Master Venu
-
'జయప్రద నాన్న దగ్గర సంగీతం నేర్చుకుంది'
నాన్న పాటలకు గాలి కూడా సడి సేయదు ఏరువాక సాగాలోరన్నో చిన్నన్నో.. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే... హాయిగా ఆలుమగలై కాలం గడపాలి.. సడి సేయకోగాలి సడిసేయబోకే.. ఓ బాటసారీ నను మరువకోయి... నీ సుఖమే నే కోరుతున్నా.. వెన్నెలరేయీ ఎంతో చలీచలీ.. ఈ పగలు రేయిగా వెండి వెన్నెలగ మారినదేమి చెలీ.. లెక్క లేనన్ని సుమధుర గీతాలను అందించారు మద్దూరి వేణుగోపాల్.. ఆయనే మాస్టర్ వేణు.. పాతాళభైరవి లో హేమండ్ ఆర్గాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేసి, పండితుల చేత ఔరా అనిపించుకున్నారు. సంగీతంలో ఎంత ఘనులో, అల్లరిలోనూ అంతే సమానులు అంటున్నారు హోలీ ఏంజెల్స్ స్కూల్లో మ్యూజిక్ టీచర్‌గా పనిచేసిన వారి పెద్దకుమారుడు మద్దూరి వెంకట సుబ్రహ్మణ్యమూర్తి ఉరఫ్ మూర్తిచందర్. ఆ వివరాలు వారి మాటలలోనే.. నాన్నగారు బందరులో 1920 –22 మధ్యకాలంలో పుట్టారు. సరిగ్గా ఏ సంవత్సరమో తెలియదు. తాతగారు మద్దూరి సుబ్బయ్య నాయుడు, నాయనమ్మ గంగమ్మలకు నాన్నగారు ఒక్కరే సంతానం. తాతగారిది కలంకారీ అచ్చులు వేసే, మధ్యతరగతి కుటుంబం. నాన్నగారికి ఎనిమిది సంవత్సరాల వయసులోనే తాతగారు పోయారు. నాన్నగారిని వారి మావయ్యగారైన హనుమకొండ వెంకట్రామయ్య పెంచి, పెద్ద చేసి, వారి అమ్మాయితో నాన్న వివాహం జరిపించారు. ఆవిడ చాలా త్వరగా కన్నుమూయటంతో మా అమ్మను రెండో వివాహం చేసుకున్నారు. మేం ఇద్దరం మగపిల్లలం. నా పేరు మద్దూరి వెంకట సుబ్రహ్మణ్య మూర్తి. తమ్ముడికి భానుచందర్ అని పేరు పెట్టి, నన్ను మూర్తి చందర్‌గా మార్చారు. తమ్ముడు సినిమాలలో నటిస్తున్నాడు. గదిలో పది గంటల సాధన.. మొదటి భార్య తమ్ముడిని మా అమ్మ తన సొంత తమ్ముడిలా చూసింది. నాన్నగారి మేనమామ హార్మోనియం వాయించేవారు. మా తాతగారు పోవటంతో ఆయనే నాన్న బాధ్యతను తీసుకుని, కఠినమైన క్రమశిక్షణతో పెంచారు. నాన్న అల్లరి పనులు చేసేవారు. నాన్నను ఒక గదిలో పెట్టి తాళం వేసి, రోజుకి పది గంటలు బయటకు రాకుండా హార్మోనియం సాధన చేయించేవారు. లోపల నుంచి హార్మోనియం శబ్దం వినపడకపోతే వేళ్ల మీద కొట్టేవారు. నాన్నకు ఆటలంటే ఇష్టం. ఆడుకుని వచ్చి దెబ్బలు తినేవారు. పదకొండు సంవత్సరాలకే హార్మోనియం మీద పట్టు వచ్చి, మచిలీపట్నంలో పెద్ద పెద్ద వారందరికీ వాయించారు. పైడ్పైపర్ కథలో ఎలుకల్లాగ అందరూ నాన్నని చుట్టుముట్టి పాడించుకునేవారు. ముంౖ»ñ పారిపోయారు.. టీన్ ఏజ్ వచ్చాక, హిందీ సినిమా పాటలు ఇష్టపడ్డారు. ఒకరోజు తన అదృష్టం వెతుక్కుంటూ ముంబై వెళ్లిపోయి, వసంతదేశాయ్ దగ్గర హార్మోనిస్టుగా చేరారు. అప్పుడు నాన్న వయసు 20 సంవత్సరాలు. అక్కడ కొంతకాలం పనిచేశాక, మద్రాసు హెచ్ఎంవిలో చేరారు. ఆ రోజుల్లో ప్రైవేట్ రికార్డ్సు పబ్లిష్ చేసేవారు. అక్కడ గాయకులకు పాటలు నేర్పి, రికార్డు చేయటం నాన్న పని. ఆ రోజుల్లోనే వైజయంతిమాల నాన్నగారి సంగీతంలో రెండు పాటలు పాడారు. హెచ్ఎంవి నుంచి విజయ స్టూడియోలో స్టాఫ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేరి, రికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ చేసేవారు. మాయాబజార్, పాతాళభైరవి చిత్రాలలో బ్యాక్ గ్రౌండ్‌స్కోర్, హేమండ్ ఆర్గాన్ని నాన్నగారు మాత్రమే హ్యాండిల్ చేశారు. ఆ పియానోని ఇండియాలో నాన్నగారే మొదట వాడారు. ‘రోజులు మారాయి’ చిత్రంలోని ‘ఏరువాక సాగాలో’ పాటకు ఎస్.డి. బర్మన్ చాలా ఇన్‌స్పయిర్ అయ్యి, ఆయన తన సినిమాలో ఈ పాటను పెట్టుకున్నారట. మారలేకపోయారు.. 1960 నుంచి సుమారు 12 సంవత్సరాలు నాన్‌స్టాప్‌గా పనిచేశారు నాన్న. ఆ పన్నెండు సంవత్సరాలు ఆయనతో చాలా అరుదుగా గడిపేవాళ్లం. క్రమేపీ సంగీత విలువలు పడిపోతుండటంతో నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయిపోతూ వచ్చారు. అప్పటి నుంచి మాతో ఎక్కువకాలం గడిపారు. విశ్రాంతి సమయం దొరకటంతో ప్రతిరోజూ పియానో లేదా సితార్ రెండు గంటలు తప్పనిసరిగా వాయించుకునేవారు. మాకు టి. నగర్లో పెద్ద ఇల్లు ఉండేది. మా అమ్మ శకుంతల వల్లే ఆ ఇల్లు నిలబడింది. నాన్నకి ఆదాయం తగ్గినప్పుడు, ఇల్లు అద్దెకు ఇచ్చి, డబ్బు జాగ్రత్త చేసేది. ‘అమ్మా! నీకు మేమిద్దరం కాదు, నాన్న మూడో కొడుకుతో సమానం’ అనేవాడిని. కొందరు సంగీతకారులు మా ఇంట్లో అద్దెకు ఉండేవారు. వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భోజనం పెట్టి, ఎంతో కొంత డబ్బు ఇచ్చేవారు. (ఎడమ నుంచి కుడి) మూర్తి చందర్, భానుచందర్ చాలా చిలిపి.. నాన్నలో ఉన్న చిలిపితనం, పసితనం.. చివరి రోజుల వరకు చూశాం. నాన్నతో మేం స్నేహితుల్లా ఉండేవాళ్లం. ఇంట్లో పెద్దవాళ్లు సైలెంట్‌గా, చిన్నవాళ్లు చురుకుగా ఉంటారు. నేను డల్‌గా ఉండటం వల్ల అమ్మనాన్నలకి బెంగగా ఉండేది. నా మీద రెట్టింపు ప్రేమ చూపించేవారు. ప్రతి శుక్రవారం నాన్న, నేను ఇంగ్లీషు సినిమాకి వెళ్లేవాళ్లం. కాలేజీకి వచ్చేసరికి నాకు, తమ్ముడికి ఇద్దరికీ సంగీతం వచ్చింది. కాని, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలలో పెట్టాలనుకున్నారు. మామిడిచెట్లు మామిడి పళ్లనే ఇస్తాయి. మా ఇద్దరికీ సంగీతం మీద ఆసక్తి ఆగలేదు. తమ్ముడు భానుచందర్ నాన్నగారి ఆర్కెస్ట్రాలో గిటార్ వాయించేవాడు. మన సంప్రదాయ సంస్కృతి సంగీతంలో ఉండాలి అనేవారు. ఆ విషయం ఇప్పుడు అర్థం అవుతోంది.. సంపూర్ణమైన భోజనం పాత పాటలే అని. స్టూడియోలో సింహమే... ఏ పూర్వజన్మ సుకృతమో కానీ, నాన్న అన్నిరకాల వాద్యపరికరాలు వాయించేవారు. రికార్డింగ్ స్టూడియోలోకి వెళితే సింహంలా చాలా క్రూరంగా ఉండేవారు. ఎవరు తప్పు చేసినా ఒక టీచర్లా వాళ్లని కొట్టి, వాద్యపరికరం లాగేసుకుని ఆయనే వాయించేసేవారు. ‘మావారి మంచితనం’ చిత్రంలో ఎన్టిఆర్ జయప్రదలకు ఒక పాట చేశారు. ఆ పాట విన్న జయప్రద సితార్ తెచ్చుకుని, నాన్న దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఇద్దరూ నా దగ్గరే.. నాన్నకి చెట్లంటే ఇష్టం. రూఫ్ గార్డెన్ చేశారు. ధ్యానం, తోటపని.. వీటితో చాలా ప్రశాంతంగా ఉండేవారు. ఇంటి వ్యవహారాలు అమ్మ చూసుకునేది. మాతో ఆడేవారు.. ఒకసారి ఎన్టిఆర్ అమ్మతో, ‘అమ్మా! మాస్టర్‌గారు ఏం చేస్తున్నారు?’ అని అడిగితే, సినిమాలు లేక ఖాళీగా ఉన్నారని చెప్పింది. అప్పుడు ఆయన తీస్తున్న ‘మావారి మంచితనం’ సినిమాకు సంగీతం చేసే అవకాశం ఇచ్చారు. అదే నాన్న చేసిన ఆఖరి సినిమా. ఆ సినిమా పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో పూర్తి చేసుకుని, అక్కడ నుంచి వస్తూ మాకు చరఖా, గాలిపటాలు తెచ్చి, మాతో సమానంగా ఎగరేశారు. బొంగరాలు, గోళీలు బాగా ఆడేవారు. గోళీ కొడితే పగలాల్సిందే. అందరితోటీ పరాచికాలాడేవారు. కొలీగ్స్‌కి తొడపాశం పెట్టడం ఆయనకు ఇష్టం. ఘంటసాల గారికి కూడా పెట్టారు. నాన్నగారిని చూసి బాలు కూడా తొడపాశం ప్రారంభించారు. కళ్లల్లో నీళ్లు ఆగలేదు.. పి. పుల్లయ్య, శాంతకుమారి దంపతులు నాన్నని ‘ఏరా అబ్బాయి’ అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. నాన్నకు క్యాన్సర్ వచ్చిందని తెలిసి ఆయన ఏడు పదుల వయసులో మూడు అంతస్తులు ఎక్కి నాన్నను చూసి వెళ్తూ, మెట్ల మీద కూలబడిపోయి, గట్టిగా ఏడ్చేశారు. రక్తసంబంధం లేకపోయినా అంత ప్రేమగా ఉండేవారు. నాన్న క్యాన్సర్‌తో 1981లో, అమ్మ 1991లో పోయారు. అమ్మకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆసుపత్రిలో డ్రెస్సింగ్ చేసేటప్పుడు నేను అమ్మ పక్కనే ఉండటానికి నాకు అనుమతి ఇచ్చారు. ‘ఆడపిల్ల లేని లోటు తీర్చావు’ అని ఆప్యాయంగా అంది అమ్మ. అమ్మానాన్న నా చేతుల్లోనే పోయారు. మా తాతయ్య గారికి అమ్మ వాళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్లు సంగీతం నేర్చుకోవటానికి వచ్చేవారు. అప్పటికి అమ్మకి పాతికేళ్లు. నాన్నగారు చాలా అందంగా ఉండేవారు. అమ్మ సైలెంట్‌గా లవ్ చేసి, ఎక్స్‌ప్రెస్ చేయలేదేమో అనుకుంటాను. అమ్మ దగ్గర ఉండి మరీ నాన్న పెళ్లి చేయించింది. చివరకు అమ్మకు ప్రేమ దక్కింది అనుకుంటాను. అదొక మిస్టరీ. అమ్మ నాన్‌వెజ్ వంటకాలు బాగా చేసేది. ఆవిడ పొద్దున్న మార్కెట్‌కి వెళ్లి ఫిష్ తెచ్చి, పసుపు వేసి బాగా తోమి, మసాలాలు వేసి మధ్యాహ్నం రెండు గంటలకు వంట పూర్తి చేసేది. పది నిమిషాలలో భోజనం పూర్తి చేసేసేవాళ్లం. ‘అమ్మ ఐదు గంటలు వంట చేస్తే, మనం ఐదు నిమిషాలలో పూర్తి చేసేస్తాం’ అని సరదాగా అనేవాడిని. ఆ విషయం నాన్న అందరికీ చెప్పేవారు. పాన్, పొగాకు నమలటం ఆయనకు ఇష్టం. - మూర్తి చందర్ (మాస్టర్ వేణు పెద్ద కుమారుడు) సంభాషణ: వైజయంతి పురాణపండ -
మూర్తి చందర్ .. S/O మాస్టర్ వేణు
ఏరువాక సాగాలోరన్నో చిన్నన్నా... ఓ బాటసారీ... నను మరువకోయి...సడి సేయకో గాలి... సడి సేయబోకే... ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ... ఇటువంటి మరపురాని మరువలేని లెక్కించలేనన్ని మధురగీతాలు అందించారు మాస్టర్ వేణు...మూర్తిచందర్, భానుచందర్.... ఆయన కుమారులు... భానుచందర్ తెలుగు తెర నటుడిగా సుపరిచితులు... మూర్తి చందర్... పరిచయం చేస్తే గాని తెలియని అజ్ఞాత వ్యక్తి... తండ్రికి బహూకరించిన పియానోను పదిల పరచుకుని, దాని మీద వేళ్లతో సంగీత నాట్యం చేస్తున్నారు... ఆ వేళ్లు ఎక్కడున్నాయో కూడా కనిపించనంత వేగంగా పియానో మీటుతారు... సెలబ్రిటీ కుమారుడే అయినా ఏ మాత్రం భేషజం లేని మూర్తిచందర్ను పలకరిస్తే.... ఎంతో సౌమ్యంగా తన గురించి వివరించారు... నేను పుట్టింది మచిలీపట్టణంలో. కాని పెరిగిందంతా మద్రాసులోనే. నేను పుట్టే సమయానికి నాన్నగారు సినిమాలలో బిజీగా ఉండేవారు. పాటల రికార్డింగు కోసం ప్రతిరోజూ ఉదయాన్నే స్టూడియోలకి వెళ్లిపోయేవారు. మళ్లీ ఏ సాయంత్రానికో, రాత్రికో ఇంటికి వచ్చేవారు. స్వర్ణయుగం... 