manvinder singh
-
రాజ్‌పుత్ వర్సెస్ రాజ్‌పుత్
జైపూర్ : రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై పోటీ చేసేందుకు తాను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నానని కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కొడుకు, శివ్ ఎమ్మెల్యే మాన్వేంద్ర సింగ్ పేర్కొన్నారు. రాజ్‌పుత్ నాయకుడిని అవమానించినందుకు బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. బీజేపీ టికెట్‌పై గెలుపొందిన మన్వేందర్ సింగ్ ఇటీవలే ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం విడుదల చేసిన తొలి జాబితాలో ఆయనకు చోటు కల్పించిన కాంగ్రెస్ అధిష్టానం.. సీఎం వసుంధర రాజే ప్రాతినిథ్యం వహిస్తున్న ఝలరాపటాన్ నుంచి మన్వేంద్ర పోటీ చేస్తారని పేర్కొంది. ఇది వ్యక్తుల మధ్య పోటీ కాదు.. బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన మన్వేందర్ సింగ్‌కు ఏ సీటు కేటాయించాలో అర్థం కాకే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చోట ఆయనను నిలబెట్టారని వసుంధర రాజే అన్నారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదని, రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న ఘర్షణ అని ఆమె వ్యాఖ్యానించారు. 2003 నుంచి మూడు పర్యాయాలు అక్కడి నుంచి గెలిచిన విషయాన్ని మరోమారు గుర్తుచేశారు. కాగా వసుంధర రాజే నాయకత్వంపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన్వేంద్ర సింగ్‌ను ఆమెపై పోటీకి దించడం ద్వారా సీఎంను చాలా తేలికగా తీసుకుంటున్నామని కాంగ్రెస్ సంకేతాలు జారీ చేస్తోంది. అంతేకాకుండా ఈ టికెట్‌ను రాజ్‌పుత్‌కే కేటాయించడం ద్వారా గట్టి పోటీ ఇవ్వొచ్చనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
రాజస్తాన్‌లో బీజేపీని వీడిన ఎమ్మెల్యే
బాడ్మెర్/జైపూర్: మరో 2–3 నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో ఓ ఎమ్మెల్యే అధికార బీజేపీ నుంచి బయటకు వచ్చారు. కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కొడుకు, శివ్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్న మాన్వేంద్ర సింగ్ తాను బీజేపీని వీడుతున్నట్లు శనివారం ప్రకటించారు. కాంగ్రెస్‌లో చేరే ఆలోచన ప్రస్తుతానికైతే లేదనీ, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బాడ్మెర్–జైసల్మేర్ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని మాన్వేంద్ర చెప్పారు. ఇన్నాళ్లూ బీజేపీలో కొనసాగి తాను పెద్ద తప్పు చేశానని అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ జశ్వంత్ సింగ్‌కు ఎంపీ టికెట్ నిరాకరించడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. -
కమలంతో జశ్వంత్ సింగ్ అమీతుమీ
-
కమలంతో జశ్వంత్ సింగ్ అమీతుమీ
జోధ్‌పూర్: బీజేపీ సీనియర్ నాయకుడు జశ్వంత్ సింగ్ అధిష్టానంతో అమీతుమీకి సిద్ధమయ్యారు. తన సొంత నియోజకవర్గం బార్మర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంపై బహిరంగంగా తన అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బార్మర్ బరిలో నిలిచేందుకే మొగ్గుచూపారు. తానిచ్చిన 48 గంటల గడువుకు బీజేపీ అధిష్టానం స్పందించకపోవడంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తనకు తానుగా బీజేపీని వదిలిపెట్టడం లేదని జశ్వంత్ సింగ్ తెలిపారు. తన మద్దతుదారులు చెప్పినట్టే నడుచుకుంటున్నానని వెల్లడించారు. కాగా, జశ్వంత్ సింగ్ కుమారుడు, రాజస్థాన్ ఎమ్మెల్యే మన్వీంద్ర సింగ్.. తన తండ్రి అడుగుజాడల్లోనే నడిచే అవకాశముందని సంకేతాలిచ్చారు. జశ్వంత్‌కు టికెట్ ఇవ్వకపోవడానికి నిరసనగా పలువురు బీజేపీ జిల్లా కమిటీ సభ్యులు ఆదివారం పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చారు. సమావేశం నిర్వహించి.. జశ్వంత్‌కు బార్మర్ టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.