Mating method
-
అలా పట్టించుకోకుండా వెళ్లిపోతే ఎలా? : హిల్లేరియస్ వీడియో వైరల్
నెమలి మన జాతీయ పక్షి. అందమైన అపురూపమైన పక్షి. ఆడ నెమలిని ఇంప్రెస్ చేసేందుకు మగ నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంది. గున గున అడుగులేస్తూ ఆడ నెమలి వెంట తిరుగుతుంది. ఈ నాట్యం చేసేటప్పుడు తన పింఛాన్ని చుట్టూ వృత్తం లాగా చేస్తుంది. ఒక్కోసారి విసినకర్రలా వంచి అందంగా నాట్యం చేస్తుంది. ప్రేయసి సంతృప్తి చెంది, చెంతక చేరేదాకా మగ నెమలికి ఈ తిప్పలు తప్పవు. అకస్మాత్తుగా మబ్బులు కమ్మేసి, చినుకులు పడినపుడు, ప్రధానంగా వడగళ్లు పడినపుడు సంతోషంతో పింఛంతో మగ నెమలి చేసే నాట్యం వర్ణశోభితంగా, అత్యంత రమణీయంగా ఉంటుంది కదా. తాజాగా గ్రేట్ ఆర్గస్ నెమలి ఆడ నెమలిని ఆకట్టుకునేందుకు పాట్లు, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియో దాదాపు 30 లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించడం విశేషం. వాస్తవానికి ఈ వీడియో 2021లో ఫ్లోరిడాలోని బే లేక్‌లోని డిస్నీస్ యానిమల్ కింగ్‌డమ్‌లోని మహారాజా జంగిల్ ట్రెక్‌లో తీసింది. ఇపుడు మళ్లీ సందడి చేస్తోంది. ఈ తతంగం అంతా చూసి నెటిజన్లు చతురోక్తులతో స్పందిస్తున్నారు. ఇంత చేసినా అలా వెళ్లిపోతే ఎలా అంటూ ఫన్నీ కమెంట్లు పెడుతున్నారు. A male Pheasant is trying to impress her but she is not impressed! 😂 pic.twitter.com/dqfAj2icz4 — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 20, 2024 An incredible leucistic peacock! (Video Laurel Coons) pic.twitter.com/H0eO6ID6TM — Natural Science & History (@joehansenxx) March 20, 2024 This is so so beautiful 🦚🥰😍 pic.twitter.com/XHwbmH5lUC — Aisha Abbasi (@aisha_FCB) March 20, 2024 -
మరో చీతా కన్నుమూత! జతకట్టే సమయంలో గాయపడటంతో..
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో దక్ష అనే మరో ఆడ చీతా కన్నుమూసింది. మరో రెండు మగ చీతాలతో జతకట్టిన సమయంలో గాయపడటంతో.. కొద్దిగంటల్లోనే దక్ష మృతి చెందిందని, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ జేఎస్ చౌహాన్ అన్నారు. తాము ఆ ఆడ చీతాకు అవసరమైన అన్ని మందులు, చికిత్స తక్షణమే అందించామని, కానీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రాణాలు విడిచిందని తెలిపారు. వాయు, అగ్ని అనే మగ చీతాలతో సంభోగ సమయంలో అవి పరస్పరం హింసాత్మక దాడులు చేసుకున్నాయని, అందువల్లే దక్ష అనే చీతా మరణించిందని చౌహాన్ పేర్కొన్నారు. ఎన్‌క్లోజర్ నెంబర్ 1లో ఉన్న దక్షను బోమా 7 ఎన్‌క్లోజర్‌లో ఉన్న వాయు, అగ్ని అనే రెండు మగ చీతాలతో సంభోగం కోసం విడుదల చేశారు. అయితే ఈ ప్రక్రియలో మగ చిరుతలు హింసాత్మకంగా మారినట్లు కనిపిస్తోంది. కానీ ఇది చాలా సర్వ సాధారణ విషయమని చౌహాన్ చెబుతున్నారు. మగ చిరుతలు జత కట్టే సమయంలో తమకు సంబంధంలేని మగ చిరుతలతో దాడులకు దిగుతాయని, గెలిచిన మగ చిరుత ఆడ చిరుతతో జత కడుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా, గతేడాది ప్రాజెక్టు చీతా కింద దక్షిణాఫ్రికా నుంచి దాదాపు ఇరువై చీతాలను జాతీయ పార్కుకి తీసుకురాగా వాటిలో సాషా, ఉదయ్ అనే రెండు చిరుతలు మార్చి, ఏప్రిల్‌లో చనిపోయిన సంగతి తెలిసిందే. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఆ రెండు చిరుతలను సెప్టంబర్ 2022లో వేర్వేరు బ్యాచ్‌లలో మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తరలించారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది సెప్టెంబర్ 17న తన 72వ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని కునో వద్ద ఉన్న క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లోకి నమీబియా నుంచి ఐదు ఆడ చీతా పిల్లలు, మూడు మగ చీతా పిల్లలతో కూడిన ఎనిమిది చీతా పిల్లలను విడుదల చేశారు. (చదవండి: హాట్‌టాపిక్‌గా ప్రధాని మోదీ బహిరంగ లేఖ! ఆ లేఖలో ఏముందంటే..) -
Mating Season: ఆడతోడు కోసం ఎందాకైనా..!
ప్రాణహిత, గోదావరి, కిన్నెరసాని నదుల వెంట ప్రయాణాన్ని సాగించిన మగ పులి ఆడతోడు కోసమే ఇటువైపుగా వచ్చినట్లు తెలుస్తోంది. 26 రోజులపాటు సాగిన ప్రయాణంలో తోడు దొరకకపోవడంతో తిరిగి సిర్పూర్‌కు వెళ్తున్నట్లు దాని గమనం చూస్తుంటే స్పష్టమవుతోంది. ఈ పులి సిర్పూర్ ప్రాంతానికి చెందినదని, పేరు ఎస్–8 అని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ మగపులి ఉమ్మడి జిల్లాలో సాగించిన ప్రయాణం.. దాని ప్రత్యేకతలు, ఎందుకు.. ఎలా వచ్చిందన్న దానిపై ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ కథనం.. – పోతరాజు రవిభాస్కర్, భూపాలపల్లి మహారాష్ట్రలోని తాడోబా రిజర్వ్ ఫారెస్ట్‌లో పుట్టిన ఈ మగపులి ప్రస్తుతం ఏడు నుంచి ఎనిమిదేళ్లు ఉంటుంది. రెండేళ్ల వయసులో తల్లినుంచి దూరమై అక్కడినుంచి కుమురం భీం జిల్లాలోని సిర్పూర్ ప్రాంతానికి వచ్చింది. అక్కడి అటవీశాఖ అధికారులు దీనిని గుర్తించి ఎస్–8గా నామకరణం చేశారు. పులులు అభయారణ్యంలో సుమారు 25 నుంచి 30 చదరపు కిలోమీటర్లు తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అక్కడ తాను ఉన్న విషయాన్ని గుర్తించేలా ఆ ప్రాంతం చుట్టూ మలం, మూత్రం విసర్జిస్తుంది. మూత్రం ఎక్కువ కాలంపాటు రసాయనాల మాదిరిగా వాసన వస్తుంది. దీంతో అటువైపు ఇతర జంతువులు, పులులు రావు. కొన్ని సందర్భాల్లో బలమైన పులి వెళ్లి దాడికి పాల్పడినప్పుడు, అక్కడి పులి తన తోడును వదిలి దూరంగా వచ్చేస్తుంది. ఈ మాదిరిగానే ఎస్–8 పులి వచ్చి ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. మేటింగ్ సీజన్ కావడంతో... పులులకు చలికాలంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మేటింగ్(సంభోగం) సీజన్.. దీంతో సిర్పూర్ నుంచి బయలుదేరిన ఎస్–8 మేటింగ్ చేసేందుకు ఆడపులిని వెతుక్కుంటూ వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల అడవుల్లో తిరిగింది. ఆడతోడు కానరాకపోవడంతో తిరిగి సిర్పూర్‌కు బయలుదేరింది. ఎస్–8గా ఎలా గుర్తించారంటే.. సాధారణంగా పాదముద్రలు(పగ్‌మార్క్స్) ఆధారంగా పులిని గుర్తించి ఆడదా, మగదా అని నిర్ధారిస్తారు. పులుల చర్మంపై చారలు వేర్వేరుగా ఉంటాయి. ఒక పులి చారలను మరో పులి పోలి ఉండదు. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా పులిని మొదటిసారి గుర్తించిన చోటే దానికి నామకరణం చేస్తారు. 2020, అక్టోబర్ 11న సిర్పూర్ అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాకు చిక్కిన, ములుగు జిల్లా మంగపేట అడవిలో గత నెలలో సీసీ కెమెరాకు చిక్కిన పులి చారలు ఒకే మాదిరిగా ఉన్నాయి. దీంతో అది సిర్పూర్ నుంచి వచ్చిన ఎస్–8గా అటవీశాఖ అధికారులు ధ్రువీకరించుకున్నారు. కాగా.. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కడా మనుషులపై దాడి చేసిన ఘటన లేకపోవడంతో మ్యాన్ఈటర్ కాదని అటవీశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో కూడా ఒక పులి భూపాలపల్లి మీదుగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరిగి తోడు దొరకకపోవడంతో మళ్లీ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా మీదుగా సిర్పూర్ అడవులకు తిరిగి వెళ్లింది. అయితే గతంలో ఆ పులి ఎక్కడా కనిపించలేదు. దీంతో దానికి ఎం(ములుగు)–1గా నామకరణం చేశారు. ►గురువారం రాత్రి భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉంది. భూపాలపల్లి జిల్లాలోని అడవుల మీదుగా కాళేశ్వరం గోదావరి వరకు వెళ్లి, నది దాటి తిరిగి సిర్పూర్ వైపునకు వెళ్లనున్నట్లు అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ►30న ములుగు అడవుల్లోకి వచ్చింది. ఈ నెల ఒకటో తేదీన రాత్రి ములుగు మండలం ఇంచర్ల గ్రామ సమీపంలో గల ఎన్‌హెచ్ 163 రహదారి దాటింది. తాజాగా గురువారం వెంకటాపూరం(ఎం) మండలం రామకృష్ణాపూర్ అడవిలో పులి అడుగులను గుర్తించారు. ►29వ తేదీన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటమీదుగా పాకాలకు చేరుకుంది. కొత్తగూడ వెళ్లే దారిలో రోడ్డుదాటుతుండగా ఇద్దరు వాహనదారులు గమనించి భయంతో పరిగెత్తారు. పులి ఆ రోజు మొత్తం ప్రయాణం సాగించింది. ►ఎస్–8 పులి సిర్పూర్ నుంచి అక్టోబర్ చివరి వారంలో బయలుదేరి ప్రాణహిత నది దాటి మహారాష్ట్రలోని సిరొంచకు చేరుకుంది. అదే నెల 28వ తేదీన మహారాష్ట్రలోని సిరొంచ తాలుకా పరిధిలోని పెంటిపాక గ్రామ సమీప అడవిలో పశువుల కాపరి దుర్గం మల్లయ్య(48)పై దాడి చేసి చంపింది. సుమారు వారం రోజులు అదే ప్రాంతంలో ఉంది. ►25వ తేదీన మహబూబాబాద్ జిల్లాకు చేరుకొని గూడూరు మండలం నేలవంచ సమీప అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన రెండు లేగదూడలపై దాడి చేసి చంపింది. అనంతరం మూడు రోజులు అక్కడే ఉంది. ►12వ తేదీన మంగపేట నుంచి నర్సింహాపూర్ మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి చేరుకుంది. అక్కడ పినపాక మండలం అమరారం సమీప అడవిలో పశువుల మందపై దాడి చేసి ఒక ఆవుని చంపింది. ఆజిల్లా అడవుల్లో సుమారు 12 రోజులు గడిపింది. ►8వ తేదీ రాత్రి ములుగు జిల్లాలోకి ప్రవేశించింది. రెండు రోజులపాటు ప్రయాణం చేస్తూ తాడ్వాయి మండలంలోని కాల్వపల్లి, కామారం మీదుగా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామం చింతలమోరి వద్ద గల రోడ్‌ను క్రాస్ చేసి హీరాపూర్, తొండ్యాల లక్ష్మీపురం మీదుగా మంగపేట మండలంలోకి 11వ తేదీన చేరింది. ►గత నెల 7న గోదావరి నది దాటి కాళేశ్వరం, పలిమెల మీదుగా భూపాలపల్లి మండలంలోని దూదేకులపల్లి శివారు అడవిలో గల మద్దిమడుగుకు 8వ తేదీన చేరుకుంది. -
ఈ మగ పిట్ట పాడటం మర్చిపోయిందట..అందుకే
సాక్షి, న్యూఢిల్లీ : ఎప్పుడైనా మీరు పాడుకునే పాటలు మర్చిపోయారా? ఆ అవును.. మర్చిపోతాం.. అయినా అందులో పెద్ద సమస్య ఏముంటది అనే కదా మీ ప్రశ్న. అవును మనకు ఏ సమస్యా ఉండదు. ఒకటి కాకపోతే ఇంకో పాట పాడుకుంటాం. అయితే ఇలాంటి ఓ సమస్యే ఈ పక్షికి వచ్చిపడింది. అదేంటంటే తాను పాడుకునే పాట మర్చిపోయిందట. ఇలా పాట పాడటం మర్చిపోవడం వల్ల ఈ పక్షి జాతికి పెద్ద చిక్కే వచ్చిపడింది. ఏకంగా ఆ జాతి మొత్తం అంతరించిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. ఎందుకంటే ఆడ పక్షిని ఆకర్షించేందుకు మగ పక్షులు మధురంగా ఓ పాట అందుకుంటాయట. అయితే మగ పక్షులు సరైన శ్రుతిలో పాడటం మర్చిపోయాయట. దీంతో ఆడపక్షులు మగ పక్షుల దగ్గరకు రావట్లేదట. దీంతో వాటి సంతతి అభివృద్ధి చెందక.. చివరికి అంతరించిపోయే దాకా పరిస్థితి వచ్చింది. ఇంతకీ వీటి పేరేంటో చెప్పలేదు కదా.. ‘రీజెంట్ హనీఈటర్’ అని పిలిచే ఈ పక్షులు ఆస్ట్రేలియాలో ఒకప్పుడు చాలా ఉండేవట. ఇప్పు డు ప్రపంచం మొత్తం కూడా 300 పక్షులు మాత్రమే ఉన్నాయట. దీంతో పక్షి శాస్త్రవేత్తలు ఇందుకు కారణాలు వెతకగా.. మగ పక్షులు పాట పాడటం మర్చి పోయిన విషయం గుర్తించారు. గత ఐదేళ్లుగా పర్యావరణ శాస్త్రవేత్త రాస్ క్రేట్స్ దీనిపై పరిశోధన నిర్వహించగా రీజెంట్ హనీయేటర్స్ పాటల సామర్థ్యం సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తున్న