హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జనవరి–మార్చిలో భారతీయ కంపెనీలు ఆచితూచి నియామకాలు చేపట్టే అవకాశం ఉందని మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ సర్వే వెల్లడించింది. 3,030 ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ఈ సర్వేలో పాలుపంచుకున్నాయి. ‘మాంద్యం అంచనాలు, ప్రపంచ మందగమనం ఇందుకు కారణం. ఉద్యోగుల సంఖ్య పెరగవచ్చని 48 శాతం కంపెనీలు తెలిపాయి. తగ్గవచ్చని 16 శాతం, మార్పు ఉండకపోవచ్చని 34 శాతం సంస్థలు అభిప్రాయపడ్డాయి.
ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో నియామకాలు అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే 17 శాతం, 2022 తొలి క్వార్టర్‌తో చూస్తే 22 శాతం తగ్గవచ్చు. ఐటీ, ఫైనాన్స్, రియల్టీ, కంజ్యూమర్ గూడ్స్, సర్వీసెస్ విభాగాల్లో డిమాండ్ ఉంటుంది. నిపుణుల కొరత నియామకాలకు అడ్డంకిగా పరిణమించింది. కార్పొరేట్ కంపెనీలు, విద్యా సంస్థలు సంయుక్త ప్రయత్నాల ద్వారా దీనిని పరిష్కరించే వరకు ఉపాధి రేటులో వృద్ధి సింగిల్ డిజిట్‌లో ఉంటుంది’ అని నివేదిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment