Massachusetts Institute of Technology scientists
-
26 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి
లండన్: కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజల్ని కాపాడడానికి అత్యంత ముఖ్యమైన ఆయుధం భౌతిక దూరం. ఇన్నాళ్లూ ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోతుందని అనుకుంటూ వచ్చాం. కానీ ఆ దూరం సరిపోదని ఆక్స్ఫర్డ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్–19 రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, పాడినప్పుడు ఆ వ్యక్తి నోటి నుంచి వెలువడే కంటికి కనబడని తుంపర్లు కొద్ది సెకండ్లలోనే 26 అడుగుల వరకు ప్రయాణిస్తాయని బీఎంజే జర్నల్‌లో ప్రచురితమైన ఆ సర్వే వెల్లడించింది. వైరస్ బారిన పడిన వ్యక్తి మాట్లాడినప్పుడు నోటి నుంచి వచ్చే తుంపర్లు ఆరు అడుగుల దూరం వరకు ప్రయాణిస్తాయని, అదే దగ్గడం, తుమ్మడం లేదంటే పాటలు పాడడం వంటివి చేసినప్పుడు ఏకంగా 26 అడుగుల దూరం ప్రయాణిస్తాయని ఆ సర్వే తేల్చింది. అందులోనూ తలుపులన్నీ మూసి ఉంచిన ప్రదేశాలు, గాలి వెలుతురు రాని ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. గతంలో కాలిఫోర్నియా యూనివర్సిటీ, స్టాన్ఫార్డ్ యూనివర్సిటీల పరిశోధనల్లో 20 అడుగుల దూరం వరకు తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందని వెల్లడైంది. తాజా అధ్యయనంలో 26 అడుగుల వరకు తుంపర్లు ప్రయాణిస్తాయని వెల్లడి కావడంతో కోవిడ్‌కు అడ్డుకట్ట వేయడానికి భౌతిక దూరం నిబంధనలు మార్చాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మహిళల్లో ముప్పు తక్కువకి కారణమిదే ! ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 గణాంకాల ను పరిశీలిస్తే మహిళల్లో కంటే పురుషులకే వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి గల కారణాలను అమెరికాలోని వేక్ ఫారెస్ట్ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్‌కి చెందిన శాస్త్రవేత్తలు అన్వేషించారు. వారి పరిశోధనల్లో మహిళల్లో సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజన్ వల్ల వైరస్ సోకే ముప్పు తక్కువగా ఉందని తేలింది. కరోనా వైరస్ సోకితే గుండె మీద తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తుంది. మహిళల్లో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్ గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా నిరోధిస్తూ ఉంటుంది. అదే విధంగా కరోనా వైరస్ ప్రభావం నేరుగా గుండెపై పడకుండా ఈస్ట్రోజ న్ అడ్డుపడు తుందని, దీం తో వైరస్ సోకినా మహి ళల్లో ముప్పు తక్కువగా ఉంటోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ లియాన్నె గ్రోబన్ చెప్పారు. తాము చేసిన అధ్యయనం కోవిడ్ చికిత్సకి పనికి వస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. -
ఆసియా, మధ్యప్రాచ్యాల్లో వేగం తక్కువే..
బోస్టన్: వెచ్చటి వాతావరణం... గాలిలో తేమశాతం అధికంగా ఉండటం! ప్రాణాంతక కరోనా వైరస్‌ను అడ్డుకునే ఆయుధాలని తేల్చారు బోస్టన్లోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. చైనాలోని వూహాన్ నగరంలో గత ఏడాది డిసెంబరులో గుర్తించింది మొదలు.. ఈ నెల 22వ తేదీ వరకూ వివిధ దేశాలకు విస్తరించిన తీరు.. ఆయా దేశాల్లోని ఉష్ణోగ్రతలు, గాల్లో తేమశాతాలను అంచనా వేయడం ద్వారా ఖాసీమ్ బుఖారీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ అంచనాకు వచ్చింది. ‘ఎస్ఎస్ఆర్ఎన్ రిపాసిటరీ’జర్నల్‌లో ఈ అధ్యయనం తాలూకూ వివరాలు ప్రచురితమయ్యాయి. మార్చి 22వ తేదీ వరకూ ఉన్న కరోనా కేసులన్నింటిలో 90 శాతం కేసులు ఉష్ణోగ్రతలు మూడు నుంచి 17 డిగ్రీ సెల్సియస్‌లు ఉన్న ప్రాంతాల్లోనే సంభవించాయని ఈ అధ్యయనం చెబుతోంది. అంతేకాదు.. ఈ ప్రాంతాల్లో గాల్లో తేమశాతం ప్రతి ఘనపు మీటర్ గాలిలో నాలుగు నుంచి తొమ్మిది గ్రాముల వరకూ ఉందని వీరు చెప్పారు. జనవరి నుంచి మార్చి నెల మొదటి వరకూ సగటు ఉష్ణోగ్రతలు 18 డిగ్రీ సెల్సియస్, గాల్లో తేమశాతం ఘనపు మీటర్‌కు తొమ్మిది గ్రాములు ఉన్న ప్రాంతాల్లో కేవలం ఆరు శాతం కేసులే ఉన్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఈ లెక్క ప్రకారం ఆసియా దేశాల్లో రుతుపవనాల్లాంటి వాతావరణం ఏర్పడితే వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశముంది. ఈ రకమైన వాతావరణంలో గాల్లో తేమశాతం ఘనపుమీటర్కు 10 గ్రాముల కంటే ఎక్కువగా ఉంటుందని, అక్కడ ఈ వైరస్ వేగంగా వ్యాపించదని వీరు అంచనా కట్టారు. ‘ చల్లని ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువ కేసులు ఉంటే.. వెచ్చటి వాతావరణమున్న దక్షిణ రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నాయి. దక్షిణ ప్రాంతానితో పోలిస్తే ఉత్తరాన రెట్టింపు కేసులు ఉన్నాయి’ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆసియా, మధ్యప్రాచ్యాల్లో వేగం తక్కువే.. చైనా, యూరప్ దేశాలు, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల మాదిరిగా క్వారంటైన్ చర్యలు పెద్ద ఎత్తున చేపట్టకపోయినా పలు ఆసియాదేశాల్లో, మధ్యప్రాచ్య, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో వైరస్ ప్రభావం తక్కువగా ఉందని ఈ అధ్యయనం చెబుతోంది. భారత్, పాకిస్తాన్, ఇండోనేసియా వంటి దేశాల్లో పరీక్షల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ కేసులు కనపడటం లేదని కొంతమంది వాదిస్తున్నారని.. అయితే ఈ దేశాల్లో ఉండే వాతావరణమే ఉండే సింగపూర్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల్లో ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేసినా కేసులు తక్కువగానే ఉన్నాయని గుర్తు చేశారు. కాబట్టి తగినన్ని పరీక్షలు చేయడం అన్నది సమస్య కాదని స్పష్టం చేశారు. ఇతర అంశాల కంటే కదలికలను నియంత్రించడం, క్వారంటైన్ పాటించడం ద్వారా వైరస్‌ను సమర్థంగా కట్టడి చేయవచ్చునని తెలిపారు. అయితే, వైరస్ ఎలా మార్పు చెందుతోంది? పరిణమిస్తోంది? పునరుత్పత్తి వేగం వంటి అనేక ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే భిన్నమైన అంచనాలు రావచ్చునని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. -
ఉల్కలే నీటిని భూమిపైకి తీసుకొచ్చాయా?
బోస్టన్: భూమిపై జీవం పుట్టుకకు నీరు ప్రధాన కారకమనే విషయం శాస్త్రీయంగా ఇప్పటికే రుజువైంది. మరి ఈ భూమిపైకి నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇందుకు సంబంధించి అమెరికాలోని మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు సరికొత్త విషయాన్ని వెల్లడించారు. మన సౌర వ్యవస్థ ఆవిర్భవించిన తొలి రెండు మిలియన్ సంవత్సరాల్లో భూమిపైకి ఉల్కలే నీటిని తీసుకొచ్చాయని చెబుతున్నారు. ‘ఉల్కలనేవి అంతరిక్షంలోని శిథిల పదార్థాలు. సౌర మండలంలోని మంచు, వాయువులు, ధూళితో ఉల్కలు ఏర్పడతాయి. ఇవి మైక్రాన్ల నుంచి కొన్ని కిలోమీటర్ల మేర వ్యాసార్ధాన్ని కలిగి ఉంటాయి. వీటికి నిర్దిష్ట కక్ష్య ఉండదు. అంతరిక్షంలో సంచరిస్తున్న శిథిల పదార్థం భూమి సమీపంలోకి వచ్చినపుడు గురుత్వాకర్షణకు లోనవుతుంది. ఫలితంగా భూమి వాతావరణంలోకి ఆకర్షితమవుతాయి. -
ఆకారం మార్చుకునే రసాయన రోబోలు...
హాలీవుడ్ సినిమా టర్మినేటర్లో మాదిరిగా.. కరిగిపోయినా, వస్తువుల మధ్య ఇరుక్కుపోయి కుంచించుకుపోయినా.. తిరిగి మామూలు స్థితికి రాగలిగే వినూత్న రోబోలు త్వరలోనే రానున్నాయట. ఇలాంటి రోబోల తయారీకి ఉపయోగపడే ప్రత్యేక పదార్థాన్ని తాము సృష్టించామని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. చిత్రంలో మెత్తని ప్లాస్టిక్‌లా కనిపిస్తున్న వస్తువు ఆ పదార్థంతో తయారు చేసిందే. ఒకరకమైన మైనం, నురగను కలిపి చేసిన పదార్థాన్ని సన్నని తీగలకు పూసి దీనిని రూపొందించారు. తీగలకు కరెంటును పంపినప్పుడు మైనం వేడెక్కి ఇది ద్రవస్థితిలోకి మారుతుందని, అలాగే కరెంటును ఆపేసినప్పుడు తిరిగి ఘనస్థితిలోకి మారుతుందని, దీనివల్ల ఈ వస్తువు ఆకారాన్ని మార్చుకోవడంతోపాటు ఎక్కడైనా దెబ్బతింటే కూడా తిరిగి బాగు చేసుకుంటుందనీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ పదార్థంతో సూక్ష్మస్థాయి రోబోలను తయారుచేస్తే.. ఆకారం మార్చుకునే లక్షణం వల్ల ఇవి మనిషి శరీరంలో యథేచ్ఛగా తిరుగుతాయని, అందువల్ల వైద్య పరీక్షలకు, చికిత్సలకు ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. కాస్త పెద్దస్థాయి రోబోలను తయారు చేస్తే.. భవనాలు కూలినప్పుడు శిథిలాల సందుల్లోంచి దూరిపోయి బాధితుల సమాచారం తెలుసుకునేందుకూ ఉపయోగపడతాయట.