Manasi Joshi
-
ఇంత చెత్తగా వ్యవహరిస్తారా? యువీ, భజ్జీపై విమర్శలు
భారత ‘దిగ్గజ’ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా తీరుపై పారాలింపిక్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లెజెండ్స్ నుంచి ఇలాంటి అమానుషమైన, చెత్త ప్రవర్తనను ఊహించలేదంటూ ఘాటుగా విమర్శించింది.క్రికెట్ సెలబ్రిటీలుగా సానుకూల దృక్పథాన్ని వ్యాప్తి చేయాల్సింది పోయి.. ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికింది. అనుచితంగా వ్యవహరించిన కారణంగా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ విజేతగా భారత్విషయం ఏమిటంటే.. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌ను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఇండియా చాంపియన్స్ జట్టుకు యువరాజ్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, సురేశ్ రైనా తదితరులు సభ్యులుగా ఉన్నారు.ఇక ఈ టీ20 టోర్నీలో భారత్- పాకిస్తాన్ చాంపియన్స్ ఫైనల్‌కు చేరగా.. యువీ సేన గెలుపొందింది. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 అరంగేట్ర టైటిల్ కైవసం చేసుకుంది.ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో యువీ, భజ్జీ, రైనా కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘‘లెజెండ్స్ క్రికెట్లో పదిహేను రోజుల పాటు ఒళ్లు హూనమైంది. శరీరంలోని ప్రతీ అవయవం నొప్పితో విలవిల్లాడుతోంది’’ బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ పాట తౌబ.. తౌబకు తమ స్టెప్పులు ఇలాగే ఉంటాయంటూ కుంటుతూ నడుస్తున్నట్లుగా అభినయించారు.అనుచిత ప్రవర్తనఈ వీడియో వైరల్‌కాగా పారాలింపిక్ ఇండియా కమిటీ తీవ్రంగా స్పందించింది. ‘‘ఏమాత్రం సున్నితత్వం లేని అనుచిత ప్రవర్తన ఇది. క్రికెట్ స్టార్ సెలబ్రిటీలుగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా మీ ప్రవర్తన ఉండాలి.కానీ ఇతరుల వైకల్యాన్ని ఎత్తిచూపేలా ఇలా గంతులు వేయడం బాధ్యతారాహిత్యం. ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా? దివ్యాంగుల పట్ల వివక్ష చూపడమే ఇది. ఇలాంటి చర్యలకు పాల్పడ్డందుకు వెంటనే క్షమాపణలు చెప్పండి’’ అని పారాలింపిక్ ఇండియా కమిటీ చురకలు అంటించింది.ప్రముఖ పారా అథ్లెట్, బ్యాడ్మింటన్ స్టార్ మానసి జోషీ సైతం యువరాజ్, భజ్జీ, రైనా తీరును తప్పుబట్టారు. అయితే, ఈ ముగ్గురిలో ఎవరూ కూడా తమపై వస్తున్న విమర్శలకు ఇంతవరకు స్పందించలేదు. అయితే, విమర్శల నేపథ్యంలో యువీ ఈ వీడియోను డిలీట్ చేయడం గమనార్హం.చదవండి: T20I Captain: టీమిండియా టీ20 కెప్టెన్‌గా వాళ్లిద్దరి మధ్యే పోటీ View this post on Instagram A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) -
అంగ వైకల్యం అడ్డు కాలేదు.. ప్రపంచం మెచ్చిన స్పోర్ట్స్ స్టార్ అయ్యింది..!
ఆమె దృఢ సంకల్పానికి అంగ వైకల్యం అడ్డు కాలేదు. మొండి పట్టుదలతో అనుకున్నది సాధించింది. 22 ఏళ్లకే రోడ్డు ప్రమాదంలో కాలు పోయినా.. కృత్రిమ కాలితో తనకెంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ క్రీడలో సక్సెస్ సాధించింది. విధి వెక్కిరించినా సంచలనాలు సృష్టించింది. ఆమె ఆత్మ విశ్వాసం ముందు అంగ వైకల్యం ఓడిపోయింది. ఈ నిజమైన విజేత పేరే మానసి జోషి. గుజరాత్లో పుట్టి, ముంబైలో పెరిగిన 34 ఏళ్ల మానసి రోడ్డు ప్రమాదంలో కాలు పోయినా ఏమాత్రం అధైర్యపడకుండా జీవితంలో ముందడుగు వేసింది. కృత్రిమ కాలితో తనకెంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ క్రీడలో సక్సెస్ సాధించింది. శారీరక లోపాన్ని జయించి అంతర్జాతీయ వేదికలపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. ఈ క్రమంలో పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌గా, వరల్డ్ నంబర్ వన్ షట్లర్‌గా ఎదిగింది. ఆరేళ్ల వయసులోనే రాకెట్ పట్టుకున్న మానసి ఓవైపు ఉన్నత చదువులు చదువుతూనే.. క్రీడల్లో రాణించింది. ముంబైలో ఇంజినీరింగ్ పూర్తి చేశాక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన మానసి.. ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయింది. 2011 డిసెంబర్ 2న ద్విచక్రవాహనంపై ఆఫీసుకు వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో ఆమె ఎడమ కాలు పూర్తిగా ఛిద్రమైంది. కాలు కోల్పోయాక కొద్ది రోజుల పాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయిన మానసి.. వైకల్యం తన ఎదుగుదలకు అడ్డుకాకూడని నిశ్చయించుకుని ముందడుగు వేసింది. కృత్రిమ కాలును అమర్చుకొని తనకెంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ బరిలోకి రీఎంట్రీ ఇచ్చింది. కఠోర శ్రమ అనంతరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన మానసి.. 2018లో హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేరి తన ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకుంది. గోపీచంద్ శిక్షణలో రాటుదేలిన మానసి.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌తో పాటు మరెన్నో అంతర్జాతీయ పతకాలు సాధించింది. తన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు పొందింది. 2022లో మానసి వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్‌గా అవతరించింది. అమెరికాకు చెందిన బార్బీ కంపెనీ మానసి సాధించిన విజయాలకు గుర్తింపుగా ఆమె పోలికలతో బార్బీ బొమ్మను రూపొందించింది. తాజాగా చైనాలో జరుగుతున్న పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన మానసి.. సహచర క్రీడాకారిణిలతో కలిసి ఫోటోకు పోజిచ్చింది. With Para baddy girls in China 🇨🇳 pic.twitter.com/bkDNlDM5vl — Manasi Joshi (@joshimanasi11) February 29, 2024 -
నా విజయం వెనుక గోపిచంద్ కృషి ఎంతో ఉంది
-
‘అమ్మా నన్ను కన్నందుకు’.. మేడమ్ మీవల్లే
మార్చి 8 మహిళాశక్తి బర్త్ డే! బాయ్స్ అండ్ బిగ్ బాయ్స్.. ఆరోజు మీరు మీ మహిళకు.. మీ బాస్, మీ కొలీగ్, మీ టీచర్, మీ మదర్, వైఫ్, సిస్టర్ .. వారెవరైనా సరే.. శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోకండి. ‘మేడమ్ మీవల్లే’ ‘అమ్మా నన్ను కన్నందుకు’ ‘సోదరీ తోడున్నావు’ ‘సహచరీ నీడవయ్యావు’ కృతజ్ఞతగా ఒక్కమాట. ఒక్క ప్రణామం. ప్లస్.. వాళ్లను రెస్పెక్ట్ చేస్తూ ఒక ‘ఉమెన్స్ డే’ గిఫ్ట్! బార్బీ బొమ్మల తయారీ కంపెనీ ‘మటెల్’ కూడా ఈ ఏడాది ఉమెన్స్ డే కి మహిళాశక్తిని రెస్పెక్ట్ చేస్తూ డీజే క్లారా గా ఒక కొత్త బార్బీని మార్కెట్ లోకి తెస్తోంది. 36 ఏళ్ల క్లారా బ్రిటిష్ రేడియో ప్రెసెంటర్. ‘పవర్ గర్ల్’ బార్బీ, ‘సూపర్ ఉమన్’ క్లారా ప్రతి మహిళలోనూ ఉంటారు. మహిళే మన రోల్ మోడల్. అమ్మాయిలూ.. (లేదా) మహిళలూ.. మీరొక సెలబ్రిటీ అనుకుందాం. ‘అనుకోవడం ఏంటీ! నేను సెలబ్రిటీనే’ అంటారా! మరీ మంచిది. ‘ఉమెన్స్ డే’ కి మీకు రెండు గిఫ్టులు. అయితే రెండూ కాదు. ఏదో ఒకటే ఎంపిక చేసుకోవాలి. మొదటిది: ఆస్కార్ అవార్డు. రెండోది: మీ తెలివి తేటలతో, మీ రూపలావణ్యాలతో, మీ ప్రొఫెషనల్ ప్రతిభా సామర్థ్యాలతో, అచ్చంగా మీలా ఉండే బార్బీ డాల్ మీ పేరిట మార్కెట్లో రిలీజ్ అవడం. రెండిట్లో ఏది కోరుకుంటారు? పైకి చెప్పక్కర్లేదులెండి. డీజే క్లారా సంతోషాన్ని చూసినవాళ్లు ఎవరైనా ఏమంటారంటే.. మీరసలు ఆస్కార్ వైపే చూడరని! ‘ఎలా చెప్పగలరు మీరలా!’.. అంటారా? డీజే క్లారా ప్రస్తుతం ఆకాశం పట్టనంత సంతోషంగా ఉన్నారు. ఆమెను రోల్ మోడల్‌గా చూపుతూ.. బార్బీ బొమ్మలు తయారు చేస్తుండే ప్రపంచ ప్రసిద్ధ ‘మటెల్’ టాయ్స్ కంపెనీ ‘డీజే క్లారా బార్బీ’ని మార్కెట్లోకి విడుదల చేసింది. సందర్భం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ‘ఒక మహిళకు ఇంతకన్నా గౌరవం ఏముంటుంది?’ అంటున్నారు క్లారా. తన రూపంలో ఉన్న ఆ కొత్త బార్బీ డాల్‌ను రెండు చేతులతో అందుకుని అపురూపంగా చూసుకుంటూ ఆమె మురిసిపోతున్నారు. 36 ఏళ్ల క్లారా యాంఫో (ఆమె పూర్తి పేరు) ఆఫ్రికన్ సంతతి బ్రిటిష్ మహిళ. లండన్‌లో బి.బి.సి. రేడియో ప్రెజెంటర్. బి.బి.సి టెలివిజన్ లో వ్యాఖ్యాత. క్లారాయాంఫో డాట్ కామ్‌లోకి వెళ్లి చూస్తే ఆమె గురించి అంతా తెలిసిపోతుంది. అంత ఓపిక లేకపోతే క్లారా బార్బీ డాల్‌ను చూసినా సరే. క్లారా బాహ్య సౌందర్యాన్ని, ఆమె అంతఃశక్తిని ప్రతిఫలించేలా ఉంది క్లారా బార్బీ. కంగ్రాట్స్ క్లారా. మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ∙∙ బార్బీ ‘గర్ల్ పవర్’ అయితే, క్లారా ‘సూపర్ ఉమెన్’, ఇద్దరూ కలిసిన ‘పవర్ ఉమన్’.. మహిళ. ఫలానా మహిళ అని కాదు. ప్రతి మహిళా! మన మేడమ్, మన కొలీగ్, మన టీచర్, మన సహోద్యోగి, స్నేహితురాలు, అమ్మ, సోదరి, జీవిత సహచరి.. చుట్టూ ఎంత శక్తి! మనల్ని బతికిస్తున్న, మనల్ని నడిపిస్తున్న, మనిషంటే ఎలా ఉండాలో నేర్పిస్తున్న శక్తులు. ఆ శక్తులకు, సామర్థ్యాలకు ప్రతీకలే క్లారా, క్లారా బార్బీ. క్లారా మొదట డాన్సర్. తర్వాత డీజే (డిస్క్ జాకీ). బి.బి.సి. టీవీలో ‘స్ట్రిక్ట్లీ కమ్ డ్యాన్సింగ్’ అనే డాన్స్ పోటీల ప్రోగ్రామ్ వస్తుంటుంది. ఇప్పటికీ వస్తోంది. ‘స్ట్రిక్ట్లీ’ అంటారు షార్ట్‌కట్‌లో. ఆ ప్రోగ్రామ్ కంటెస్టెంట్‌గా వచ్చి, బి.బి.సి.లోనే రేడియో ప్రెసెంటర్‌గా ప్రసిద్ధి చెందారు క్లారా. అయితే బార్బీగా ఆమె అవతరించడానికి అదొక్కటే కారణం కాదు. జాతి వివక్షకు, జాత్యహంకారానికి వ్యతిరేకంగా గళమెత్తారు. తన జాతి హక్కుల కోసం నిలబడ్డారు. గత ఏడాది మేలో అమెరికాలో నల్లజాతి పౌరుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా బ్రిటన్‌లో జరిగిన అనేక సభల్లో ఆమె ప్రసంగించారు. బి.బి.సి.లో ఉద్యోగం పోతుందనీ, ఉద్యోగం పోతే గుర్తింపు ఉండదని అనుకోలేదు. ఆమె నిబద్ధతని బ్రిటన్ గుర్తించింది. ‘ది ఫేసెస్ ఆఫ్ హోప్’ అంటూ బ్రిటిష్ ‘వోగ్’ పత్రిక 2020 సెప్టెంబర్ సంచిక కోసం తను ఎంపిక చేసిన 40 మంది సామాజిక కార్యకర్తల్లో ఒకరిగా క్లారాకు స్థానం కల్పించింది. బార్బీగా కూడా ఇప్పుడు స్థానం పొందడాన్ని క్లారా తన అదృష్టంగా భావిస్తున్నారు. ‘‘నా ప్రొఫెషనల్ లైఫ్‌కు లభించిన గౌరవమిది. శక్తికి, ఆత్మవిశ్వాసానికి ఆదర్శవంతమైన ఒక బార్బీని అవడం కన్నా అదృష్టం ఏమంటుంది!’’ అంటున్నారు క్లారా ఎంతో గర్వంగా. ‘మిల్క్ హనీ బీస్’ అని లండన్‌లో ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ నల్లజాతి మహిళలకు, బాలికలకు సృజనాత్మక రంగాలలో చేదోడుగా ఉంటుంది. ఆ సంస్థకు చేదోడుగా కూడా క్లారా ఉంటున్నారు. కలలకు రూపం బార్బీ ప్రపంచంలో ఎన్ని రంగాల్లోనైతే మహిళలు రాణిస్తున్నారో అన్ని రంగాల మహిళలకూ బార్బీలో రోల్ మోడల్స్ వచ్చేశాయి. ‘స్టెమ్’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమేటిక్స్) సహా దాదాపు 200 జాబ్ ఫీల్డ్స్‌లో బార్బీ బొమ్మలు ఉన్నాయి. ఆడపిల్లల ఆశలకు, వాస్తవాలకు మధ్య ఉండే ‘డ్రీమ్ గ్యాప్’ను చెరిపేయడానికే బార్బీ ఆవిర్భవించింది. తొలి బార్బీ 1959లో ఫ్యాషన్ డాల్‌గా అమెరికన్ మార్కెట్లోకి వచ్చింది. ఆ బార్బీ సృష్టికర్త రూత్ హ్యాండ్లర్ అనే మహిళ. ఆగమనంతోనే ఆడపిల్లలకు ఆత్మీయనేస్తం అయింది బార్బీ. తోబుట్టువు పుట్టినంతగా సంతోషించారు. ఆడపిల్లల్ని కనుక మనం సంతోషంగా ఉంచగలిగితే వాళ్లు ఏదైనా సాధించగలరు అని మార్లిన్ మన్రో అంటుండేవారు. ఒక బార్బీని కొనిచ్చినా వారు ఏదైనా సాధించగలరు. అయితే వారు కోరుకున్న బార్బీని మాత్రమే. ఎడ్యుకేషన్, మెడిసిన్, మిలటరీ, పాలిటిక్స్, ఆర్ట్స్, బిజినెస్, సైన్స్.. ఏ రంగలోని బార్బీని కోరుకుంటే ఆ బార్బీ. ‘స్పెషల్లీ ఏబుల్డ్’ బార్బీలు కూడా ఉన్నాయి. గత ఏడాది అంతర్జాతీయ బాలికా దినోత్సవానికి (అక్టోబర్ 11) మానసి జోషీ బార్బీ విడుదలైంది. మానసి ప్యారా–బాడ్మింటన్ ప్లేయర్. అంతర్జాతీయ బాలికా దినోత్సవానికి గత ఏడాది వచ్చిన తన రోల్ మోడల్ బార్బీతో మానసి జోషి -
స్వర్ణ ‘దీక్షా’ మణులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత కీర్తిని ఎగురవేయడంలో క్రీడాకారిణులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికే మీరాబాయి చాను, సంజితా చాను, పూనమ్ యాదవ్, మనూబాకర్, మానికా బాత్రా , హీనా సిద్ధూ మేరీకోమ్, సైనా నెహ్వాల్, తేజస్విని సావంత్, శ్రేయాసి సింగ్ ఇలా చాలామంది ప్రపంచ పటంపై ‘బంగారు’ పతకాలను కొల్లగొట్టిన వారే. ఎన్ని కష్టాలు ఎదురైనా రెట్టించిన ఉత్సాహంతో సాగర కెరటాల్లా ఎగసిపడుతునే ఉన్నారు మన క్రీడా కుసుమాలు. ఇటీవల బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ, షూటర్ ఇలవేణి, పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మానసి జోషిలు భారత కీర్తిని మరింత ఇనుమడింపజేశారు. కొన్ని రోజుల క్రితం తమ విభాగాల్లో సత్తాచాటిన ఈ గోల్డెన్ గర్ల్స్ గురించి ఒకసారి చూద్దాం. పీవీ సింధు.. 1995, జూలై 5 తేదీని పి. వి. రమణ, పి. విజయ దంపతులకు సింధు జన్మించారు. ఎనిమిదేళ్ల వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించిన సింధు.. 24 ఏళ్ల వయసులోనే ప్రపంచ చాంపియన్ అయ్యారు. వరల్డ్ చాంపియన్ షిప్ ఆరంభంనుంచి ఆఖరు దశకు చేరే వరకు ఎందరో స్టార్లు తలవంచి నిష్క్రమించిన చోట... సింధు మాత్రం ఉవ్వెత్తున ఎగిశారు. వరుసగా మూడుసార్లు ఫైనల్‌కు చేరిన ఈ హైదరాబాదీ అమ్మాయి.. స్వర్ణం ముచ్చటను తీర్చుకున్నారు. ఫలితంగా నాలుగు దశాబ్దాలుగా ఊరించిన పసిడి కల నెరవేరింది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను అందుకున్నారు సింధు. గతంలో పాల్గొన్న ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో నాలుగు పతకాలు గెల్చుకున్న తెలుగు తేజం.. ఈసారి మాత్రం పసిడి సాధించే వరకూ వదల్లేదు. గత ఆదివారం ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ పోరులో సింధు ఏకపక్ష విజయం సాధించి పసిడిని ఒడిసి పట్టుకున్నారు. పీవీ సింధు 21-7, 21-7 తేడాతో జపాన్ స్టార్ క్రీడాకారిణి ఒకుహారాను మట్టికరిపించి తొలిసారి చాంపియన్‌గా అవతరించారు. సెప్టెంబరు 21, 2012 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్- 20 జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఆగస్టు 10, 2013 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించి అలా గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించారు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో జరిగిన సెమీఫైనల్లో జపాన్ కు చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించడం ద్వారా ఈ మెగా టోర్నమెంట్ బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. ఫైనల్లో పోరాడి ఓడినప్పటికీ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయ క్రీడాకారిణిగా సింధు నిలిచారు. ఓవరాల్‌గా తన కెరీర్లో 15 టైటిల్స్ సాధించారు. మార్చి 30, 2015న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రదానం చేయగా, అంతకముందు 2013లో అర్జున అవార్డును సింధు అందుకున్నారు. 2016లో భారత దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్ రత్నాతో సింధును సత్కరించారు. మానసి జోషి.. పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్లో మానసి జోషి స్వర్ణం సాధించడం వెనుక పెద్ద కష్టమే ఉంది. రోడ్డు ప్రమాదం కారణంగా ఎడమ కాలును పోగొట్టుకుని ఇక ఆటకు దూరమవుతుందేమో అనుకుంటున్న సమయంలో... అసమాన ప్రతిభ చూపించి పారా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించారు మానసి. ముంబైలో 2011లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మానసి జోషి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఎముకలు విరిగిపోయాయి. ఎడమకాలు తెగి పడిపోయింది. ప్రమాదం జరిగిన మూడు గంటల తర్వాత ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. 10 గంటలపాటు మానసికి ఆపరేషన్ చేసి చివరికి ప్రాణాలను కాపాడారు. అయితే గ్యాంగ్లిన్ అనే వ్యాధి సోకడంతో ఆమె కాలును తొలగించారు. ఆ విషయం తెలిసిన తర్వాత మానసి.. నాలుగు గోడలకే పరిమితం కావాలని అనుకోలేదు. ప్రమాదం జరిగిన ఏడాది తర్వాత కృత్రిమ కాలుతో నడిచింది. పట్టుదలతో బ్యాడ్మింటన్ కోర్టులోకి దిగింది. స్కోబా డైవింగ్‌లో కూడా మెలకువలు నేర్చుకుంది. 2014లో పారా ఏషియన్ గేమ్స్‌తో అంతర్జాతీయ క్రీడల్లోకి ప్రవేశించారు. మానసి జోషి 1989 జూన్ 11న జన్మించారు. ఆమె తండ్రి బార్క్‌లో మాజీ శాస్త్రవేత్త. 2010లో ముంబయి వర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అయితే ఆ జీవితంలో అతి పెద్ద కుదుపు రోడ్డు ప్రమాదం. అతి వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు ఆమెను ఢీకొనడంతో జోషి తన ఎడమ కాలును కోల్పోయింది. అయితేనేం పట్టువదలకుండా ఎంతో శ్రమించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు మానసి. 