Manifesto of political parties
-
TS: ప్రధాన పార్టీల మేనిఫెస్టోలు చూశారా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 కోసం ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలను విడుదల చేశాయి. పోటాపోటీ అంకెలతో.. అంతకు మించి అన్నివర్గాలను ఆకట్టుకుంటాయన్న నమ్మకంతో హామీలను ప్రకటించాయవి. ప్రధాన మూడు పార్టీల మేనిఫెస్టోలను విడుదల వారీగా చూస్తే.. తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థుల ప్రకటనలోనే కాదు.. మేనిఫెస్టోను కూడా ముందుగానే ప్రకటించింది. రైతు బంధు, పెన్షన్ పెంపులను దశలవారీగా అందించడం ప్రధానంగా.. అలాగే మిగతా హామీలను స్వయంగా ప్రకటించారు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రధానాంశాలు.. రైతుబీమా తరహాలో పేదలకు కేసీఆర్ బీమా పథకం తెల్లరేషన్‌కార్డుదారులకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా కేసీఆర్ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికీ ధీమా తెల్ల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ అన్నపూర్ణ పథకం ద్వారా సన్నబియ్యం అందిస్తాం పెన్షన్లను ఏటా రూ.500 చొప్పున రూ.5 వేలకు పెంచుతాం దివ్యాంగుల పెన్షన్లు ఏటా రూ.300 చొప్పున రూ.6 వేలకు పెంపు రాష్ట్రంలో మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల గౌరవ భృతి అర్హులైనవారికి రూ.400కే గ్యాస్ సిలిండర్లు అర్హులైన జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షలకు పెంపు రైతుబంధు మొత్తం దశలవారీగా రూ.16 వేలకు పెంపు అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించి ఆంక్షలు ఎత్తివేస్తాం అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తాం కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15 లక్షల బీమా పథకం జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రూ.15 లక్షల వరకు వైద్య సేవలు. అక్టోబర్ 15వ తేదీనాడు బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ.. ‘గత మేనిఫెస్టోలో లేని 90 శాతం పథకాలను అమలు చేశాం. మేనిఫెస్టోలో కల్యాణలక్ష్మిని ప్రకటించపోయినా అమలు చేశాం. రైతు బంధు మేనిఫెస్టోలో చేర్చలేదు.. అయినా అమలు చేశాం. సాగునీరు, తాగునీరు లేక తెలంగాణ కరువుతో అల్లాడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రణాళిక ప్రకారం ప్రయాణం సాగింది. గత రెండు ఎన్నికల్లో మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను అమలు చేశాం’’ 👉: బీఆర్ఎస్ మేనిఫెస్టో పూర్తి కాపీ కాంగ్రెస్ మేనిఫెస్టో.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ఆరు గ్యారెంటీల అమలును ప్రకటించింది. ఆపై అధికారిక మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా నవంబర్ 17వ తేదీన గాంధీభవన్‌లో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. తెలంగాణ ఎన్నికల కోసం అభయ హస్తం పేరిట మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆరు గ్యారెంటీల హామీలను రంగరించి.. 37 ప్రధానాంశాలతో.. అనుబంధ మేనిఫెస్టో పేరిట జాబ్‌క్యాలెండర్‌లో మరో 13 అంశాల్ని చేర్చి.. మొత్తం 42 పేజీలతో అభయ హస్తం తెచ్చింది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు ఇవే.. 1. మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఆర్థిక సాయం రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ మహిళలకు రాష్ట్ర మంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత పయ్రాణం 2. రైతు భరోసా రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం. రైతుకూలీలకు, భూమిలేని నిరుపేదలకు రూ.12 వేల సాయం. వరి పంటకు మద్దతు ధర కల్పించడంతోపాటు రూ 500 బోనస్ అందజేత 3. గృహ జ్యోతి రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా 4. ఇందిరమ్మ ఇళ్లు ఇల్లు లేని ప్రతి కుటుంబానికీ ఇంటిస్థలం. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అదనంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం అందజేత. 5. యువవికాసం విద్యార్థులకు విద్య భరోసా కార్డు అందజేత. రూ.5 లక్షల వ్యయ పరిమితితో, వడ్డీ రహిత ఆర్థిక సహాయక కార్డు అందజేసి కాలేజీ ఫీజులు, కోచింగ్ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్స్ కొనుగోలు, హాస్టల్ ఫీజులు, ల్యాప్‌టాప్, పరీక్ష ఫీజులు, పరిశోధన పరికరాలు, స్కిల్ డెవల్‌పమెంట్ కోర్సులు, ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకొనేలా సదుపాయ కల్పన. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు. 6. చేయూత ప్రతి నెలా రూ.4 వేల చొప్పున వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులకు పింఛన్ల అందజేత. పేదలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా వర్తింపు అభయ హస్తం రిలీజ్ తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. ‘‘తెలంగాణ కాంగ్రెస్ కు ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత.. ఖురాన్.. బైబిల్.. సర్వమతాలకు, తెలంగాణ ప్రజలకు ఈ మేనిఫెస్టో అంకితం చేస్తున్నాం. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాశారు. పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారు. నమ్ముకున్నవారికి ద్రోహం చేశారు... పదేళ్లలో ఒక అహంకారపూరిత పాలనను తెలంగాణ ప్రజలు చవిచూశారు వెనక్కి తిరిగి చూసుకుంటే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారు. తెలంగాణలో కాంగ్రెస్ తుపాను రాబోతోంది మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలు ముందుకొచ్చారు. కేసీఆర్ కు గుణపాఠం చెప్పేందుకు ముందుకొస్తున్నారు.. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి’’ . 👉: కాంగ్రెస్ మేనిఫెస్టో పూర్తి కాపీ ----------- బీజేపీ మేనిఫెస్టో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేత మంత్రి అమిత్ షా నవంబర్ 18న సాయంత్రం హైదరాబాద్‌లోని హోటల్ కత్రియా టవర్స్‌లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 10 అంశాలు కలిగిన... సకల జనుల సౌభాగ్య తెలంగాణ 'మన మోదీ గ్యారెంటీ... బీజేపీ భరోసా' పేరుతో విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు... 1. ప్రజలందరికీ సుపరిపాలన - సమర్థవంతమైన పాలన - అవినీతిని ఉక్కుపాదంతో అణచివేయడం - ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ నినాదంతో సుపరిపాలన - బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నట్లుగా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించి పెట్రో ఉత్పత్తుల ధరల తగ్గింపు - ధరణి వ్యవస్థ స్థానంలో పారదర్శకమైన 'మీ భూమి' వ్యవస్థను తీసుకు వస్తాం - కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రత్యేక నోడల్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు - తెలంగాణ గల్ఫ్ నివాసితుల సంక్షేమం కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు 2. వెనుకబడిన వర్గాల సాధికారత - అందరికీ సమానంగా చట్టం వర్తింపు 3. కూడు, గుడు - ఆహార భద్రత, నివాసం 4. రైతే రాజు - అన్నదాతలకు అందలం. విత్తనాల కొనుగోలుకు రూ.2500 ఇన్పుట్ అసిస్టెన్స్ 5. నారీ శక్తి - మహిళల నేతృత్వంలో అభివృద్ధి. మహిళా రైతుల కోసం మహిళా రైతు కార్పోరేషన్. మహిళలకు 10 లక్షల వరకు ఉద్యోగాలు 6. యువ శక్తి - యూపీఎస్సీ తరహాలో గ్రూప్ 1, గ్రూప్ 2 నిర్వహణ. ఈడబ్ల్యుఎస్ కోటాతో సహా అన్ని నియామకాలు ఆరు నెలల్లో పూర్తి. 7. విద్యాశ్రీ - నాణ్యమైన విద్య. మండల కేంద్రాల్లో నోడల్ స్కూళ్ల ఏర్పాటు అన్ని ప్రయివేటు స్కూళ్ళలో ఫీజుల విధానంపై పర్యవేక్షణ. 8. వైద్యశ్రీ - నాణ్యమైన వైద్య సంరక్షణ. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రయివేటు ఆసుపత్రిల్లో రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం. జిల్లాస్థాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రోత్సాహం. 9. సమ్మిళిత అభివృద్ధి - పరిశ్రమలు, మౌలికవసతులు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర సమీక్ష. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రీయింబర్సుమెంట్స్. 10. వారసత్వం - సంస్కృతి, చరిత్ర. సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినం. జాతీయస్థాయిలో సమ్మక్క - సారక్క జాతర ఉత్సవాలు. వృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్ర. ఉమ్మడి పౌర స్మృతి కోసం కమిటీ ఏర్పాటు. బైరాన్ పల్లి, పరకాల ఊచకోతలను స్మరించుకుంటూ అగస్ట్ 27న రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ దినం. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేయడం ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితం అమిత్ షా మాట్లాడుతూ.. సకల జనుల సౌభాగ్య పేరుతో ఈ ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ ప్రధాని నరేంద్రమోదీ గ్యారెంటీ ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు బాగా అమలవుతాయన్నారు. గతంలో వాజ్‌పేయి మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. చిన్న రాష్ట్రాలకు బీజేపీ అనుకూలమన్నారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఇచ్చామన్నారు. తెలుగు రాష్ట్రాలకు మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కేటాయించామన్నారు. 👉: బీజేపీ మేనిఫెస్టో పూర్తి కాపీ -
పొలిటికల్ మంటపై ఎన్నికల వంట!
‘‘ఎలక్షన్లకూ, వంటలకూ బాగా దగ్గరి సంబంధం ఉందని నా అభిప్రాయం రా’’ అన్నాడు మా రాంబాబుగాడు. ‘‘నువ్వెప్పుడూ ఇంతేరా. నువ్వనేదాన్లో ఏమైనా లాజిక్ ఉందా? అసలు ఎన్నికలకూ, వంట వండటానికీ ఎలా ముడిపెట్టగలుగుతున్నావ్’’ అంటూ కోప్పడ్డాను నేను. ‘‘విను.. ఉదాహరణకు మన చంద్రబాబు ఉన్నాడనుకుందాం. ‘మీకు పోలవరం బిర్యానీ పెడతా.. రాజధాని బగారాబైగన్ రెసిపీ చేస్తా’ అంటూ తెగ ఊరిస్తూ ఉంటాడు. కానీ ఐదేళ్ల పాటు ఏమీ చేయడు. ఉన్న టైమ్‌లో ఏమీ చేయలేక ‘నేను విదేశాలన్నీ తిరిగి రకరకాల కాంటినెంటల్ ఐటమ్స్‌తో, మీకు ఇంటర్నేషనల్ క్యూజిన్ వడ్డిద్దామనుకున్నాను. కానీ కేంద్రంలో మోదీ, పక్కరాష్ట్రంలో కేసీఆర్ అడ్డుపడటం వల్ల ఏమీ చేయలేకపోయాను. ఈసారికి ఇవే తినండి’ అంటూ పాత మేనిఫెస్టో మెనూలో మిగిలిపోయిన అన్నంలో ఏ తాలింపో, పోపో వేసేసి పోపన్నం చేస్తాడు. అలా పొద్దున్నే పాచి ఐటమ్స్‌తోనే మేకోవర్ తిరగమోతతో మేనేజ్ చేస్తూ మోత మోగించేస్తుంటాడు. ఆ పాచిబువ్వ పులిహోర కలిపేస్తున్నప్పుడు వచ్చే పోపు వాసనను పట్టుకొని, ఎల్లో మీడియా అంతా ‘వాహ్.. వాటే వాసన... ఇట్స్ గోయింగ్ టు బీ డెలీషియస్ డిషెస్’ అంటూ హడావుడి చేస్తూ ఊదరగొట్టేస్తుంది. ‘‘కరక్టేరా.. నువ్వంటుంటే నిజమే అనిపిస్తోంది’’ అన్నాను. ‘‘అప్పుడే అయిపోయిందా.. విను. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల వంటలన్నీ మాటల రెసిపీల లాంటివే. ఉదాహరణకు చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయాలనుకున్నప్పుడు ‘నేను తెలంగాణ కోసం లేఖ ఇచ్చా. తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు’ అంటూ ‘రెండు డిష్’ల సిద్ధాంతం చెబుతాడు. అలాగే ఈ చంద్రబాబు కనుసన్నల్లో, అడుగుజాడల్లో నడుస్తున్న పవన్‌కళ్యాణ్ కూడా ఆయన దారిలోనే మరింత ముందుకెళ్లి.. ఆంధ్రలో మాట్లాడేటప్పుడు ‘తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొడుతున్నారటాడు. మళ్లీ కాసేపటికి తెలంగాణకు వచ్చి.. ‘నేను తెలంగాణలో పుట్టకపోవడం నా దురదృష్టం. నేనిక్కడే పుట్టి ఉద్యమంలో ఉండి ఉంటే.. దుర్మార్గులైన ఆ యొక్క ఆంధ్రనాయకులను అల్లల్లాడించి, వాళ్లను అష్టకష్టాలు పెట్టేవాణ్ణి. మిమ్మల్ని కష్టాలే లేకుండా కళ్లలో పెట్టుకునేవాణ్ణి’ అని వాపోతాడు. ఇదెలాంటిదంటే.. పెనం మీద పిండి పరచి దోసె వేశాక.. అవతలివైపు కూడా బాగా కాలడానికి దోసె తిరగేయడం లాంటిదన్నమాట. ఇలా దోసెల్లాగా, చపాతీల్లాగా రెండువైపులా మాటిమాటికీ తిరగేస్తున్నట్టుంటాయి వీళ్ల పొలిటికల్ ప్రసంగాలు. వీళ్లలోనే మరికొందరుంటారు. వారు పొత్తులనే పేరుతో నలుగురైదుగురు కలిసి వంట చేస్తుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అయితే పొత్తులేదంటూనే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, పాల్ లాంటివాళ్లు కలిసి.. అన్నం లాంటి ఒకే ఐటమ్‌ను ఒకరు బగారరైస్ అనీ, మరొకరు బిర్యానీ అనీ, ఇంకొకరు ఫ్రైడ్ రైస్ అని వండుతున్నారు. ‘టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్’ అనే సామెత తెలుసుకదా. అయితే వీరందరూ కలిసి పక్కవాళ్ల వంటను చెడగొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు’’ చెప్పాడు రాంబాబుగాడు. ‘‘మరి వీళ్లలో ఎవరైనా సిన్సియర్‌గా కడుపు నింపేవారు ఉన్నారంటావా?’’ నేనడిగా. ‘‘ఉన్నారు. ఆయన షో చేయడు. అప్పటికప్పుడు ఏదో వండేస్తున్నట్టు నటించడు. చాలా ముందు నుంచే పొయ్యిసెగలాంటి ఎండలో మాడుతూ, నడుస్తూ అందర్నీ కలుస్తాడు. మర్నాటి ఇడ్లీ కోసం ముందు రోజు నుంచే పిండి కలుపుకొన్నట్టు ఎప్పట్నుంచో శ్రమ పడతారు. ఆ ఇడ్లీలోకి కొబ్బరిపచ్చడీ, అల్లంచెట్నీ, సాంబారు.. ఇలాంటివెన్నో టిఫిన్‌గా పెడతామంటాడు. వాటికి అవసరమైన సరుకుల కోసం ముందు నుంచే పాదాల మీద శ్రమతో నడుస్తూ.. చాలా చోట్ల తిరుగుతూ, అన్ని రకాల సంభారాలూ సేకరిస్తారు. నవరత్నాల్లాంటి పిండి వంటలు చేస్తాననీ, ఆ వంటకయ్యే దినుసులూ చూపిస్తారు. మధ్యాహ్న భోజనం కోసం, రాత్రి ఫుడ్ కోసం తానేమి వండిపెట్టదలచుకున్నాడో అవే తప్పకుండా వండుతాడు. అలాంటి యువనేతలాంటి చెఫ్‌ను నమ్ముకుంటేనే ముప్పూటలా కడుపునిండుతుంది. షడ్రసోపేతమైన విందు దొరుకుతుంది’’ అంటూ ముగించాడు మా రాంబాబుగాడు. -
ఎన్నికలయ్యాక మేనిఫెస్టోలకు పవిత్రత, చట్టబద్ధత కావాలి
ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో)లు, వాటి అమలు రాను రాను ప్రహసనంగా మారుతున్నాయి. అలా కాకుండా వాటికి ఒక పవిత్రత, చట్టబద్ధత, అమలుపరచకుంటే... సదరు ప్రభుత్వాలను రద్దయినా చేసే పరిస్థితి రావాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. అలాంటి నిబద్ధతే లేకుంటే, అదీ ఒక రకంగా ఓటర్లను గంపగుత్తగా ప్రలోభపెట్టడమే అవుతుంది. ఎన్నికల ముందు ఏ వాగ్దానమైనా చేయొచ్చు. అరచేత వైకుంఠం చూపి, ఆకర్శణీయ వరాలతో ప్రజల్ని నమ్మించి ఓట్లు దండుకున్నాక.... సదరు హామీలను పూర్తిగా మర్చిపోయి, ఇష్టానుసారం వ్యవహరిస్తే ఇక ఎన్నికల ప్రణాళికకు ఉండే విలువేంటి? దాన్ని నమ్మి ఓట్లేసిన ప్రజల పరిస్థితి ఏంటి? అని ఆలోచనాపరులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. ‘మేనిఫెస్టో’ అంటే, ‘ఇదుగో మేం అధికారంలోకి వస్తే ఈ విషయంలో ఇలా చేస్తాం’అని ముందుగానే ఆయా రాజకీయ పార్టీలు చేసే నిర్దిష్ట ప్రతిపాదన వంటిది. దాన్ని చూసి, నమ్మకంతో ఓటువేసి సదరు పార్టీని ప్రజలు అధికారంలోకి తీసుకురావడమంటేనే, వారిద్దరి మధ్య అదొక పరస్పర అంగీకార పత్రం అయినట్టే లెక్క! అందుకని, పాలకపక్షంగా ఆయా పార్టీలు మేనిఫెస్టోలను అమలు పరచాలి. మేనిఫెస్టో అమలుపరచకపోవడం అంటే, సదరు పరస్పర అంగీకారాన్ని ఉల్లంఘించడమే! ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన ఒక అంగీకారాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడాన్ని చట్టవిరుద్ధ చర్యగా పరిగణించాలి. తగు విధంగా శిక్షించాలి. ఇప్పటివరకు ఇది లేదు. మలి విడత ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఇటీవలి ఒక మార్పు ఏంటంటే, ప్రధాన పార్టీల ఎన్నికల ప్రణాళికలను ఎన్నికల సంఘం పరిశీలించి, ఆమోదించిన తర్వాతే వాటిని ఆయా పార్టీలు అధికారికంగా ప్రకటించాలి. ‘ఇది మా మేనిఫెస్టో’ అని ఆయా పార్టీల వారితో డిక్లరేషన్ తీసుకుంటున్నారు. ఇది కొంతలో కొంత మేలు! అలా ప్రకటించిన ప్రణాళికను సదరు పార్టీలు అధికారంలోకి వచ్చాక అమలుపరచకపోతే, ప్రజలెవరైనా న్యాయస్థానాలను సంప్రదించవచ్చనే వెసలుబాటు కల్పించారు. కానీ, ఇది మాత్రమే సరిపోదు! ప్రకటించిన స్ఫూర్తి కొరవడకుండా మేనిఫెస్టోను ‘యధాతథం’ అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా, ‘ఇదో ఇలా అన్నాం, ఇలా చేశాం, ఇది అమలుపరచడమే!’ అని అరకొరగా చేసి, అటు ఇటుగా తిప్పి బుకాయిస్తే సరిపోదు. దాన్ని నిలదీయడానికి, సదరు వైఫల్యానికి ఆయా పార్టీలను–ప్రభుత్వాలను జవాబుదారు చేయడానికి ఈ విషయంలో ఒక చట్టబద్ద రక్షణ అవసరం. నిన్నటికి నిన్న మనమే చూశాం, రెండు తెలుగు రాష్ట్రాల్లో 2014 ఎన్నికల్లో పెద్ద పెద్ద హామీలతో ఎన్నికల ప్రణాళికల్ని ప్రకటించిన పాలకపక్షాలు, అధికారం చేజిక్కాక హామీలను సవ్యంగా నెరవేర్చకపోగా అమలుపరచినట్టు జబ్బలు చరచుకున్నాయి. హామీ–అమలుకు మధ్య వ్యత్యాసానికి వక్రభాష్యం చెప్పాయి. కొన్నిటికి సమాధానమే లేదు. పాలన మొదలై రెండున్నరేళ్లు గడవక ముందే, ‘మా ఎన్నికల మేనిఫెస్టోలను పూర్తిగా అమలు చేయడమే కాకుండా, ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చినందుకు ఎంతో సంతృప్తిగా ఉంద’ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిరంగంగా ప్రకటించి ప్రజల్ని విస్మయ పరిచారు. ఈ పరిస్థితి మారాలి. నిబద్ధత కావాలి. కొన్ని కీలక విషయాల్లో ‘పర్యావరణానికి మేం కట్టుబడి ఉన్నాం’ ‘పేదరికాన్ని నిర్మూలించడానికి మా పార్టీ కట్టుబడి ఉంది’. ‘మేనిఫెస్టోలు–అమలు’పై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరే షన్ హైదరాబాద్‌లో సోమవారం ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. పలువురు ప్రొఫెసర్లు, ఎడిటర్లు ఇవే అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. పేదవాడిని బాగుపర్చేలా... ఎన్నికల ప్రణాళికలు, సబ్సిడీలు పేదవాడ్ని బాగుచేయాలి తప్ప ధనికుల్ని మరింత ధనికుల్ని చేసేలా ఉండకూడదు. తమ ప్రణాళికాంశాల ఆర్థిక వ్యయాల్నీ ప్రకటించాలి. అవి రాష్ట్ర ఆదాయవనరులకు లోబడి ఉండాలి. – ప్రొ. కంచ అయిలయ్య ప్రజలు నిలదీసే వాతావరణం ఏదీ? ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించిన సామాజికార్థికాంశాల్ని అమలుపరిచే సంస్కృతి మన రాజకీయ పార్టీలకు లేదు. అలా అమలు చేయనపుడు ప్రజలు పాలకుల్ని నిలదీసి ప్రశ్నించే ప్రజాస్వామ్య వాతావరణం రాష్ట్రంలో, దేశంలో లేదు. – ప్రొ. హరగోపాల్ శ్వేతపత్రం కావాలి రాజకీయపార్టీలు అధికారంలోకి రాగానే తాము ప్రకటించిన ప్రణాళికను అమలుపరచాలి. అప్పటివరకు ఏ మేరకు అమలుపరచింది ప్రతి ఏటా ఒక శ్వేతపత్రం ద్వారా వెల్లడించాలి. – ప్రొ.మురళీ మనోహర్ చర్యలుండాలి ఎన్నికల ప్రణాళిక అమలుపరచకపోతే నిలదీసే, చర్యతీసుకునే విధంగా దానికో చట్టబద్ధత ఉండాలి. చర్యలు తీసుకునే ఒక ఎజెన్సీ ఉండాలి. – వినయ్‌కుమార్, ఎడిటర్ నిబద్ధత లేకుంటే వృథాయే... పార్టీలు అనుత్పాదక రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నందున అభివృద్ధి కుంటుపడుతోంది. పార్టీలకు నిబద్ధత లేనపుడు మేనిఫెస్టోలు భ్రమ కల్పించే పత్రాలే! అవి తూకానికి తప్ప మరొకందుకు పనికిరావు. – సారంపల్లి మల్లారెడ్డి, వ్యవసాయరంగ నిపుణులు .:: దిలీప్‌రెడ్డి -
సీపీఐ ‘సర్వేజనా సుఖినో భవంతు’
సాక్షి, హైదరాబాద్: భూ చట్టాల్లో సమగ్ర మార్పులు, విద్యుత్ చార్జీలకు టెలిస్కోపిక్ విధానం రద్దు, మద్యం అమ్మకాల సమయం కుదింపు తదితర అంశాలతో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసింది. ఈబీసీ, మైనార్టీ, అనాథల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు, మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడంతోపాటు కేరళ తరహాలో ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్)లో మార్పులు తెచ్చి మినీ సూపర్ మార్కెట్ల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టనున్నట్టు ప్రతిపాదించింది. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ మహాకూటమిగా ఏర్పడిన నేపథ్యంలో అన్ని పక్షాలు కలసి ‘కామన్ ఎజెండా’రూపొందిస్తూనే భాగస్వామ్య పక్షాలు మాత్రం సొంతంగా ఎన్నికల ప్రణాళికలు ప్రకటిస్తున్నాయి. సీపీఐ రూపొందించిన మేనిఫెస్టోలో ధార్మికరంగంపైనా ప్రత్యేక దృష్టిని సారించింది. దీనిలో భాగంగా అన్ని మతాల ప్రార్థనాలయాల అభివృద్ధి, ఆస్తుల పరిరక్షణ, నిధులు దుర్వినియోగం కాకుండా చర్యలు, ఆలయాలు, ప్రార్థనా సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ భద్రత, పెన్షన్ల చెల్లింపు వంటి వాటిని చేర్చింది. సీపీఐ సూచిస్తున్న ఆయా అంశాలను మహాకూటమి ‘కామన్ మినిమమ్ ప్రోగ్రామ్’లేదా కామన్ ఎజెండాలో చేర్చాలని ఆ పార్టీ కోరనుంది. సీపీఐ సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, డా.సుధాకర్‌లతో కూడిన మేనిఫెస్టో కమిటీ ఎన్నికల ప్రణాళికను రూపొందించింది. ఈ మేనిఫెస్టోను సీపీఐ గురువారం విడుదల చేయనుంది. మేనిఫెస్టో ముఖ్యాంశాలు.. - ప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి కట్టడికి చర్యలు - పాతకాలపు రెవెన్యూ చట్టాల్లో సమూల మార్పులు - వ్యవసాయరంగ పరిరక్షణ, రైతులు, కౌలు రైతుల సంక్షేమానికి చర్యలు - అన్ని వర్గాలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు - మద్యం విక్రయ సమయాలు మరింత కుదింపు ∙పర్యావరణ పరిరక్షణ - పర్యాటక అభివృద్ధికి కార్యాచరణ - విద్యుత్ చార్జీల గణనకు ప్రస్తుతమున్న టెలిస్కోపిక్ విధానం రద్దు - ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత - ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, క్రీడాకారులు, న్యాయవాదుల సంక్షేమానికి చర్యలు - కుల, మతాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ - ప్రవాస తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణకు చర్యలు - మెట్రో రైలు చార్జీల తగ్గింపు ట్రాన్స్జెండర్లు, బాలకార్మికుల హక్కుల పరిరక్షణ. -
నక్క వేషాలు వద్దు
‘‘చూశారా సార్... ఈసారి ఎన్నికల్లో ఇప్పటివరకూ ఏ పార్టీ వాళ్లూ మేనిఫెస్టోలు ప్రకటించలేదట. ఈరోజే పేపర్లో చూశా. కానీ ఒకళ్లను ఇంకొకళ్లు మాత్రం విపరీతంగా తిట్టుకుంటున్నారు’’ ‘‘పోనీలే.. మేనిఫెస్టోలో ఉన్నది మాత్రం చేసి చస్తున్నారా?’’ ‘‘మేనిఫెస్టోలో పెడితే ఒక కమిట్మెంట్ ఇచ్చినట్టు కదా. ‘ఆరోజు మీరే కదా అలా చెప్పారు’ అంటూ నిలదీయడానికి వీలవుతుంది కద్సార్. ప్రజలు మోసపోతున్నారనే నా బాధ’’ ‘‘ఏం పర్లేదు. ఓటర్లెప్పుడూ ముల్లా నస్రుద్దీన్ అంత తెలివిగా, చిలిపిగా ఉంటారు. గాడిద తన పని కాకుండా నక్క పని చేస్తే బుద్ధి చెబుతారు’’ ‘‘ముల్లా నస్రుద్దీన్ కథలు నేనూ విన్నా.. అయినా గాడిద పని గాడిద చేయాలి. కుక్క పని కుక్క చేయాలి అని కదా కథ. మరి ఈ నక్క ఎక్కడ్నుంచి వచ్చింది కథలోకి?’’ ‘‘ఓ కథ చెబుతా విను. ముల్లా నస్రుద్దీన్ సరుకులు తెచ్చుకునే కిరాణా కొట్టు వాగు అవతల ఉండేదట. సరుకులన్నీ తన గాడిద వీపు మీద వేసే సమయంలో ముందుగా ఉప్పు మూట వేసి దాని మీద మిగతా సామాన్లన్నీ పేర్చేవాడట. సామాన్లు మోస్తున్న గాడిద ఓ కీలకం కనిపెట్టింది. ఉప్పుబస్తా నీళ్లలో లోతుగా మునిగేలా ఒంగుతూ మెల్ల మెల్లగా నడుస్తూ ఉంటే వీపు మీది మోతబరువు బాగా తగ్గినట్టు గ్రహించింది. దాంతో ఎప్పుడు సరుకులు తెచ్చినా అదే పని చేయడం మొదలుపెట్టింది. రెండు మూడు సార్లు చూశాక గాడిద కాస్తా నక్క తెలివితేటలు ప్రదర్శిస్తోందని అర్థమైంది ముల్లా గారికి. అంతే... నెక్స్ట్ టైమ్ ఎప్పటిలాగే బస్తాను వీపు మీద వేయించి మిగతా సామాన్లు సర్దాడు ముల్లా. గాడిద కూడా ఎప్పటిలాగే ముక్కుతూ మునుగుతూ తక్కుతూ తారుతూ లోతు నీళ్లలోకి వెళ్తూ బరువు తగ్గించుకోడానికి ప్రయత్నించింది. అంతే.. ఎప్పట్లా కాకుండా బస్తా బరువు అంతకంతకూ పెరిగిపోసాగింది. కాస్త నిటారుగానూ, బస్తాను తడపకుండా నడిస్తేనే బరువు తేలికవుతోంది. దాంతో అప్పట్నుంచి బస్తాను ముంచకుండా తేవడం మొదలు పెట్టిందట ఆ గాడిద’’ ‘‘గాడిదకు బుద్ధి చెప్పడానికి ముల్లా ఏం చేశాడు?’’ ‘‘ఇంట్లోని చెడిపోయిన పరుపును ఎక్కడైనా పారేద్దామని బయలుదేరిన ముల్లాకు ఓ ఆలోచన వచ్చింది. దాంతో ఆ దూదినంతా తాను ముందే సిద్ధం చేయించిన ఓ బస్తాలో బాగా కూరిపెట్టించాడు. అలా గాడిదకు బుద్ధి చెప్పాడు సస్రుద్దీన్’’ ‘‘ఇంతకీ ఏమంటారు?’’ ‘‘నువ్వేం బెంగపడకు. ఓటర్లెప్పుడూ ముల్లా నస్రుద్దీన్ అంత తెలివైన వాళ్లే. ఓట్లు కావాలంటే తిట్లు కాదు... ఏం చేస్తారో ఒట్లు వేయండంటూ తమ దగ్గరికి వచ్చే అభ్యర్థులను బాగానే నిలదీస్తున్నారు లే. ప్రజాసేవ చేస్తామంటూ వచ్చిన వారు ఎప్పుడైతే ఓటరు కోసం కష్టపడకుండా.. సొంతం కోసం నక్కవేషాలు వేయడం మొదలుపెడతారో.. ఓటు దెబ్బతో అభ్యర్థి వీపు మీద ఓటమిభారం మోపేస్తారు. అచ్చ తెలంగాణ సామెతగా చెప్పాలంటే.. కర్రుకాల్చి వాతపెడతారు. ఓకే’’. -
మేనిఫెస్టోలు ప్రకటించని పార్టీలు
-
గడువు 18 రోజులే.. మేనిఫెస్టోలు ఎక్కడ సారూ?
