maniac
-
మద్యానికి డబ్బివ్వలేదని ఉన్మాదం
మైసూరు: తాగుడుకు బానిసైన వ్యక్తి మద్యానికి కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వలేదని ఉన్మాదిగా మారాడు. మహాభారత కాలంలో కంసుడు చేసినట్లుగా చెల్లెలి 8 నెలల బిడ్డను గోడకు కొట్టి హత్య చేసిన దురాగతం మైసూరు నగరంలో చోటు చేసుకుంది. కనకగిరిలోని 5వ క్రాస్‌లో నివాసం ఉంటున్న సిద్దమ్మ అనే మహిళ కుమారుడు రాజు (30) ఈ ఘోరానికి పాల్పడినవాడు. ఇతడు చిన్నా చితకా పనులు చేస్తూ ఆ డబ్బుతో మద్యం తాగుతుంటాడు. శుక్రవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ఇంటికి వచ్చి మద్యం డబ్బులు కావాలని తల్లిని అడిగాడు. తన వద్దలేవని చెప్పగా ఇంటిలో ఉన్న చెల్లెలిని అడిగాడు. ఆమె కూడా లేవని చెప్పడంతో రాజు తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. ఇంట్లో ఉన్న టీవీని పగలగొట్టాడు. అంతటితో ఆగకుండా ఊయల్లో పడుకున్న 8 నెలల శిశువును తీసుకుని గోడకు విసిరికొట్టడంతో చిన్నారి ప్రాణాలు విడిచింది. దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానిక విద్యారణ్యపుర పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి రాజు కోసం గాలింపు చేపట్టారు. (చదవండి: నాకు ప్రియుడే ముఖ్యం.. భార్య ఏం చేసిందంటే..? ) -
కూకట్‌పల్లిలో ఉన్మాది కత్తితో వీరంగం
-
మళ్లీ అదే తీరు
వైఎస్ఆర్ జిల్లా , బద్వేలు అర్బన్ : స్థానిక సిద్దవటం రోడ్డులోని సుమిత్రానగర్‌లో ఓ యువకుడు ఉన్మాదిగా ప్రవర్తిస్తుండటంతో మహిళలు బెంబేలెత్తుతున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతానికి చెందిన మహిళలు ఆదివారం స్థానిక అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కొంత కాలంగా నాగరాజు అనే వ్యక్తి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. గత నెలలో రమణమ్మపై లైంగిక వేధింపులకు పాల్పడి దాడికి యత్నించడంతో.. సదరు మహిళతోపాటు స్థానిక మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు పంపారు. అనంతరం కొన్ని రోజుల క్రితం బెయిల్‌పై వచ్చిన ఆ యువకుడు ఆదివారం రాత్రి గతంలో ఫిర్యాదు చేసిన మహిళతోపాటు రేణుక, కళావతిపై దాడి చేశాడు. ‘నా పైనే ఫిర్యాదు చేస్తారా, మీ అంతు చూస్తా’ అంటూ వీరంగం సృష్టించినట్లు మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ప్రవర్తన వలన ఒంటరిగా తిరగలేకున్నామని, గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా మళ్లీ అదే విధంగా వ్యవహరిస్తున్నాడని మహిళలు వాపోతున్నారు. పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళలు (ఇన్సెట్) ఉన్మాదిగా ప్రవర్తిస్తున్న నాగరాజు (ఫైల్) -
చిన్నారి గొంతు కోసి రక్తం తాగబోయాడు!
