మణిపూర్ సీఎం ఇంటి ఎదుట బాంబు పేలుడు | Grenade explodes in front of Manipur CM's residence | Sakshi
Sakshi News home page

మణిపూర్ సీఎం ఇంటి ఎదుట బాంబు పేలుడు

Published Sat, Aug 10 2013 9:02 PM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM

Grenade explodes in front of Manipur CM's residence

మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ ఇంటి ఎదుట శక్తిమంతమైన గ్రెనేడ్ ఒకటి పేలింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఆయన నివాస ప్రాంగణం ఎదుట సాయంత్రం ఈ బాంబు పేలినా, ఎవరికీ పెద్దగా ప్రమాదం జరగలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో త్వరలో జరగబోతున్న స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల సందర్భంగా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులే ఈ గ్రెనేడ్ పేల్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సాయంత్రం 6.35 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించగా, ఆ తర్వాతి నుంచి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, బిషెన్పూర్, తౌబల్ జిల్లాలన్నింటిలో పోలీసు, సెక్యూరిటీ ఔట్పోస్టులను ఏర్పాటుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement