maths test
-
ఆర్యభట్ట మ్యాథ్స్ కాంపిటీషన్; మొదటి విజేతకు లక్షన్నర
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ స్కిల్ డవలప్మెంట్(ఏఐసీటీఎస్‌డీ), ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థులతో కలిసి ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. మ్యాథమెటిక్స్‌లో ప్రతిభావంతులను గుర్తించి.. భవిష్యత్ టెక్నాలజీ సైంటిస్ట్‌లుగా ఎదిగేలా ప్రోత్సహించేందుకు ఈ పరీక్ష జరుపుతోంది. ఈ ఏడాదికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్‌కు అర్హతలు, ప్రయోజనాలు, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం.. అర్హతలు దేశంలోని ఏదైనా కళాశాల, లేదా పాఠశాల విద్యార్థులు ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 10ఏళ్ల నుంచి 24ఏళ్లలోపు ఉండాలి. జాతీయ స్థాయి పోటీలో తమ మ్యాథమెటిక్స్ నైపుణ్యాలను ప్రదర్శించాలనే అభిలాష ఉండాలి. ప్రయోజనాలు పరీక్షలో ప్రతిభ చూపిన టాప్ 20 మందిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో టాప్ –3ని విజేతలుగా ప్రకటిస్తారు. మొదటి విజేతకు రూ.1.5 లక్షలు, రెండో విజేతకు రూ.50 వేలు, మూడో విజేతకు రూ.పదివేలు అందిస్తారు. దీంతోపాటు ఏఐసీటీఎస్‌డీ ధ్రువపత్రం, నేషనల్ మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ ట్రోఫీ ఇస్తారు. అదేవిధంగా రోబోటిక్స్ ఆటోమేషన్, సాఫ్ట్వేర్స్ విత్ ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్స్‌లో ఉచిత శిక్షణ లభిస్తుంది. అంతేకాకుండా ఏఐసీటీఎస్‌డీ నిర్వహించే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా పొందొచ్చు. స్కాలర్షిప్కు కూడా అవకాశం ఉంది. పరీక్ష విధానం! పరీక్ష ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. ఇంటి నుంచే రాయొచ్చు. ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్ విధానం(ఎంసీక్యూ)లో ఉంటుంది. 30 ప్రశ్నలకు– 60 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం 45 నిమిషాలు. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత వేస్తారు. ల్యాప్‌ట్యాప్ లేదా పీసీ ద్వారా పరీక్షకు హాజరుకావచ్చు. రాత పరీక్షలో ప్రతిభ చూపిన టాప్ 20 మందికి ఆన్లైన్ లైవ్ ఇంటర్వ్యూ ఇంటి నుంచే హాజరుకావచ్చు. ► పది నుంచి పదమూడేళ్ల వయసు విద్యార్థులకు గ్రూప్–1 విభాగం పరీక్ష; 14ఏళ్ల నుంచి 17 ఏళ్ల వయసు విద్యార్థులకు గ్రూప్–2 విభాగం పరీక్ష; 18ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసు విద్యార్థులకు గ్రూప్–3 విభాగం పరీక్ష ఉంటుంది. ఆయా విభాగం పరీక్షలకు సిలబస్ భిన్నంగా ఉంటుంది. ► గ్రూప్–1 విభాగం విద్యార్థులకు చైన్ రూల్, పర్సంటేజెస్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, నంబర్ సిస్టమ్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ క్యాలెండర్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ► గ్రూప్–2 విభాగం విద్యార్థులకు కంపేరింగ్ క్వాంటిటీస్, ఏజెస్, ట్రైన్స్, టైమ్ అండ్ వర్క్, ట్రూ డిస్కౌంట్, చైన్ రూల్, హెచ్‌సీఎఫ్ అండ్ ఎల్సీఎం, ప్రాఫిట్ అండ్ లాస్ అంశాలపై ప్రశ్నలు ఎదురవుతాయి. ► గ్రూప్–3 వి«భాగం విద్యార్థులకు ప్రాఫిట్ అండ్ లాస్,రేషియో అండ్ ప్రపోర్షన్,స్పీడ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంటరెస్ట్, టైమ్ అండ్ వర్క్, ట్రైన్స్, చైన్ రూల్, ఏజెస్‌పై ప్రశ్నలు అడుగుతారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.290. మొదట దరఖాస్తు చేసిన పదివేల మందిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ► దరఖాస్తులకు చివరి తేది: 20.05.2021 ► ఆన్లైన్ పరీక్ష తేది: 10.06.2021 ► తుది ఫలితాల వెల్లడి: 30.06.2021 ► వెబ్సైట్: https://www.aictsd.com/aryabhatta-national-maths-competition After 10th Class: టెన్త్.. టర్నింగ్ పాయింట్! -
పీటల మీద పెళ్లి ఆపిన వధువు.. కారణం తెలిస్తే షాకే!
