manavapadu
-
కంటిలో నుంచి బియ్యపు గింజలు.. బాలిక నరకయాతన..
-
గద్వాలలో అద్భుత దృశ్యం.. మీరే చూసేయండి
సాక్షి, గద్వాల: ప్రకృతి అందాలు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఎన్నో ఉన్నాయి. వర్షాకాలం వేళ మరింత రమణీయంగా పర్యాటక ప్రాంతాలు కనులవిందు చేస్తుంటాయి. వర్షాల జోరుకు బుధవారం కొంత తెరపడింది. అయితే వాతావరణం మాత్రం ఆహ్లాదకరంగా మారింది. ఈ సమయంలో ఇంద్రధనుస్సు విరిసింది. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులో అద్బుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆకాశంలో ఇంద్రధనుస్సు అస్తమించే సూర్యుడిలా దర్శనమిచ్చింది. ఇంద్రధనస్సు కనువిందు చేయడంతో స్థానిక ప్రజలందరూ ఆసక్తిగా తిలకించారు. ఈ దృశ్యాలను తమ సెల్ఫోన్లలో బంధించారు. -
కడుపులో శిశువు మాయమైందని..
సాక్షి, మానవపాడు (గద్వాల): కడుపులోని శిశువు మాయమైందని మండలంలోని చిన్నపోతులపాడుకు చెందిన ఓ మహిళ ఆదివారం స్థానిక పీహెచ్సీ వద్ద కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మంజుల తాను నిండు గర్భిణినని.. ప్రసవం కోసం శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి మానవపాడు పీహెచ్‌సీకి వస్తుండగా దేవుడు కలలోకి వచ్చి ఇంటికి వెళ్లాలని సూచించటంతో తిరిగి వెళ్లాలని చెబుతోంది. ఆదివారం ఉదయం లేచేసరికి ఎలాంటి గర్భం లేదని, దీంతో తిరిగి ఆస్పతికి వచ్చానని తెలిపింది. పరీక్షించిన వైద్యులు నెల క్రితమే అబార్షన్ అయినట్లు నిర్ధారించారు. ఈ విషయమై వైద్యురాలు దివ్య మాట్లాడుతూ.. ఆ మహిళ చెప్పేది అవాస్తవమని అన్నారు. ఆమెకు మతిస్థిమితం తప్పినట్లుందని మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లి వైద్యుల పర్యవేక్షణలో సైకలాజికల్ ట్రిట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అవసరమైతే స్కానింగ్ తీయించాలని సూచించారు. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్పర్సన్ సరిత సెల్ఫోన్లో వైద్యులతో మాట్లాడి మెరుగైన మంజులకు చికిత్స అందించాలని కోరారు. అనంతరం మంజుల తల్లిగారి ఊరైన పెద్దపోతులపాడుకు వెళ్లి ఆమెను పరామర్శించారు. జెడ్పీ చైర్పర్సన్ వెంట నాయకులు చిన్న తిరుపతయ్య, పీఏసీఎస్ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, విజయ్‌భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, భాస్కర్ ఉన్నారు. -
కుటుంబంలో ఒక్కరికే పింఛన్
సాక్షి, మానవపాడు: రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ వయస్సు 57 ఏళ్లకు తగ్గించడంతో అర్హులైన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచి రూ.2 వేల పింఛన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వృద్ధుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పింఛన్ల వయస్సు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండల నిరుపేదలు ఊరట చెందుతున్నారు. నూతన పింఛన్ విధానంతో మండలంలో లబ్ధిదారుల సంఖ్య బాగానే పెరిగే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఒక కుటుంబంలో ఒక్కరే పింఛన్‌కు అర్హులని ఆదేశాలు చేయడంతో వృద్ధులు ఉసూరుమంటున్నారు. ఇప్పటి వరకు ఇంట్లో ఒకరికి పింఛన్ ఉండగా నూతన విధానంతో ఇంట్లో మరొకరికి పింఛన్ వస్తుందని ఆశపడిన లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. ఎన్నికల సమయంలో 57 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ పింఛన్ అందిస్తామని చెప్పిన కేసీఆర్ హామీ అమలు చేయడంలో షరతులు విధించడం సమంజసంగా లేదంటున్నారు. నూతన పింఛన్ విధానంపై.. ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి అందించనున్న రూ.2 వేల పింఛన్ పథకంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న సమాజంలో 60 ఏళ్లు దాటితే పనిచేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను గుర్తించి వృద్ధాప్యం సమీపిస్తుండగానే వారికి అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అర్హతలివే.. మండలంలో అర్హులైన లబ్ధిదారులు తమ ఆదాయం రూ.1.50 లక్షలోపు ఉన్నట్లు ధ్రువపత్రం, తమ వయస్సు 57 ఏళ్లు పూర్తయినట్లు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు లేదా ఓటరు కార్డు కలిగి ఉండాలి. మూడెకరాల తరి భూమి, 7 ఎకరాల్లోపు మెట్ట భూమి కలిగి ఉన్న రైతులు మాత్రమే అర్హులు. ఇందుకు సంబంధించిన షరతులతో దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కరికే ఇవ్వడం సరికాదు ఇంటికి ఒక్కరికే పింఛన్ ఇవ్వడం సరికాదు. ఇంట్లో 57 ఏళ్లు పైబడిన వారు ఎంతమంది ఉంటే అందరికీ ఇవ్వాలి. 60 ఏళ్లు నిండాయంటే లేవడం, కూర్చోవడానికి సైతం ఇబ్బందులు పడుతుంటారు. ఈ వయస్సులో ఏ పని చేయలేని పరిస్థితి. ప్రభుత్వం పింఛన్ ఇస్తే ఆ డబ్బులు మందులు, తిండి ఖర్చులకు పనికొస్తాయి. – సంజీవ నాయుడు, చెన్నిపాడు అర్హుల వివరాలు సేకరిస్తున్నాం.. మండలంలో 57 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ప్రతిఒక్కరి వివరాలు సేకరిస్తున్నాం. కుటుంబానికి ఒక్క పింఛన్ మాత్రమే ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి. కొత్త పింఛన్ పథకం కోసం ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన వెంటనే దరఖాస్తులు స్వీకరిస్తాం. – ముషాయిదాబేగం -
చదవాలంటే నడవాల్సిందే!
కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి పట్టని అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థుల కాలినడక కష్టాలకు ఫుల్‌స్టాఫ్ పడేనా? మానవపాడు: మండల పరిధిలోని విద్యార్థులు చదువుకోలాంటే కాలినడకన వెళ్లాల్సిందే. పలు గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ఈ పరిస్థితి దాపురించింది. దీంతో కొంత మంది విద్యార్థులు చదువులకు స్వస్తిచెబుతున్నారు. అయినప్పటికీ పాలకులు, అధికికారులు పట్టించుకోవడం లేదు. పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి.. మానవపాడు మండల పరిధిలోని గోకులపాడు, ఇటిక్యాలపాడు, చండూరు, ఏ బూడిదపాడు, పోతులపాడు, కొర్విపాడు తదితర గ్రామాల విద్యార్థులకు బస్సు సౌకర్యం నేటి వరకు లేదు. దీంతో ఆయా గ్రామాల నుంచి ఇతర గ్రామాలకు ఉన్నత చదువులు చదువుటకు కాలినడకన వెళ్తున్నారు. మండల పరిధిలోని ఈ గ్రామాల్లో ప్రాథమిక స్థాయి పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. పైచదువులు చదవాలంటే మానవపాడు, పుల్లూర్, జల్లాపురం, ఉండవెల్లి పాఠశాలలకు వెళ్లాలి. ఉన్నత చదువులు చదువుకోవడానికి పాఠశాలలకు వెళ్లి చదువుకోవాలంటే కాలినడక తప్పటం లేదు. ప్రతి రోజూ ఆరుకిలోమీటర్లు నడవాలి ప్రతి రోజు ఉదయం మూడు కిలోమీటర్లు, సాయంత్రం మూడు కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి వస్తుంది. విద్యార్థులు మాత్రం కష్టమైనా ఇష్టపడి చదువుకుంటున్నారు. కాలినడక, ఇంటి అవసరాల నేపథ్యంలో జంకుతున్న కొంత మంది విద్యార్థులు ఆరవతరగతి వరకే చదువుతున్నారు. ఆ తరువాత ఇంటికే పరిమితమవుతున్నారు. గత కొన్నెళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. పట్టని అధికారులు అయినా అధికారులు మాత్రం బస్సు సౌకర్యం కల్పించడంలో విఫలమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేరండి మీకు అన్ని సౌకర్యలు కల్పిస్తామని చెబుతున్నారే తప్ప ఆచరణలో బస్సు సౌకర్యం కల్పించడం లేదు. ప్రతి రోజూ విద్యార్థులు పడుతున్న కషాం్టలు వారికి పట్టడం లేదు. ఆర్టీసీ యాజమాన్యం స్పందించాలి సీమాంధ్రకు సరిహద్దుగా ఉన్న గ్రామాలకు మొదటి నుంచి కర్నూల్డిపో బస్సులే ఆధారమయ్యాయి. కాని వారు మాత్రం బస్సులను ఇష్టం వచ్చినప్పుడు తిప్పుతారు. అడిగినా స్పదించడం లేదు. తెలంగాణ జిల్లాలో ఉన్నSఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న గ్రామాలవైపు దష్టిసారించడం లేదు. జిల్లాలో ఉన్న డిపోల నుంచి బస్సు సౌకర్యం కల్పించాల్సి ఉంది. బస్సు సౌకర్యం లేని గ్రామాలకు బస్సు సర్వీసులను నడిపితే తప్ప విద్యార్థుల సమస్యలకు పరిష్కారం దొరకదు. ఇప్పటికైనా పాలకులు స్పదించి విద్యార్థుల కాలినడక కష్టాలకు ఫుల్‌స్టాఫ్ పెట్టాలని పలువురు కోరుతున్నారు. -
కొడుకు చేసిన పనికి తండ్రి ఆత్మహత్య..
మానవపాడు (మహబూబ్‌నగర్) : కుమారుడి ప్రేమ వ్యవహారానికి తండ్రి బలయ్యాడు. కుమారుడు ఓ యువతిని ప్రేమ పేరుతో తీసుకెళ్లిపోవడంతో వచ్చిన బెదిరింపులకు మనస్తాపం చెందిన అబ్బాయి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలం మద్దూరు గ్రామంలో ఆదివారం జరిగింది. మోనప్ప గ్రామంలోని గ్రామీణ తాగునీటి సరఫరా పథకంలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నాడు. ఇతడి మూడవ కుమారుడు ప్రవీణ్ కరీంనగర్లో బీటెక్ చదువుతున్నాడు. హైదరాబాద్ హయత్‌నగర్ ప్రాంతంలో ఉన్న స్నేహితుల దగ్గరకు తరచూ వెళుతుండేవాడు. అక్కడే ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. తాజాగా ప్రవీణ్ ఆ యువతిని తీసుకుని ఎటో వెళ్లిపోవడంతో ఆమె తల్లిదండ్రులు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువతి తల్లిదండ్రులు ప్రవీణ్ తండ్రి మోనప్పకు ఫోన్ చేసి బెదిరించారు. మరోవైపు విచారణ పేరుతో పోలీసుల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్‌తో మనస్తాపం చెందిన మోనప్ప ఆదివారం తాను పనిచేస్తున్న వాటర్ స్కీమ్ వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మోనప్ప మొదటి కుమారుడు రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాము కాటుతో బాలుడి మృతి
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడులో సురేశ్(5) అనే చిన్నారి పాముకాటుతో మృతి చెందాడు. ఉదయం ఇంట్లో సురేశ్ ఆడుకుంటుండగా పాము కాటు వేసింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. చిన్నారి మరణంతో ఆ ఊరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.