1950-1960 మధ్య సినీ పరిశ్రమకు స్వర్ణయుగం. దర్శకులు, నటులు, సాహిత్యం, సంగీతం... ఒకటేమిటి అన్ని రంగాలకూ పట్టాభిషేకం జరిగిన రోజులు. సంగీత దర్శకులంతా ఎవరి శైలిలో వారు కళామతల్లికి తమ వంతు నిస్వార్థ సేవ చేస్తూ, పేరుప్రఖ్యాతులు తీసుకువచ్చిన ఘనమైన రోజులు. సంగీతాన్ని తపస్సులా భావించి, సుమధురమైన, సుస్వరమైన, శ్రవణపేయమైన బాణీలు తయారుచేసిన రోజులు. అటువంటి మహనీయులలో నాన్నగారు కూడా ఒకరు. తనదైన శైలిలో సుమధురమైన పాటలు రూపొందిస్తూ, పూర్తిగా పాటల రికార్డింగులోనే మునిగిపోయి ఉండేవారు. అన్నం కూడా మర్చిపోయేవారు. ఆ పది పదిహేను సంవత్సరాలు సంగీత కళామతల్లికి నిత్యం స్వరార్చన చేశారు నాన్న. మార్పులతో... కాలక్రమేణా సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. దాంతో 1965 తర్వాత ఆయనకు సినిమాలు బాగా తగ్గాయి. మూడేళ్లకు ఒక సినిమా వస్తే గొప్ప. దాంతో ఆయన బిజీ జీవితానికి తెర పడి, విశ్రాంతి సమయం ఎక్కువ దొరికింది. ఇంట్లోనే ఎక్కువసేపు ఉండే అవకాశం దొరికింది. అంతవరకూ మమ్మల్ని పట్టించుకోవడానికి క్షణం కూడా తీరికలేని నాన్నగారు, ఖాళీ సమయం దొరకడంతో, మాతో ఒక స్నేహితుడిలా కాలక్షేపం చేయడం ప్రారంభించారు. ఎన్నో ఆటలు చక్కగా ఆడేవారు. ఒక సెలబ్రిటీలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఆయన సరదా మనిషి... నాన్నతో ఆడుకోవడమే మాకు మధురానుభూతి. అవన్నీ మాకు మరపురాని, మరువలేని తీపి జ్ఞాపకాలు. నాన్నతో కులాసాగా, కాలక్షేపంగా ఉండేవాళ్లం. నాన్నది పసిపిల్లవాడి తత్త్వం. ఎక్కువగా మాతో గాలిపటాలు, క్రికెట్, బొంగరాలు, కర్ర బిళ్ల ఆడేవారు. ఆటల్లో సరదాగా గొడవ పడేవాళ్లం. ఆయనతో కలిసి ఇంగ్లీషు సినిమాలు చూసేవాళ్లం. ఆయన ఎప్పుడూ సీరియస్‌గా ఉండేవారు కాదు. సంగీతమే ఊపిరి... నాన్నకి సంగీతం తప్పించి ఇతర విషయాలు తెలియవు. అందువల్ల మా చదువు బాధ్యత అంతా మా అమ్మగారే తీసుకున్నారు. నాన్న మాతో సమానంగా ఆడుతుండేవారు. అందుకని నాన్నమీద ఇష్టంగా ఉండేది. అమ్మ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. చదువుకోమని అమ్మ చెబుతుంటే అమ్మ మీద కోపం వస్తుండేది. కాని పెద్దయిన తర్వాత అమ్మ ఎందుకలా కేకలేసిందో అర్థమైంది. ఆవిడే మా గాడ్ మదర్. అమ్మ చాలా జాగ్రత్తగా పొదుపు చేయడం వల్లే ఇల్లు కొనుక్కోగలిగాం. స్కూల్ చదువు పూర్తయ్యాక కాలేజీ చదువులో చేరాం. నాన్న మమ్మల్ని మ్యూజిక్ ఫీల్డ్ లోకి వచ్చేందుకు ప్రోత్సహించలేదు. నేను, తమ్ముడు భానుచందర్ ఇద్దరం బీఏ పూర్తి చేశాం. భాను గిటార్, నేను పియానో వాయించేవాళ్లం. అమ్మ నన్ను మెడిసిన్ చదివించాలనుకుంది. కాని నాకు సంగీతం మీద శ్రద్ధ ఏర్పడి, మ్యూజిక్ డిప్లొమో చేశాను. నాకు సహజంగా సిగ్గు బిడియం ఎక్కువ. అందువల్ల నాన్నతో స్టూడియోలకి వెళ్లేవాడిని కాను. కాని భాను మాత్రం నాన్నతో వెళ్లి, ఆయన పాటలకు గిటార్ వాయిస్తుండేవాడు. అలాగే రెండు సినిమాలకు సంగీతం కూడా చేశాడు. నాన్నగారికి బహూకరించిన పియానో నా దగ్గరే ఉంది. దాని మీద ఇప్పటికీ నేను వాయించుకుంటూ ఉంటాను. మ్యూజిక్ టీచర్‌గా... చెన్నైలోని హోలీ ఏంజెల్స్ స్కూల్లో మ్యూజిక్ టీచర్‌గా పది సంవత్సరాలు పనిచేశాను. రాజ్- కోటి ఇద్దరూ విడివిడిగా ఎవరికి వారు ట్యూన్లు చేయడం మొదలుపెట్టాక, నేను రాజ్ దగ్గర అసోసియేట్‌గా పది సంవత్సరాలు పనిచేశాను. తమ్ముడు యాక్టింగ్ స్కూల్లో చేరాడు. అది కూడా అమ్మ అనుమతితోనే. నాన్నగారు వద్దని పట్టుబట్టినప్పటికీ అమ్మ పూర్తిగా ప్రోత్సహించింది. 