చదవాలంటే నడవాల్సిందే!
-
కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి
-
పట్టని అధికారులు, ప్రజాప్రతినిధులు
-
విద్యార్థుల కాలినడక కష్టాలకు ఫుల్‌స్టాఫ్ పడేనా?
మానవపాడు: మండల పరిధిలోని విద్యార్థులు చదువుకోలాంటే కాలినడకన వెళ్లాల్సిందే. పలు గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ఈ పరిస్థితి దాపురించింది. దీంతో కొంత మంది విద్యార్థులు చదువులకు స్వస్తిచెబుతున్నారు. అయినప్పటికీ పాలకులు, అధికికారులు పట్టించుకోవడం లేదు. పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి.. మానవపాడు మండల పరిధిలోని గోకులపాడు, ఇటిక్యాలపాడు, చండూరు, ఏ బూడిదపాడు, పోతులపాడు, కొర్విపాడు తదితర గ్రామాల విద్యార్థులకు బస్సు సౌకర్యం నేటి వరకు లేదు. దీంతో ఆయా గ్రామాల నుంచి ఇతర గ్రామాలకు ఉన్నత చదువులు చదువుటకు కాలినడకన వెళ్తున్నారు. మండల పరిధిలోని ఈ గ్రామాల్లో ప్రాథమిక స్థాయి పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. పైచదువులు చదవాలంటే మానవపాడు, పుల్లూర్, జల్లాపురం, ఉండవెల్లి పాఠశాలలకు వెళ్లాలి. ఉన్నత చదువులు చదువుకోవడానికి పాఠశాలలకు వెళ్లి చదువుకోవాలంటే కాలినడక తప్పటం లేదు.
ప్రతి రోజూ ఆరుకిలోమీటర్లు నడవాలి
ప్రతి రోజు ఉదయం మూడు కిలోమీటర్లు, సాయంత్రం మూడు కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి వస్తుంది. విద్యార్థులు మాత్రం కష్టమైనా ఇష్టపడి చదువుకుంటున్నారు. కాలినడక, ఇంటి అవసరాల నేపథ్యంలో జంకుతున్న కొంత మంది విద్యార్థులు ఆరవతరగతి వరకే చదువుతున్నారు. ఆ తరువాత ఇంటికే పరిమితమవుతున్నారు. గత కొన్నెళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది.
పట్టని అధికారులు
అయినా అధికారులు మాత్రం బస్సు సౌకర్యం కల్పించడంలో విఫలమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేరండి మీకు అన్ని సౌకర్యలు కల్పిస్తామని చెబుతున్నారే తప్ప ఆచరణలో బస్సు సౌకర్యం కల్పించడం లేదు. ప్రతి రోజూ విద్యార్థులు పడుతున్న కషాం్టలు వారికి పట్టడం లేదు.
ఆర్టీసీ యాజమాన్యం స్పందించాలి
సీమాంధ్రకు సరిహద్దుగా ఉన్న గ్రామాలకు మొదటి నుంచి కర్నూల్‌డిపో బస్సులే ఆధారమయ్యాయి. కాని వారు మాత్రం బస్సులను ఇష్టం వచ్చినప్పుడు తిప్పుతారు. అడిగినా స్పదించడం లేదు. తెలంగాణ జిల్లాలో ఉన్నSఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న గ్రామాలవైపు దష్టిసారించడం లేదు. జిల్లాలో ఉన్న డిపోల నుంచి బస్సు సౌకర్యం కల్పించాల్సి ఉంది. బస్సు సౌకర్యం లేని గ్రామాలకు బస్సు సర్వీసులను నడిపితే తప్ప విద్యార్థుల సమస్యలకు పరిష్కారం దొరకదు. ఇప్పటికైనా పాలకులు స్పదించి విద్యార్థుల కాలినడక కష్టాలకు ఫుల్‌స్టాఫ్ పెట్టాలని పలువురు కోరుతున్నారు.