Master Mind
-
నీట్ లీకేజీ కీలక సూత్రధారి ‘రాకీ’ అరెస్ట్
ఢిల్లీ: నీట్-యూజీ (2024) పరీక్ష పత్రం లీక్ కేసు సీబీఐ దర్యాప్తులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలక సూత్రధారిగా భావిస్తోన్న రాజేశ్ రంజన్ అలియాస్ రాకీ అనే వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేసింది. గురువారం మధ్యాహ్నం పాట్నాలో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న దర్యాప్తు సంస్థ.. విచారించేందుకు స్థానిక కోర్టు అనుమతితో 10 రోజుల కస్టడీకి తీసుకుంది.మరోవైపు పాట్నాతో పాటు కోల్‌కతా (పశ్చిమ బెంగాల్)లోని పలు ప్రాంతాల్లో నిర్వహించాయి. అంతేకాదు.. ఈ నేరానికి సంబంధించి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. రాకీతో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు సీబీఐ ఎనిమిది మందిని అరెస్ట్ చేసింది. సీబీఐ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మే 5వ తేదీన పరీక్ష జరిగింది. అయితే అంతకంటే రెండురోజుల ముందే హజారీబాగ్‌లోని ఎస్బీఐ బ్యాంకులో పేపర్లను భద్రపరిచారు. అక్కడి నుంచి రెండు సెట్ల పేపర్లు స్థానిక పరీక్ష కేంద్రం అయిన ఒయాసిస్ స్కూల్‌కు చేరాయి. అయితే స్కూల్‌కు చేరే క్రమంలోనే వాటి సీల్స్ తెరుచుకుని.. పేపర్ లీక్ అయ్యింది.జార్ఖండ్‌లోని హజారిబాగ్ పాఠశాల నుంచి నీట్ పేపర్ లీక్ అయ్యి ఉండొచ్చని సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడి నుంచే బీహార్ పాట్నా సెంటర్లకు చేరి ఉండొచ్చని చెబుతోంది. ఈ క్రమంలో బుధవారం ఆ స్కూల్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌ను సైతం అరెస్ట్ చేసింది. ప్రశ్నాపత్రాల సీల్ తొలగించిన టైంలో రాకీ అక్కడే ఉన్నాడు. తన ఫోన్‌తో వాటిని ఫొటోలు తీసి.. సాల్వర్ గ్యాంగ్స్ పేరిట ముఠాకు షేర్ చేశాడు. ఆ గ్యాంగ్ రెండు దశాబ్దాలుగా పోటీ పరీక్షల పేపర్లను లీక్ చేస్తూ వస్తోంది. రాకీ చేరవేసిన నీట్ ప్రశ్నాపత్రాల్ని.. అభ్యర్థుల నుంచి లక్షల సొమ్ము తీసుకుని పేపర్‌ను లీక్ చేసింది. ఈ ముఠాలో మరో వ్యక్తి, రాకీకి సన్నిహితుడైన సంజీవ్ ముఖియా పరారీలో ఉన్నాడు. అయితే.. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ స్థానికంగానే జరిగిందని, కొందరు విద్యార్థులకే ప్రశ్నాపత్రం చేరిందని, భారీ ఎత్తున పేపర్ లీకేజీ జరగలేదని కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి. కానీ, రాకీ అరెస్ట్.. అతన్ని విచారిస్తే లీకేజీ ఏ స్థాయిలో జరిగిందో తేలే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. బీహార్‌లో మూడు కేసులతో పాటు ప్రత్యేకంగా మరో ఆరు కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలో నీట్ తరహాలో ఇతర పోటీ పరీక్షల పేపర్లను లీక్ చేసిన గ్యాంగ్‌ల గుట్టు వీడుతోంది. -
'బుల్లిబాయ్' యాప్.. వికృత పోకడలు
దేశంలో విద్వేష వాతావరణం క్రమేపీ విస్తరిస్తున్నదని కలవరపడుతున్నవారికి తాజా పరిణామం మరింత ఆందోళన కలిగిస్తుంది. వందమంది ముస్లిం మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేయడంతోపాటు వారిని వేలం వేస్తూ దుండగులు ఆన్లైన్లో పెట్టిన వైనం అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. సరిగ్గా ఆరునెలల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు ఈ మాదిరే వందమంది మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. దానిపై ఇంతవరకూ సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందువల్లే కావొచ్చు, దుండగులు మరోసారి రెచ్చిపోయారు. విద్వేషం తలకెక్కినవారికి యుక్తాయుక్త విచక్షణ ఉండదు. ఏం చేస్తున్నామన్న స్పృహ ఉండదు. అరెస్టయిన ఇద్దరిలో ఒకరు ఉత్తరాఖండ్‌కు చెందిన పద్దెనిమిదేళ్ల యువతి కాగా, మరొకరు బెంగళూరు యువకుడు. లక్షణంగా చదువుకోవాల్సిన వయసులో... పైపైకి ఎదగడానికి కావలసిన జ్ఞానాన్ని సముపార్జించి భవిష్యత్తుకు బంగారు బాటలు పరుచుకోవాల్సిన వయసులో పిల్లలు ఇంత విషపూరితంగా మారడానికి, దారి తప్పడానికి వారిని ప్రేరేపించిందీ, ఉన్మాదాన్ని నూరిపోసిందీ ఎవరు? సరిగ్గా దర్యాప్తు చేస్తే ఇవన్నీ బయటపడకపోవు. కొందరు భావిస్తున్నట్టు కేవలం ఆకతాయితనంతో చేసిన చిల్లర చేష్టగా దీన్ని కొట్టిపారేయడం అసాధ్యం. ఓపెన్ సోర్స్ వెబ్ టూల్ గిట్‌హబ్‌లో ఉంచిన ఈ యాప్ రూపకల్పన కేవలం వీరిద్దరు మాత్రమే చేసివుంటారని భావించడం కష్టం. సంఘటిత నేరగాళ్ల ప్రమేయం లేకుండా ఇది జరిగిందని విశ్వసించడం అసాధ్యం. దుండగుల లక్ష్యంగా మారిన మహిళల్లో అత్యధికులు ఉన్నత విద్యావంతులు, వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్ఠులు. ఇందులో పాత్రికేయులున్నారు, కళాకారులున్నారు, పరిశోధకులున్నారు, సినీతారలు న్నారు. వీరంతా తమ తమ రంగాలకే పరిమితం కాకుండా జరుగుతున్న అన్యాయాలపై బాధ్యతగా గళమెత్తుతున్నవారు. సామాజిక మాధ్యమాలతో సహా అన్ని వేదికల్లోనూ నిక్కచ్చిగా, నిర్మొహ మాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవారు. సామాజిక అసమానతలకూ, అన్యాయాలకూ వ్యతిరేకంగా పోరాడుతున్నవారు. అయిదేళ్ల క్రితం జేఎన్‌యూలో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన నజీబ్ అనే విద్యార్థి నాయకుడి తల్లి ఫాతిమా నఫీస్ ఫొటోను సైతం దుండగులు యాప్‌లో ఉంచారు. తమ ఉన్మాద చేష్టకు వారినే ఏరికోరి లక్ష్యంగా చేసుకోవడంలో– ఆ పిల్లలు కావొచ్చు, వారి వెనకున్న నేరగాళ్లు కావొచ్చు– ఆశించిన ప్రయోజనం ఏమిటి? ఆ మహిళలను అంగడి సరుకుగా చిత్రీకరించడం, వారి పరువు ప్రతిష్ఠలు దెబ్బతీయడం, భయకంపితులను చేయడం, ఆ మహిళలు తలెత్తుకోలేకుండా చేయడం తక్షణ ప్రయోజనం కావొచ్చు. కానీ అంతకన్నా ముఖ్యంగా కళ్లముందు జరిగే అన్యాయాలపై మరే మహిళా గొంతెత్తకుండా చూడటం, సమాజంలో పరస్పర వైషమ్యాలు పెంచడం, అది నిస్సహాయంగా మిగిలిపోయేలా చేయడం ఈ చేష్టల ఆంతర్యం. సారాంశంలో ఇది సామాజిక ధ్వంస రచన. అందుకే దీన్ని తేలిగ్గా తీసుకోలేం. ఆన్లైన్ విధానం అందుబాటులోకొచ్చాక... సామాజిక మాధ్యమాలు విస్తరించాక పౌరులకు గోప్యత లేకుండా పోయిందన్నది వాస్తవం. పౌరుల్లో ఎవరెవరు ఏ ఏ వెబ్సైట్లు చూస్తున్నారో, ఎలాంటి లావాదేవీలు నిర్వహిస్తున్నారో నిత్యం కన్నేసి ఉంచే విభాగాలు ప్రపంచ దేశాల న్నిటితోపాటు మన దేశంలో కూడా పెరిగాయి. దేశాల భద్రతకు ఇది అవసరం కూడా. గుర్తుతెలియని వ్యక్తులు చొరబడే ప్రయత్నం చేశారని తమ ఖాతాదారులను వివిధ మాధ్యమాలు హెచ్చరిస్తున్న ఉదంతాలు అడపా దడపా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెబ్సైట్లో ఒక అవాంఛనీయమైన యాప్ ప్రత్యక్షమైందని ఫిర్యాదు వచ్చేవరకూ గ్రహించ లేకపోవడం, వెనువెంటనే దర్యాప్తు జరిపి దాన్ని ఫలానా ప్రాంతంనుంచి ప్రయోగించి ఉంటారని ఆచూకీ రాబట్టలేకపోవడం చేతగానితనం కాదా? మహిళలపై జరిగే నేరాలను అరికట్టడానికి మన దేశంలో కఠినమైన చట్టాలు వస్తున్నాయి. కానీ ఆ నేరాలు తగ్గటం మాట అటుంచి క్రమేపీ పెరుగుతూ పోవడంలో పోలీసుల వైఫల్యమే ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఫిర్యాదు నమోదు చేసుకోవడం దగ్గరనుంచి మొదలయ్యే అలసత్వం నేరగాళ్లకు ఊతం ఇస్తోంది. ఈ వికృత యాప్ విషయంలోనూ జరిగింది ఇదే. తమ వెబ్సైట్లో ఉంచిన యాప్‌ను ఆరునెలలక్రితం ఇదే సంస్థ తొలగించింది. అది మినహా తమకేం కాలేదన్న ధైర్యంతో ఇప్పుడు మరో యాప్‌తో ఆ నేరగాళ్లు బయల్దేరారు. అట్టడుగు వర్గాలవారినీ, మహిళలనూ కించపరచడం, వారిపై విద్వేషం వెళ్లగక్కడం మన దేశంలో కొత్తేమీ కాదు. ‘మతములన్నియు మాసిపోవును–జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును’ అన్నాడు మహాకవి గురజాడ. కానీ ఆయన ఆశించినదానికి విరుద్ధంగా ఆధునికత పెరిగేకొద్దీ, అభివృద్ధి విస్తరిస్తున్నకొద్దీ విద్వేషం రూపం మార్చుకుంటోంది. ఊహించ సాధ్యంకాని పోకడలు పోతోంది. చూస్తుండగానే అది పిల్లలను కూడా కాటేస్తోంది. తెలిసీ తెలియని వయసులో వారిని నేరగాళ్లుగానో, బాధితులుగానో మార్చి వారి జీవితాలను అగాథంలోకి నెట్టేస్తోంది. దీన్ని సకాలంలో గుర్తించి చర్యలు తీసుకోవడంలో విఫలమైతే సమాజం కల్లోలభరితమవుతుంది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారి విషయంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వంతో వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు ఇప్పటికే వస్తున్నాయి. కనుక ఈ యాప్ రూపకర్త్తలపై కఠిన చర్యలకు ఉపక్రమించడం పాలకుల బాధ్యత. -
ప్రధాన సూత్రధారి సేఫ్
‘ఎస్సారెస్పీ’ బాగోతంలో మరో కోణం హసన్‌పర్తి: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో చోటుచేసుకున్న మెడికల్ బిల్లుల బాగోతంలో మరో కోణం వెలుగు చూసింది. బిల్లుల స్వాహా వ్యవహారంలో సదరు ఉద్యోగులపై కేసు నమోదు కాగా.. ఇందులో ప్రధాన çసూత్రధారినే తప్పించినట్లు తెలుస్తోంది. ఎస్సారెస్పీ ఉద్యోగులు కొందరు ఆస్పత్రిలో చికిత్స చేయించుకోకున్నా.. చేయించుకున్నట్లు తప్పుడు మెడికల్ బిల్లులను సృష్టించి సర్కారు నిధులను అప్పనంగా డ్రా చేసుకున్న ఘటన గతంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 2008 నుంచి ఈ తతంగం సాగగా.. 2016లో వెలుగుచూసింది. ఈ మేరకు శాఖా పరమైన విచారణ ప్రారంభం కాగా.. ప్రాథమికంగా 26 మంది ఉద్యోగులను దోషులుగా తేల్చారు. వారిని వెంటనే సస్పెండ్ చేయడంతోపాటు ప్రమోషన్లు, అలవెన్సులు రాకుండా నిలిపివేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో 2017లో విజిలెన్స్ బృందం విచారణ చేపట్టింది. అప్పటి నుంచి విచారణ కొనసాగగా.. నివేదికను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ అవినీతి బాగోతాన్ని సీరియస్‌గా తీసుకున్న సర్కారు.. సదరు ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్సారెస్పీ ఉన్నతాధికారిని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సదరు ఉన్నతాధికారి కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. అయితే.. ఈ బాగోతానికి అసలు సూత్రధారిని పక్కకు తప్పించినట్లు తెలిసింది. పెద్దోళ్ల పేర్లు బయటకు వస్తాయనే.. మెడికల్ బిల్లుల వ్యవహారంలో విజిలెన్స్ విచారణలో ప్రాథమికంగా 26 బిల్లులు ఫోర్జరీ చేసినట్లు తేలింది. మరో వంద బిల్లులు కూడా ఫోర్జరీవేనని విజిలెన్స్ అధికారులు నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. రెండేళ్ల పాటు జరిగిన విచారణ అనంతరం సుమారు 26 బిల్లులకు సంబంధించి రూ.50 లక్షల మేరకు