match fixing scam
-
"మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కాదు.." హైకోర్టు సంచలన తీర్పు
Match Fixing Not Punishable Says Karnataka High Court: క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కాదని, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) ప్రకారం శిక్షార్హం కూడా కాదని ఆదేశించింది. 2019 కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) ఫిక్సింగ్ కేసుకు సంబంధించి ఈ తీర్పును వెల్లడించింది. జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. కేసును కొట్టి వేస్తూ, దోషులను శిక్షించడం బీసీసీఐ అధికార పరిధిలోకి వస్తుందని పేర్కొంది. నిందితులపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేయడం కరెక్ట్ కాదని, ఐపీసీ ప్రకారం వీరికి చీటింగ్ కేసు వర్తించదని వివరించింది. ఓ ఆటగాడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడితే.. క్రీడను అమితంగా అభిమానించే ప్రేక్షకులను మోసం చేశాడన్న భావన కలగడం సహజమని, అయితే దీన్ని పరిగణలోకి తీసుకుని నిందితులను శిక్షించే హక్కు కోర్టుకు లేదని, ఇలాంటి కేసుల్లో చర్యలు తీసుకునే అధికారం సంబంధిత క్రికెట్ బోర్డులకే ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, 2019 కేపీఎల్ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి భారీ ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పలువురు ఆటగాళ్లు, జట్ల యజమానులు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఓ అధికారి సహా ఓ బుకీపై బెంగళూరు పోలీసులు ఛార్జిషీట్లు దాఖలు చేశారు. వీరిలో సిఎం గౌతమ్ (ప్లేయర్, ఏ1), అబ్రార్ ఖాజీ (ప్లేయర్, ఏ2), అలీ అష్పక్ (బెల్గావి పాంథర్స్ యజమాని, ఏ3), అమిత్ మావి (బుకీ, ఏ4) ప్రధాన నిందితులుగా ఉన్నారు. చదవండి: కోహ్లికి షోకాజ్ నోటీసులు.. స్పందించిన గంగూలీ -
ఇజ్జత్ లేదు.. ఏం లేదు.. కేవలం డబ్బే కావాలి.. ఛీ యాక్: భజ్జీ
Harbhajan Singh- Mohammad Amir Twitter War: టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ మధ్య ట్విటర్ యుద్ధం తారస్థాయికి చేరింది. సరదాగా మొదలైన మాటల యుద్ధం కాస్తా.. సీరియస్‌గా మారింది. వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే ఆమిర్.. ఒకానొక టెస్టు మ్యాచ్‌లో షాహిద్ ఆఫ్రిది.. హర్భజన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన వీడియో క్లిప్‌ను షేర్ చేశాడు. భజ్జీ బౌలింగ్‌లో ఆఫ్రిది సిక్సర్లు బాదిన దృశ్యాలు అవి. అయితే, ఈ వీడియో హర్భజన్‌కు ఆగ్రహం తెప్పించింది. Lords mai no ball kaise ho gya tha ?? Kitna liya kisne diya ? Test cricket hai no ball kaise ho sakta hai ? Shame on u and ur other supporters for disgracing this beautiful game https://t.co/nbv6SWMvQl — Harbhajan Turbanator (@harbhajan_singh) October 26, 2021 ఆమిర్‌కు కౌంటర్ ఇచ్చే క్రమంలో... 2010 నాటి లార్డ్స్ టెస్టుకు సంబంధించిన నో- బాల్ స్కాండల్‌ను భజ్జీ ప్రస్తావించాడు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన సదరు టెస్టు మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్, ఆమిర్‌లు తప్పు చేశారని నిరూపితం కావడంతో కొంతకాలం నిషేధం ఎదుర్కొన్నారు. ఈ వివాదాన్ని గుర్తుచేస్తూ భజ్జీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు చదవండి: Shoaib Malik: సెలక్టర్ల నిర్ణయం సరైందేనని నిరూపించాడు: జహీర్ ఖాన్ ‘‘లార్డ్స్‌లో నో బాల్ ఎలా అయ్యిందో?? ఎంత ఇచ్చారు.. ఎవరు ఇచ్చారు? టెస్టు క్రికెట్... అది నో బాల్ ఎలా అవుతుంది? సిగ్గుపడు.. ఆటను అగౌరపరిచినందుకు నువ్వు, నీ మద్దతు దారులు సిగ్గుపడాలి’’ అని ట్విటర్ వేదికగా ఆమిర్‌కు కౌంటర్ ఇచ్చాడు. For people like you @iamamirofficial only Paisa paisa paisa paisa .. na izzat na kuch aur sirf paisa..bataoge nahi apne desh walo ko aur supporters ko k kitna mila tha .. get lost I feel yuk talking to people like you for insulting this game and making people fool with ur acts https://t.co/5aPmXtYKqm pic.twitter.com/PhveqewN6h— Harbhajan Turbanator (@harbhajan_singh) October 26, 2021 అదే విధంగా వరుస ట్వీట్లలో... ‘‘ఆమిర్ లాంటి వాళ్లకు పైసా.. పైసా.. పైసా.. పైసా... ఇజ్జత్ లేదు.. ఏం లేదు.. కేవలం డబ్బే కావాలి.. నీకు, నీ మద్దతుదారులకు ఎంత డబ్బు దొరికిందో చెప్పగలవా.. ఛీ యాక్.. నీలా ఆటకు కళంకం తెచ్చి.. ప్రేక్షకులను పిచ్చివాళ్లుగా భావించే వాళ్లతో నేను మాట్లాడను. గెట్ లాస్ట్’’ అంటూ భజ్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత ఫిక్సర్ బౌలింగ్‌లో సిక్సర్ అంటూ సిక్సర్ బాదిన ఓ వీడియో క్లిప్ షేర్ చేసి ఆమిర్‌ను తూర్పారబట్టాడు. హర్భజన్ ట్వీట్లు నెట్టింట చర్చకు దారితీశాయి. Fixer ko sixer.. out of the park @iamamirofficial chal daffa ho ja pic.twitter.com/UiUp8cAc0g — Harbhajan Turbanator (@harbhajan_singh) October 26, 2021 Pakistan Vs England 2010 Match Fixing: 2010లో ఏం జరిగింది? ఇంగ్లండ్- పాకిస్తాన్.. 2010లో లార్డ్స్ మైదానంలో టెస్టు మ్యాచ్ ఆడాయి. తొలి రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తుండగా.. మూడు నోబాల్స్ పడ్డాయి. అయితే ఇందుకు సంబంధించిన అసలు నిజాలు రెండు రోజుల తర్వాత బయటకు వచ్చాయి. అప్పటి పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ భట్, బౌలర్లు మహ్మద్ ఆమిర్, మహ్మద్ ఆసిఫ్ అసలు స్వరూపాన్ని బయటపెట్టాయి. తనను తాను బుకీగా సల్మాన్ భట్‌తో పరిచయం చేసుకున్న జర్నలిస్టు మజర్ మజీద్.. అతడికి డబ్బు ఆశ చూపించాడు. ఇంగ్లండ్‌కు మేలు చేకూరేలా వ్యవహరించాలని కోరాడు. ఇందుకు అంగీకరించిన సల్మాన్... మొదటి రోజు ఆటలో ఆమిర్‌తో రెండు, ఆసిఫ్‌తో ఒక నో బాల్ వేయించాడు. బ్రిటన్‌కు చెందిన వార్తా సంస్థ... న్యూస్ ఆఫ్ ది వరల్డ్(ఇప్పుడు ఉనికిలో లేదు)చేపట్టిన ఈ స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను తమ టాబ్లాయిడ్లో బహిర్గతం చేసింది. క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసిన ఈ ఉదంతం పాకిస్తాన్ ప్రతిష్టను