15+6 =17 ఈ లెక్క తెలుసా మీకు? | Groom flunks math test, goes brideless | Sakshi
Sakshi News home page

15+6 =17 ఈ లెక్క తెలుసా మీకు?

Published Fri, Mar 13 2015 10:42 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

15+6 =17  ఈ లెక్క తెలుసా మీకు?

15+6 =17 ఈ లెక్క తెలుసా మీకు?

 ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో  ఓ పెళ్లి కొడుకుకి   విచిత్ర పరిస్థితి ఎదురైంది.  కొత్త పెళ్లి కూతురి చిటికెన  వేలు పట్టుకొని ఇంటికి రావాల్సిన  అతగాడు ఒట్టి చేతలుతో  మొఖం వేలాడేసుకుని ఇంటి ముఖం పట్టాడు. ఎందుకనుకుంటున్నా... ఇదిగో  అయితే స్టోరీ చదవండి మరి...

ఇటావా జిల్లాకు  చెందిన మెహర్ సింగ్ కుమార్తెకి... రామ్ బారన్కి వివాహం నిశ్చయించారు. ఈ వివాహ వేడుకకు  ఇరు కుటుంబాల వారు బంధుమిత్ర సపరివార  సమేతంగా కళ్యాణ వేదికకు చేరుకున్నారు. పెండ్లి పందిరి కోలాహలంగా ఉంది. బాజా భజంత్రీలు జోరుగా మోగుతున్నాయి. ఇక వధువు మెడలో మూడు ముళ్లు పడడమే తరువాయి. ఇంతలో ఎందుకో వధువుకి... వరుడి విద్యార్హతల మీద అనుమానం వచ్చింది.   దాంతో ఒక చిన్న పరీక్ష పెట్టింది.   అయితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక  వరుడు తెల్లమొఖం వేశాడు. తడబడుతూ నోటికొచ్చిన సమాధానం చెప్పాడు.

అంతే ..ఆ సమాధానం విన్న వధువు, ఆమె కజిన్  షాక్ అయ్యారు. ఇంత  సులువైన లెక్కను కూడా చెప్పలేని వాడు నాకొద్దు పొమ్మంది నూతన వధువు. పెళ్లి పెద్దలు, కుటుంసభ్యులు, బంధువులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ఆమె మాత్రం మెట్టు దిగి రాలేదు. పెళ్లికి ససేమిరా అంది.  అబ్బాయి చదువు గురించి తనదగ్గర  దాచిపెట్టారంటూ  పెళ్లి వేదిక నుంచి  నిష్ర్కమించింది ఆ వధువు.

దాంతో...పెళ్లి కుదుర్చుకుని...తీరా తాళి కట్టేసమయానికి ఇంత అవమానం చేస్తారా... మా పరువంతా పోయిందంటూ రుసరుసలాడుకుంటూ వెళ్ళిపోయాడట వరుడు. ఆనక  పరస్పరం ఇచ్చుకున్న బంగారం తదితర బహుమతులను ఎవరిది వారు  వెనక్కి తీసుకునేలా  పెళ్లి పద్దలు రాజీ కుదుర్చుకున్నారు. అదండీ సంగతి. ఇంతకీ  అమ్మాయి అడిగిన ఆ లెక్క ఏంటనేగా మీ డౌట్.. అక్కడికే వస్తున్నా..15+6  ఎంత అని.... మరి ఆ వరుడు సమాధానం ఏంటో తెలుసా.. 17 అని.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement