గీత స్మరణం
పల్లవి :
ఆమె: అది ఒక ఇదిలే అతనికే తగులే
సరికొత్త సరసాలు సరదాలు చవిచూపెలే
ఆహ ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే
లాలలాలలాలలాలలలా ॥
అది ఒక ఇదిలే...
చరణం : 1
అతడు: మెచ్చాను వచ్చాను ఏమేమో తెచ్చాను
అహ నచ్చాను అన్నావా ఏమైనా ఇస్తాను
అని పలికిందిరా... చె లి కులికుందిరా...
ఎద రగిలిందిరా మతి చెదిరిందిరా చెదిరిందిరా...
అది ఒక ఇదిలే ఆమెకె తగులే
సరికొత్త సరసాలు సరదాలు చవిచూపెలే
ఆహ ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే
అది ఒక ఇదిలే...
చరణం : 2
ఆ: సిగ్గేల అన్నాడు నా బుగ్గ గిల్లాడు (2)
అహ మొగ్గల్లే ఉన్నావు విరబూయమన్నాడు
మది పులకించెను... మరులొలికించెను...
నను మరిపించెను తగుననిపించెను అనిపించెను...
అది ఒక ఇదిలే...
చరణం : 3
అ: నడకేది అన్నాను నడిచింది ఒకసారి
అహ నడుమేది అన్నాను నవ్వింది వయ్యారి
నా వద్దున్నదే... తన ముద్దన్నదీ...
చేకొమ్మన్నదీ నీ సొమ్మన్నది... సొమ్మన్నది
ఆ: ఎండల్లే వచ్చాడు
మంచల్లే కరిగాను
ఆహా వెన్నెల్లు కురిశాడు
వేడెక్కిపోయాను
ఇది బాధందునా
ఇది హాయందునా
ఏది ఏమైననూ నే తనదాననూ
తనదాననూ...
॥
చిత్రం : ప్రేమించిచూడు (1965)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : మాస్టర్ వేణు
గానం : పి.బి.శ్రీనివాస్, పి.సుశీల