Manipur CM
-
కారులో వెంటాడి.. కిరాతకంగా చంపేశాడు
-
మణిపూర్ సీఎంపై పోటీ చేస్తున్న ఉక్కు మహిళ
-
మణిపూర్ అఖిలపక్షానికి మోదీ ఆహ్వానం
ఇంపాల్: అక్రమ వలసదారుల నిరోధానికి సంబంధించిన మూడు బిల్లులపై చర్చించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మణిపూర్ అఖిల పక్ష ప్రతినిధి బృందానికి ఆహ్వానం పంపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఒకారమ్ ఇబోబి గురువారమిక్కడ తెలిపారు. ఈ మూడు బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ గత ఏడాదే ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లులను గిరిజన తెగకు చెందిన ఓ వర్గం ప్రజలు వ్యతిరేకిస్తోంది. దీనిపై చర్చించేందుకు ప్రధాని అఖిలపక్షాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం ఒకారమ్ ఇబోబి మాట్లాడుతూ దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే ఏ బిల్లును అయినా సవరించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు ఈ బిల్లుకు వ్యతిరేకంగా, మద్దతుగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. గతంలో వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో 9 మంది ఆందోళనకారులు మరణించిన విషయం తెలిసిందే. ప్రధాని అపాయింట్ మెంట్ జాప్యంపై ప్రశ్నించగా ప్రధానికి దేశ, విదేశీ సమస్యలు ఎన్నో ఉంటాయని ఇబోబి అన్నారు. -
మణిపూర్ సీఎం ఇంటి ఎదుట బాంబు పేలుడు
మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ ఇంటి ఎదుట శక్తిమంతమైన గ్రెనేడ్ ఒకటి పేలింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఆయన నివాస ప్రాంగణం ఎదుట సాయంత్రం ఈ బాంబు పేలినా, ఎవరికీ పెద్దగా ప్రమాదం జరగలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో త్వరలో జరగబోతున్న స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల సందర్భంగా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులే ఈ గ్రెనేడ్ పేల్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సాయంత్రం 6.35 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించగా, ఆ తర్వాతి నుంచి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, బిషెన్పూర్, తౌబల్ జిల్లాలన్నింటిలో పోలీసు, సెక్యూరిటీ ఔట్‌పోస్టులను ఏర్పాటుచేశారు.