matin
-
వైఎస్సార్ ఆశయ సాధన కోసం పనిచేద్దాం
వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడు మతీన్ సాక్షి, సిటీబ్యూరో:మైనార్టీల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నిరంతరం తపించేవారని, ఆయన ఆశయాల సాధన కోసం మనమంతా పనిచేద్దామని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడు మతీన్ ముజ్దాది పిలుపునిచ్చారు. శనివారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి అజామ్ అలీ సారథ్యంలో మౌలాలికి చెందిన 300 మంది యువకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేసేందుకు ఇప్పటి పాలకులపై ఒత్తిడి చేయాల్సి ఉందన్నారు. అందుకోసం అందరం కలిసి పార్టీ అధినేత వైఎస్ జగన్ వెంట నడవాల్సి ఉందన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. సీఎం కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ఈ సందర్భంగా మౌలాలికి చెందిన సయ్యద్ హయత్, ఎండీ షఫీ, సయ్యద్ జాఫర్, మహమ్మద్, పర్వేద్ హుస్సేన్, టి.రాము, ఎండీ ఆషీద్ అలీతోపాటు 300 యువకుకులకు మతీన్ పార్టీ కండువా కప్పి వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి రిజ్వాన్, నాయకులు మాజీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురిపై నిర్భయ కేసు
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: ఓ విద్యార్థిని వెంటపడి కిడ్నాప్ చేసి వేధించిన ముగ్గురిపై రామచంద్రాపురం పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేశారు. ఎస్ఐ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... జీవనోపాధికోసం మరో రాష్ట్రం నుంచి వచ్చిన ఓ కుటుంబం రామచంద్రాపురంలో స్థిరపడింది. ఈ కుటుంబంలోని 15 సంవత్సరాల బాలిక స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. ఈ బాలిక చదువుతున్న పాఠశాలలో ఓ కార్యక్రమం నిర్వహించగా, బెల్ విద్యుత్‌నగర్‌కు చెందిన మతిన్ డెకరేషన్ చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలోనే బాలికపై కన్నేసి అతను మాటల్లో దింపి తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. తరచూ బాలికతో ఫోన్లో మాట్లాడుతూ అప్పుడప్పుడూ కలిసేందుకు ప్రయత్నించేవాడు. ఈ క్రమంలోనే తన మిత్రులైన రామచంద్రాపురానికి చెందిన ఆటోడ్రైవర్ సుల్తాన్, జవహర్‌నగర్‌కు చెందిన టెన్నీస్ కోచ్ మహేశ్‌లను బాలికకు పరిచయం చేశాడు. వీరంతా బాలికను అప్పుడప్పుడూ పాఠశాల నుంచి ఆటోలో తీసుకెళ్లి ఇంటివద్ద దింపేవారు. ఈ క్రమంలోనే ఈ నెల 26న మతిన్, సుల్తాన్, మహేశ్‌లు హైదరాబాద్ చూపిస్తామంటూ బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకువెళ్లారు. అనంతరం హైదరాబాద్ నుండి ఆ బాలిక ను బీదర్‌కు తీసుకెళ్లారు. అయితే ఉదయం పాఠశాలకు వెళ్లిన బాలిక సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అదే రోజు రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక ఇంట్లో ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేయగా బాలిక బీదర్‌లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు శనివారం బీదర్‌కు వెళ్లి బాలికతో పాటు ముగ్గురు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం నిందింతులను తమదైనశైలిలో విచారించిన పోలీసులు వారు తెలిపిన వివరాల మేరకు వారిపై నిర్భయచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.