maskat
-
మస్కట్‌లో సంక్రాంతి సంబరాలు
ఒమన్ దేశ రాజధాని మస్కట్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఒమన్‌లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు, వీరి కోసం వచ్చిన తెలుగు ప్రముఖుల మధ్య రెండు రోజుల పాటు శోభాయమానంగా వేడుకలు నిర్వహించారు. 'రాయల్ కింగ్ హోల్డింగ్'తోపాటు 'చిరు మెగా యూత్ ఫోర్స్' సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ అలరించాయి. ఇటీవల సినీరంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రముఖులు.. డా. మాగంటి మురళీ మోహన్ గారిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఒమన్ దేశ చిహ్నం అయిన కంజరి నడుముకు తొడిగి స్వర్ణ కంకణంతో గౌరవించడం ఈ వేడుకలో ప్రధానఘట్టంగా నిలిచింది. టాలీవుడ్ నిర్మాత, సినీ పంపిణీదారు వ్యాపారవేత్త బుర్ర ప్రశాంత్ గౌడ్‌తోపాటు సీపీవైఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షలు రామదాస్ చందక ఈ వేడుకలు నిర్వహించారు. డా. మురళీమోహన్‌తో పాటు టాలీవుడ్ నటీమణులు.. రజిత, మధుమని, పింకీ, సోనియా చౌదరి, టివి నటి సంజన సంక్రాంతి వేడుకలకు కొత్త కళను తెచ్చారు. వేడుకలకు కుమారి మాధవి రెడ్డి చేసిన యాంకరింగ్ ఆకట్టుకుంది. సింగర్లు హనుమాన్, స్వాతి సత్యభామ, మోనికా యాదవ్ లు తమ సంగీతంతో ప్రేక్షుకలును కట్టిపడేసారు. పాటలకు తగ్గ డ్యాన్సులతో సందడి నెలకొంది. వేడుకలో ఢీ ఫేమ్ గోవింద్ టీమ్ స్టెప్పులతో స్టేజిని దులిపారు. జబర్దస్త్ సుధాకర్ తన కామెడీతో కడుపు ఉబ్బా నవ్వించారు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన మరో కళాకారుడు ఎమ్ఎస్ఆర్ నాయుడు తన వెంట్రిలాక్కుజమ్ నైపుణ్యంతో పిల్లలను అలరించారు. ఈ సంక్రాంతి సంబరాలకు హైదరాబాద్ నుంచి ఇన్‌కంటాక్స్ మాజీ అధికారి శ్రీకర్ వేముల, వ్యాపారవేత్త రమేష్ గౌడ్లు హాజరయ్యారు. ఒమన్‌లో వివిధ రంగాల్లో వ్యాపారాభివృద్ధి గురించి పరిశీలన చేశారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా సామాజిక బాధ్యతను మరిచిపోలేదు తెలుగు బిడ్డలు. ఇప్పటివరకు 20 సార్లకు పైగా రక్తదానం చేసిన 30 మంది యువతీయువకులకు మురళీమోహన్ సత్కరించారు. అంబేద్కర్ సేవాసమితి మహిళామణుల అధినేత శ్రీలతాచౌదరి శాలువాతో సత్కరించారు. ఇందులో భాగంగా తెలుగు కమ్యూనిటీకి విశేష సేవలను అందిస్తున్న రాజేష్ మడకశిరను మెమొంటోతో సత్కరించారు. ఈ వేడుక జరిగేందుకు అన్ని రకాలుగా సహకరించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థ, వైబ్రాంట్ సంస్థకు చెందిన పెద్దలు.. మల్లారెడ్డి, రవీంద్ర రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, సీఈఓ శ్రీనివాస్ రావులను సత్కరించారు. సంబరాల్లో సహాయ సహకారాలను అందించిన బాలాజీ, చంద్రశేఖర్, ప్రసాద్ రెడ్డి, నాగభూషణ్‌ను సన్మానించారు. సంక్రాంతి సంబరాలకు సహకరించిన రాయల్ కింగ్ యాజమాన్యానికి (రెన్నీ జాన్సన్ అండ్ టీం) అభినందనలు తెలిపారు. -
ఆసియా కప్‌లో భారత్ శుభారంభం..
ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ శుభారంభం చేసింది. మస్కట్‌లో శుక్రవారం జరిగిన పూల్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో భారత్ 9–0 గోల్స్ తేడాతో మలేసియాపై ఘనవిజయం సాధించింది. కెరీర్లో 250వ మ్యాచ్ ఆడిన వందన కటారియా రెండు గోల్స్ సాధించింది. నవనీత్ కౌర్, షర్మిలా దేవి కూడా రెండేసి గోల్స్ చేయగా... దీప్ గ్రేస్ ఎక్కా, మోనిక, లాల్రెమ్సియామి ఒక్కో గోల్ సాధించారు. చదవండి: పాకిస్తాన్లో భారీ బాంబు పేలుడు.. ఆస్ట్రేలియా పర్యటన ఇక..! -
మోసం చేసిన ఏజెంట్! ఒమన్‌లో చిక్కుల్లో పడ్డ భారతీయ మహిళ !
ట్రావెల్ ఏజెంట్లు చేసిన మోసంతో ఓ మహిళ దేశం కాని దేశంలో ఇక్కట్ల పాలైంది. చేతిలో డబ్బులు లేక అక్కడ యజమాని పెట్టే కష్టాలు భరించలేక బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూసింది. చివరకు విదేశాంగ శాఖ అధికారులు రంగంలోకి దిగి ఆ మహిళకు అండగా నిలిచారు. మారుమూల ప్రాంతానికి మస్కట్‌లో ఉద్యోగం ఉందంటూ మాయమాటలు చెప్పిన ఓ ట్రావెల్ ఏజెంట్ రంగారెడ్డి జిల్లాలోని షహీన్ నగర్‌కి చెందిన ఓ మహిళను విమానం ఎక్కించాడు. మస్కట్‌కి కాకుండా ఒమన్‌లోని మారుమూల ప్రాంతమైన సిర్కి ఆ మహిళను పంపాడు. అక్కడ ఉద్యోగం బదులు ఒకరి ఇంట్లో పని మనిషిగా కుదిర్చాడు. ఈ ఘటన 2021 నవంబరులో జరిగింది. నిత్యం హింసే రోజుకు 18 గంటల పాటు పని చేసినా యజమాని సంతృప్తి చెందకపోవడంతో నిత్యం ఆమెను హింస పెట్టేవాడు. దీంతో తనను ఇండియా పంపివ్వాలంటూ ఆ మహిళ వేడుకోగా.. తనకు రెండు లక్షలు నష్ట పరిహారం చెల్లిస్తే తప్ప విముక్తి లేదంటూ ఖరాఖండీగా ఆ యజమాని చెప్పాడు. దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఫోన్ ద్వారా జరిగిన మోసం కుటుంబ సభ్యులకు తెలిపింది. నిఘా పెట్టాలి ఆ మహిళ కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న స్వచ్ఛంధ సంస్థల ద్వారా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. మస్కట్, ఒమన్లలో ఉన్న భారత అధికారులు.. సదరు యజమానితో మాట్లాడి సమస్యకి పరిష్కారం చూపారు. చివరకు 2022 జనవరి 18న ఆ మహిళ సురక్షితంగా ఇండియా చేరుకుంది. ట్రావెల్ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతీసారి సరైన సమయంలో సహాయం అందకపోవచ్చని.. కాబట్టి చిక్కుల్లో పడవద్దంటూ సూచించారు. ట్రావెల్ ఏజెంట్ల ముసుగులో హుమన్ ట్రాఫికింగ్ చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: అబుదాబి ఎయిర్‌పోర్టు డ్రోన్ ఎటాక్.. యూఏఈ స్పందన -
మస్కట్‌లో ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్ ఆవిష్కరణ
గల్ఫ్ డెస్క్: గల్ఫ్ వలస జీవితాలు, కష్టసుఖాలు, హక్కులు, అభివృద్ధి.. ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ ప్రతీవారం ‘సాక్షి’ జిల్లా పేజీల్లో ‘గల్ఫ్ జిందగీ’ ప్రచురించడం తెలుగు జర్నలిజంలో కొత్త ప్రయోగం. 