బలగాలపై గ్రనేడ్‌ విసిరాడు.. | One dead, 5 injured in Srinagar grenade blast | Sakshi
Sakshi News home page

బలగాలపై గ్రనేడ్‌ విసిరాడు..

Published Thu, Sep 7 2017 6:50 PM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM

బలగాలపై గ్రనేడ్‌ విసిరాడు..

బలగాలపై గ్రనేడ్‌ విసిరాడు..

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాల వాహనం లక్ష్యంగా ఓ ఉగ్రవాది గ్రనేడ్‌తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో గ్రనేడ్‌ విసిరిన ఉగ్రవాది కూడా ఉన్నాడు. పోలీసుల వివరాల ప్రకారం జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, అధికారుల నివాసాలు ఉండే ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్రమత్తమైన బలగాలు ఆ ప్రాంతంలోకి ఎవరిని రాకుండా చేస్తున్నారు.

గురువారం సాయంత్రం భద్రతా బలగాలు తమ వాహనాల్లో వెళుతుండగా అదే అదను చూసుకొని ఉగ్రవాది జహంగీర్‌ చౌక్‌ ప్రాంతంలో గ్రనేడ్‌ విసిరాడు. దాని పేలుడు ధాటికి అతడు కూడా గాయపడ్డాడు. రోడ్డుపై భారీ కందకం ఏర్పడింది. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీనిపై శ్రీనగర్‌కు చెందిన ప్రత్యేక పోలీసు అధికారి స్పందిస్తూ కొంతమంది చొరబాటు దారులు బలగాలపై గ్రనేడ్లు విసరాలని ప్రణాళిక రచించుకున్నారని, అయితే, అది కాస్త అతడికి సమీపంగానే పడటంతో చివరకు అతడు కూడా గాయపడినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఓ పౌరుడు మృత్యువాత పడినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement