ManpowerGroup Employment Outlook Survey
-
ManpowerGroup Employment Outlook Survey: నియామకాలపై భారత్‌లో బుల్లిష్ ధోరణి
న్యూఢిల్లీ: భారత కంపెనీలు వచ్చే మూడు నెలల (2024 జనవరి–మార్చి) కాలానికి నియామకాల పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నట్టు మ్యాన్‌వపర్ గ్రూప్ ఇండియా సర్వే వెల్లడించింది. నియామకాల ఆశావాదం భారత్‌లోనే ఎక్కువగా నమోదైంది. రానున్న మూడు నెలల్లో తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటామని 37 శాతం కంపెనీలు చెప్పాయి. మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయింట్‌మెంట్ అవుట్‌లుక్ సర్వే ప్రపంచవ్యాప్తంగా 3,100 కంపెనీలను ప్రశ్నించి ఈ వివరాలను విడుదల చేసింది. 2023 ప్రథమ త్రైమాసికంతో పోలిస్తే భారత్‌లో నియామకాల ధోరణి 5 శాతం ఎక్కువగా కనిపించింది. ‘‘దేశీయ డిమాండ్ ఇప్పటికీ స్తబ్దుగానే ఉంది. నిరంతరాయ ప్రైవేటు పెట్టుబడుల ప్రవాహం భారత్‌ను లాభదాయక ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో సాయపడుతున్నాయి’’అని మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటి పేర్కొన్నారు. భారత్‌లోనే అధికం.. జనవరి–మార్చి త్రైమాసికానికి నియామకాల పరంగా ఎక్కువ ఆశావాదం భారత్, నెదర్లాండ్స్‌లోనే కనిపించింది. ఈ రెండు దేశాల్లోనూ 37 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలత కనబరిచాయి. ఆ తర్వాత కోస్టారికా, అమెరికాలో ఇది 35 శాతంగా ఉంది. 34 శాతంతో మెక్సికో నియామకాల ఆశావాదంలో మూడో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా సగటున చూస్తే ఇది రానున్న త్రైమాసికానికి 26 శాతంగా ఉంది. ఈ రంగాల్లో సానుకూలం రియల్ ఎస్టేట్ రంగంలో నియామకాల సానుకూల త ఎక్కువగా నమోదైంది. ఆ తర్వాత ఐటీ, కన్జ్యూ మర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రంగాల్లో నియామకాల ధోరణి వ్యక్తమైంది. మార్చి త్రైమాసికంలో నియామకాలు పెంచుకుంటామని ఫైనాన్షియల్స్, రియల్ ఎస్టేట్ రంగంలో 45 శాతం కంపెనీలు చెప్పాయి. ఐటీ రంగంలో 44 శాతం, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రంగంలో 42% కంపెనీలు ఇదే విధమైన దృక్పథంతో ఉన్నాయి. అతి తక్కువగా 28% మేర నియామకాల సానుకూలత ఇంధనం, యుటిలిటీ రంగాల్లో కనిపించింది. మన దేశంలో పశ్చిమ భారత్‌లో ఎక్కువగా 39 శాతం మేర నియామకాల పట్ల కంపెనీలు సానుకూలంగా ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తరాదిలో 38 శాతం సానకూలత కనిపించింది. నిపుణుల కొరత భారత్, జపాన్‌లో నిపుణులైన మానవ వనరుల కొరత అధికంగా ఉంది. భారత్‌లో 81 శాతం సంస్థలు నైపుణ్య మానవ వనరులను గుర్తించడం కష్టంగా ఉందని చెప్పాయి. 2023 సంవత్సరం ఇదే కాలంలోని ఫలితాలతో పోలి్చచూసినప్పుడు ఒక శాతం పెరిగింది. తమకు కావాల్సిన నిపుణులను గుర్తించడం కష్టంగా ఉందని 85 శాతం జపాన్ కంపెనీలు చెప్పాయి. ఆ తర్వాత గ్రీస్, ఇజ్రాయెల్‌లోనూ 82 శాతం కంపెనీలు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాయి. నిపుణులను గుర్తించి, వారిని నియమించుకుని, అట్టి పెట్టుకునేందుకు కంపెనీలు సౌకర్యవంతమైన పని విధానాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఐటీ, డేటా, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ అండ్ లాజిస్టిక్స్, హెచ్ఆర్ నిపుణులకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. -
నియామకాలపై ఆశావహ అంచనాలు
ఉద్యోగాల్లో కోతలు, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన అవకాశాలు మొదలైన ఆందోళనకర పరిస్థితి నెలకొన్నప్పటికీ జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో మాత్రం నియామకాలు ఆశావహంగా కనిపిస్తున్నాయి. ఐటీ రంగంలో అత్యధికంగా రిక్రూట్మెంట్ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. మ్యాన్‌పవర్‌గ్రూప్ నిర్వహించిన ఉపాధి అంచనాల సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 3,020 పైచిలుకు సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. ఇందులో 49 శాతం సంస్థలు హైరింగ్‌పై అత్యధికంగా ఆసక్తి వ్యక్తం చేయగా, 13 శాతం మాత్రం నియామకాల యోచన లేదని పేర్కొన్నాయి. దీంతో నికరంగా 36 శాతం సంస్థలు రిక్రూట్మెంట్ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సర్వే తెలిపింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే హైరింగ్ సెంటిమెంటు 15 శాతం క్షీణిచగా, క్రితం క్వార్టర్‌తో పోలిస్తే మాత్రం 6 పర్సంటేజీ పాయింట్లు మెరుగుపడింది. సర్వేలోని మరిన్ని వివరాలు.. ► అంతర్జాతీయంగా 41 దేశాలు హైరింగ్ విషయంలో సానుకూలంగా ఉన్నాయి. కోస్టారికాలో నికర నియామకాల అంచనాలు 43 శాతంగా ఉండగా, నెదర్లాండ్స్ (39 శాతం), పెరూ (38 శాతం), తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా తర్వాత 36 శాతంతో భారత్ అయిదో ర్యాంకులో నిల్చింది. ► రంగాలవారీగా చూస్తే ఐటీ, టెక్నాలజీ, టెలికం, కమ్యూనికేషన్స్, మీడియా సంస్థల హైరింగ్ అంచనాలు 47 శాతంగా ఉన్నాయి. పర్యావరణ అనుకూల విధానాలను అమలు చేయాల్సిన విధులు నిర్వర్తించే ఉద్యోగులను తీసుకోవడంపై (గ్రీన్ జాబ్స్) కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ► రీజియన్లవారీగా చూస్తే పశ్చిమ రాష్ట్రాల్లో నికర హైరింగ్ అంచనాలు 42 శాతంగా ఉండగా, ఉత్తరాదిలో 39 శాతంగా, దక్షిణాదిలో 39 శాతంగా, తూర్పు రాష్ట్రాల్లో 29 శాతంగా ఉన్నాయి. -
మార్చి క్వార్టర్లో ఆచితూచి నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జనవరి–మార్చిలో భారతీయ కంపెనీలు ఆచితూచి నియామకాలు చేపట్టే అవకాశం ఉందని మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ సర్వే వెల్లడించింది. 3,030 ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ఈ సర్వేలో పాలుపంచుకున్నాయి. ‘మాంద్యం అంచనాలు, ప్రపంచ మందగమనం ఇందుకు కారణం. ఉద్యోగుల సంఖ్య పెరగవచ్చని 48 శాతం కంపెనీలు తెలిపాయి. తగ్గవచ్చని 16 శాతం, మార్పు ఉండకపోవచ్చని 34 శాతం సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ ఏడాది మార్చి క్వార్టర్లో నియామకాలు అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే 17 శాతం, 2022 తొలి క్వార్టర్‌తో చూస్తే 22 శాతం తగ్గవచ్చు. ఐటీ, ఫైనాన్స్, రియల్టీ, కంజ్యూమర్ గూడ్స్, సర్వీసెస్ విభాగాల్లో డిమాండ్ ఉంటుంది. నిపుణుల కొరత నియామకాలకు అడ్డంకిగా పరిణమించింది. కార్పొరేట్ కంపెనీలు, విద్యా సంస్థలు సంయుక్త ప్రయత్నాల ద్వారా దీనిని పరిష్కరించే వరకు ఉపాధి రేటులో వృద్ధి సింగిల్ డిజిట్లో ఉంటుంది’ అని నివేదిక వివరించింది. -
జోరుగా.. హుషారుగా..నియామకాలు!
న్యూఢిల్లీ: రానున్న మూడు నెలల్లో (అక్టోబర్–డిసెంబర్) ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున రానున్నాయి. 54 శాతం కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవాలని అనుకుంటున్నాయి. మ్యాన్ పవర్ గ్రూప్ నిర్వహించిన ‘ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ సర్వే’ ఈ వివరాలను నివేదికగా విడుదల చేసింది. కార్మిక మార్కెట్ సెంటిమెంట్ రానున్న త్రైమాసికానికి బలంగా ఉన్నట్టు తెలిపింది. మ్యాన్‌పవర్ గ్రూపు భారత్ సహా 41 దేశాల్లో ఉపాధి మార్కెట్ తీరుతెన్నులను అర్థం చేసుకునేందుకు ఈ సర్వే నిర్వహించింది. భారత్‌లో సర్వే ఫలితాలను గమనించినట్టయితే.. 64 శాతం కంపెనీలు ఉద్యోగులను పెంచుకోవాలని అనుకుంటున్నాయి. 24 శాతం కంపెనీలు ఎలాంటి మార్పు ఉండదని చెప్పాయి. 10 శాతం కంపెనీల్లో నియామకాల ధోరణి తగ్గింది. దీని ప్రకారం సగటున 54 శాతం కంపెనీలు ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ఈ సర్వే తేల్చింది. బ్రెజిల్లో 56 శాతం కంపెనీలు వచ్చే మూడు నెలలకు ఉద్యోగుల నియామకాల విషయంలో ఆశావహంగా ఉంటే, ఆ తర్వాత భారత్ అత్యధిక రేటుతో రెండో స్థానంలో ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే.. మన దేశంలో నియామకాల సెంటిమెంట్‌లో 10 శాతం వృద్ధి కనిపిస్తోంది. త్రైమాసికం వారీగా చూస్తే నియామకాల సెంటిమెంట్ 3% మెరుగుపడింది. భారత్‌కు ప్రయోజనం.. ‘‘భారత్ ఆర్థిక మూలాలు పటిష్టంగా, బలంగా ఉన్నాయి. స్వల్పకాల ప్రతికూలతలు ఉన్నా కానీ, వృద్ధికి మద్దతునిచ్చే విధానాలు, మౌలిక రంగంలో పెట్టుబడులు, ఎగుమతులు పెరగడం వల్ల మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి ప్రతికూలతలను అధిగమిస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల వర్ధమాన దేశాలు, మరీ ముఖ్యంగా భారత్ వృద్ధికి మద్దతునిస్తుంది. ఎగుమతులు పెంచుకుంటుంది. అదే సమయంలో అంతర్జాతీయ మందగమనంపై వదంతులు నేపథ్యంలో ఐటీ కంపెనీల్లో అప్రమత్త ధోరణి నెలకొంది’’అని మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటీ తెలిపారు. నియామకాల పట్ల సానుకూల ధోరణి బలంగానే ఉన్నా కానీ, తమకు కావాల్సిన నైపుణ్య మానవ వనరులు లభించడం లేదని 85 శాతం కంపెనీలు చెప్పడం ఆందోళనకరం. ఇక భారత్‌లో ప్రాంతాల వారీగా చూస్తే దక్షిణాది, ఉత్తరాదిన వచ్చే మూడు నెలల్లో ఉద్యోగులను నియమించుకోవాలని 56 శాతం కంపెనీలు అనుకుంటుంటే.. పశ్చిమాదిన 53 శాతం, తూర్పున 47 శాతంగానే ఉంది. -
ఫ్రెషర్లకు అదిరిపోయే శుభవార్త..!