సాక్షి, హైదరాబాద్: ఓట్ల పండుగ రానే వస్తోంది... కానీ ప్రధాన రాజకీయ పార్టీల సీట్ల పంచాయితీ మాత్రం తెగకపోవడంతో రానున్న ఎన్నికల్లో తమను గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తామన్నది మాత్రం అధికారికంగా వెల్లడి చేయడం లేదు. పోలింగ్‌కు మరో 18 రోజులు మాత్రమే గడువున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఒక్క రాజకీయ పార్టీ కూడా అధికారికంగా తమ మేనిఫెస్టోను విడుదల చేయకపోవడం గమనార్హం. సీట్లు, టికెట్ల గొడవలతోనే రాజకీయ పక్షాలు కాలం వెళ్లదీస్తుండగా, ఈ ఎన్నికల్లో ఫలానా పార్టీకి ఓటేస్తే తమకు ఏం ఒరుగుతుందనేది సామాన్య ప్రజలకు అంతుబట్టడం లేదు. టీఆర్ఎస్ కేవలం పాక్షిక మేనిఫెస్టో విడుదల చేయగా, మిగిలిన పార్టీలు ఇంకా కసరత్తు దశలోనే ఉండిపోయాయి. కాంగ్రెస్ కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాగా, ఇతర పార్టీలూ అడపాదడపా అది చేస్తాం... ఇది చేస్తామంటూ చెప్పడం.. అప్పుడప్పుడూ మీడియా కు లీకులివ్వడంతోనే సరిపెడుతున్నాయి. పోలింగ్‌కు సమయం సమీపిస్తున్నా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటించడంలో జాప్యం చేస్తుండటంపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటిదీ అదే తీరు... ఈసారి ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఏం చేయాలన్న దానిపై ప్రధాన రాజకీయ పార్టీలు చేస్తున్న కసరత్తు ఇంకా కొలిక్కిరావడం లేదు. ఇందుకోసం కమిటీలను ఏర్పాటు చేసుకున్న ఆయా పార్టీలు ఇంతవరకు ముసాయిదా మేనిఫెస్టోలను కూడా సిద్ధం చేయలేదని తెలుస్తోంది. సెప్టెంబర్ 6నే 105 మంది అభ్యర్థులను ప్రకటించిన అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ఇంతవరకు మేనిఫెస్టోను అధికారికంగా ప్రకటించలేదు. ఇక, కూటమిలో సీట్ల సర్దుబాటు పేరుతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు కాలం గడుపుతూ ఆయా పార్టీల మేనిఫెస్టోలను ప్రకటించడంలోనూ, కూటమి పక్షాన ఉమ్మడి ఎజెండాను వెల్లడించడంలోనూ జాప్యం చేస్తున్నాయి. బీజేపీ, బీఎల్పీ, ఇతర పార్టీలు కూడా ఇంకా మేనిఫెస్టోలకు తుదిరూపు ఇవ్వకపోవడం చర్చనీయాంశం అవుతోంది. పింఛన్లు, రుణమాఫీ, నిరుద్యోగ భృతిపైనే చర్చ ఈసారి ఎన్నికల్లో సామాజిక పింఛన్లు, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి అంశాలే కీలకం అవుతాయని పార్టీలు అంచనా వేస్తున్నాయి. సామాజిక పింఛన్లను రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించగా, టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ప్రకటించిన దాని కన్నా ఎక్కువగా మరో రూ.16 జోడించింది. నిరుద్యోగ భృతి విషయంలోనూ పోటాపోటీగా ప్రకటనలు చేశాయి. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని కాంగ్రెస్ చెప్పగా, కాలపరిమితిని వెల్లడించనప్పటికీ గతంలో లాగానే రూ.లక్ష రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ వెల్లడించింది. మిగిలిన పార్టీలు పింఛన్లు, రుణమాఫీ, నిరుద్యోగ భృతిపై ప్రకటనలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. పాక్షికంతోనే ఆగారెందుకు..? పార్టీల పరంగా చూస్తే టీఆర్ఎస్ మాత్రమే మేని ఫెస్టో అంటూ అధికారిక ప్రకటన చేసింది. పాక్షిక మేనిఫెస్టో పేరుతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ గత నెలలో కొన్ని ప్రకటనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బోలెడన్ని హామీలు ఇచ్చినా అధికారికంగా మేనిఫెస్టోను మాత్రం ప్రకటించలేదు. బీజేపీ కూడా ఇల్లు లేని వారికి సొంత ఇల్లు కట్టుకునేంతవరకు ఇంటి అద్దె చెల్లిస్తామనే ప్రజాకర్షక వాగ్దానాలు చేస్తోంది. కానీ, ఆ పార్టీ ఇంకా ముసాయిదా దశలోనే ఉంది. అమరవీరుల పేరుతో... అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చేందుకే కూటమిగా ఏర్పడ్డామని కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ చెబుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని, కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) పేరుతో ఉండే ఈ ఎజెండాలో అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చడమే ప్రధానాంశంగా ఉంటుందని చెప్పాయి. కానీ, అమరవీరుల ఎజెండా ఏమైందో... ఆ ఎజెండాపై కసరత్తు ఎంతవరకు వచ్చిందన్నది మాత్రం తేలడం లేదు. మరి, ఈ పార్టీలు ఎప్పటికి స్పందిస్తాయో... మేనిఫెస్టోలు, కూటమి ఉమ్మడి ప్రణాళికను ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తాయో... ప్రజల్లో వీటిపై ఎప్పుడు చర్చ జరగాలో... ఎవరికి ఓటేయాలనేది ఓటరు దేవుడు ఎప్పుడు నిర్ణయించుకోవాలో అంతుపట్టని పరిస్థితి నెలకొంది. ఒకరి కోసం ఇంకొకరు... మేనిఫెస్టోల జాప్యంలో టికెట్ల ఖరారు అంశం ప్రధానమైంది కాగా, ఎన్నికల సంఘం ఈసారి ఎన్నికల్లో పార్టీల మేనిఫెస్టోల విషయంలో సీరియస్‌గా ఉండటం, ఒక పార్టీ ప్రకటిస్తే అందుకు అనుగుణంగా తామూ ప్రకటిద్దామని మరో పార్టీ వేచి చూస్తుండటం కూడా కారణాలుగా కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలను 3 రోజుల్లోగా 3 సెట్ల చొప్పున తమకు సమర్పించాలని, నిబంధనలకు విరుద్ధంగా మేనిఫెస్టోల్లో వ్యక్తిగత ప్రయోజనాలను హామీగా ఇవ్వకూడదని ఎన్నికల సంఘం ప్రకటించడంతో మేనిఫెస్టోల తయారీలో అన్ని పార్టీలు జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తోంది. -
ఒక్కసారి కమిట్ అయితే..