1980లలో భానుచందర్ సినిమాల వైపు వెళ్లిపోయాడు. ‘తరంగిణి’ చిత్రంలో సినీ పరిశ్రమలో మంచి స్థానం పొందాడు. అది చూసి నాన్న సంతోషించారు. బ్రేక్ వచ్చిందని ఆనందపడ్డారు. నా గురించి ఆయనకి ఎప్పుడూ బాధగా ఉండేది. నేను ఫిలాసఫీ వైపు మొగు ్గచూపాను. వివాహం చేసుకోకుండా బ్యాచిలర్‌గా ఉండిపోయాను. జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్‌లో వలంటీర్‌గా పనిచేస్తున్నాను. ఆయన ఆంగ్లంలో ఇచ్చిన ప్రసంగాలను నేను తెలుగులో రికార్డు చేస్తున్నాను. 1981లో నాన్నగారు గతించారు. ఆ పియానో అపురూపం... విజయ - వాహినీ సంస్థలో మ్యూజిక్ ఆరేంజర్గా, మ్యూజిక్ కండక్టర్‌గా పనిచేశారు నాన్నగారు. ఘంటసాల సంగీతం స్వరపరచిన ‘పాతాళభైరవి’ సినిమాకి రీరికార్డింగ్ పని నాన్నకి అప్పచెప్పారు. అప్పట్లో విజయా వాహినీ వారు హ్యామండ్ ఆర్గాన్ తెప్పించారు. అయితే దానిని వాడటం ఎవ్వరికీ తెలియలేదు. మా నాన్నగారు దానితో ఎక్స్పరిమెంట్ చేసి, పాతాళభైరవి సినిమా అంతా ఆ వాద్యంతోనే రీరికార్డింగ్ చేశారు. అదే ప్రధానమైన వాద్యపరికరం. అందరూ ఆశ్చర్యపోయారు. విజయ - వాహినీ స్టూడియోలో మానేసి బయటకు వస్తున్న సందర్భంలో ఆ సంస్థవారు, నాన్నగారికి బహుమతిగా పియానో బహూకరించారు. నాన్నగారు గతించాక ఆ పియానో నా దగ్గర పదిలంగా భద్రపరుచుకున్నాను. దానిని నేను అపురూపంగా చూసుకుంటాను. నేటికీ దాని మీద వాయిస్తుంటాను. డప్పు మీద పాట... రోజులు మారాయి చిత్రానికి ఈ సంవత్సరం అరవై వసంతాలు నిండాయి. ఆ చిత్రంలో ‘ఏరువాకా సాగాలోరన్నో చిన్నన్నా’ పాట నేటికీ అందరి మదిలో మెదులుతూనే ఉంది. కేవలం డప్పు మీద స్వరపరిచిన ఈ పాట ఆ రోజుల్లో సంచలనం. దానిని స్వరపరచి చరిత్రను సృష్టించినవారు మాస్టర్ వేణు. - మూర్తి చందర్, ఫోన్ 9952926552 - ఫీచర్స్ ప్రతినిధి, సాక్షి, చెన్నై -
మాస్టర్ వేణు... మాస్టర్ మూర్తి చందర్...
రోజులు మారాయి చిత్రానికి ఈ సంవత్సరం 60 వసంతాలు నిండాయి. ఆ చిత్రంలో ‘ఏరువాకా సాగాలోరన్నో చిన్నన్నా’ పాటను కేవలం డప్పు మీద స్వరపరిచారు మాస్టర్ వేణు. వారి పెద్ద కుమారుడు మూర్తి చందర్, తండ్రిగారికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు. నేను పుట్టింది మచిలీపట్టణంలో. కాని పెరిగిందంతా మద్రాసులోనే. నేను పుట్టే సమయానికి నాన్నగారు సినిమాలలో చాలా బిజీగా ఉండేవారు. 1950 - 1960 మధ్య సినీ పరిశ్రమకు స్వర్ణయుగం. దర్శకులు, నటులు, సాహిత్యం, సంగీతం... ఒకటేమిటి అన్ని రంగాలకూ పట్టాభిషేకం జరిగిన రోజులు. సంగీత దర్శకులంతా ఎవరి శైలిలో వారు కళామతల్లికి పేరుప్రఖ్యాతులు తీసుకువచ్చారు. అందులో నాన్న కూడా. తనదైన శైలిలో పాటలు చేస్తూ పూర్తిగా పాటల రికార్డింగులో బిజీగా ఉండేవారు. ఆ పది పదిహేను సంవత్సరాలు సంగీత కళామతల్లికి స్వరార్చన నిత్యం చేశారు నాన్న. ఆ తరవాత సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. దాంతో 1965 తర్వాత ఆయనకు సినిమాలు బాగా తగ్గాయి. మూడేళ్లకో సినిమా