బరంపురం: మూడో తరగతి చదివే ఓ చిన్నారి గొంతుకోసి రక్తం తాగబోయాడో ఉన్మాది. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఆదివారం ఈ దారుణం జరిగింది. ఆస్పత్రిలో ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. గంజాం జిల్లాలోని బడా అర్జాపల్లికిచెందిన యూ బైరాగి(33) ఇంటిదగ్గర్లోనే ఈ చిన్నారి కుటుంబం నివసిస్తోంది. ఆదివారం తొటి పిల్లలతో కలసి ఈ అమ్మాయి సముద్రతీరం వెంట ఆడుకుంటుండగా బైరాగి వచ్చి బ్లేడుతో పాప గొంతుకోసి వెంటనే రక్తంతాగేందుకు ప్రయత్నించాడనిఅర్జీపల్లి ఇన్స్పెక్టర్ నమిత చెప్పారు. బైరాగి ముఖంనిండా రక్తపు మరకలు ఉన్నాయని, చూడ్డానికి మానసికరోగిలా కనిపిస్తున్నాడని నమితి చెప్పారు. పారిపోతున్న బైరాగిని గోపాల్పూర్ పోర్టు వద్ద స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.ఇంతటి దారుణానికి అసలు కారణం తెలియాల్సిఉంది. ప్రస్తుతం చిన్నారిని ఎంకేసీజీ వైద్యవిద్య ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. -
ఇల్లందులో సైకో కలకలం
ఖమ్మం జిల్లా ఇల్లందులో గత ఐదు రోజుల నుంచి ఉన్మాది సంచారం కలకలం రేపుతోంది. అర్థరాత్రి దాటిన తర్వాత ఇళ్ల తలుపులను గొడ్డలితో పగులగొట్టి పరార వుతున్నాడంటూ పుకార్లు వచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మంగళవారం రాత్రి 16వ నంబర్ బస్తీలోని ఓ ఇంటి తలుపును ఆగంతకుడు బాదుతుండగా లోపలున్న వారు కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యాడు. దీనిపై స్థానికులెవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. -
బరితెగింపు!
విద్యార్థినిపై హాస్టల్లో కాల్పులు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి గాయపడిన మరో విద్యార్థిని ఆస్పత్రిలో పోలీసుల అదుపులో నిందితుడు కృష్ణరాజపురం/బనశంకరి/పావగడ : ఉద్యాననగరిలో ఉన్మాది బరితెగించాడు. హాస్టల్లో నిద్రిస్తున్న ఓ విద్యార్థినిపై కాల్పులు జరిపాడు. మరో విద్యార్థిని కొనవూపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న వివరాలు ఇలా ఉన్నాయి... తుమకూరు జిల్లా పావగడ తాలూకా పతంజలి నగర్‌కు చెందిన రమేష్, లక్ష్మి దంపతుల కుమార్తె గౌతమి(17), డాక్టర్ జయంతి, శ్రీనాథ్‌ల కుమార్తె శిరీష బెంగళూరులోని కాడుగోడి ఉన్న ప్రగతి కళాశాల హాస్టల్లో ఉంటూ రెండో ఏడాది పీయూసీ చదువుకుంటున్నారు. మంగళవారం రాత్రి స్టడీ అవర్స ముగిసిన తర్వాత గౌతమి, శిరీషా మూడవ అంతస్తులోని తమ గదికి చేరుకున్నారు. రాత్రి 10.05 గంటలకు గౌతమి గది తలుపు తట్టిన చప్పుడు కావడంతో శిరీషా తలుపు తీసింది. ఆ సమయంలో అదే కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న మహేష్(28) లోపలకు దూసుకువచ్చి శిరీషాను పక్కకు నెట్టి తన వద్ద ఉన్న తపంచా(నాటు తుపాకీ)తో నిద్రిస్తున్న గౌతమిపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో అతన్ని పట్టుకునేందుకు శిరీషా ప్రయత్నించడంతో ఆమెపై కూడా అతను కాల్పులు జరిపి పారిపోయాడు. మిన్నంటిన హాహాకారాలు అర్ధరాత్రి హాస్టల్లో తుపాకీ కాల్పుల శబ్ధంతో విద్యార్థులు హడలిపోయారు. అదే సమయంలో చుట్టుపక్కల ఉన్న వారు అప్రమత్తమై హాస్టల్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే కళాశాల సిబ్బంది క్షతగాత్రులను తీసుకుని కిందకు చేరుకుంది. వెంటనే వారిని స్థానిక వైదేహి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గౌతమి మరణించింది. ప్రాథమిక చికిత్స అనంతరం శిరీషాను మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న బాధిత కుటుంబసభ్యులు తెల్లవారుజాము మూడు గంటలకు బెంగళూరుకు చేరుకున్నారు. ఆస్పత్రి వద్దకు చేరుకోగానే కుమార్తె మరణించిందన్న విషయం తెలుసుకుని గౌతమి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. బంధువులు, సహ విద్యార్థుల రోదనలతో ఆస్పత్రి నిండిపోయింది. ఇదిలా ఉండగా హోంశాఖ మంత్రి కే.