు జిల్లా అధికారుల తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందేలా చూస్తామని సభలో ప్రకటించారు. గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం అంటే మామూలు విషయం కాదని వల్లూరు ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్ అన్నారు. వల్లూరు మండలం పెద్దపుత్తలో జన్మించిన శిరీష వల్లూరు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు గాను ఆమెకు ‘వల్లూరు క్రీడారత్నం’ బిరుదును ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. అమ్మాయిలకు క్రీడలు ఎందుకు అని చాలామంది నిరుత్సాహ పరచినా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను క్రీడల్లో రాణిస్తున్నట్లు శిరీష తెలిపారు. కోచ్‌లు, అధ్యాపకుల సహకారంతో మరిన్ని పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. అనంతరం ఆమెను సన్మానించడంతో పాటు నగదు బహుమతిని అందించారు. శిరీష తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, వెంకటశివారెడ్డి, స్పోర్ట్స్ స్కూల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ వై.భాస్కర్‌రెడ్డి, కోచ్‌లు నౌషాద్, రంగనాథరెడ్డి, అనిల్, విద్యార్థులు పాల్గొన్నారు.