భారత కంపెనీలు భారీ ఎత్తున ఫ్రెషర్ల నియామాకాలను చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పెద్ద ఎత్తున్న నియామాకాలను జరిపేందుకు కంపెనీలు సిద్దంగా ఉన్నాయని మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయిమెంట్ ఔట్లుక్ సర్వే వెల్లడించింది. 38 శాతంపైగా..! వచ్చే మూడు నెలల్లో 38 శాతం కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయని సర్వేలో తేలింది. సుమారు 3090 కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్దంగా ఉన్నాయి. మరోవైపు త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే మాత్రం నియామకాలు 11 శాతం క్షీణించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో తమ ఉద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని 55 శాతం, తగ్గొచ్చని 17 శాతం, నియామాకాల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చునని 36 శాతం కంపెనీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. మొత్తంగా చూస్తే 38 శాతం కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు తేలింది. వీడని భయాలు..! కరోనా రాకతో పలు కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. కోవిడ్ ఉదృతి కాస్త తగ్గడంతో కంపెనీలు కొత్త ఉద్యోగుల నియమాకాలపై దృష్టి సారించాయి. అయినప్పటీకి తాజా పరిస్థితులు కంపెనీల్లో భయాలను సృష్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ వార్, అధిక ద్రవ్యోల్భణాల నుంచి కంపెనీలకు పెను సవాళ్లు ఎదురుకానున్నాయని మ్యాన్‌పవర్ గ్రూప్ ఎండీ సందీప్ గులాటి తెలిపారు. బలంగా భారత స్టార్టప్ వ్యవస్థ..! భారత్‌లో స్టార్టప్ వ్యవస్థ బలంగా పుంజుకుంటోంది. స్టార్టప్ కంపెనీలకు భారత్ అనువైన దేశంగా మారినట్లు సందీప్ గులాటీ అభిప్రాయపడ్డారు. బలమైన స్టార్టప్ వ్యవస్థను రూపొందించేందుకు గాను కేంద్రం కూడా భారీ ఫండ్‌ను కేటాయిస్తున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో సుమారు రూ.283.5 కోట్ల "స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇక ఉద్యోగాల్లో మహిళల వాటా ఇంకా ఆందోళకరంగానే ఉందని సర్వే తెలిపింది. అత్యధికంగా ఐటీ, సాంకేతికరంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండగా, తరువాత రెస్టారెంట్లు-హోటళ్లు, విద్య, వైద్యం, సామాజిక-ప్రభుత్వ రంగాల్లో నియామాకాలు అధికంగా ఉంటాయని మ్యాన్‌పవర్ గ్రూప్ సర్వే వెల్లడించింది. చదవండి: జర్మనీ అతి పెద్ద సంస్థ ఇన్ఫోసిస్ కైవసం.. డీల్ విలువ ఎంతంటే? -
కొత్త కొలువులు అరకొరే !
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌తో భారత్‌లో జాబ్ మార్కెట్ కుదేలైంది. రానున్న మూడు మాసాల్లో కేవలం 5 శాతం కంపెనీలే నూతన నియామకాలపై దృష్టి సారించగా, పలు కార్పొరేట్ కంపెనీలు లాక్డౌన్ పూర్తిగా ముగిసేవరకూ వేచిచూసే ధోరణిని కనబరుస్తున్నాయని తాజా సర్వే వెల్లడించింది. జులై-సెప్టెంబర్ క్వార్టర్లో నికర ఉపాథి రేటు సర్వే చేపట్టిన 15 ఏళ్ల కనిష్ట స్ధాయిలో 5 శాతంగా ఉందని మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ సర్వే వెల్లడించింది. సానుకూల హైరింగ్ ట్రెండ్‌ను కనబరిచిన 44 దేశాల్లో భారత్ టాప్ 4 స్ధానంలో ఉండటం మాత్రం ఊరట కలిగిస్తోంది. జపాన్, చైనా, తైవాన్లు వరుసగా 11 