జే జార్జ్, నగరపోలీస్‌కమిషనర్ ఎం.ఎన్.రెడ్డితో పాటు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరించారు. పోలీసుల అదుపులో నిందితుడు కాల్పులు జరిపిన అనంతరం మహేశ్ బెంగళూరులోని ఏ.నారాయణపురలో ఉంటున్న తన అక్క ఇంటికి వెళ్లిపోయాడు. ఇంతలో మహేశ్ ఫొటో టీవీల్లో రావడం గమనించిన ఆ ఇంటి ఓనర్ పోలీసులకు బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఫోన్ చేసి మహేశ్ ఆచూకీ తెలిపారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మహేశ్‌ను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని కళాశాల ప్రతినిధి ప్రశాంత్ మీడియాతో పేర్కొన్నారు. మరోవైపు విద్యార్థునులకు రక్షణ కల్పించలేక పోయిన కళాశాల లెసైన్సును రద్దు చేయాలని పలు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా శిరీష తల్లి జయంతి వాదన మరోలా ఉంది. గౌతమి, శిరీష వేర్వేరు గదుల్లో ఉండగా మొదట గౌతమిపై కాల్పులు జరిగాయని, అటుపై పక్క గదిలో ఉన్న శిరీష పై కాల్పులు జరపడంతో శిరీష గాయపడినట్లు మీడియాతో పేర్కొన్నారు. తపంచా ఎలా వచ్చింది... నిందితుడి చేతికి తపంచా ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా రాత్రి సమయంలో విద్యార్థునులు ఉంటున్న హాస్టల్లోకి ఎలా చేరారనే విషయంపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇదిలా ఉండగా నిందుతుడు మహేశ్...కళాశాల విద్యార్థునులు బయటి వారితో ఎవరితోనూ మాట్లాడకూడదని తరుచుగా బెదిరించేవాడని తెలుస్తోంది. దీంతో విద్యార్థునులు ఇతన్ని వివిధ నిక్‌నేమ్‌లతో గేలిచేసేవారని ఈ విషయంలో మనస్థాపం చెందిన మహేశ్ ఈ ఘాతుకానికి తెగబడినట్లు తెలుస్తోంది. -
ఉన్మాదం
గర్భిణీ, ఆమె కుమార్తెను చంపిన ఉన్మాది ఆపై ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య ఉలిక్కిపడిన గూడూరు గూడూరు/మచిలీపట్నం : ఉన్మాది పేట్రేగి పోయాడు. గర్భిణి, ఆమె ఏడాదిన్నర వయసు గల కుమార్తెను బలితీసుకున్నాడు. కొద్దిరోజుల్లో ఈ లోకంలోకి రావాల్సిన పసిగుడ్డును తల్లికడుపులోనే అంతంచేశాడు. చివరికి తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గూడూరులో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ దుర్ఘటన జరిగింది. ఒకే గదిలో ముగ్గురి మృతదేహాలను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గూడూరు గ్రామానికి చెందిన ఏలూరు వెంకన్న (28) లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అతను అదే గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సంపతి కుమారి(24)తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. కుమారి భర్త శ్రీనివాసరావు టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతను ఐదు రోజుల క్రితమే విజయవాడ వెళ్లాడు. అప్పటి నుంచి కుమారి ఇంట్లోనే వెంకన్న ఉంటున్నాడు. కొద్దికాలంగా కుమారి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వెంకన్న ఆమెతో వాగ్వాదానికి దిగాడు. గది తలుపునకు గొళ్లెం పెట్టిన వెంకన్న తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న కత్తితో ఎనిమిది నెలల