Margadarsi Finance session pvt
-
మరో అత్యాచారం, హత్య జరిగేదాకా వేచి చూడలేం... కోల్‌కతా వైద్యురాలి హత్య ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం! ఇంకా ఇతర అప్డేట్స్..
-
‘మార్గదర్శి’ ఎగవేతదారుల వివరాలు తెలుసుకోండి: తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్, సాక్షి: సుప్రీం కోర్టు ఆదేశాలతో మార్గదర్శి కేసు విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శి ఎగవేతదారుల వివరాలు తెలుసుకోవాలని, ఇందుకోసం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ దినపత్రికల్లో నోటీసులు ఇచ్చి విస్తృత ప్రచారం కల్పించాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. మార్గదర్శి కేసును ఇవాళ తెలంగాణ హైకోర్టులో డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. జస్టిస్ సుజోయపాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం వాదనలు వింది. ఉండవల్లి అరుణ్‌కుమార్, మార్గదర్శి న్యాయవాది సిద్దార్థ లూద్రా అన్లైన్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆర్బీఐ దాఖలు చేసిన కౌంటర్‌పై స్పందన తెలిపేందుకు రెండు వారాలు సమయం కావాలని కోరారు మార్గదర్శి లాయర్ లూద్రా. అయితే..ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్) ప్రకారం మార్గదర్శి చందాలు వసూలు చేయడం చట్టవిరుద్ధమని ఆర్బీఐ కౌంటర్లో తేల్చిందన్న విషయాన్ని ఉండవల్లి బెంచ్ ముందు ప్రస్తావించారు. దీనిపై పూర్తి విచారణ జరపాలని, బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని చెప్పిందని గుర్తు చేశారు. అలాగే.. మొత్తం 70,000 చందాదారుల వివరాలు సుప్రీంకోర్టుకు మార్గదర్శి సమర్పించిందని, ఆ వివరాలను హైకోర్టుకు పెన్‌డ్రైవ్‌లో ఇచ్చేలా ఆ సంస్థను ఆదేశించాలని ఉండవల్లి కోరారు. అయితే.. ఆ వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని ఉండవల్లికి హైకోర్టు సూచించింది. ఎగవేత దారుల వివరాలు తెలుసుకునేందుకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మరోవైపు.. రెండు వారాల్లో కౌంటర్లు వేయాలని ఏపీ, తెలంగాణ సర్కారుకు ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. -
అక్రమ డిపాజిట్ల కేసు.. ‘మార్గదర్శి‘కి ‘ఆర్బీఐ’ షాక్
సాక్షి,హైదరాబాద్: రామోజీరావు కుటుంబానికి చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్కు తెలంగాణ హైకోర్టులో ఎదరుదెబ్బ తగిలింది. డిపాజిట్ల సేకరణ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) యాక్ట్ తమకు వర్తించదని మార్గదర్శి వేసిన క్వాష్ పిటిషన్ ప్రస్తతం తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉంది. అయితే..తమపై అక్రమ డిపాజిట్ల సేకరణ కేసును కొట్టివేయాలంటూ మార్గదర్శి వేసిన క్వాష్ పిటిషన్‌కు ఆర్బీఐ తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిపాజిట్లు సేకరించడంపై విచారణ కొనసాగించాల్సిందేనని అఫిడవిట్లో ఆర్బీఐ స్పష్టం చేసింది. మార్గదర్శికి ఆర్బీఐ యాక్ట్‌లోని సెక్షన్-45 వర్తిస్తుందని రిజర్వ్ బ్యాంకు తన కౌంటర్లో హైకోర్టుకు తెలిపింది. హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ(హెచ్‌యూఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించడం చట్టవ్యతిరేకమని ఆర్బీఐ కుండబద్దలు కొట్టింది. మార్గదర్శి వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును ఆర్బీఐ కోరింది. అక్రమంగా డిపాజిట్లు సేకరణ విషయంలో నేరం రుజువైతే మార్గదర్శి డైరెక్టర్లకు 2 నుంచి 5 ఏళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉంది. అక్రమ డిపాజిట్ల సేకరణకు సంబంధించి మార్గదర్శిపై 2008లో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వేసిన కేసు ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉంది. ఆర్బీఐ యాక్ట్‌కు విరుద్ధంగా మార్గదర్శి వేల మంది నుంచి సంవత్సరాల తరబడి అక్రమ డిపాజిట్లు సేకరిస్తోందని, దానిపై చర్యలు తీసుకోవాలనేది ఉండవల్లి కేసు సారాంశం. -
ఏపీ వ్యాప్తంగా చిట్‌ఫండ్, ఫైనాన్స్ కంపెనీల్లో సోదాలు
-
‘మార్గదర్శి’పై ‘స్టే’ పొడిగించాలని అభ్యర్థన
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఈనాడు’ గ్రూపు ఛైర్మన్ రామో జీరావుకు చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ తమ డిపాజిట్ల వ్యవహారంపై విచారణ కొనసా గించరాదని కోరింది. దీనికి సంబంధించి హైదరా బాద్ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజి స్ట్రేట్, సిటీ క్రిమినల్ కోర్టులో నమోదైన క్రిమినల్ కేసు విచారణపై ‘స్టే’ కొనసాగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును శుక్రవారం విచారించింది. ఈ కేసులో ప్రతి వాదిగా ఉన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తరపున న్యాయవాది అల్లంకి రమేష్ వాద నలు వినిపిస్తూ ఇదే తరహా దరఖాస్తును మార్గదర్శి కింది కోర్టులో కూడా సమర్పించిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న తెలం గాణ ప్రభుత్వం, ఉండవలికి నోటీ æసులు జారీ చేసిన సుప్రీం ధర్మాసనం మార్గదర్శి అభ్యర్థనపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిం చింది. ఇదీ నేపథ్యం...: అవిభక్త హిందూ కుటుంబ సంస్థ అయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ రిజర్వ్ బ్యాం క్ ఆఫ్ ఇండియా చట్టం–1934లోని సెక్షన్ 45(ఎస్) నిబంధనను ఉల్లంఘించి దాదాపు రూ.2300 కోట్ల డిపాజిట్లను సేకరించిందన్న అభి యోగంపై చర్యలు తీసుకునేందుకు ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2006 డిసెంబరు 19న జీవో నంబరు 800, జీవో నంబరు 801 జారీ చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ తాను సేకరించిన డిపాజిట్ల మొత్తంలో సగం విలువ మేరకు నష్టాలను కలిగి ఉందని వచ్చిన వార్తల నేపథ్యంలో డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా జీవో నంబరు 800 ద్వారా అప్పటి ఆర్థిక శాఖ సలహాదారు ఎన్.రంగాచారిని డిపాజిట్ల వ్యవహారం పరిశీలన కోసం నియ మిం చింది. రంగాచారి ఇచ్చిన నివేదిక ఆధారంగా అధీకృత అధికారి కృష్ణరాజు 23 జనవరి 2008న ఫస్ట్ అడిషనల్ చీఫ్ మెట్రొపాలిటన్ మెజి స్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కంప్లయింట్(సీసీ) నంబరు 540 దాఖలు చేశారు. ఉత్తర్వులను పక్కన పెట్టాలని, ప్రొసీడిం గ్స్‌ను పూర్తిగా కొట్టివే యాలని 2011లో మార్గదర్శి హైకోర్టును ఆశ్రయిం చింది. 2011 జూలై 20న మరో క్రిమినల్ పిటిషన్లో హై కోర్టు ఏకసభ్య ధర్మాసనం మధ్యంతర స్టే ఇచ్చింది. ఇటీవల ఏషియన్ రీ సర్ఫేసింగ్ ఆఫ్ రోడ్ ఏజెన్సీ ప్రయివేటు లిమిటెడ్ వర్సెస్ సీబీఐ కేసులో 2018 మార్చి 28న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సివిల్, క్రిమినల్ కేసుల స్టే ఉత్తర్వులు ఆ రోజు నుంచి ఆరు నెలల తరువాత రద్దవుతాయని పేర్కొంది. దీని ప్రకారం మార్గదర్శి కేసులోనూ స్టే ఉత్తర్వుకు కాలం చెల్లింది. -
31 ఫైనాన్స్ కంపెనీలపై కొరడా
-
31 ఫైనాన్స్ కంపెనీలపై కొరడా
-
29 ఫైనాన్స్ కంపెనీలపై కొరడా
హైదరాబాద్: తెలంగాణలో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలపై ఆర్ బీఐ కొరడా ఝుళిపించింది. 29 సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ కంపెనీలతో ఇటువంటి లావాదేవీలు జరపొద్దని హెచ్చరించింది. నిషేధించిన ఫైనాన్స్ కంపెనీల్లో 'ఈనాడు' సంస్థకు చెందిన మార్గదర్శి ఫైనాన్స్ సెషన్ ప్రైవేటు లిమిటెడ్, మార్గదర్శి ఇన్వెస్ట్ మెంట్ అండ్ లీజింగ్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ కూడా ఉన్నాయి. ఆర్ బీఐ నిషేధించిన సంస్థలు 1. మార్గదర్శి ఫైనాన్స్ సెషన్ ప్రైవేటు లిమిటెడ్, సోమాజిగూడ, హైదరాబాద్ 2. మార్గదర్శి ఇన్వెస్ట్ మెంట్ అండ్ లీజింగ్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్, సోమాజిగూడ, హైదరాబాద్ 3. యుక్త ఫైనాన్స్ ప్రైవేటు లిమిటెడ్, పద్మరావునగర్, సికింద్రాబాద్ 4. ఎమర్జీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్, హకీంపేట, సికింద్రాబాద్ 5. శ్రీ హైర్ పర్చేజ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్, సీతాఫల్ మండి, సికింద్రబాద్ 6. శ్రీ సిరి ఆటో ఫైనాన్షియర్స్ ప్రైవేటు లిమిటెడ్, కొత్తగూడం, ఖమ్మం జిల్లా 7. శ్రీ విష్ణు ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ ప్రైవేటు లిమిటెడ్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 8. హెచ్ సీజీ ఇన్వెస్ట్ మెంట్స్ అండ్ ఇంప్లెక్స్ లిమిలిటెడ్, జీడిమెట్ల, హైదరాబాద్ 9. అవ్యా ఫైనాన్స్ లిమిటెడ్, కార్ఖానా, సికింద్రాబాద్ 10. డీఎస్ఎల్ ఫైనాన్స్ ప్రైవేటు లిమిటెడ్, సోమాజిగూడ, హైదరాబాద్ 11. బీఎన్ఆర్ ఉద్యోగ్ లిమిటెడ్, సోమాజిగూడ, హైదరాబాద్ 12. నానో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, సోమాజిగూడ, హైదరాబాద్ 13. బాంబినో ఫైనాన్స్ ప్రైవేటు లిమిటెడ్, సరూర్ నగర్, హైదరాబాద్ 14. జీఎన్ వాసవి ఫైనాన్స్ లిమిటెట్, పంజాగుట్ట, హైదరాబాద్ 15. శుభం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెట్, బౌద్ధనగర్, సికింద్రాబాద్ 16. చెన్నై ఫైనాన్స్ కో లిమిటెడ్, ఆదర్శ నగర్, హైదరాబాద్ 17. ఆర్ ఆర్ ఫైనాన్స్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, అమీర్ పేట, హైదరాబాద్ 18. మహాలక్ష్మి ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్, రామకోటి, హైదరాబాద్ 19. మారుతి సెక్యురిటీస్ లిమిటెడ్, మనోవికాస్ నగర్, సికింద్రాబాద్ 20. ప్రొద్దుటూరు ఇన్వెస్ట్ మెంట్స్ లిమిటెడ్, తాడ్ బంద్, సికింద్రాబాద్ 21. మాగ్నిల్ ఫైనాన్స్ అండ్ హైర్ పర్చేజ్ ప్రైవేటు లిమిటెడ్, నల్లకుంట, హైదరాబాద్ 22. సూర్యలక్ష్మి సెక్యురిటీస్ లిమిటెడ్, దోమలగూడ, హైదరాబాద్ 23. భవ్య కేపిటల్ సర్వీసెస్ లిమిటెడ్, నారాయణగూడ, హైదరాబాద్ 24. సీగల్ లీఫిన్ లిమిటెడ్, కేపీహెచ్ పీ, హైదరాబాద్ 25. శ్రీమాన్ సాయి సెక్యురిటీస్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ ఫైనాన్స్ లిమిటెడ్, జగిత్యాల, కరీంనగర్ 26. సెహగల్ లీజింగ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ లిమిటెడ్, రాజభవన్ రోడ్, హైదరాబాద్ 27. విక్రాంత్ ఇన్వెస్ట్ మెంట్స్ అండ్ ఇంపెక్స్ లిమిటెడ్, బాలానగర్, హైదరాబాద్ 28. సైక్లో ఇన్వెస్ట్ మెంట్ ప్రైవేటు లిమిటెడ్, అమీర పేట, హైదరాబాద్ 29. నరియన్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ లిమిటెడ్, నారాయణగూడ, హైదరాబాద్