8 ప్రపంచ రికార్డులు ఆయన సొంతం
న్యూఢిల్లీ: 180 కేజీల బరువైన బ్రెడ్, ప్రపంచంలోనే అతిపెద్ద అప్పం, 14,353 చిన్న చిన్న చక్కెర స్ఫటికాలతో నిర్మించిన ఘనం.. ఈ రికార్డులన్నీ సాధించింది ఒక్కరే. అంతేనా.. ఆయన పేరు మీద మొత్తం 8 ప్రపంచ రికార్డులు ఉన్నాయి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అత్యధిక సంఖ్యలో వ్యక్తిగత రికార్డులు కలిగిన ఘనత ఆయన∙సొంతం. ఆయనే జైపూర్‌కు చెందిన మనోజ్ శ్రీవాస్తవ.
ప్రస్తుతం మణిపాల్ విశ్వవిద్యాలయం జైపూర్ క్యాంపస్‌లో హోటల్ మేనేజ్మెంట్ విభాగాధిపతిగా ఉన్న మనోజ్ 2008లో 180 కిలోల బ్రెడ్‌ను తయారుచేసి ఆయన మొదటిసారి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. బ్రెడ్‌ను తయారు చేసేందుకు ఆయనకు 16 గంటల సమయం పట్టింది. 2013లో 14 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు కలిగిన అప్పంను 12 గంటల్లోనే తయారు చేశారు. 365 కేజీల బరువైన ఈ అప్పం ప్రపంచంలోనే అతి పెద్దది.