11 నవంబర్ 2017 న ప్రారంభమైన ఈ పేజీ 22 నెలలుగా.. ఈ సెప్టెంబర్ 2019 వరకు 83 వారాలుగా కొనసాగుతూ... వలస కార్మికులకు, ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు మధ్య వారధిలా ఉపయోగపడుతోంది. సమగ్ర సమాచారాన్ని ఇస్తూ గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు నేనున్నాననే భరోసా కల్పిస్తూ ముందుకెళ్తోంది. మొదట్లో ప్రతి శనివారం ప్రచురితమైన ఈ పేజీ, పాఠకుల కోరిక మేరకు 15 జూన్ 2018 నుంచి గల్ఫ్ దేశాల్లో సెలవు దినమైన శుక్రవారానికి మార్చడమైనది. ఈ పేజీలో గల్ఫ్ కార్మికులకు ఉపయోగపడే సమాచారం, ఎంబసీలు నిర్వహించే సమావేశాల వివరాలతో పాటు ఆయా దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న కార్మికుల గురించి, వారి జీవన విధానాలపై, సక్సెస్‌పై ప్రత్యేక కథనాలు ప్రచురించాం. ఒమన్ రాజధాని మస్కట్‌లో 4 అక్టోబర్ 2019న నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా 83 వారాల పేజీలను అన్నింటినీ కలిపి ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్‌ను ఆవిష్కరించనుండటం సంతోషం. ‘మైగ్రేంట్ ఫోరం ఇన్ ఏసియా’ సభ్య సంస్థ అయిన ‘ఎమిగ్రేంట్స్ వెల్ఫేర్ ఫోరం’ తెలంగాణ వలసల చరిత్రలతో ఈ ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్‌ను ఆవిష్కరించనుండటం గుర్తుండిపోయే ఘట్టం అని చెప్పవచ్చు. -
గల్ఫ్‌తో దశాబ్ధాల అనుబంధం
-
దోశ, బీట్రూట్ కబాబ్, పప్పు!
గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం యూఏఈ, ఒమన్లలో బిజీబిజీగా గడిపారు. ఉదయం దుబాయ్‌లోని ఒపెరా హౌజ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అక్కడి భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. భారత్–యూఏఈ మధ్య శతాబ్దాల నాటి బంధం దృఢమైనదన్నారు. ప్రవాసీల కలల సాకారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అనంతరం అబుదాబిలో నిర్మించనున్న స్వామినారాయణ్ మందిరానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. దుబాయ్‌లో వరల్డ్ గవర్నమెంట్ సమిట్‌లో ప్రారంభోపన్యాసం చేశారు. సాంకేతికతను వికాసానికే వాడాలి తప్ప విధ్వంసానికి కాదని సూచించారు. దుబాయ్ ఉపాధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్‌తో సమావేశమై రక్షణ, వాణిజ్యరంగాల్లో ద్వైపాక్షిక బంధాల బలోపేతంపై చర్చించారు. అక్కడినుంచి ఒమన్ చేరుకున్న ప్రధాని.. మస్కట్‌లో భారత సంతతి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఒమన్ పురోగతిలో భారతీయులు తమవంతు పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. దుబాయ్/మస్కట్ సైబర్ స్పేస్ దుర్వినియోగం కాకుండా, ఉగ్రవాదుల చేతిలో చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సాంకేతికతను అభివృద్ధికోసం ఉపయోగించే ఓ నియంత్రణ వ్యవస్థగానే వినియోగించుకోవాలని విధ్వంసం కోసం కాదని ఆయన పేర్కొన్నారు. దుబాయ్‌లో ఆదివారం జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమిట్‌లో మోదీ ప్రసంగించారు. సైబర్‌స్పేస్‌ను ఉగ్రవాదులు, హ్యాకర్లు దుర్వినియోగం చేస్తున్నారని దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పాలనకు సరైన సాంకేతికత తోడైతే సరైన అభివృద్ధి జరుగుతుందన్నారు. భారత పురోగతిలో సాంకేతికత పాత్రను మోదీ తన ప్రసంగంలో వివరించారు. కృత్రిమ మేధస్సు, నానో టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ తదితర రంగాల్లో భారత్ త్వరలోనే కీలకస్థానం అందుకోనుందన్నారు. దాదాపు 140 దేశాలకు చెందిన 4వేల మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘6ఆర్’లు, ‘5ఈ’ల సూత్రంతోనే.. భారత జనాభాలో 65 శాతం.. జనాభా 35 ఏళ్ల లోపువారేనని.. అందుకే సాంకేతికత ద్వారా యువతకు సాధికారత కల్పిస్తూ నవభారత నిర్మాణానికి తమ ప్రభుత్వం ముందడుగేస్తోందని ఆయన తెలిపారు. ‘సాంకేతికతతో ప్రకృతిపై పోరాటం చేయటం భవిష్యత్ మానవాళికి ప్రమాదకరం. ప్రకృతితో పోరాటం చేయవద్దు. దాంట్లో మమేకమయ్యే ప్రయత్నం చేయాలి’ అని మోదీ సూచించారు. ‘6ఆర్’ (రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్, రికవర్, రీడిజైన్, రీమ్యానుఫ్యాక్చర్), ‘5ఈ’ (ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎనర్జీ, ఎంపతీ, ఈక్విటీ) సూత్రాల ద్వారానే మనం సంతోషంగా ఉంటామన్నారు. సదస్సులో భాగంగా యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని, మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్‌తో మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునే పలు అంశాలపై వీరిద్దరూ చర్చించారు. గల్ఫ్ సహకార మండలి వ్యాపారవేత్తలతోనూ ప్రధాని సమావేశమై ‘నవభారతం’ విజన్‌ను వారితో పంచుకున్నారు. పెట్టుబడులతో భారత్‌కు రావాలని వారిని ఆహ్వానించారు. ఫ్రెంచ్ ప్రధాని ఎడ్వర్డ్ ఫిలిప్పీ, కిర్గిజ్స్తాన్ ప్రధాని సపర్ ఇసాకోవ్లతోనూ మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. భారత్–యూఏఈ బంధం దృఢమైంది యూఏఈ, ఇతర గల్ఫ్ దేశాలతో భారత్‌కు ఉన్న బంధం అమ్మకపుదారు–కొనుగోలుదారు పరిధికంటే లోతైనది, విస్తృతమైనదని, బలమైనదని మోదీ తెలిపారు. దుబాయ్ ఒపెరా హౌజ్‌లో భారత సంతతి ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడారు. దేశం, కుటుంబం నుంచి దూరంగా ఉన్నప్పటికీ.. 30 లక్షల మంది భారతీయులకు యూఏఈ సొంతింటిలా అక్కున చేర్చుకుందన్నారు. ప్రవాసీయుల కలలను నిజం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు. ‘ప్రపంచ బ్యాంకు వ్యాపారానుకూల జాబితాలో భారత్ స్థానం చాలా మెరుగుపడింది. ఇంతటితో సంతృప్తి చెందాలనుకోవట్లేదు. దీన్ని మెరుగుపరుచుకునేందుకు కావాల్సిన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం’ అని అన్నారు. అబుదాబిలో దేవాలయ శంకుస్థాపన అబుదాబిలో తొలి హిందూ దేవాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. బీఏపీఎస్ నారాయణ్ ఆలయానికి ఒపెరా హౌజ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘యూఏఈ పాలకులు భారత్‌పై, భారత సంస్కృతి, సంప్రదాయాలపై తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. అందుకే ఇక మన పాత్ర నిర్వహణలో ఎలాంటి పొరపాట్లూ ఉండకూడదని ఈ ఆలయ నిర్మాణంతో ముడిపడిఉన్న అందరికీ చెబుతున్నా. మనం ఎవరికీ ఇబ్బంది కలిగించేలా వ్యవహరించొద్దు. మీనుంచి ఇదే ఆశిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నారు. మందిర నిర్మాణానికి స్థలాన్నిచ్చిన అబుదాబి యువరాజుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. దోశ, బీట్రూట్ కబాబ్, పప్పు! ప్రధాని నరేంద్ర మోదీ ఆహారంతో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ చెప్పారు. ఆయన ఎప్పుడూ ఒకే రకమైన వంటకాలను తినే వ్యక్తి కాదనీ, మాంసాహారాన్ని ముట్టని మోదీ ఎలాంటి శాకాహార వంటలనైనా ఆరగించేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. మోదీ యూఏఈ పర్యటన సందర్భంగా ఆయన ఆహారాన్ని సంజీవ్ కపూర్ తయారుచేస్తున్నారు. దోశ, బీట్రూట్తో చేసిన కబాబ్, పప్పు, అన్నం ఎప్పుడూ మోదీ ప్లేట్లో ఉంటాయని సంజీవ్ పేర్కొన్నారు. ఒక దేశం సంస్కృతీ సంప్రదాయాలను మరో దేశం సులభంగా తెలుసుకునేందుకు ఆహారాన్ని మంచి మార్గంగా మోదీ భావిస్తారన్నారు. వంటకు సంబంధించి మోదీ కొన్ని కొత్త విషయాలను తనకు నేర్పించారని సంజీవ్ చెప్పారు. ఒమన్.. మినీ ఇండియా! యూఏఈ నుంచి రెండ్రోజుల పర్యటనకోసం ప్రధాని ఒమన్ చేరుకున్నారు. మస్కట్‌లో మోదీకి ఒమన్ ఉప ప్రధాని సయ్యద్ ఫహద్ బిన్ మహమ్మద్ ఘనస్వాగతం పలికారు. అనంతరం సుల్తాన్ ఖబూస్ స్పోర్ట్ కాంప్లెక్స్‌లో భారత సంతతి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని ఒమన్ సుల్తాన్ ఖబూస్ స్టేడియంలోని రాయల్ బాక్స్ నుంచి వీక్షించారు. ‘ఒమన్‌లోని 8 లక్షల మంది భారతీయులు.. సౌహార్ద్ర రాయబారులే. ఒమన్ అభివృద్ధిలో తమవంతు పాత్ర పోషించారు. అందుకే ఒమన్‌ను చూస్తుంటే మినీ భారత్‌లా అనిపిస్తోంది. ఇరుదేశాల్లో రాజకీయ మార్పులొచ్చినా.. భారత్–ఒమన్ సంబంధాల్లో మాత్రం ఎప్పుడూ ఇబ్బందులు తలెత్తలేదు’ అని మోదీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కుంభకోణాల కారణంగా భారత ప్రతిష్ట మసకబారిందని పరోక్షంగా కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు చేశారు. పశ్చిమాసియాతో భారత్ సంబంధాల్లో ఇదొక కొత్త శకమన్నారు. తమ ప్రభుత్వ పథకాలను మోదీ వివరించారు. కార్యక్రమానికి హాజరైన వారందరితో వందేమాతరం అని నినాదాలు చేయించారు. దీంతో స్టేడియం మార్మోగిపోయింది. వాహనంలో తిరుగుతూ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ అభివాదం చేశారు. మస్కట్‌లో మోదీకి స్వాగతం పలుకుతున్న ఒమన్ ఉపప్రధాని ఫహద్ బిన్ మహమూద్ అల్ సయిద్ -
ఓంక్యాప్ ద్వారా మస్కట్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
విజయవాడ (మొగల్రాజపురం) : ఆం్ర«దప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఓంకాప్ ద్వారా మస్కట్‌లో అన్వర్ అల్మజెడ్ యునైటెడ్ (నేషనల్ ఎలక్ట్రిసిటీ సెంటర్)లో వివిధ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాశాఖాధికారి డాక్టర్ పి.వి.రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. టెస్టింగ్ ఇంజినీరు–1, ఫోర్‌మెన్–3, లైన్మెన్–4, ఎలక్ట్రీషియన్–3, కేబుల్ జాయింటర్–1, డ్రాప్ట్స్‌మెన్–1, సర్వేయర్–1, హెచ్ఎస్ఈ ఆఫీసర్–1, బిల్ డిస్ట్రిబ్యూటర్లు–50 పోస్టుల భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. అక్టోబర్‡మూడో వారంలో ఇంటర్వూ్యలు జరుగుతాయని, ఇంటర్వూ్య జరిగే ప్రదేశం వివరాలను తర్వాత తెలియజేస్తామని వివరించారు. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు పూర్తిబయోడేటా, పాస్‌పోర్టు, అర్హతలకు సంబంధించిన పత్రాలు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో నగరంలోని ఐదో నంబరు బస్సు రూట్లో ఐటీఐ కళాశాల ఆవరణలో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో అందించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 0866–2484948, 81792 04289, 70753 40904 నంబర్లను సంప్రదించాల్సిందిగా కోరారు. బయోడేటాను నేరుగా సీవీవోఎంసీఏపీ ఎట్ దరెట్ఆఫ్ జిమెయిల్ డాట్ కామ్‌కు పంపవచ్చని తెలిపారు.