పెళ్లి పీటల వరకూ వచ్చి వివాహాలు ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అమ్మాయి వాళ్లు కట్నం తక్కువ ఇచ్చారని, మర్యాదలు సరిగా చేయలేదని, వధూవరుల్లో ఎవరికైనా ప్రేమ వ్యవహారం ఉందని తెలియడం.. ఇలా పెళ్లి నిలిచిపోవడానికి కారణాలు అనేకం ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు చిన్న విషయాలు దాచడం వల్ల కూడా పెళ్లి ఆగిపోతుంది. అబ్బాయికి బట్టతల ఉందని, అమ్మాయి పొట్టిగా ఉందని ఇలాంటి కారణాలతో కూడా జరగకుండా ఆగిపోతుంటాయి. అచ్చం ఇలాంటి కారణంతోనే ఓ వధువు పీటల వరకు వచ్చిన పెళ్లిని ‘స్టాప్’ అంటూ క్యాన్సిల్ చేసింది. ఇంతకీ ఆ రీసన్ ఎంటో తెలుసుకోవాలంటే మ్యాటర్‌లోకి ఎంటర్ అవ్వాల్సిందే.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన విద్యావంతురాలైన యువతికి ఇటీవల మహోబా జిల్లాలోని ధవార్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పెళ్లి కుదిరింది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. శనివారం సాయంత్రం వివాహ కోసం మందిరానికి చేరుకున్నారు. అయితే వరుడి విద్యార్హతలపై అనుమానం వచ్చిన వధువు.. తనకు కాబోయే భర్తకు పెళ్లికి కొన్ని క్షణాల ముందు మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టింది.పెళ్లి దండలు మార్చుకునే ముందు అతన్ని రెండో ఎక్కం చెప్పాలని ప్రశ్నించింది. కానీ ఇది చెప్పడంలో వరుడు తడబడ్డాడు. ‘రెండో ఎక్కమేగా.. హహ చెప్పేస్తా.. చిన్నప్పుడు చదివింది కదా.. ఏం గుర్తుంటుంది.. చెప్పేస్తా... రెండు... రెండు.. ఆరు అంటూ నీళ్లు మింగాడు. ఇంకేముంది ఆగ్రహం చెందిన వధువు నిరక్షరాస్యుడైన వ్యక్తిని పెళ్లి చేసుకోనని ఖరాకండిగా చెప్పేసింది. ఆ వ్యక్తికి కనీసం రెండో ఎక్కం కూడా రాదని, పెళ్లిని నిలిపివేసింది. పెళ్లి చేసుకోమని స్నేహితులు, బంధువులు వధువును ఒప్పించినా ఫలితం లేకపోయింది. వరుడు చదువురానివాడు అని తెలిసి తాము షాక్ అయ్యారని వధువు బంధువు చెప్పారు. వరుడి విద్య గురించి తమ కుటుంబం అబద్దం చెప్పారని, అతను పాఠశాలకు కూడా పోలేదని తెలిసిందన్నారు. వరుడి కుటుంబం మమ్మల్ని మోసం చేసినప్పటికీ నా సోదరి ధైర్యంగా సమాజానికి భయపకుండా పెళ్లిని ఆపేసిందని తెలిపారు. చదవండి: కరోనా ఎఫెక్ట్ : లైవ్‌లో పెళ్లి.. ఆన్లైన్లో దీవెనలు -
‘నీకున్న విజ్ఞత.. పెద్దలకు కూడా లేదు’
వాషింగ్టన్: ఆడవారి టాపిక్ వస్తే చాలు.. మనలో చాలా మంది నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తుంటారు. అలా మాట్లాడటం చాలా గొప్పగా ఫీలవుతుంటారు. అలాంటివారు ఈ చిన్నారిని చూసి బుద్థి తెచ్చుకోవాలి. వయసులో చిన్నదే కావచ్చు కానీ ఆలోచనలో మాత్రం చాలా మంది ‘పెద్ద’లకంటే ఎన్నో రెట్లు పెద్దది. అందుకే ఈ చిన్నారి చేసిన పని ప్రశంసలు అందుకుంటుంది. ఇంతకు ఎవరా చిన్నారి.. ఏమా పని.. ఆ వివరాలు.. రిథమ్ పచేకో అనే పదేళ్ల చిన్నారి ముర్రేలోని గ్రాంట్ ఎలిమెంటరీ స్కూల్లో నాల్గవ తరగతి చదువుతుంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం పచేకో మ్యాథ్య్ టీచర్ హోం వర్క్‌లో ఓ లెక్క ఇచ్చింది. ఓ పట్టికలో నలుగురు నాల్గవ తరగతి విద్యార్థినిల బరువులు ఇచ్చి వారిలో తక్కువ బరువున్న విద్యార్థిని కంటే ఇసాబెల్ ఎంత ఎక్కువ బరువుందో కనుక్కొమంది. అయితే ఈ లెక్క పచేకోకు నచ్చలేదు. దాంతో వర్క్‌బుక్ మీద తాను ఈ లెక్కను చేయలేనని తెలపడమే కాక అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది. పచేకో తన నోట్స్‌లో ‘ఏంటిది.. ఇది వారిని చాలా బాధపెడుతుంది. నేను ఇంత కఠినంగా ఉండాలనుకోవడం లేదు. ఈ లెక్కను నేను చేయడం లేదు. మీరిచ్చిన సమస్య చాలా బాగుంది. కానీ ఓ మనిషి మిగతా వారి కంటే ఎంత ఎక్కువ బరువుందో కనుక్కొమనడం నాకు నచ్చలేదు. అందుకే మీరిచ్చిన హోం వర్క్‌ను నేను చేయడం లేదు’ అని తెలిపింది. పచేకో మ్యాథ్స్ టీచర్ కూడా ఆ చిన్నారి చూపిన విజ్ఞతకు సంతోషించింది. వెంటనే దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో నెటిజన్లు కూడా పచేకో చేసిన పనిని అభినందిస్తున్నారు. అంతేకాక ఇలాంటి తలకు మాసిన సిలబస్‌ను తయారు చేసిన అధికారులను విమర్శిస్తున్నారు. పచేకో తల్లిదండ్రులు దీనిపై స్పందిస్తూ.. ‘మా కూతురు చేసిన పనికి మేం ఎంతో గర్విస్తున్నాం. ఇంత చిన్న వయసులోనే తాను ఎంతో విజ్ఞతను చూపింది. ఏది మంచో దాని వైపే తాను నిలబడింది. చాలా సున్నితమైన అంశంపై నా కుమార్తె మరింత సున్నితంగా స్పందించింది. తన పట్ల మేం ఎంతో గర్వపడుతున్నాం’ అని తెలిపారు. -
టెన్త్ మ్యాథ్స్ రీ–ఎగ్జామ్ లేదు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పదో తరగతి విద్యార్థులకు ఉపశమనం. ప్రశ్నపత్రం బహిర్గతమైందని ఆరోపణలు వచ్చిన గణితం పేపర్‌కు పునఃపరీక్ష నిర్వహించకూడదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది. లీకేజీ ప్రభావాన్ని ప్రాథమికంగా అంచనా వేసిన తరువాతే విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా శాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ మంగళవారం వెల్లడించారు. ముందుగా అనుకున్నట్లుగా ఢిల్లీ, రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), హరియాణాలో కూడా పునఃపరీక్ష ఉండదని స్పష్టం చేశారు. ‘పదో తరగతి 11వ తరగతికి ప్రవేశద్వారం లాంటిది. అది పాఠశాల విద్యలో అంతర్భాగం. కానీ 12వ తరగతి ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు కీలకం. ఈ దశలో లీకేజీ వల్ల కొందరు అనుచిత లబ్ధి పొందడం మంచిది కాదు’ అని సీబీఎస్ఈ పేర్కొంది. ఇప్పటి వరకూ మూల్యాంకనం చేసిన కొన్ని పదో తరగతి గణితం సమాధాన పత్రాల్లో లీకేజీ వల్ల ఎవరూ లబ్ధి పొందినట్లు గుర్తించలేదంది. ఒకవేళ ఎవరికైనా అయాచిత ప్రయోజనం కలిగినట్లు వెలుగులోకి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
లెక్కలకు రెక్కలు
తిరుపతి ఎడ్యుకేషన్ : సీబీఎస్ఈ మ్యాథ్స్(గణితం) పరీక్ష ప్రశ్న పత్రం లీకైన వార్త విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. పరీక్షలు ముగిశాయనే సంతోషం మటుమాయమైంది. ఎక్కడో ప్రశ్న పత్రం లీకేజీ అయితే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను శిక్షించ డం సరికాదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడు తున్నారు.సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పదో తరగతి పరీక్షలు ఈ నెల 5న దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఎంతో పకడ్బందీగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 16.35లక్షలకు పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షను రాశారు. ఈ నెల 28న మ్యాథ్స్ పరీక్ష జరిగింది. సాధారణంగా సీబీఎస్ఈ పరీక్షల్లో మ్యాథ్స్ పరీక్ష చాలా కఠినంగా ఉం టుందని నిపుణులు చెబుతున్నారు. సోషియల్ పరీక్షకు, మ్యాథ్స్ పరీక్షకు మధ్య నాలుగు రోజులు సమయం ఉండడంతో విద్యార్థులు రేయింబవళ్లు చదివారు. ఈ ఏడాది ఒకింత సులువుగా ప్రశ్నలు ఉండడంతో విద్యార్థులు సంతోషంతో పరీక్షలు రాశారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 15సీబీఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి. ఒక్క తిరుపతి నగర పరిసరాల్లో కేంద్రీయ విద్యాలయ నెం 1, 2, భారతీయ విద్యాభవన్, ఎడిఫై, అకార్డ్, శ్రీవిద్యానికేతన్, సిల్వర్బెల్స్, చిత్తూరులో బీవి.రెడ్డి, పీఈఎస్, చౌడేపల్లె వద్ద విజయవాణి, మనదపల్లెలోని జవహర్ నవోదయ వంటి పాఠశాలలు సీబీ ఎస్ఈ పరిధిలోకి వస్తాయి. ఈ ఏడాది ఆయా పాఠశాలల నుంచి సుమారు వెయ్యికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసిన ఆనందంలో ఉన్న విద్యార్థులకు రెండు గంటల వ్యవధిలోనే మ్యాథ్స్ పేపర్ లీకై నట్లు వచ్చిన వార్తతో షాక్‌కు గురయ్యారు. అదే రోజు 12వ తరగతి విద్యార్థులకు ఎకనామిక్స్ పరీక్ష జరిగింది. ఈ రెండు పేపర్లూ లీక్ అయ్యాయని, ఈ రెండింటికి తిరిగి పరీక్షను నిర్వహిస్తామని, దానికి సంబంధించిన తేదీని వారంలోపు ప్రకటిస్తామని సీబీఎస్ఈ ప్రకటించింది. దీంతో విద్యార్థులు డీలా పడ్డారు. గత ఏడాది మ్యాథ్స్‌లో 7చాప్టర్లే ఉన్నాయని, ఈ ఏడాది 15కి పెంచారని, మ్యాథ్స్ పరీక్ష అంటేనే చాలా కష్టమని, అలాంటిది తిరిగి నిర్వహిస్తామనడం మళ్లీ టెన్షన్‌కు గురిచేస్తోందని నవశక్తి, కీర్తి, సంజన తదితరులు వాపోయారు. మ్యాథ్స్ పేపర్ లీక్ వ్యవహారం ఢిల్లీలో జరిగిందంటూ తల్లిదండ్రులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఢిల్లీ రీజియన్‌లో రీ–ఎగ్జామ్ నిర్వహించాలని, అలా కాకుండా దేశవ్యాప్తంగా మ్యాథ్స్ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమంటూ ఇటు తల్లిదండ్రులు, అటు సీబీఎస్ఈ పాఠశాలల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. బాధ్యులపై కఠినంగా వ్యవహ రించాలేగానీ ఏకంగా పరీక్షనే రద్దు చేయడం