గర్భిణీ అయిన కుమారి, ఆమె కుమార్తె దుర్గాభవానీ (18నెలలు) పీకలు కోసి చంపేశాడు. అనంతరం అతను అదే గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నం! కుమారి, అమె కుమార్తెలను హత్య చేసిన అనంతరం వెంకన్న తన చేతులకు అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకున్నట్లు, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఇంట్లో మరకలను కడిగేందుకు నీళ్లు పోసినట్లు ఘటనాస్థలాన్ని పరిశీలిస్తే స్పష్టమవుతోంది. కుమారి, ఆమె కుమార్తె నుంచి రక్తం అధికంగా కారటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు అర్థమవుతోంది. ఈ విషయం బయటకు పొక్కుతుందనే భయంతో చివరకు వెంకన్న కూడా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వెలుగుచూసిందిలా... టాక్సీ డ్రైవర్ అయిన కుమారి భర్త శ్రీనివాసరావు ఐదు రోజులుగా విజయవాడలోనే ఉంటున్నాడు. గురువారం రాత్రి తొమ్మిది గంటలకు కుమారి సమీపంలోని తన తల్లి సుభద్ర ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తన కుమార్తె దుర్గాభవానీ కోసం పాలు తెచ్చుకుంది. ఇంటికి వెళ్లిన అనంతరం తాను భోజనం చేశానని, దుర్గాభవానీ నిద్రిస్తోందని, మీరు పడుకోండని తల్లికి ఫోన్ చేసి చెప్పింది. తోడుగా తాను ఇంటికి వస్తానని తల్లి చెప్పినా కుమారి వద్దని వారించింది. అప్పటికే కుమారితోపాటు వెంకన్న ఇంట్లోనే ఉన్నాడు. శుక్రవారం ఉదయం కుమారి కుమార్తెకు టిఫిన్ ఇచ్చిరావాలని సుభద్ర తన సోదరి కుమార్తె దేవిని పంపారు. కుమారి నివసిస్తున్న ఇంటికి వచ్చిన దేవి తలుపులు కొట్టగా ఎవరూ మాట్లాడలేదు. కిటికీలో నుంచి చూడగా కుమారి, ఆమె కుమార్తె దుర్గాభవానీ రక్తపు మడుగులో మృతిచెంది ఉన్నారు. వెంకన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతున్నాడు. స్థానికులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి పరిశీలించారు. పోలీసుల విచారణలోఆసక్తికర విషయాలు.. గూడూరు ఇందిర మ్మకాలనీలోని ఘటనాస్థలాన్ని బందరు డీఎస్పీ కేవీ శ్రీనివాసరావు శుక్రవారం పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఐదు రోజులుగా వెంకన్న కుమారితో పాటు ఇంట్లోనే ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. కుమారి హత్యకు గురైందనే తెలిసి గూడూరు వచ్చిన ఆమె భర్త శ్రీనివాసరావు, తల్లి సుభద్ర, స్థానికుల నుంచి మరిన్ని వివరాలు సేకరించారు. కుమారికి వెంకన్నతోపాటు మరి కొందరితోనూ వివాహేతర సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వెంకన్న తన సెల్‌ఫోన్ నుంచి కుమారితో వివాహేతర సంబంధం ఉన్న వారికి ఫోన్ చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని వెంకన్న తండ్రి పోలీసుల వద్ద ప్రస్తావిం చాడు. వెంకన్న పదేపదే వేరే వ్యక్తులకు ఫోన్ చేయటం, ఈ విషయం నచ్చని కుమారి అతనితో గొడవకు దిగడం వల్లే హత్యలు చేసి ఉంటాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. రూరల్ సీఐ ఎస్వీఎస్ మూర్తి, గూడూరు ఎస్ఐ అడపా ఫణిమోహన్, పెడన ఎస్ఐలు దుర్గాప్రసాద్, మణికుమార్ ఘటనాస్థలానికి వచ్చారు. వెంకన్న ఒక్కడే ఈ ఘతుకానికి పాల్పడ్డాడా.. లేక మరెవరైనా పాలుపంచుకున్నారా.. అనే విషయంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తంచేయగా.. పోలీసులు ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నారు. క్లూస్‌టీమ్ సిబ్బంది ఘటనాస్థలంలో వివరాలు సేకరించారు. కుమారి సోదరుడు సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.