దిగజార్చింది. పాక్ ముగ్గురు క్రికెటర్లు దోషులుగా తేలారు. నిషేధం ఎదుర్కొన్నారు. జైలు పాలయ్యారు. అంతేకాదు.. ఈ వివాదం కారణంగా పాకిస్తాన్‌ను అంతర్జాతీయ క్రికెట్ సమాజం నుంచి నిషేధించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. క్రికెట్ పుట్టిన గడ్డ మీదే ఇంతటి నీచమైన పనిచేస్తారా అంటూ ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. ఈ ఘటన నేపథ్యంలో కొంతకాలం పాటు నిషేధం ఎదుర్కొన్న ఆమిర్ 2016లో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడేందుకు అనుమతి పొందాడు. ఇక ఆసిఫ్ ఏడేళ్ల పాటు నిషేధం, ఏడాది జైలు శిక్ష అనుభవించాడు. సల్మాన్ భట్ ఇంతవరకు ఈ వివాదం తాలుకు మచ్చ చెరిపేసుకోలేకపోయాడు. చదవండి: T20 World Cup: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. అతడు టోర్నీ నుంచి అవుట్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ చీకటి రోజుకు సరిగ్గా 20 ఏళ్లు
ఏప్రిల్ 11, 2000.. క్రికెట్ చరిత్రలో ఈ తేదిని ఒక చీకటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జెంటిల్మెన్ గేమ్‌గా ఉన్న క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని కుదుపేసింది. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హన్సీ క్రోన్జే మ్యాచ్ ఫిక్సింగ్‌లో ప్రధాన పాత్ర పోషించడంతో తన కెరీర్‌ను అర్థంతరంగా ముగించాల్సి వచ్చింది. అలాంటి చీకటిరోజు జరిగి నేటికి 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆరోజు ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం.. ఏప్రిల్ 2000వ సంవత్సరంలో దక్షిణాప్రికా జట్టు భారత్‌లో పర్యటించింది. ఆ సమయంలో దక్షిణాఫ్రికా జట్టుకు హన్సీ క్రోన్జే, టీమిండియా జట్టుకు మహ్మద్ అజారుద్దీన్లు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు క్రోన్జేపై అభియోగాలు రావడంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా ఇండియన్ బూకీ సంజయ్ చావ్లాతో కలిసి క్రోన్జే చర్చలు జరిపినట్లు తేలడంతో ఢిల్లీ పోలీసులు క్రోన్జేను అదుపులోకి తీసుకొని విచారించారు.(అలా వార్నర్‌ను హడలెత్తించా..!) ఈ నేపథ్యంలో వారి విచారణలో క్రోన్జే పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. వన్డే సిరీస్‌లో భాగంగా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడింది నిజమేనని ఒప్పుకొన్నాడు. అయితే అంతకుముందే భారత్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తనను సంజయ్ చావ్లా అనే ఇండియన్ బూకీకి పరిచయం చేశాడంటూ క్రోన్జే పెద్ద బాంబ్ పేల్చాడు. 1996లో టెస్టు సిరీస్ ఆడడానికి ఇండియాలో పర్యటించినప్పుడే సంజయ్ చావ్లా తనను కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందామంటూ తన దగ్గర ప్రపోజల్ తెచ్చాడని క్రోన్జే పేర్కొన్నాడు. కాగా మ్యాచ్ ఫిక్సింగ్‌లో మీరు భాగమవ్వాలంటూ క్రోన్జే మాపై ఒత్తిడి తెచ్చాడని అప్పటి దక్షిణాఫ్రికా క్రికెటర్లు హర్షలే గిబ్స్, నికీ బోజే, పాట్ సిమ్‌కాక్స్ కమీషన్ ముందు వాపోవడంతో క్రోన్జే కెరీర్ ప్రమాదంలో పడింది. దీంతో ఐసీసీ కల్పించుకొని క్రోన్జేను జీవితకాలం క్రికెట్ నుంచి నిషేదిస్తున్నట్లు పేర్కొంది. దీంతో అప్పటివరకు విజయవంతమైన కెప్టెన్‌గా ఒక వెలుగు వెలిగిన హన్సీ క్రోన్జే కెరీర్ చివరకు మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో అర్థంతరంగా ముగిసింది. ఇది జరిగిన రెండు సంవత్సరాలకు జూన్ నెలలో క్రోన్జే ప్రయాణం చేస్తున్న విమానం క్రాష్‌కు గురవ్వడంతో అతను మరణించినట్లు దక్షిణాఫ్రికా మీడియా ప్రకటించింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సహకరించినందుకు మహ్మద్ అజారుద్దీన్‌పై జీవితకాలం నిషేధం విధిస్తున్నట్లు బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేగాక బూకీలతో సంబంధాలు నెరిపారన్న కారణంతో అజయ్ జడేజాపై ఐదేళ్లు, మనోజ్ ప్రభాకర్, అజయ్ శర్మలపై జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు అప్పట్లో బీసీసీఐ తెలిపింది. -
నటులకు మ్యాచ్ ఫిక్సింగ్ మరక
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో రోజుకొక కొత్త విషయం బయటకు వస్తోంది. ఇన్ని రోజులు ఆటగాళ్లు, కోచ్‌లు, బుకీల బాగోతంతోపాటు హనీట్రాప్ మరక కూడా నమోదైంది. తాజాగా ఈ స్కామ్‌లో శాండల్వుట్ నటీనటులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నగర పోలీసు కమిషనర్ భాస్కర్‌రావు బుధవారం మీడియాతో మాట్లాడుతూ కేపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు నటీనటులకు సంబంధం ఉందని అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. మ్యాచ్‌లు ముగిసిన తర్వాత జరిగే పార్టీల్లో నటీనటులు కూడా పాల్గొన్నారని తెలిపారు. ఈ విందుల్లో నటీనటులు, ఆటగాళ్లతో కలిసిమెలిసి కనిపించేవారన్నారు. తద్వారా కొద్ది రోజుల్లోనే నటులు భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసిందని తెలిపారు. హఠాత్తుగా వీరికి అంత డబ్బు ఎలా వచ్చిందనే విషయాన్ని మున్ముందు విచారణలో తెలుసుకుంటామన్నారు. కేవలం రెండు, మూడు సినిమాలు చేసిన తర్వాత ధనవంతులయిపోవడం సాధ్యమయ్యే పనేనా అనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. బెళగావి ప్యాంథర్స్ కోచ్ సు«దీర్ శింధేను మంగళవారం అరెస్టు చేసినట్లు, అతని నుంచి విచారణలో పలు విషయాలను రాబట్టినట్లు చెప్పారు. ఆ క్లబ్ నుంచే ఫిక్సింగ్ సుధీర్ శింధేకు చెందిన జయనగరలోని సోషల్ క్రికెట్ క్లబ్లో చాలా మంది ఆటగాళ్లు క్రికెట్ ఆడేవారని, ఆ ఆటగాళ్లే దాదాపుగా చాలామంది బెళగావి ప్యాంథర్స్ జట్టులో ఉన్నారని వెల్లడించారు. అంతేకాకుండా ఈ క్లబ్లో శిక్షణ పొందిన క్రికెటర్లు కేపీఎల్లోని చాలా జట్లలో చేరారని తెలిపారు. ఆయా జట్లలో చేరిన ఈ ఆటగాళ్లతో∙మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడే వారని చెప్పారు. ఆ క్రికెట్ క్లబ్‌కు బెళగావి జట్టు యజమాని అస్ఫాక్ థార్ అలి తరచూ వచ్చి ఆటగాళ్లతో పరిచయాలు పెంచుకునే వాడని తెలిపారు. ఈ కేసుతో సంబంధమున్న సినీ నటులు అప్రూవర్‌గా మారితే వారికి పోలీసుల నుంచి సహాయంతోపాటు రక్షణ కల్పిస్తామని కమిషనర్ తెలిపారు. కేపీఎల్ రద్దు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో కేపీఎల్కు మాయని మచ్చ పడింది. ఇప్పటికే ఈ కేసులో ఆటగాళ్లు, జట్ల యజమానులు, కోచ్‌లతో కలుపుకుని సుమారు 9 మంది వరకు అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఫిక్సింగ్ కేసు తేలే వరకు కేపీఎల్ నిర్వహించరాదని కర్నాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) నిర్ణయించింది. వచ్చే ఏడాది జరగనున్న కేపీఎల్ టోర్నీని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. క్యాబ్‌లకు సీసీ కెమెరా, జీపీఎస్ ఓలా, ఉబర్ తదితర ట్యాక్సీలు, క్యాబ్‌లల్లో సీసీ టీవీ కెమెరాలను అమర్చుకోవాలని కమిషనర్ సూచించారు. హైదరాబాద్ వద్ద పశువైద్యురాలిపై దారుణ హత్యాచారం నేపథ్యంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ట్యాక్సీల్లో సీసీటీవీ కెమెరా, జీపీఎస్, ఎమెర్జెన్సీ బటన్ అమర్చుకోవడం తప్పనిసరి అని చెప్పారు. హైదరాబాద్ ఘటన తర్వాత బెంగళూరు నగర పోలీసులు సిద్ధం చేసిన బీసీపీ సురక్షా యాప్ డౌన్లోడ్లు పెరిగాయని తెలిపారు. -
'మ్యాచ్ ఓడిపోతే 1.35 కోట్లు ఇస్తామన్నారు'
మెల్బోర్న్: ప్రపంచ టెన్నిస్‌ను మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి ఆరోపణలు కుదిపేస్తున్న నేపథ్యంలో వరల్డ్ నంబర్ 1 టెన్నిస్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ సంచలన విషయాలు వెల్లడించాడు. తన కెరీర్ ఆరంభంలో మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తనను కూడా బెట్టింగ్ దళారులు ఆశ్రయించినట్టు వెల్లడించాడు. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుండగా.. బీబీసీ, బజ్‌ఫీడ్ మీడియా సంస్థలు టెన్నిస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించాయి. గడిచిన దశాబ్దకాలంలో దాదాపు 50 మంది ఆటగాళ్లు పలుమార్లు మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు తెలిపాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన వారిలో టాప్ 50 ర్యాకింగ్ ఆటగాళ్లు, గ్రాండ్‌స్లామ్ చాంపియన్లు కూడా ఉన్నారని స్పష్టం చేశాయి. దీంతో ఉలిక్కిపడిన ప్రపంచ టెన్నిస్ సమాఖ్య అధికారులు మ్యాచ్‌ఫిక్సింగ్ జరిగినట్టు తమ దృష్టికి రాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో 2007లో తనను కూడా బెట్టింగ్ దళారులు పరోక్షంగా ఆశ్రయించారని జకోవిక్ తెలిపారు. అప్పట్లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవాలని తనకు దళారులు చెప్పారని అన్నారు. అయితే తాను వెంటనే దళారుల ఆఫర్‌ను తిరస్కరించానని, తాను గట్టిగా స్పందించడంతో వారు మళ్లీ తన జోలికి రాలేదని జకోవిక్ తెలిపారు. టెన్నిస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్పై బీబీసీ కథనాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు. అప్పుడప్పుడు టెన్నిస్‌లో ఇలాంటి ఆరోపణలు రావడం తన దృష్టికి కూడా వచ్చిందని తెలిపారు. మ్యాచ్ ఓడిపోతే రెండు లక్షల డాలర్లు (రూ. 1.35 కోట్లు) ప్రతిఫలంగా ఇస్తామని జకోవిక్‌కు దళారులు ఆఫర్ చేసినట్టు తెలిసింది. కానీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు తాను ఎప్పుడూ పాల్పడలేదని, అది ఆటలో నేరం లాంటిదని జకోవిక్ చెప్పారు.