శాతం, మూడు శాతం, మూడు శాతం సానుకూల హైరింగ్ ధోరణులతో తొలి మూడుస్ధానాల్లో నిలిచాయి. ఆర్థిక మందగమనం, మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కార్పొరేట్ ఇండియా ఉద్యోగుల నియామకాల్లో హేతుబద్ధంగా వ్యవహరిస్తోందని, లాక్డౌన్ పూర్తిగా తొలగిన అనంతరం డిమాండ్ పెరిగే క్రమంలో నియామకాలు ఊపందుకునేలా వేచిచూసే ధోరణిని ప్రదర్శిస్తోందని మ్యాన్‌పవర్‌గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటీ చెప్పుకొచ్చారు. భారత్‌లో ఆశావహ దృక్పథం నెలకొందని, ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్ పలు రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి సానుకూల పరిణామాల నేపథ్యంలో ఉద్యోగార్థుల ఆశలు నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మైనింగ్, నిర్మాణ, బీమా, రియల్ ఎస్టేట్ రంగాల్లో జాబ్ మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని చెప్పారు. మధ్యతరహా సంస్ధల్లో హైరింగ్ అధికంగా ఉంటుందని ఆ తర్వాత భారీ, చిన్నతరహా సంస్ధలు నియామకాలకు మొగ్గుచూపుతాయని అంచనా వేశారు. లాక్డౌన్ సమయంలో సాంకేతికత నూతన ఒరవడికి దారితీసిందని అన్నారు. చదవండి : 10వేల ఉద్యోగాలిస్తాం: జొమాటో సీఈవో -
ఉద్యోగాలు రావడం ఇక చాలాకష్టం!
ముంబై : ఉద్యోగవకాశాలు ఎదురుచూస్తున్న వారికి బ్యాడ్ న్యూస్. గతేడాదితో పోలిస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఉద్యోగవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కంపెనీల్లో ఆటోమేషన్ టెక్నాలజీ పెరగడం, అంతర్జాతీయంగా వ్యాపారాల్లో అనిశ్చితి పరిస్థితులు నెలకొనడం, అవసరమైన నైపుణ్యాలకు తగిన ప్రతిభావంతులు దొరకకపోవడం ఈ త్రైమాసికంలో ఉద్యోగాలకు భారీగా గండికొడుతుందని వెల్లడవుతోంది. 4,389 మంది ఉద్యోగులపై నిర్వహించిన మ్యాన్‌పవర్‌గ్రూప్ ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ సర్వే క్యూ2 2017లో కేవలం 19 శాతం మంది ఉద్యోగులు మాత్రమే తమ స్టాఫ్ ను పెంచాలని యోచిస్తున్నట్టు చెప్పారు. 1 శాతం ఉద్యోగులు తమ స్టాఫ్ తగ్గించుకోనున్నట్టు తెలిపారు. ఈ సర్వేలో గరిష్టంగా 68 శాతం మంది అసలు తమ ఎంప్లాయ్ మెంట్ లో ఎలాంటి మార్పులు చేయబోమని వెల్లడించారు. దీంతో నికరంగా ఈ త్రైమాసికంలో ఎంప్లాయ్ మెంట్ అవుట్ లుక్ +18శాతంగానే ఉండబోతుందని ఈ సర్వే తెలిపింది. 2017 జనవరి-మార్చి క్వార్టర్లో ఈ నికర ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ +21 శాతంగా, 2016 ఏప్రిల్-జూన్ లో+38 శాతంగా ఉంది. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్న కొత్త ఉద్యోగులను నియమించుకునే ప్రక్రియ మున్ముందు సన్నగిల్లుతుందని మ్యాన్‌పవర్‌గ్రూప్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఏజీ రావ్ కూడా తెలిపారు. అయితే ఏడు ఇండస్ట్రి సెక్టార్లలో వర్క్ ఫోర్స్ పెరుగుతుందని భావిస్తున్నామని తాజా సర్వే పేర్కొంది. ఎక్కువగా సర్వీసు సెక్టార్లో ఉద్యోగవకాశాలు పెరుగుతాయని చెప్పారు. తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ సెక్టార్, రిటైల్ ట్రేడ్ సెక్టార్లలో ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ బాగుంటుందని సర్వే రిపోర్టు వెల్లడించింది. ట్రాన్స్‌పోర్టేషన్, యుటిలిటీస్ సెక్టార్ భారీగా పడిపోతుందని తెలిపింది.