సరికాదని , ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ అధికారులు పునరాలోచించాలని, లీక్ అయిన డిల్లీ రీజియన్‌లో రీ–ఎగ్జామ్ నిర్వహించాలని కోరుతున్నారు. చాలా కష్టపడి చదివాం సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలో మ్యాథ్స్ ప్రశ్నపత్రం చాలా కష్టంగా ఉంటుంది. పైగా ఈ ఏడాది 7నుంచి 15కు చాప్టర్లను పెంచారు. మొదటి నుంచే మ్యాథ్స్ సబ్జెక్టుపై దృష్టి సారించి బాగా చదివాం. పరీక్షను బాగా రాశాం. ఇప్పుడు పేపర్ లీక్ అయిందని, తిరిగి పరీక్ష నిర్వహిస్తామని చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. – ఆర్.నవశక్తి, సీబీఎస్ఈ విద్యార్థిని అందరినీ శిక్షిస్తున్నారు ఎక్కడో ప్రశ్నపత్రం లీక్ అయితే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను శిక్షిస్తున్నారు. ఎక్కడ ప్రశ్నపత్రం లీకయ్యిందో ఆ రీజియన్‌లో రీ–ఎగ్జామ్ నిర్వహించాల్సింది పోయి అందరికీ పరీక్ష పెట్టడం విద్యార్థులందరికి శిక్షే. ఈసారి మరింత కఠినంగా ప్రశ్నపత్రం తయారు చేస్తారేమోనని టెన్షన్‌గా ఉంది. –బి.ధనుష్ విహారి, సీబీఎస్ఈ విద్యార్థి -
పెళ్లి మంత్రాలు చెప్పలేని వరుడిని వదిలేసి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మైనర్ సంచలన నిర్ణయం తీసుకుంది. సరియైన జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో తెలివిగా వ్యవహరించింది. పెళ్లి తంతులో మంత్రాలు సరిగా వల్లించలేని వరుడిని కాదని, సొంత గ్రామానికి చెందిన రైతును సంతోషంగా పెళ్లాడింది. తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తుల సమక్షంలో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివరాల్లోకి వెళ్లితే మణిపూరి జిల్లాకు చెందిన గులియాపూర్కు చెందిన ఖుష్బూ పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లి మంటపంలో బాజా భజంత్రీలు జోరుగా మోగుతున్నాయి. ఇక మూడు ముళ్లు పడడమే తరువాత. ఇంతలో పెళ్లి కొడుకు యవ్వారం గురించి పెళ్లి కూతురి చెవిలో వేసారు ఆమె స్నేహితులు. ఇది విని షాకైన ఖుష్బూ స్వయంగా తానే రంగంలోకి దిగింది. పెద్దలు వారిస్తున్నా వినకుండా...ధైర్యంగా ముందుకెళ్లి అతగాడికి కొన్ని పరీక్షలు పెట్టింది. లెక్కల పరీక్షలో ఫెయిలైన సదరు పెళ్లికొడుకు కనీసం మొబైల్లో నెంబర్‌ను డయల్ చేయడంలో కూడా ఫెయిల్ అయ్యాడు. దీంతో కనీస విద్యార్హత కూడా లేదని, మానసికంగా కూడా దృఢంగా లేని వ్యక్తిని పెళ్లి చేసుకోనంటూ ఆ వివాహాన్ని రద్దు చేసుకుంది. తనకు చదువంటే చాలా యిష్టమంటున్న ఖుష్బూ ప్రస్తుతం ఎనిమిదవ తరగతి చదువుతోంది. టీచర్ కావాలనేది ఆమె కోరిక. చదువు సంధ్యాలేని మొద్దుకంటే పదో తరగతి చదువుకొని, గౌరవంగా గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న తెలివైన రైతే మేలని భావించింది. అందుకే ఆనందంగా స్థానిక యువకుడు అమిత్(21) ను ఆనందంగా మనువాడింది. -
15+6 =17 ఈ లెక్క తెలుసా మీకు?
ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ పెళ్లి కొడుకుకి విచిత్ర పరిస్థితి ఎదురైంది. కొత్త పెళ్లి కూతురి చిటికెన వేలు పట్టుకొని ఇంటికి రావాల్సిన అతగాడు ఒట్టి చేతలుతో మొఖం వేలాడేసుకుని ఇంటి ముఖం పట్టాడు. ఎందుకనుకుంటున్నా... ఇదిగో అయితే స్టోరీ చదవండి మరి... ఇటావా జిల్లాకు చెందిన మెహర్ సింగ్ కుమార్తెకి... రామ్ బారన్‌కి వివాహం నిశ్చయించారు. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల వారు బంధుమిత్ర సపరివార సమేతంగా కళ్యాణ వేదికకు చేరుకున్నారు. పెండ్లి పందిరి కోలాహలంగా ఉంది. బాజా భజంత్రీలు జోరుగా మోగుతున్నాయి. ఇక వధువు మెడలో మూడు ముళ్లు పడడమే తరువాయి. ఇంతలో ఎందుకో వధువుకి... వరుడి విద్యార్హతల మీద అనుమానం వచ్చింది. దాంతో ఒక చిన్న పరీక్ష పెట్టింది. అయితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక వరుడు తెల్లమొఖం వేశాడు. తడబడుతూ నోటికొచ్చిన సమాధానం చెప్పాడు. అంతే ..ఆ సమాధానం విన్న వధువు, ఆమె కజిన్ షాక్ అయ్యారు. ఇంత సులువైన లెక్కను కూడా చెప్పలేని వాడు నాకొద్దు పొమ్మంది నూతన వధువు. పెళ్లి పెద్దలు, కుటుంసభ్యులు, బంధువులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ఆమె మాత్రం మెట్టు దిగి రాలేదు. పెళ్లికి ససేమిరా అంది. అబ్బాయి చదువు గురించి తనదగ్గర దాచిపెట్టారంటూ పెళ్లి వేదిక నుంచి నిష్ర్కమించింది ఆ వధువు. దాంతో...పెళ్లి కుదుర్చుకుని...తీరా తాళి కట్టేసమయానికి ఇంత అవమానం చేస్తారా... మా పరువంతా పోయిందంటూ రుసరుసలాడుకుంటూ వెళ్ళిపోయాడట వరుడు. ఆనక పరస్పరం ఇచ్చుకున్న బంగారం తదితర బహుమతులను ఎవరిది వారు వెనక్కి తీసుకునేలా పెళ్లి పద్దలు రాజీ కుదుర్చుకున్నారు. అదండీ సంగతి. ఇంతకీ అమ్మాయి అడిగిన ఆ లెక్క ఏంటనేగా మీ డౌట్.. అక్కడికే వస్తున్నా..15+6 ఎంత అని.... మరి ఆ వరుడు సమాధానం ఏంటో తెలుసా.. 17 అని.