Man power
-
WELCOME 2024: కొత్త సంవత్సరమా మనిషిని మేల్కొలుపు
రోడ్డున ప్రమాదం చూస్తే సాయానికి పరిగెత్తి వెళ్లే మనిషిని, చుట్టూ చెడు జరిగితే మనకెందుకులే అనుకోని మనిషిని, ఇరుగింట్లో ఆర్తనాదాలకు చలించే మనిషిని, పొరుగింట్లో కష్టానికి హాజరయ్యే మనిషిని, ద్వేషమే జీవితంగా బతకని మనిషిని, ఒకరు బాగుపడితే సంతోషపడే మనిషిని, అడుగంటిపోయిన మానవత్వాన్ని జాగృతం చేసుకునే మనిషిని, మనిషి మీద నమ్మకం నిలిపే మనిషిని, ఓ కొత్త సంవత్సరమా మేల్కొలుపు. వద్దు. నమ్మాల్సిన చోట నేరం చేసే మనిషి వద్దు. భర్తగా ఉంటూ, భార్యగా ఉంటూ, స్నేహితుడిగా ఉంటూ, అత్త మామగా ఉంటూ, బంధువుగా ఉంటూ... వీరిని నమ్మొచ్చు, వీరిని కాకపోతే ఎవరిని నమ్ముతాం... అనుకున్న సందర్భంలో కూడా నేరం చేసి, ప్రాణం తీసి మనిషి మీద నమ్మకమే పోగొట్టిన– 2023లో చాలాసార్లు కనపడిన మనుషి– కొత్త సంవత్సరంలో వద్దు. ‘అయ్యో... నా గోడు ఎవరూ వినట్లేదే’ అని కన్నపిల్లలతో పాటు నిస్సహాయంగా వెళ్లి చెరువులో దూకే కన్నతల్లి వద్దు. ‘నా బాధ అమ్మానాన్నలు వినట్లేదే’నని హాస్టల్ ఫ్యాన్లకు వేళ్లాడే ముక్కుపచ్చలారని పిల్లలూ వద్దు. నలుగురు సంతానం ఉన్నా, మీ దగ్గర ఉంచుకుని నాలుగు మెతుకులు పెట్టండి చాలు అంటున్నా వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులను పడేసి వారిని బాధించే స్వార్థసంతానం వద్దు. సాకులు చెప్పే సంతానం వద్దు. ముఖ్యంగా– తల్లిదండ్రుల శాపం అందుకునే సంతానం వద్దు. జీవితమంటే అనుక్షణం డబ్బు సంపాదనే అనుకునే, ఎంత ఉన్నా సరిపోదనుకునే మనిషి వద్దు. అందుకు ఉద్యోగ బాధ్యతలను కలుషితం చేసే, ప్రజల భవిష్యత్తును బలి పెట్టే మనిషి వద్దు. కల్తీ చేసే మనిషి, విషం లాంటి ఆహారం అమ్మే, కూరనారలను రసాయనం చేసే మనిషి వద్దు. వ్యసనపరులుగా మార్చే ఉత్పత్తులను తయారు చేసే మనిషి వద్దు. అందుకు అనుమతించే ప్రభుత్వ నేతలూ వద్దు. వైద్యం తెలియని వైద్యుడు వద్దు. దైవభీతి పాపభీతి లేని వైద్యుడు వద్దు. రోగి మీద దయ, సానుభూతి లేని వైద్యుడు వద్దు. రోగుల అశ్రువులను అంతస్తులుగా చేసి ఆస్పత్రులు నిర్మించాలనుకునే వైద్యుడు వద్దు. చదువుల పేరుతో తల్లిదండ్రుల కడుపులో గంజిని కూడా తాగే విద్యావ్యవస్థల యజమాని కూడా వద్దు. మూర్ఖుడు వద్దు. మూకస్వభావము ఉన్నవాడూ వద్దు. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి సాటి మనిషిని ద్వేషించే వాడు వద్దు. బతకగోరని వాడు వద్దు. బతకనివ్వనివాడు వద్దు. అమాయకుల నుంచి లాక్కుని నింగినీ, నేలనూ మింగేసేవాడు వద్దు. ఉద్యోగుల గోడు వినని యజమాని వద్దు. పిలిస్తే పలకని పోలీసు వాడు వద్దు. న్యాయం వైపు నిలవని తీర్పు కూడా వద్దు. 2024 సంవత్సరమా... ఎన్నో ఆశలను కల్పిస్తూ అడుగిడుతున్న నూతన వత్సరమా... ఎంత జరిగినా ఏమి జరిగినా ‘మానవుడే మహనీయుడు’ అని నిరూపించే నిదర్శనాలను ఈ సంవత్సరం చూపు. మనిషిని మేల్కొలుపు. మనిషి తప్ప మరెవరూ ఈ జగతిని శాంతితో, కాంతితో నింపలేరు. కుడికాలు ముందు పెట్టి రా తల్లీ! -
వైరల్: ఈ దొంగోడి ప్లాన్ బెడిసికొట్టింది.. వదిలేయండంటూ ఏడుస్తూ..
కాలిఫోర్నియా : దొంగతనం చేయాలంటే పక్కా ప్లాన్ వేయాలి. ఎవరికి చిక్కకుండా చాలా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఎంత జాగ్రత్త వహించినా కొన్నిసార్లు అడ్డంగా బుక్కైపోతుంటారు. తాజాగా అలాంటి ఓ ఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియనాలోని శాస్ లియాండ్రోలో ఓ ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేయాలని పక్కా ప్లాన్ వేశారు. దోచుకునేందుకు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమయంలోనే ఓ వ్యక్తి తన కారు వద్దకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కారు తాళం తీసేలోపు ఈ ఇద్దరు దొంగలు తుపాకీతో కారు వ్యక్తి దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు. ఇద్దరిలో ఓ వ్యక్తి తన తుపాకీతో అతనిని బెదిరించాడు. అయితే ఇక్కడే దొంగల ప్లాన్ రివర్స్ అయ్యింది. దొంగల బెదిరింపులకు కారు యాజమాని భయపడకపోవడమే కాకుండా తుపాకీ పట్టుకున్న దొంగను గట్టిగా పట్టుకున్నాడు. అతని గట్టిగా కొట్టి ఒక్క దెబ్బతో కిందపడేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీంతో చేసేదేం లేక లొంగిపోయిన దొంగ ఏడుస్తూ ‘సరే సరే ఆల్రైట్ నన్ను వెళ్లనివ్వండి’ అంటూ వేడుకున్నాడు. అతనితో వచ్చిన మరో దొంగకూడా అతన్ని వదిలిపెట్టండి అంటూ అరవడం వీడియోలో వినిపిస్తోంది. ఇక చివరికి ఆ వ్యక్తి దొంగను వదిలిపెట్టేస్తాడు. దీంతో ఇద్దరు అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను డావెన్యూ వరల్డ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ సోషల్ మీడియాలో చేశారు. కాలిఫోర్నియాలో అతని దొంగతనం పాపం అనుకున్నట్లు జరగలేదు అనే క్యాష్టన్తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరలవుతోంది. సదరు వ్యక్తి ధైర్యాన్ని, సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చదవండి: కారులో రూ.12 లక్షల చోరీ.. 24 గంటల్లో స్వాధీనం ముగ్గురు ఓఎన్జీసీ సిబ్బందిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు View this post on Instagram A post shared by Fifty Shades of Whey (@davenewworld_) -
సిబ్బంది లేక ఇబ్బంది
* తూనికలు, కొలతల శాఖ సిబ్బంది ఆవేదన * మూడేళ్లుగా సిబ్బంది కొరతతో సతమతం * అదనపు పనితో యాతన * పడుతున్నా స్పందించని ఉన్నతాధికారులు గుంటూరు (లక్ష్మీపురం): జిల్లా తూనికలు కొలతలు శాఖ సిబ్బంది కొరతతో సతమతవుతోంది. గత మూడేళ్లుగా సమస్యతో ఇబ్బందులు పడుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని సిబ్బంది వాపోతున్నారు. జిల్లా తూనికలు కొలతల శాఖ కార్యాలయం పట్టాభిపురంలో గత 10 సంవత్సరాలుగా అద్దె భవనంలో ఉంది. శాఖలో మొత్తం ముగ్గురు జిల్లా ఇన్స్పెక్టర్లు, ఐదుగురు ఇన్స్పెక్టర్లు ఉండాలి. అయితే మూడేళ్లుగా ఇద్దరు జిల్లా ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఒక రీజినల్ డెప్యూటీ కంట్రోలర్ ఉండాలి. అయితే ఆ పోస్ట్‌లో కూడా వైజాగ్ రీజినల్ డెప్యూటీ కంట్రోలర్ పి.