సాక్షి, న్యూఢిల్లీ: ‘ఈనాడు’ గ్రూపు ఛైర్మన్ రామో జీరావుకు చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ తమ డిపాజిట్ల వ్యవహారంపై విచారణ కొనసా గించరాదని కోరింది. దీనికి సంబంధించి హైదరా బాద్ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజి స్ట్రేట్, సిటీ క్రిమినల్ కోర్టులో నమోదైన క్రిమినల్ కేసు విచారణపై ‘స్టే’ కొనసాగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును శుక్రవారం విచారించింది.
ఈ కేసులో ప్రతి వాదిగా ఉన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తరపున న్యాయవాది అల్లంకి రమేష్ వాద నలు వినిపిస్తూ ఇదే తరహా దరఖాస్తును మార్గదర్శి కింది కోర్టులో కూడా సమర్పించిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న తెలం గాణ ప్రభుత్వం, ఉండవలికి నోటీ æసులు జారీ చేసిన సుప్రీం ధర్మాసనం మార్గదర్శి అభ్యర్థనపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిం చింది.
ఇదీ నేపథ్యం...: అవిభక్త హిందూ కుటుంబ సంస్థ అయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ రిజర్వ్ బ్యాం క్ ఆఫ్ ఇండియా చట్టం–1934లోని సెక్షన్ 45(ఎస్) నిబంధనను ఉల్లంఘించి దాదాపు రూ.2300 కోట్ల డిపాజిట్లను సేకరించిందన్న అభి యోగంపై చర్యలు తీసుకునేందుకు ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2006 డిసెంబరు 19న జీవో నంబరు 800, జీవో నంబరు 801 జారీ చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ తాను సేకరించిన డిపాజిట్ల మొత్తంలో సగం విలువ మేరకు నష్టాలను కలిగి ఉందని వచ్చిన వార్తల నేపథ్యంలో డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా జీవో నంబరు 800 ద్వారా అప్పటి ఆర్థిక శాఖ సలహాదారు ఎన్.రంగాచారిని డిపాజిట్ల వ్యవహారం పరిశీలన కోసం నియ మిం చింది.
రంగాచారి ఇచ్చిన నివేదిక ఆధారంగా అధీకృత అధికారి కృష్ణరాజు 23 జనవరి 2008న ఫస్ట్ అడిషనల్ చీఫ్ మెట్రొపాలిటన్ మెజి స్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కంప్లయింట్(సీసీ) నంబరు 540 దాఖలు చేశారు. ఉత్తర్వులను పక్కన పెట్టాలని, ప్రొసీడిం గ్స్‌ను పూర్తిగా కొట్టివే యాలని 2011లో మార్గదర్శి హైకోర్టును ఆశ్రయిం చింది. 2011 జూలై 20న మరో క్రిమినల్ పిటిషన్‌లో హై కోర్టు ఏకసభ్య ధర్మాసనం మధ్యంతర స్టే ఇచ్చింది.
ఇటీవల ఏషియన్ రీ సర్ఫేసింగ్ ఆఫ్ రోడ్ ఏజెన్సీ ప్రయివేటు లిమిటెడ్ వర్సెస్ సీబీఐ కేసులో 2018 మార్చి 28న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సివిల్, క్రిమినల్ కేసుల స్టే ఉత్తర్వులు ఆ రోజు నుంచి ఆరు నెలల తరువాత రద్దవుతాయని పేర్కొంది. దీని ప్రకారం మార్గదర్శి కేసులోనూ స్టే ఉత్తర్వుకు కాలం చెల్లింది.
Comments
Please login to add a commentAdd a comment