వచ్చేది విశ్రాంతి సమయం ఎక్కువ దొరికింది. ఇంట్లోనే ఎక్కువసేపు ఉండేవారు. మాతో చక్కగా ఆడేవారు. నాన్నతో ఆడుకోవడమే మాకు మధురానుభూతి. నాన్నది పసిపిల్లవాడి తత్త్వం. ఎక్కువగా మాతో గాలిపటాలు, క్రికెట్, బొంగరాలు, కర్రబిళ్ల ఆడేవారు. ఆయనతో కలిసి ఇంగ్లీషు సినిమాలు చూసేవాళ్లం. నాన్నకి సంగీతం తప్పించి ఇంకే విషయాలూ తెలియవు. అందువల్ల మా చదువు బాధ్యత అంతా మా అమ్మగారే తీసుకున్నారు. చదువుకోమని అమ్మ చెబుతుంటే అమ్మ మీద కోపం వస్తుండేది. నాన్న మాతో సమానంగా ఆడుతుండేవారు. అందుకని నాన్నమీద ఇష్టంగా ఉండేది. కాని పెద్దయిన తర్వాత అమ్మ ఎందుకలా కేకలేసిందో అర్థమైంది. స్కూల్ చదువు పూర్తయ్యాక కాలేజీ చదువులో చేరాం. నాన్న మమ్మల్ని మ్యూజిక్ ఫీల్డ్ లోకి వచ్చేందుకు ప్రోత్సహించలేదు. నేను, తమ్ముడు భానుచందర్ ఇద్దరం బి. ఏ పూర్తి చేశాం. భాను గిటార్, నేను పియానో వాయించేవాళ్లం. నాన్నగారికి బహూకరించిన పియానో నా దగ్గరే ఉంది. దాని మీద ఇప్పటికీ నేను వాయిస్తూనే ఉంటాను. అమ్మ నన్ను మెడిసిన్ చదివించాలనుకుంది. కాని నాకు సంగీతం మీద శ్రద్ధ ఏర్పడి, మ్యూజిక్ డిప్లమా చేశాను. నాకు సహజంగా సిగ్గు బిడియం ఎక్కువ. అందువల్ల నాన్నతో స్టూడియోలకి వెళ్లేవాడిని కాను. కాని భాను మాత్రం నాన్నతో వెళ్లి, ఆయన పాటలకు గిటార్ వాయిస్తుండేవాడు. అలాగే రెండు సినిమాలకు సంగీతం కూడా చేశాడు. నేను హోలీ ఏంజెల్స్ స్కూల్లో మ్యూజిక్ టీచర్‌గా పది సంవత్సరాలు పనిచేశాను. రాజ్ కోటి ఇద్దరూ విడివిడిగా ట్యూన్లు చేయడం మొదలుపెట్టాక, నేను రాజ్ దగ్గర అసోసియేట్‌గా పది సంవత్సరాలు పనిచేశాను. తమ్ముడు యాక్టింగ్ స్కూల్లో చేరాడు. అది కూడా అమ్మ అనుమతితోనే. నాన్నగారు వద్దని పట్టుబట్టినప్పటికీ అమ్మ పూర్తిగా ప్రోత్సహించింది. 1980లలో భానుచందర్ సినిమాల వైపు వెళ్లిపోయాడు. తరంగిణితో హిట్ అయ్యాడు. అది చూసి నాన్న సంతోషించారు. బ్రేక్ వచ్చిందని ఆనందపడ్డారు. నా గురించి ఆయనకి ఎప్పుడూ బాధగా ఉండేది. నేను ఫిలాసఫీ వైపు మొగ్గుచూపాను. వివాహం చేసుకోకుండా బ్యాచిలర్‌గా ఉండిపోయాను. జిడ్డు కృష్ణమూర్తి షౌండేషన్‌లో వలంటీర్‌గా పనిచేస్తున్నాను. ఆయన ఆంగ్లంలో ఇచ్చిన ప్రసంగాలను నేను తెలుగులో రికార్డు చేస్తున్నాను. 1981లో నాన్నగారు గతించారు. అమ్మ చాలా జాగ్రత్తగా పొదుపు చేయడం వల్లే ఇల్లు కొనుక్కోగలిగాం. విజయావాహినీ సంస్థలో మ్యూజిక్ ఆరేంజర్గా, మ్యూజిక్ కండక్టర్‌గా పనిచేశారు మాస్టర్ వేణు. ఘంటసాల సంగీతం స్వరపరచిన ‘పాతాళభైరవి’ సినిమాకి రీరికార్డింగ్ పని మాస్టర్ వేణు చేశారు. అప్పట్లో విజయా వాహినీ వారు హ్యామండ్ ఆర్గాన్ తెప్పించారు. అయితే దానిని వాడటం ఎవ్వరికీ తెలియలేదు. మా నాన్నగారు దానితో ఎక్స్పరిమెంట్ చేసి, పాతాళభైరవి సినిమా అంతా ఆ వాద్యంతోనే రీరికార్డింగ్ చేశారు. అదే ప్రధానమైన వాద్యపరికరం. విజయవాహినీ స్టూడియోలో మానేసి బయటకు వస్తున్న సందర్భంలో వారు, నాన్నగారికి బహుమతిగా పియానో బహూకరించారు. ఇది విజయవాహినీ వారు బహూకరించిన వాద్యం. దానిని నేను అపూరూపంగా చూసుకుంటాను. నేటికీ దాని మీద వాయిస్తుంటాను. - మూర్తి చందర్ (మాస్టర్ వేణు పెద్ద కుమారుడు, ఫోన్ 09952926552) - సంభాషణ, ఫొటోలు: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై -
