రైలు కింద పడి వృద్ధురాలు మృతి
గార్లదిన్నె : మర్తాడుకు చెందిన సుభద్రమ్మ (70) బుధవారం రైలు కింద పడి మృతి చెందిన సంఘటన గార్లదిన్నెలో జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన మేరకు... సుభద్రమ్మకు కొంత కాలంగా మతిస్థిమితం సరిగాలేదు. ధర్మవరంలో కొడుకు వద్ద ఉంటోంది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మంగళవారం ధర్మవరం నుంచి మర్తాడుకు బయల్దేరింది.
అలా వెళ్లిన ఆమె బుధవారం గార్లదిన్నెలో రైలు కింద పడి మృతి చెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీస్ జమేదార్లు ఎస్.వేణుగోపాల్, ఎన్.వేణుగోపాల్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.