2015లో పారా బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మిక్స్డ్ డబుల్స్‌లో రజతం సాధించారు. ఇక 2018లోను పలు టైటిల్స్‌ను అందకున్నారు. అదే ఏడాది జకార్తాలో జరిగిన ఆసియన్ పారా గేమ్స్‌లో కాంస్య పతకం సాధించారు మానసి. ఇలా చాంపియన్‌గా ఎదిగి యువతకి స్ఫూర్తిగా నిలిచారు. అదే ఆత్మవిశ్వాసంతో ఆటను కొనసాగించారు. ఈ ఏడాది పారా బ్యాడ్మింటన్ గోల్డ్ ఛాంపియన్ షిప్లో స్వర్ణాన్ని అందుకున్నారు. ఇలవేణి భారత షూటర్ ఇలవేణి వలరివన్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో స్వర్ణ పతకంతో మెరిశారు. రియో డి జెనిరో వేదికగా జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆమె భారత్‌కు పతకాన్ని అందించారు. తద్వారా షూటింగ్ ప్రపంచ కప్ సిరీస్‌లో ఈ ఘనత సాధించిన(10 మీ ఎయిర్ రైఫిల్) మూడో మహిళా షూటర్‌గా నిలిచారు. ఈనెలలోనే 20వ వసంతంలో అడుగుపెట్టిన ఈ కడలూరు అమ్మాయి సీనియర్ క్రీడాకారిణిగా బరిలో దిగిన రోజే పసిడిని సొంతం చేసుకోవడం విశేషం.తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో 1999, ఆగస్టు 2వ తేదీని జన్మించారు. ఇలవేణి వలరివన్ కుటుంబం ఉద్యోగ రీత్యా ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఉంటున్నది. తమిళనాట కడలూరు జిల్లాలోనే కాదు, చెన్నైలోనూ ఆ కుటుంబానికి ఆప్తులు ఎక్కువే. అందుకే తమిళనాడుతోనే ఆ కుటుంబానికి అనుబంధం ఎక్కువ. బ్యాచిలర్ ఇన్ ఆర్ట్స్ చదువుతున్న ఇలవేణికి రైఫిల్ షూటింగ్లో చిన్నతనం నుంచి మక్కువ ఎక్కువే. తండ్రి వలరివన్ ఇచ్చిన ప్రోత్సాహం ఆమెను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. 2018లో సిడ్నీ వేదికగా జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్ జూనియర్ విభాగంలో ఆమె స్వర్ణం సాధించారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పసిడితో మెరిశారు ఇలవేణి. ఇప్పుడు సీనియర్ షూటింగ్ విభాగంలో 251.7 పాయింట్లు సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. బ్రెజిల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో అంచనాలకు తగ్గట్టే రాణించి శభాష్ అనిపించారు. సీనియర్ షూటర్, ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ వద్ద ఇలవేణి షూటింగ్లో మెళకువలు నేర్చుకుని తన గురికి పదును పెట్టుకుంటున్నారు. -
పీవీ సింధు, మానసి జోషికి నా అభినంధనలు
-
అందరికీ ఆమె రోల్‌మోడల్: నరసింహన్
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు 2020 ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించడం ఖాయమని తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. మన సత్తా ఏమిటో ప్రపంచానికి సింధు చాటిందని ప్రశంసించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలిచిన సింధుతో పాటు, పారా బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన మానసి జోషిలను రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతులు సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ.. మానసి జోషి అద్భుత విజయం సాధించి అందరికీ రోల్ మోడల్‌గా నిలిచారని పొడిగారు. సింధు, మానసి సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఒలింపిక్స్ స్వర్ణ పతకంతో వచ్చే ఏడాది రాజ్‌భవన్‌కు రావాలని ఆకాంక్షించారు. కోచ్ పుల్లెల గోపీచంద్, సింధు తల్లిదండ్రులను ఆయన అభినందించారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించేందుకు శక్తివంచన లేకుండా కష్టపడతానని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకునేందుకు కృషి చేస్తానని సింధు పేర్కొంది. తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పుల్లెల గోపీచంద్, సింధు తల్లిదండ్రులు, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. (చదవండి: ఆత్మీయ స్వాగతాలు... అభినందనలు..!)