సుధాకర్ ఇన్‌చార్‌్జగా వ్యవహరిస్తున్నారు. అంతా ఆ నలుగురే... ముగ్గురు జిల్లా ఇన్స్పెక్టర్లకు గాను ఇద్దరే విధులను నిర్వహిస్తున్నారు. నరసరావుపేట రెగ్యులర్ జిల్లాఇన్‌స్పెక్టర్ అయిన దయాకర్‌రెడ్డి గుంటూరు ఇన్చార్జ్ జిల్లా ఇన్‌స్పెక్టర్‌గాను, నరసరావుపేట ఇన్చార్జి ఇన్‌స్పెక్టర్‌గాను విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే పురుషోత్తం తెనాలి జిల్లా ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే విధంగా నల్లబోతుల అలూరయ్య గుంటూరు రెగ్యులర్ ఇన్స్పెక్టర్ కాగా,సత్తెనపల్లి ఇన్‌చార్‌్జగా పనిచేస్తున్నారు.సయ్యద్ సలీం తెనాలి రెగ్యులర్ ఇన్స్పెక్టర్ కాగా, పొన్నూరు ఇన్‌చార్‌్జగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న చౌక డిపోలు 2660లను వీరు నలుగురు స్టాంపింగ్ చేస్తూ నానా యాత న పడుతున్నారు. పని భారంతో సతమతం.. తూనికలు కొలతలు శాఖ ఇన్స్పెక్టర్లు జిల్లా వ్యాప్తంగా చౌకడిపోలను ప్రత్యక్షంగా పరిశీ లించి ఈ పాస్ ఎలాక్ట్రానిక్ వేయింగ్ మిషన్ స్టాంపింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే చిల్లర దుకాణాలు, పెట్రోల్ బంకులు, లారీ వేయింగ్లను, యార్డులలో ఉండే కాటాలను ఇలాæ తూకం వేసే ప్రతి వ్యాపారంపై పూర్తి నిఘా ఉంచాల్సి వస్తుంది. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను సైతం పరిశీలించి దాడులు నిర్వహించాల్సి ఉంటుంది. వినియోగదారుడిని మోసం చేసేందుకు వ్యాపారస్తుడు కాటాలో తేడా చూపించినట్టు సమాచారం అందితే హుటాహుటిన వచ్చి పరిశీలించి కేసులు నమోదు చేసి కాటాలను సీజ్ చేసే అధికారం కూడా ఈ శాఖలో ఇన్స్పెక్టర్లకు ఉంటుంది. అయితే సిబ్బంది లేని కారణంగా ఎనిమిదిమంది చేయాల్సిన పనిని నలుగురు మాత్రమే జిల్లాలో చేస్తున్నారు. ఈ కారణంగా తీవ్ర పనిఒత్తిడికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కొరతపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం జిల్లాలో మూడు సంవత్సరాలుగా సిబ్బంది కొరత ఉన్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లాం. ఉండవలసిన ఎనిమిది మంది మాత్రమే కాకుండా మండలానికి ఓ ఇన్స్పెక్టర్ను నియమించేందుకు ఉన్నతాధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అదేవిధంగా కార్యాలయంలో కంప్యూటర్లు కూడా 2జిబి ర్యాం ఉన్నవి మూడు మాత్రమే ఉన్నాయి. 4జిబి ర్యాం ఉన్న కంప్యూటర్లు ఎనిమిది వరకు కావాలి. ప్రతి ఇన్స్పెక్టర్కు ఓ కంప్యూటర్ను కేటాయించి, సిబ్బంది కొరత తీర్చి, సొంత భవనంలోకి కార్యాలయాన్ని బదిలీ చేస్తే ప్రజలకు మరింత చేరువ అవుతాము. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేశాం. – ఎ.కృష్ణచైతన్య, జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్