ఊకదంపుడు హామీలు.. నోటికొచ్చిన వాగ్దానాలు.. చేతి కొచ్చిన రాతలతో ఇష్టానుసారం మేనిఫెస్టోలను రూపొందించేసి ఓట్లు దండుకుందామంటే ఇకపై కుదరదు. తూతూ మంత్రంగా మేనిఫెస్టోలను ప్రకటించేసి.. గెలిచాక హామీల సంగతి చూద్దామనుకున్నా చెల్లదు. ఓటర్లకు వ్యక్తిగత ప్రయోజనం కలిగించే ఉచిత హామీలిచ్చేందుకు నిబంధనలు అంగీకరించవు. ఎన్నికల మేనిఫెస్టోల ప్రకటన విషయంలో రాజకీయ పార్టీలు జాగ్రత్తగా ఉండక తప్పదు. ఎన్నికల మేనిఫెస్టోలను కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలోకి తెచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు అమలులో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోల రూపకల్పనలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అనుసరించాల్సిన విధివిధానాలను ఎన్నికల ప్రవర్తన నియమావళిలో 8వ భాగంగా చేర్చుతూ 2015 ఏప్రిల్ 24న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్నికల మేనిఫెస్టోల విషయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ‘కోడ్’ కిందకు మేనిఫెస్టో - ఎన్నికల ప్రవర్తన నియమావళి స్ఫూర్తికి అనుగుణంగా మేనిఫెస్టోలు ఉండాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలు, విలువలకు భంగం కలిగించేలా ఉండరాదు. - రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాదేశిక సూత్రాల మేరకు పౌరుల కోసం వివిధ సంక్షేమ పథకాలను రూపొందించే అధికారం ప్రభుత్వాలకు ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇలాంటి సంక్షేమ పథకాలపై హామీలివ్వడంపై ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, ఓటర్లను అనుచిత ప్రభావాలకు లోను చేయకూడదు. - పారదర్శకత పరిరక్షణ, అందరికీ (రాజకీయ పార్టీలు, అభ్యర్థులందరికీ) సమ అవకాశాల కల్పన, హామీల విశ్వసనీయత కోసం మేనిఫెస్టోలో ప్రకటించే హామీలు హేతుబద్ధంగా ఉండాలి. హామీల అమలుకు పద్ధతులు, అవసరమైన ఆర్థిక వనరులను సవివరంగా తెలపాలి. అమలుకు సాధ్యమైన హామీలతోనే ఓటర్ల మద్దతు కోరాలి. అసలు మూలం ఇదీ.. రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను తప్పనిసరిగా అమలు చేసేలా ఆదేశించాలని ఎస్.సుబ్రహ్మణ్యం బాలాజీ అనే వ్యక్తి వేసిన కేసులో 2013 జూలై 5న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి ఎన్నికల మేనిఫెస్టోలో ఉండాల్సిన కంటెంట్‌పై విధివిధానాలు రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అందుకు కొన్ని మార్గదర్శకాలను సూచించింది. - ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 ప్రకారం మేనిఫెస్టోల్లో ఇచ్చే హామీలను అవినీతిమయ విధానాలతో రూపకల్పన చేసేందుకు వీల్లేదు. ఏ విధమైన ఉచిత హామీలైనా ప్రజలందరినీ ప్రభావితం చేస్తాయనడంలో అనుమానం లేదు. స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలు ఇలాంటి హామీలతో కుదుపునకు గురవుతాయి. - సాధారణంగా ఎన్నికల తేదీ ప్రకటనకు ముందే రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటిస్తాయి. ఎన్నికల తేదీ ప్రకటనకు ముందటి చర్యలను నియంత్రించే అధికారం ఎన్నికల సంఘానికి ఏ మాత్రం లేదు. అయితే, ఎన్నికల మేనిఫెస్టోలు నేరుగా ఎన్నికలకు సంబంధించిన అంశమైనందున ఈ విషయంలో మినహాయింపు పొందవచ్చు. ధ్రువీకరణ తప్పనిసరి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు ప్రజలు, పత్రికలకు మాత్రమే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించేవి. ఇకపై ఎన్నికల సంఘానికీ సమర్పించాల్సిందే. మేనిఫెస్టోను ప్రకటించిన 3 రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పార్టీలు, అభ్యర్థులు ఆంగ్ల/హిందీ భాషల్లో 3 జతల కాపీలను సమర్పించాలి. ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని 8వ భాగంలో పేర్కొన్న విధివిధానాలకు అనుగుణంగానే మేనిఫెస్టోలో హామీలు, కార్యక్రమాలు, విధానాలను పొందుపర్చినట్లు ధ్రువీకరణ పత్రం సైతం మేనిఫెస్టోలతో పాటు సీఈఓకు సమర్పించాలి. ఈ మేనిఫెస్టోలను ఎన్నికల సంఘం భద్రపరుస్తుంది. ‘హామీ’లపై కోర్టుకు వెళ్లవచ్చు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పార్టీలు అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోతే ప్రజలు కోర్టులను ఆశ్రయించవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీలు సమర్పించే మేనిఫెస్టోలను ఎన్నికల సంఘం పరిశీలించడం ఆచరణలో సాధ్యం కాదని, ఒకవేళ పరిశీలన జరిపి మార్పులు సూచిస్తే పార్టీలు కోర్టులకు వెళ్లి సవాలు చేసే అవకాశముందని, దీంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగదని ఆయన అంటున్నారు. మరోవైపు మేనిఫెస్టోలను ఎన్నికల సంఘం పరిశీలించాల్సిందేనని స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ..::మహమ్మద్ ఫసియొద్దీన్ నిప్పులాంటి వారి ఉప్పు ముప్పు! పట్టు వదలని ఓటరు రాజకీయ బేతాళుణ్ణి భుజాన వేసుకొని పోలింగ్ బూతు వైపు నడవటం మొదలుపెట్టాడు. ఓటరుకు అలసట కలగకుండా ఉండేందుకు ఎప్పటిలాగే కథ చెప్పడం మొదలుపెట్టాడు రాజకీయ బేతాళుడు. అనగనగనగా ఓ ఊళ్లోకి నలుగురు బాటసారులు వచ్చారు. ఓ చెట్టుకింద చేరాక తామంతా తినేయడం.. సారీ తినడం కోసమే అక్కడికి చేరినట్టు తెలుసుకున్నారు. తమ దగ్గరున్న వనరులతో నలుగురూ వేర్వేరుగా వంట చేసుకుంటే ఎవ్వరికీ ఏమీ రాదు. అదే గనక సరుకులన్నీ ఒకేచోట చేర్చి నలుగురం కలిసి వండుకుంటే నాలుగైదు రకాల ఐటమ్స్‌తో అందరం మృష్టాన్నభోజనం చేయవచ్చనుకున్నారు. అప్పుడు మొదలైంది గొడవ. ఎవరు ఏ ఐటమ్ కోసం ముడి సరుకులు తేవాలా అని రగడ.. కాసేపు వాదోపవాదాలు కొససాగాయి. చివరికెలాగో ఒప్పందం కుదిరింది. అయితే తన వాటాగా ఉప్పు తెస్తానన్నాడు ఒకాయన. రుచి కోసం ఉప్పు చాలా ప్రధానమన్నాడు. ఉప్పులేని పప్పు చప్పన అనీ, ఉప్పు లేని కూర.. పప్పు లేని పెండ్లి అనీ సామెతలు పలికాడు. ‘పదునుగ మంచి కూర నలపాకము చేసిననైన అందు ఉప్పు లేక రుచిపుట్టగ నేర్చునటయ్య’ అంటూ శతకపద్యాలు చెప్పాడు. ఉప్పుతో పొత్తుకలపడం అనే సామెత ఉండనే ఉంది కదా. అక్కడికీ వాళ్లలో ఒకడికి డౌటొచ్చి... ‘మేమంటే బియ్యం, పప్పు, చింతపండు, కూరగాయలు ఇలా రకరకాలు తెచ్చాం. రుచులకు రారాజు ఉప్పు అనే సామెత కూడా తెలుసు. రాజును తెస్తున్నానంటూ నువ్వు నీ వాటాగా చాలా తక్కువ ఇస్తున్నావనిపిస్తోంది’’ అంటూ అనుమానపడ్డాడు. అప్పుడాయన ‘‘మీరేమీ అపోహ పడవద్దు. నేను నిప్పులాంటివాణ్ణి. మీరు బియ్యం, పప్పూ, కూరగాయలూ, చింతపండూ ఇలాంటివన్నీ తలా ఒక కిలో తెచ్చినట్టే... నేనూ ఉప్పు ఒక కిలో తెస్తా. నిజానికి రుచికి చిటికెడే చాలు. కానీ మీకెందులోనూ తీసిపోకుండా ఉండేందుకే కిలో తెచ్చిస్తా. ఇప్పుడిక ఇందులో మోసమేముంది?’’ అంటూ సమాధానమిచ్చాడు. ఇక్కడిదాకా కథ చెప్పిన బేతాళుడు ‘‘ఓ ఓటరూ.. చూశావు కదా. ఈ ఉప్పు మహాశయుడి యుక్తి గురించి నీకేమర్థమైందో చెప్పు. తెలిసీ చెప్పకపోతే ఓటర్ల జాబితాలో నీ పేరు గల్లంతవుతుంది’’ అన్నాడు బేతాళుడు. ‘‘ఉప్పు వల్ల సదరు వంటకు రుచి వస్తుందో రాదోగానీ.. మిగతావాళ్లందరికీ హైబీపీ రావడం ఖాయం. ఆ బీపీతో తమకు ఆశ్రయం ఇచ్చిన చెట్టులాంటి సొంత పార్టీ ఆఫీసులను ధ్వంసం చేసేంతగా చిర్రెత్తిపోవడమూ ఖాయం. చాలాచోట్ల అది తెలుస్తూనే ఉంది కదా’’ అని సమాధానమివ్వడంతో రాజకీయ బేతాళుడు మళ్లీ అందకుండా తుర్రుమన్నాడు. -
ప్రగతి పథంలో నడిపించేవారికే.. ఓటు
దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఎన్నికల్లో ఓటు వేయడాన్ని ఏదో పనిగా భావించకండి. జాతి పునర్నిర్మాణంలో మనవంతు కనీస బాధ్యతగా గుర్తించండి. జాతిపిత మహా త్మాగాంధీ చెప్పినట్టు అహింసాయుతమైన ప్రజాస్వామ్యంలో ఓటే ఏకైక ఆయుధం. ఆ ఓటును సద్వినియోగం చేసుకోండి. కులాలు, మతాలు, వేర్పాటువాదాలకు అతీతంగా సమర్థులైన నేతలనే ఎన్నుకోండి. ఓటు వేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలన్నీ ఓమారు చూసి, ఆయా పార్టీల నేతల ప్రకటనలు గమనించి ఎవరైతే సమాజాన్ని ప్రగతిపథంలో నడిపిస్తారని భావిస్తారో అలాంటి నేతలనే ఎన్నుకోండి... - మంచు లక్ష్మీప్రసన్న