డబ్బులు స్వాహా అయినట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే విజిలెన్స్ విచారణ సందర్భంగా సదరు ఉద్యోగులు.. ఈ బాగోతానికి ప్రధాన సూత్రధారి.. దళారీగా వ్యవహరించిన ఓ వ్యాపారి పేరును వెల్లడించలేదు. దీంతో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో విజిలెన్స్ అధికారులు అతడి పేరును చేర్చలేదని సమాచారం. ఈ దళారిని విచారణ పరిధిలోకి తీసుకొస్తే పెద్ద తలల పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒక్కో ఫోర్జరీ బిల్లుపై 25 శాతం కమీషన్‌గా తీసుకుని సదరు దళారీ ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు తెలుస్తోంది. సుమారు 120 మంది ఉద్యోగులకు బిల్లులు ఇప్పించినప్పటికీ.. 26 మంది మాత్రమే పట్టుబడ్డారని చింతగట్టు క్యాంప్‌లో చర్చించుకుంటున్నారు. దొంగ బిల్లులతో పాటు నిజంగా చికిత్స పొందిన వారికి సైతం మెడికల్ బిల్లులను ఇప్పించే బాధ్యత కూడా తన భుజాలపై వేసుకుంటాడనే పేరు దళారీగా వ్యహరించిన వ్యాపారికి ఉంది. మొత్తానికి దొంగ మెడికల్ బిల్లుల వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన దళారీ వివరాలను పక్కకు తప్పించేందుకు పోలీసులపై ఒత్తిళ్లు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రముఖ ఆస్పత్రి హస్తం కూడా.. ఫోర్జరీ బిల్లుల కేసులో హన్మకొండలోని ఓ ప్రధాన ఆస్పత్రి సిబ్బంది హస్తం ఉన్నట్లు.. అక్రమార్కులకు పూర్తి సహాయ సహకారాలు అందించినట్లు విజిలెన్స్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఎటువంటి చికిత్స చేయకున్నా చికిత్స జరిగినట్లు బిల్లులు సృష్టించారని.. ఉద్యోగులు సమర్పించిన ఫోర్జరీ బిల్లులు, ఆస్పత్రి వివరాలు సరిచూడగా ఈ విషయం తేటతెల్లమైందని నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. పరారీలో నిందితులు.. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీని వాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో 18 మంది ఎస్సపారెస్పీ ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. అయితే.. నిందితులు పరారీలో ఉన్నారు. 20 రోజుల çనుంచి వారు హైదరాబాద్‌లో ఉంటూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఎస్సారెస్పీ మెడికల్ స్కాం లో అందిన ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతోందని.. ఎస్సారెస్పీ–1 ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు 18 మందిపై కేసులు నమోదు చేసినట్లు కేయూసీ పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్‌బాబు తెలిపారు. -
దోవల్.. ది మాస్టర్ మైండ్!
♦ ఆర్మీ దూకుడు వెనుక జాతీయ భద్రతా సలహాదారు ♦ ఒక్క పాక్ బుల్లెట్‌కు రెండు బుల్లెట్లతో బదులివ్వండి న్యూఢిల్లీ: ‘శాంతి.. సహనం.. వ్యూహాత్మక మౌనం..’ సరిహద్దుల వెంట పాక్ విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్నా భారత్ ఇన్నాళ్లూ జపించిన మంత్రాలివీ! కానీ వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టి గురువారం బెబ్బులిలా విరుచుకుపడింది. పీవోకేలోకి వెళ్లి ఉగ్రమూకల పీచ మణిచింది. అడ్డొచ్చిన ఇద్దరు పాక్ సైనికులనూ మట్టికరిపించింది! దీంతో ఇన్నాళ్లూ రక్షణాత్మక ధోరణిని అవలంబించిన భారత్ ఎదురుదాడి వ్యూహానికి పదును పెడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ వ్యూహానికి బీజాలు ఇప్పుడు కాదు.. రెండేళ్ల కిందటే పడ్డాయి!! దీనంతటి వెనుక జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలకపాత్ర పోషించారు. ‘పాక్ ఒక్క బుల్లెట్ పేలిస్తే మీరు రెండు బుల్లెట్లతో సమాధానం చెప్పండి’ అంటూ రెండేళ్ల కిందటే అజిత్ దోవల్ సైన్యానికి స్పష్టంచేశారు. పాక్ ఏమాత్రం కవ్వించినా తగిన విధంగా బుద్ధి చె ప్పాలని, దీటుగా స్పందించాలని సూచించారు. కాల్పుల విషయంలో పై నుంచి ఆదేశాల కోసం ఎదురుచూడకుండా అప్పటికప్పుడు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలంటూ దిశానిర్దేశం చేశారు. 2014 అక్టోబర్ 7న బీఎస్ఎఫ్ డెరైక్టర్ జనరల్‌తో జరిగిన సమావేశంలో దోవల్ ఈ మేరకు పేర్కొన్నారు. ‘అటు వైపు నుంచి ఒక్క బుల్లెట్ వస్తే.. మీరు రెండు బుల్లెట్లతో బదులివ్వండి..’ అని ఆయన చెప్పినట్లు తెలిసింది. పాక్ రేంజర్లు కాల్పులు ఆపేంత వరకు ఒక క్రమ పద్ధతి ప్రకారం సరిహద్దుల వెంట వారి మౌలిక వసతులను టార్గెట్ చేసుకొని విరుచుకుపడాలని ఆ భేటీలో చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో పాక్ సైన్యంతో ఎలాంటి సమావేశాలు జరపకూడదని కూడా నిర్దేశించారు. అప్పట్నుంచి సరిహద్దుల వెంట పాక్ చిన్న కవ్వింపు చర్యకు పాల్పడ్డా.. భారత సైన్యం విరుచుకుపడింది. ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ సైన్యం ఇలా దూకుడుగా వ్యవహరించడంతో సరిహద్దు ప్రాంతంలో పాక్‌కు భారీ నష్టమే మిగిలింది. కాల్పులు ఆపండి.. ప్లీజ్! కిందటి అక్టోబర్‌లో పాకిస్తాన్ రేంజర్స్(పంజాబ్) డెరైక్టర్ జనరల్ ఉమర్ ఫరూక్ బుర్కీ చర్చల కోసం ఢిల్లీకి వచ్చిన సమయంలో కూడా సరిహద్దుల వెంట పాక్ సైన్యం రెచ్చిపోయింది. బుర్కీ పాక్‌కు తిరిగి వెళ్లాక కూడా పెద్దఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఏమాత్రం తగ్గకుండా గట్టిగా బదులివ్వాలని దోవల్, హోంమంత్రి రాజ్‌నాథ్ బీఎస్ఎఫ్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మన సైన్యం ధాటికి పాక్ వైపు 26 మంది మరణించారు. దీంతో బుర్కీ... బీఎస్ఎఫ్ చీఫ్ డీకే పాఠక్‌ను ‘హాట్‌లైన్’ ద్వారా సంప్రదించి కాల్పులు ఆపాల్సిందిగా విన్నవించినట్లు తెలిసింది. గత జూలైలో భారత ఆర్మీ.. మియన్మార్ భూభాగంలోకి చొచ్చుకువెళ్లి తీవ్రవాదులను మట్టుబెట్టడం వెనుక కూడా దోవలే కీలక పాత్ర పోషించారు. మొత్తమ్మీద గత రెండేళ్లలో భారత్ వైఖరిలో వచ్చిన మార్పు.. ఇటు ఆర్మీలో స్థైర్యాన్ని పెంచగా అటు తమతో పెట్టుకుంటే భారీగా నష్టపోక తప్పదన్న స్పష్టమైన సంకేతాన్ని పాక్‌కు అందించింది. గురువారం కూడా పీవోకేలో మన కమెండోలు సర్జికల్ స్ట్రైక్స్ చేసి వచ్చిన తర్వాత పాక్ బలగాలు రాజౌరీ, బారాముల్లాలోని బీఎస్ఎఫ్ పోస్టుల వైపు కాల్పులు జరిపాయి. ‘బహుశా అసహనంతోనే పాకిస్తాన్ ఈ చర్యకు పాల్పడి ఉంటుంది. ఆ కాల్పులను కూడా మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది’ అని అధికారులు తెలిపారు. -
సాక్షి ప్రసారానికి స్పందించిన మాస్టర్ మైండ్
-
మాస్టర్ మైండ్
క్రైమ్ ఫైల్ మార్చి 19, 2004... కన్సాస్ (యు.ఎస్.)... టెన్షన్‌గా అటూ ఇటూ తిరుగు తున్నాడు ఇన్స్పెక్టర్ జేమ్స్. సబార్డినే ట్లంతా ఆయనేం చెబుతాడా అని చూస్తున్నారు రెప్ప వేయకుండా. పది నిమిషాల తర్వాత నోరు విప్పాడు జేమ్స్. ‘‘కొన్ని నెలల క్రితం పక్క రాష్ట్రంలో కొన్ని హత్యలు జరిగాయి. వేర్వేరు కుటుం బాలకు చెందినవారు, వేర్వేరు వయసుల వారు, వేర్వేరు వృత్తుల్లో ఉన్నవారు... కానీ అందరూ ఒకేలా హత్యకు గురయ్యారు. వాళ్లలో మగవాళ్లున్నారు, ఆడవాళ్లున్నారు. అత్యాచారం చేసి, కాళ్లూ చేతులూ కట్టేసి, తాడు మెడకు బిగించి చంపారు. హత్య జరిగిన ప్రతిచోటా ‘బీటీకే’ అన్న మూడక్షరాలు రాసివున్న కాగితం దొరికింది’’ అని చెప్పి ఆగాడు జేమ్స్. ‘‘అంటే ఏంటి సర్?’’ అన్నాడు రోనీ. తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపాడు జేమ్స్. ‘‘అది తెలుసుకోవడంలో అక్కడి పోలీసులు పూర్తిగా ఫెయిల య్యారు. కానీ మనం సక్సెస్ కావాలి.’’ అందరూ ముఖాలు చూసుకున్నారు. ‘‘మనకేం సంబంధం సర్? అది మన పరిధిలోకి రాదు కదా?’’ అన్నాడు మరో సబార్డినేట్ పాల్సన్. ‘‘ఆ హంతకుడు ఇప్పుడు మన పరిధిలోనే ఉన్నాడు.’’ అందరూ అలెర్ట్ అయ్యారు. ‘‘అంటే ఇక్కడ హత్యలు మొదలెట్టాడా సర్?’’ అడిగాడు రోనీ ఆదుర్దాగా. ‘‘లేదు. కానీ మొదలుపెడతాడేమో అని అనుమానంగా ఉంది. ఎందుకంటే... ఇవాళ నా ఆఫీసుకు ఒక లెటర్ వచ్చింది’’ అంటూ టేబుల్ మీద ఉన్న కాగితాన్ని అందుకున్నాడు జేమ్స్. మడతలు విప్పి, చదవడం మొదలుపెట్టాడు. ‘‘మై డియర్ ఫ్రెండ్స్. నేను వచ్చేశా. మీకోసం చాలా సర్ప్రైజులు తీసుకొచ్చా. అవి మీకు ఎప్పుడు ఎలా ఎదురవుతాయో ఇప్పుడే చెప్పలేను. అయినా సర్ప్రైజులు ఇవ్వడం నాకు కొత్తకాదు. అందుకోవడం మీకూ కొత్త కాదు. నన్ను మర్చిపోయా రేమోనన్న అనుమానంతో గుర్తు చేయ డానికి కొన్ని తీపి జ్ఞాపకాలు పంపు తున్నాను’’... చదవడం ఆపి టేబుల్ మీద ఉన్న ఫొటోలు తీసి చూపించాడు జేమ్స్. తర్వాత మళ్లీ చదవడం మొదలెట్టాడు. ‘‘ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు వికీ వెగర్లీ. 1986, సెప్టెంబర్ 16న నా చేతుల్లో కన్నుమూసింది. చనిపోయే ముందు నాకు చాలా సంతోషాన్ని, తృప్తిని మిగిల్చింది. అందుకే తనని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరూ మర్చిపోకండి. తనని కాదు, నన్ను. బై - బిల్ థామస్ కిల్‌మేన్.’’ అందరూ అవాక్కయిపోయారు. ‘‘బీటీకే అంటే బిల్ థామస్ కిల్‌మేన్ అన్నమాట. ఎంత పొగరు వాడికి! వాణ్ని వదలకూడదు సర్’’ అన్నాడు రోనీ కసిగా. అందరి పిడికిళ్లూ బిగుసుకున్నాయి. ‘‘వదలం రోనీ. వాణ్ని మనం పట్టుకుంటున్నాం. మనతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిద్దాం. ఇప్పటికి పదిమందిని చంపేశాడు. పదకొండో మనిషి వాడి చేతికి చిక్కడానికి వీల్లేదు’’ అన్నాడు జేమ్స్ గంభీరంగా. కానీ అతను అనుకున్నది జరగలేదు. ఆ హంతకుడిని పట్టుకోవడం వాళ్ల వల్ల కాలేదు. రాత్రింబవళ్లు తిరిగారు. కానీ అతను దొరకలేదు. జూన్ 9, 2004. కవర్ తెరిచాడు జేమ్స్. ఓ ఫ్లాపీ ఉంది. దానిమీద ‘బీటీకే స్టోరీ’ అని రాసి ఉంది. ఆ ఫ్లాపీలో బీటీకే కిల్లర్ గురించి పలు పత్రికల్లో వచ్చిన కథనాల పేపర్ కటింగ్స్, క్రైమ్ సీన్స్‌కి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి. మరణం మీద రాసిన ఓ కవిత కూడా ఉంది. చివరిలో... ‘‘మరణం అనేది ఓ వరం. ఆ వరాన్ని నేను ఎంతోమందికి అందించాను. అందిస్తూనే ఉంటాను. నన్ను ఎవ్వరూ ఆపలేరు. చివరికి మీరు కూడా’’ అన్న మెసేజ్ ఉంది. జేమ్స్‌కి బీపీ వచ్చేసింది. చేతిలో ఉన్న ఫ్లాపీ కవర్ని విసిరి కొట్టాడు. ‘‘స్కౌండ్రల్. ముప్ఫయ్యేళ్లుగా తప్పించుకు తిరుగుతు న్నాడు. పైగా మనల్నే వెక్కిరిస్తున్నాడు. ఐ విల్ సీ హిజ్ ఎండ్’’ అంటూ ఆవేశంగా అక్కడ్నుంచి కదిలాడు. డెట్రాయిట్‌లోని ఓ అపార్ట్మెంట్ తలుపు తెరచుకుంది. తలుపు తీసిన యువతి వయసు ముప్ఫైలోపే ఉంటుంది. తెల్లగా, అందంగా ఉంది. ‘‘ఎస్... ఎవరు కావాలి?’’ అంది ఎంతో మృదువుగా. జేమ్స్ తన జేబులోని ఐడీ కార్డ్ తీసి చూపించాడు. ఆమె నొసలు ముడిచింది. ‘‘పోలీసులా? ఏం జరిగింది సర్? ఎవరి కోసం వచ్చారు?’’ అంది కంగారుగా. జేమ్స్, అతని టీమ్ లోపలికి నడి చారు. ‘‘మీ పేరు తెలుసుకోవచ్చా?’’ అన్నాడు జేమ్స్ ఇల్లంతా పరిశీలిస్తూ. ‘‘కెర్రీ... కెర్రీ రాసన్’’ చెప్పిందామె. ‘‘బీటీకే అంటే తెలుసా మిస్ కెర్రీ?’’ ‘‘మిస్ కాదు... మిసెస్ కెర్రీ. నాకు తెలియదు బీటీకే అంటే ఏమిటో?’’ ‘‘పోనీ బిల్ థామస్ కిల్‌మేన్ ఎవరో తెలుసా?’’ తెలీదన్నట్టు తలూపి, ‘‘ఎవరతను?’’ అడిగింది. ‘‘మీ నాన్న’’ విస్తుపోయింది కెర్రీ. ‘‘మా నాన్నగారి పేరు అది కాదు. డెన్నిస్ రాడర్.’’ నవ్వాడు జేమ్స్. ‘‘తెలుసు. కొద్ది సేపటి క్రితం మేం ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాం. అతను ఓ సీరియల్ కిల్లర్. పదిమందిని అనుభవించి, అత్యంత కిరాతంగా చంపేసిన క్రూరుడు. తనను పట్టుకొమ్మంటూ పోలీసులకే సవాలు విసిరిన పొగరబోతు. దురదృష్టంకొద్దీ... అతడు మీ నాన్నే.’’ అవాక్కయిపోయింది కెర్రీ. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదామెకి. మౌనంగా సోఫాలో కూలబడిపోయింది. ‘‘ఏంటి కెర్రీ? ఎవరు వీళ్లు? ఏమంటున్నారు?’’ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర్నుంచి లేచి వచ్చింది, అప్పుడే లంచ్‌కి కూర్చున్న కెర్రీ తల్లి పౌలా. ఆమె ఎవరు అన్నట్టుగా కెర్రీ వైపు చూశాడు జేమ్స్. ‘‘మా అమ్మగారు... పౌలా రాడర్’’ అంది కెర్రీ. ‘‘సారీ మిసెస్ రాడర్. మీకు ఈ విషయం ఇలా చెప్పాల్సి రావడం బాధా కరమే. కానీ తప్పదు. మీ భర్త డెన్నిస్ రాడర్ ఒక సీరియల్ కిల్లర్. ఇందాకే అరెస్ట్ చేశాం. మీరు, మీ అమ్మాయి స్టేషన్‌కి వస్తే కొన్ని వివరాలు తీసుకోవాలి. మళ్లీ కలుద్దాం’’ అనేసి కదిలాడు జేమ్స్. లిఫ్టులోకి వెళ్లేవరకూ వెనుక నుంచి పౌలా గట్టిగట్టిగా ఏడుస్తోన్న శబ్దం వినిపిస్తూనే ఉంది అతనికి. ‘‘ఎట్టకేలకు దొరికావ్ మిస్టర్ రాడర్. ఓ సారీ... బీటీకే, బిల్ థామస్ కిల్‌మేన్.’’ జేమ్స్ అలా అనగానే నవ్వాడు డెన్నిస్. ‘‘నో... బిల్ థామస్ కిల్‌మేన్ కాదు. బైండ్... టార్చర్... కిల్. అంటే కట్టు... హింసించు... చంపు’’ అన్నాడు ఎంతో కూల్‌గా. ‘‘అలాగే చంపావ్గా అందరినీ. సిగ్గుగా లేదూ ఈ పని చేయడానికి? ఆడా లేదు మగా లేదు. చిన్నా లేదు పెద్దా లేదు. మితిమీరిన కోరికతో నీ కళ్లు మూసుకు పోయాయి’’ అన్నాడు జేమ్స్ చిరాకు పడుతూ. డెన్నిస్ రియాక్ట్ కాలేదు. నవ్వుతూ జేమ్స్ వైపు చూస్తున్నాడు. ‘‘ఆవేశపడకండి సర్. మొత్తానికి దొరికానుగా, ఇంకా ఎందుకు బీపీ పెంచుకుంటారు! అయినా నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. బీటీకే కిల్లర్ నేనేనని ఎలా కనిపెట్టారు మీరు?’’ చిర్రెత్తుకొచ్చింది జేమ్స్‌కి. ఇన్స్పెక్టర్ తను. ప్రశ్నలు తను వేయాలి. క్రిమినల్గాడు... వాడు వేస్తాడేంటి? ‘‘ఎంత పెద్ద నేరస్తుడైనా ఎక్కడో ఓ చోట తప్పటడుగు వేస్తాడు మిస్టర్ రాడర్. ఫ్లాపీ పంపించావ్గా. దానిలో డేటా ఎక్కించిన ఐపీ అడ్రస్‌ను కనిపెట్టవచ్చని, దాని ద్వారా ఆ ఐపీ ఉన్న కంప్యూటర్ను ట్రేస్ చేయొచ్చని నీకు తెలియదో, తెలిసినా మర్చిపోయావో నాకు తెలీదు. ఆ ఫ్లాపీయే నిన్ను పట్టించింది. పాపం, చాలా తెలివైనవాణ్ని అనుకున్నావ్ కదూ?’’ ‘‘ముప్ఫయ్యేళ్లుగా నన్ను పట్టుకోలేక ముప్పుతిప్పలు పడ్డారు. దాన్ని బట్టి తెలియడం లేదా ఎవరు తెలివైనవాళ్లో! నిజం మీకూ తెలుసు. కాకపోతే ఒప్పుకోవ డానికి మీ ఇగో అడ్డు వస్తోందంతే.’’ లాగిపెట్టి కొట్టాడు జేమ్స్. ‘‘నీలాగే చాలామంది క్రిమినల్స్ తెలివైనవాళ్లం అనుకుంటారు. పోలీసుల్ని పిచ్చివాళ్లుగా జమకడతారు. చివరికి మేము గెలవకా తప్పదు. మీరు మా చేతుల్లో నలగకా తప్పదు. దేవుడనేవాడే ఉంటే, నీలాంటి క్రూరుణ్ని ఇక ఈ భూమి మీద ఒక్క క్షణం ఉండనివ్వడు. నీకు మరణశిక్ష పడి తీరుతుంది.’’ ఆ క్షణంలో జేమ్స్ అన్న మాట తథాస్తు దేవతలు విన్నట్టు లేరు. అందుకే డెన్నిస్‌కి మరణశిక్ష పడలేదు. కాకపోతే మరణించేవరకూ నరక యాతన అనుభ వించమంటూ న్యాయస్థానం శపించింది. అతడు చంపిన మనిషికో జీవితఖైదు చొప్పున పది జీవితఖైదులు విధించింది. 175 యేళ్ల తర్వాత గానీ బెయిలుకు అప్లై చేయడానికి వీల్లేదని కండిషన్ పెట్టింది. అన్నేళ్లు అతను బతికుండడు. అప్పటి వరకూ బతికినా అది బతుకూ కాదు. ఆ విషయం... జైలు గోడల మధ్య జీవచ్ఛవంలా బతుకుతోన్న డెన్నిస్‌కి ఇప్పటికైనా అర్థమైందో లేదో మరి! - సమీర నేలపూడి డెన్నిస్ రాడర్ కేసు నడుస్తుండగానే అతని భార్య అనారోగ్యంతో మరణించింది. అతని కూతురు కెర్రీ... తన తండ్రి ఓ కసాయి అన్న నిజాన్ని జీర్ణించుకోలేక నేటికీ తల్లడిల్లుతోంది. ‘బయటికెళ్లినప్పుడు జాగ్రత్తమ్మా, మనుషులు మంచోళ్లు కాదు’ అంటూ చెప్పిన తన తండ్రే మంచోడు కాదని, తనలాంటి కొందరు అమ్మాయిలను అత్యాచారం చేసి చంపాడని తెలిసి ఆమె తట్టుకోలేకపోతోంది. కెర్రీయే కాదు, డెన్నిస్ అలాంటివాడంటే ఎవ్వరూ నమ్మలేదు. అతను మంచి ఉద్యోగిగా రిటైర్ అయ్యాడు. స్థానిక లూథరన్ చర్చికి పెద్దగా వ్యవహ రించేవాడు. కూల్‌గా, వినయంగా, అందరితో ఆప్యాయంగా ఉంటాడన్న పేరు తెచ్చుకున్నాడు. ఉన్నట్టుండి అతడో మేకవన్నె పులి అని తెలిస్తే నమ్మడం కష్టమే కదా మరి! -
సీఎంఏ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్ హవా!
హైదరాబాద్: సీఎంఏ-2015 ఇంటర్, ఫైనల్ పరీక్ష ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారని ఆ విద్యాసంస్థల డెరైక్టర్ మట్టుపల్లి మోహన్ ఓ ప్రకటనలో తెలిపారు. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్స్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీడబ్ల్యూఏ) విడుదల చేసిన సీఎంఏ ఇంటర్(2012 సిలబస్) ఫలితాలలో తమ విద్యార్థులు 31 ఆలిండియా ర్యాంకులు, సీఎంఏ ఫైనల్ (2012 సిలబస్) ఫలితాలలో 5 ఆలిండియా ర్యాంకులు సాధించారని అన్నారు. అలాగే 2008 సిలబస్‌తో సీఎంఏ ఇంటర్ ఫలితాలలో ఆలిండియాలో 14 ర్యాంకులు, 2008 సిలబస్‌తో సీఎంఏ ఫైనల్ ఫలితాలలో 1 ఆలిండియా ర్యాంకు పొందారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, అధ్యాపకులను డెరైక్టర్ అభినందించారు. -
హోస్ట్ డిజైనర్!
టీవీ షో పాపులర్ హోస్ట్ ఎలెన్ డిజనరస్ కొత్త అవతారమెత్తింది. డిజైనర్‌గా మారి తన డ్రెస్‌ను తనే డిజైన్ చేసుకుంది. ఈ ఏడాది పీపుల్స్ చాయిస్ అవార్డ్స్ ఫంక్షన్‌కు విభిన్నమైన క్రీమ్ కలర్ ట్రాక్‌సూట్.. దానిపై సెయింట్ లారెంట్ షర్ట్ ధరించి వచ్చిన ఈ భామ అందర్నీ ఆకట్టుకుంది. ‘ఇది నేనే డిజైన్ చేశా. ఎంటర్ప్రెన్యూర్ క్రిస్ బర్చ్తో కలసి ఓ ఫ్యాషన్ వెంచర్ ప్లాన్ చేశా. త్వరలోనే లాంచ్ చేస్తాం. నాకెంతో ఎక్సైటింగ్‌గా ఉంది’ అని ఎలెన్ చెప్పింది. ఈ రీటైల్ ఫ్యాషన్ చైన్‌కు మాస్టర్ మైండ్ సి.వండర్, అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ టోరీ బర్చ్. డిజనరస్ బ్రాండ్‌కు ‘ఈడీ’గా పేరు పెట్టారు. ఈ ఏడాది మేలో మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.