ఓ గాయకుడి కలం సవ్వడి
కొత్త పుస్తకం గాయకుడిగా సుపరిచితులైన స్వర్గీయ పి.బి. శ్రీనివాస్ కలానికి కూడా బోలెడంత పదునుంది. 1963 - 64 ప్రాంతంలో అప్పటి ప్రముఖ మాసపత్రిక ‘జ్యోతి’లో ఆయన తన రచనా పటిమను ప్రదర్శించారు. ఆనాటి సుప్రసిద్ధ తెలుగు సినీ సంగీత దర్శకులనూ, వారి పనితీరునూ ఆహ్లాదకరంగా అక్షరాలలో ఆవిష్కరించారు. యాభయ్యేళ్ళ తరువాత తాజాగా పుస్తకరూపంలో వచ్చిన అప్పటి ఆ వ్యాసాల నుంచి కొన్ని మల్లెలు... సంగీత దర్శకులు ఎస్. రాజేశ్వర్‌రావు గారు భలే తమాషా మనిషి, విచిత్రమైన వ్యక్తి. ఎవరితోనైనా ఇట్టే పరిచయం చేసేసుకుని సరదాగా మాటాడేయగలిగే శక్తి ఆయనది. ఆ ధోరణిలో నవ్వుతూ నవ్వుతూనే నసాళానికి అంటిపోయే జోకులు బ్రేకుల్లేకుండానే స్వీట్ కేకుల్లా తెగవేయగలిగే నేర్పు ఉంది. ఒకరోజు మేం రిహార్సల్సు చేస్తూండగా వీరికీ, వీరి అన్నగారైన హనుమంతరావుగారికీ ఒక చిత్ర విచిత్రమైన సంభాషణ జరిగింది. మాటల సందర్భంలో రా.రా. నౌషాదునీ, నౌషధ సంగీతాన్ని తెగ పొగడసాగారు. వీరి అన్నగారు ‘‘ఏమిటోయ్! నువ్వు చాలా గొప్పవాడవని మన ప్రొడ్యూసర్లు నిన్ను గౌరవించి పిలిస్తే నువ్వేమిటి ఇలా ఎవరెవరో నౌషాదు గురించీ, వాళ్ళ గురించీ లంకించుకున్నావూ’’ అని సాగదీశారు. తన తమ్ముణి అక్కడివాళ్లెక్కడ అపార్థం చేసుకుంటారోనన్న భయంతో. దానికి రా.రా. గారేమన్నారో తెలుసా? ‘‘నౌషాఁదుగారు గొప్పవాళ్ళన్నాం గాని, మనం కాఁవఁన్నామా? ఎవరి గొప్పవారిదే. ఒకరి గొప్పతనాన్ని చెప్పుకున్నందువల్ల తప్పూ లేదు. మనం తగ్గీపోము’’ అన్నారు. (ఈ ‘‘మనం’’ అనేది వారు తరచూ ‘‘నేను’’ అనే మాటకి బదులు వాడుతూ వుండే ఊతపదం.) ఇదీ వారి సామర్థ్యం. ఎవరేమాట అన్నా, వెంటనే దానికి టంకంపొడిలా అతుక్కునేలా జవాబిస్తారు. మాస్టర్ వేణు సంగీతకారులే కాక, గాయకులు కూడా. వీరి హాబీలలో ముఖ్యమైనది ఇంగ్లిషు, హిందీ చిత్రాలు చూడ్డం. నౌషద్ సంగీతమిస్తే చాలు, ప్రథమ శ్రేణికి చెందిన చెత్త చిత్రమైనా సరే చూసి ఆనందించి మరీ చక్కా వస్తారు. మరో ముఖ్యమైన హాబీ ‘పియానో’ వాయించడం. అలాగే పదిహేను వాద్యాల్లో ప్రావీణ్యం సంపాయించారు. హార్మోనియాన్ని మాష్టర్ చేశారు. పాటలకి వరసలు కూర్చేటప్పుడు, పాటలలోని మాటలలోని అక్షరానికీ అక్షరానికీ మధ్య లక్ష సంగతులు ఇరికించడానికే ప్రయత్నిస్తారు వీలైనంతవరకూ, అర్థం చెడనంతవరకూ, ఈ సంగతులనేకంగా మరాఠీ బాణీలో ఉంటాయి. ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ చేతనైనందువల్లనే, వీరికి ‘రికార్డింగు’ సమయంలో సౌకర్యం. పని సుకరం. మాస్టర్ వేణు మనసుపైనే కాక వారి సంగీతం పైన కూడా నౌషాదు ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన్నికైన రాగాల ఎన్నికలో, వాద్యప్రయోగాలలో. వేణు ఫ్లూట్, క్లార్నెట్టు కాంబినేషన్, వయోలిన్ల కో ఆర్డినేషనంతా నౌషాద్ బాణీయే. లోకవ్యవహారంలో ఆయన (పెండ్యాల) నాగేశ్వరరావే కానీ, సంగీత లోకవ్యవహారంలో ఆయన పేరు రాగేశ్వరరావు. అంతే కాదు; ఓర్పు, నేర్పు, కూర్పులకు ఆయన పెట్టింది పేరని పి.