marriage vehicle
-
రెచ్చిపోయిన హిజ్రాలు, బాలుడిపైనా ప్రతాపం
బత్తలపల్లి/అనంతపురం: హిజ్రాలు రెచ్చిపోయారు. ప్రధాన రహదారిపై భిక్షమెత్తుకుంటూ తాము అడిగిన మేరకు డబ్బు ఇవ్వని ప్రయాణికులపై దాడికి తెగబడ్డారు. ఫలితంగా పలువురు రక్తగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు... మంగళవారం సాయంత్రం బత్తలపల్లి మండలం పోట్లమర్రి సమీపంలో కొందరు హిజ్రాలు వాహనాలను ఆపి బలవంతంగా డబ్బు వసూలు చేయసాగారు. అదే సమయంలో నార్పల మండలం బొందలవాడ నుంచి పెళ్లి బృందంతో బొలెరో వాహనం వచ్చింది. దాన్ని ఆపి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. ఇచ్చిన మేరకు తీసుకునేందుకు హిజ్రాలు ససేమిరా అన్నారు. అంతటితో ఆగకుండా రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఘటనలో పెళ్లి బృందంలోని బయన్న, ఈశ్వరమ్మ, ఆంజనేయులు, రామాంజినమ్మ, ఆదెమ్మ, సింహాద్రి, శివయ్య, బాలుడు చిన్న గాయపడ్డారు. అతి కష్టంపై బయటపడిన పెళ్లి బృందం.. బత్తలపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. తర్వాత గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. హిజ్రాల దాడిలో గాయపడిన చిన్నా ఇంతలో పోట్లమర్రికి చేరుకున్న హిజ్రాలు వివస్త్రలుగా మారి రోడ్డుపై పడుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని పంపించి వేశారు. అనంతరం బత్తలపల్లికి చేరుకున్న హిజ్రాలు మద్యం మత్తులో వివస్త్రలుగా మారి కూడలిలో నిలబడి అసభ్యపదజాలంతో దూషణలు మొదలుపెట్టారు. దీంతో పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాశి, లావణ్య, మురళి, దుర్గ, శ్యామలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వధువు సహా 22మందికి గాయాలు
అశ్వారావుపేటరూరల్ : పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన సోమవారం రాత్రి అశ్వారావుపేట మండలంలోని సున్నంబట్టి–పాకలగూడెం వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పెళ్లి కుమార్తెతో సహా 22 మందికి గాయాలు కాగా, మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం చుక్కలొద్ది గ్రామానికి చెందిన మడకం లక్మా(పెళ్లి కుమార్తె)కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం రాచన్నగూడేనికి చెందిన వరుడితో పెళ్లి నిశ్చయం కాగా, సోమవారం రాత్రి వరుడి ఇంట్లో జరిగే వివాహం కోసం పెళ్లి కుమార్తెను తీసుకొని రెండు ట్రాక్టర్లలో బయల్దేరారు. అశ్వారావుపేట మండలంలోని సున్నంబట్టి–పాకలగూడెం రోడ్డులోగల ఓ మూలమలుపు వద్ద ఒక ట్రాక్టర్ ట్రక్కు చింతకాయ జారిపోయి అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఈ ట్రాక్టర్లో ఉన్న పెళ్లి కుమార్తెతోపాటు కోవ్వాసి బీబమ్మ, వెట్టి మంగమ్మ, సోడెం భద్రం, మడకం ముత్తమ్మ, మడకం లక్ష్మీలకు తీవ్ర గాయాలు కాగా వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే ట్రాక్టర్ ట్రక్కులో ఉన్న మడివి పండు, మడకం మాడ, ఎం.ఊంగీ, ఎం.లక్ష్మి, ముచ్చిక దేవ, మడకం లక్ష్మీతోపాటు మరో పదిమందికి గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న 108 వాహనం సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి విషమంగా ఉన్న వారిని స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మిగిలిన వారిని మరో ట్రాక్టర్ ద్వారా స్థానిక ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స నిర్వహించారు. ఆస్పత్రి ఆవరణంతా క్షతగాత్రుల రోదనలతో హోరెత్తింది. దీనిపై స్థానిక పోలీసులు వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా..ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. -
క్రూజర్‌ను వెనుకనుంచి ఢీకొట్టిన లారీ
మూడు రోజులకే మూగబోయిన పెళ్లి ఇల్లుకుమారుడి పెళ్లి జరిగిందనే సంతోషం ఆ తల్లిదండ్రులకు ఎంతోకాలం నిలవలేదు. బంధువులతో కళకళలాడిన ఇల్లు పెళ్లి కుమారుడి తల్లిదండ్రుల దుర్మరణంతో ఒక్కసారిగా మూగబోయింది. కొడుకు, కోడలిని తమ ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన వారు కానరానిలోకానికి వెళ్లారు. రోడ్డు ప్రమాదం పెళ్లింట విషాదాన్ని నింపింది. నాగార్జున సాగర్ – హైదరాబాద్ రహదారిపై క్రూజర్ వాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో భార్యాభర్తలు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రగాయాల పాలయ్యారు. యాచారం/ మాడ్గుల: యాచారం సీఐ చంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గుల మండలం కొల్కులపల్లి గ్రామానికి చెందిన రెడ్డెమోని యాదయ్య (45), జంగమ్మ(40) దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండవ కుమారుడు శ్రీను(25)కు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మ న్నెగూడకు చెందిన అనిత అనే అమ్మాయితో ఈ నెల 25న మాల్ సమీపంలో నిరూచిమండ్ హో టల్లో వివాహం జరిగింది. పెళ్లికొడుకు, కూతురును తీసుకెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం జంగమ్మ, యాదయ్య దంపతులు క్రూయిజర్‌లో 12 మంది బంధువులతో కలిసి కొల్కులపల్లి గ్రామం నుంచి మాన్నెగూడకు బయల్దేరారు. మార్గమధ్యలో సాగర్‌రోడ్డుపై తమ్మలోనిగూడ గేటు సమీపంలో తక్కళ్లపల్లి నుంచి మాల్ వైపే వేగంగా వస్తున్న లారీ క్రూజర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో క్రూయిజర్ వెనుక సీట్లో కూర్చున్న రెడ్డమోని జంగమ్మకు బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. జంగమ్మ భర్త యాదయ్య, వీరి కొడలైన జ్యోతి, బంధువులైన రాధిక, అరవింద్‌లకు తీవ్రగాయాలు కావడంతో 108లో నగరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా యాదయ్య మార్గమధ్యలోనే మృతి చెందాడు. జ్యోతి, రాధిక, అరవింద్‌లతో పాటు స్వల్ప గాయాలైన మరో ఇద్దరిని నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స జరిపిస్తున్నారు. మరికొద్ది సేపట్లో గమ్యానికి చేరుకోవచ్చనే సమయంలో మృత్యువు రూపంలో దూసుకొచ్చిన లారీ పెళ్లింట్లో తీవ్ర దు:ఖాన్ని నింపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. క్రూయిజర్, లారీ డ్రైవర్ల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. రోదనలతో దద్దరిల్లిన సాగర్‌రోడ్డు సాగర్‌రోడ్డుపై క్రూయిజర్, లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారనే సమాచారంతో కొల్కుపల్లి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో బంధువులు తరలివచ్చారు. మృతదేహాలను చూసి వందలాది మంది బంధువుల రోదనతో సాగర్‌రోడ్డు దద్దరిల్లింది. ప్రమాదం జరిగిన సమయంలో తమ్మలోనిగూడ గ్రామా నికి చెందిన యువకులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించడంతో పాటు గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించేలా కృషి చేశారు. -
ఘోర ప్రమాదం : పెళ్లింట విషాదం
బంధువులకు, స్నేహితులకు పెళ్లి పత్రికలు పంచి తిరుగుప్రయాణమైన వారిపై మృత్యువు పంజా విసిరింది. కొన్ని గంటల్లో ఇళ్లు చేరాల్సిన ఐదుగురి జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. సూళగిరి సమీపంలో జాతీయరహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. సాక్షి, చెన్నై(టీనగర్) : బంధువులకు, స్నేహితులకు పెళ్లి పత్రికలు పంచి తిరుగుప్రయాణమైన వారిపై మృత్యువు పంజా విసిరింది. కొన్ని గంటల్లో ఇళ్లు చేరాల్సిన ఆ ఐదుగురి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. సూళగిరి సమీపంలో జాతీయరహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన శంకర్ (50) బెంగళూరులోని లక్ష్మీనారాయణపుర ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇతని ఇంట్లో త్వరలో వివాహం జరగనుంది. బంధువులైన సుమతి(32), కుబేరన్(51), సుమతి(45),మణి(45), ఆనంద్‌లతో కలిసి చెన్నై, తిరుపత్తూరు తదితర ప్రాంతాలలోని బంధువులకు శుభలేఖలు పంచి సోమవారం రాత్రి కారులో బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. సూళగిరి సమీపంలోని అడ్డగురికి వద్ద బెంగళూరు నుంచి పాండిచ్చేరికి వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ డీలక్స్ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అవతలివైపు రోడ్డులోకి దూసుకెళ్లి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. అదే సమయంలో కారు వెనుక వస్తున్న ట్రక్అదే కారుపై దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జుకాగా శంకర్, సుమతి, కుబేరన్, సుమతి, మణి మృత్యువాత పడ్డారు. వారి మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కారులోని ఆనంద్‌కు, కేఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ చిక్కణ్ణయ్య(50), కల్లకురిచ్చి జిల్లా, వేప్పేరికి చెందిన ట్రక్ డ్రైవర్ శివ గాయపడ్డారు. స్థానికులు స్పందించి ఆనంద్‌ను బెంగళూరుకు, మిగతా ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సూళగిరి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను శవపరీక్ష కోసంహోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ కదిరవన్, çహోసూరు సబ్‌కలెక్టర్ చంద్రకళ, సూళగిరి తహసీల్దార్ పెరుమాళ్ మంగళవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికుల ఆగ్రహం ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ సూళగిరి నుంచి పేరండపల్లి వరకు జాతీయ రహదారి పక్కన సర్వీసు రోడ్డు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, యూటర్న్లు, సొరంగమార్గాలు కూడా లేవని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత రెండేళ్లలో జాతీయ రహదారి సూళగిరి ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలకు ఇప్పటివరకు సుమారు 50 మంది మృతి చెందారని, రహదార్ల శాఖాధికార్లు పరిశీలనలు చేపట్టి సొరంగమార్గాలు, యూ–టర్న్‌లు, ఫైఓవర్లు నిర్మిస్తామని ఉత్తుత్తి హామీలు ఇచ్చారని మండిపడ్డారు. -
మడగాస్కర్‌లో ప్రమాదం... 47 మంది మృతి
అంటనానారివో: మడగాస్కర్‌లో ఆదివారం ఓ పెళ్లి వాహనం ప్రమాదవశాత్తూ నదిలో పడింది. ఈ ప్రమాదంలో నూతన వధూవరులు, 10 మంది చిన్నారులు సహా 47 మంది మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. రాజధానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ జోజొరోబ్ పట్టణంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు చెప్పారు. పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.