బి. శ్రీనివాస్ తీర్పు. టేకుల సెలక్షన్లో పెండ్యాల చూపే శ్రద్ధాసక్తులు నిర్మాత తిలక్‌గారి కంపెనీలు - అనగా ‘అనుపమా’లు. రాత్రిళ్ళు రికార్డింగులు జరిగేటప్పుడు గూడా పాడిన మేము, వాద్యాలు బజాయించిన ఆర్కెస్ట్రా బృందం అలిసిపోయి ఇంటికి దౌడు తీసినా, తెల్లవారిపోతున్నా సరే, ఇసుమంతయు విసుగొందక చేయించిన ఇరవై టేకులూ విని, ప్రతీ టేకులోనూ, తనకి నచ్చిన తునకలు (బిట్స్) అన్నీ గుర్తించి పెట్టుకుని, వాటినన్నిటినీ కలిపి, మొత్తం మీద నీటైన టేకొకటి తయారించుకుంటారు. ‘అత్తా ఒకింటి కోడలు’ చిత్రానికి, జిక్కిగారు నేనూ బృందసహాయంతో ఆలపించిన ‘పైలా పైలా పచ్చీసు’ పాటే దీనికి తిరుగులేని తార్కాణం. ఆ రోజున ఖర్మం కొద్దీ ఒక్క టేకూ పూర్తిగా తృప్తిగా రాలేదు. ‘రిదం’లో కాంప్లికేషన్ వల్లనైతేనైం, నిద్రాముద్రితాలైన ముఖాలతో జోగుతూ ఉండడం వల్లనైతేనేం, తాళంలో ఒకరు చేరితే మరొకరు చేరేవారు కారు. ఎలాగో ఇసకలోంచి నూనె పిండినట్టుగా, కొన్ని టేకులు టేకాము. మంచి పాట చెడిపోయిందనే బాధతోనే బయలుదేరాము ఇళ్ళకి. కానీ, చివరికి ఏం చేశారో, ఎలా సాధించారో కాని, మేము పిక్చర్లో ఆ పాట విన్నప్పుడదిరి పోయాం. ఇంత చక్కని టేకెక్కడ దొరికింది ఈయనకని. డిఫెక్ట్సన్నీ ఎఫెక్ట్స్‌గా మారిపోయాయి పెండ్యాల చేతిలో. కె.వి. మహదేవన్ పదింటికి రికార్డింగు ప్రారంభిస్తారు. పదకొండింటికల్లా ‘‘ప్యాకప్’’ అంటారు. చకచకా సాగిపోతుంది వీరి ‘వర్కు’ కొనసాగేవరకు. మధ్య మధ్య పకపకలతోనూ వికవికలతోనూ దద్దరిల్లుతుండడం కూడా కద్దు - రికార్డింగు హాలు. మహాదేవన్ గారితో పనిచేయడం మహా సుళువు. ఈజీ కంపోజింగులో కడుంగడు నేర్పరులు. ‘పొన్నిత్తిరునాళ్’ అనే తమిళ చిత్రానికి ‘ఏన్ శిరిత్తాయ్ ఎన్నైప్పార్తు (నన్ను జూచి నగవేటికి)’ వరస కట్టడానికి కూర్చున్నారు. నన్ను రిహార్సల్సుకి పిలిపించిన పిదప, ఆనాడే శ్రీ బడే గులామ్ ఆలీఖాన్ పాట విని ప్రభావితుడనైయున్న నేను నాలో నేనే ‘పహాడి’ రాగాన్ని సన్నగా గొణుగుకుంటున్నా. అదే రాగంలో అర నిమిషంలో అక్కజమందేలా అమర్చేశారు. ఆ పాట హిట్టయింది. -
గీత స్మరణం
పల్లవి : ఆమె: అది ఒక ఇదిలే అతనికే తగులే సరికొత్త సరసాలు సరదాలు చవిచూపెలే ఆహ ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే లాలలాలలాలలాలలలా ॥ అది ఒక ఇదిలే... చరణం : 1 అతడు: మెచ్చాను వచ్చాను ఏమేమో తెచ్చాను అహ నచ్చాను అన్నావా ఏమైనా ఇస్తాను అని పలికిందిరా... చె లి కులికుందిరా... ఎద రగిలిందిరా మతి చెదిరిందిరా చెదిరిందిరా... అది ఒక ఇదిలే ఆమెకె తగులే సరికొత్త సరసాలు సరదాలు చవిచూపెలే ఆహ ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే అది ఒక ఇదిలే... చరణం : 2 ఆ: సిగ్గేల అన్నాడు నా బుగ్గ గిల్లాడు (2) అహ మొగ్గల్లే ఉన్నావు విరబూయమన్నాడు మది పులకించెను... మరులొలికించెను... నను మరిపించెను తగుననిపించెను అనిపించెను... అది ఒక ఇదిలే... చరణం : 3 అ: నడకేది అన్నాను నడిచింది ఒకసారి అహ నడుమేది అన్నాను నవ్వింది వయ్యారి నా వద్దున్నదే... తన ముద్దన్నదీ... చేకొమ్మన్నదీ నీ సొమ్మన్నది... సొమ్మన్నది ఆ: ఎండల్లే వచ్చాడు మంచల్లే కరిగాను ఆహా వెన్నెల్లు కురిశాడు వేడెక్కిపోయాను ఇది బాధందునా ఇది హాయందునా ఏది ఏమైననూ నే తనదాననూ తనదాననూ... ॥ చిత్రం : ప్రేమించిచూడు (1965) రచన : ఆచార్య ఆత్రేయ సంగీతం : మాస్టర్ వేణు గానం : పి.బి.శ్రీనివాస్, పి.సుశీల