విషయాన్ని గుర్తించారు. ఈ విలక్షణమైన నలుపు ,పసుపు రంగులమిశ్రమంతో ఆకర్షణీయంగా కనిపించే పక్షులు ఒకప్పుడు ఆస్ట్రేలియా అంతటా సాధారణం, కానీ 1950 ల నుండి వీటి సంఖ్య తగ్గిపోతూ వస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పక్షులకు మా త్రమే సొంతమైన పాటను పాడకుండా.. అనుకోకుండా వేరే పక్షుల శబ్దాలను, పాటలను అనుకరించడం ప్రారంభించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల కొంతకాలానికి అవి చేయాల్సిన శబ్దాలను గుర్తు చేసుకోలేకపోయాయని పేర్కొన్నారు. పుట్టిన పిల్ల పక్షులు కూడా వేరే శబ్దాలను నేర్చుకుంటున్నాయని, దీంతో ఆడ పక్షులు ఈ పాటలకు ఆకర్షితం కావడం లేదని విశ్లేషించారు. -
నాట్ల కన్నా విత్తటం మిన్న
శ్రమ తక్కువ.. దిగుబడి ఎక్కువ - ఎకరానికి రూ. 5 వేల ఖర్చు తక్కువ.. రెండో పంటకు దిగుల్లేదు.. - గుంటూరు జిల్లాలో లక్ష ఎకరాలకు విస్తరించిన ఎద పద్ధతిలో వరి సాగు - రాయలసీమ, తెలంగాణలకూ అనుకూలమే పెరిగిన సాగు ఖర్చులు, కూలీల కొరత, అదనుకు కురవని వర్షాలు, అందని కాలువ నీరు సమస్యలన్నీ కలగలిసి రైతు సోదరులతో వరి ఉరిరా బాబు అనిపించాయి. కాలువ కింద మాగాణి పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లేందుకు అవకాశం లేదు. దీనికి తోడు రుతువులు తలకిందులయిపోతున్న కాలంలో కాలువ కింది పొలాలకు కూడా నీరు నిర్దిష్టంగా ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు చివరి వారం నుండి సెప్టెంబర్ మధ్య కాలం వరకు నీరందని పరిస్థితి. దీంతో నాట్లు ఆలస్యమై దిగుబడుల మీద ప్రభావం చూపే పరిస్థితి ఉంది. వాన రాకడ శాస్త్రీయ అంచనాలకు కూడా అందని పరిస్థితులు ఉత్పన్నమౌతున్న రోజుల్లో దమ్ము చేసి నాట్లు వేయడం అనేది రైతుకు నష్టదాయకంగా మారింది. ఈ పరిస్థితులను అధిగమించడానికి లాం ఫాంకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కోటపాటి గురవారెడ్డి సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం ప్రాచీన కాలంలో రైతులు అనుసరించిన మెట్ట వరి సాగు పద్ధతిని ఆధునీకరించి ఎద సాగు పద్ధతిని రూపొందించి మార్గదర్శకత్వం వహించారు. తొలుత 2010-11వ సంవత్సరంలో గుంటూరు గ్రామీణ మండలం జొన్నలగడ్డలో తొలుత నాలుగు వేల ఎకరాల్లో ఈ పద్ధతిని అమలు చేయ నారంభించారు. డాక్టర్ గురవారెడ్డి, డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ వి. సీతారాంబాబు, డాక్టర్ ఈ. నారాయణ, కె. తులసీరామ్, కె. సురేష్‌రెడ్డిలతో కూడిన లాంఫాం శాస్త్రవేత్తల బృందం, గుంటూరు వ్యవసాయ శాఖ అధికారులతో కలసి చేసిన కృషి ఫలితంగా.. ఈ విధానం ఇప్పుడు గుంటూరు గ్రామీణ మండలం, తెనాలి, బాపట్ల, దుగ్గిరాల తదితర మండలాల్లో దాదాపు లక్ష ఎకరాలకు విస్తరించింది. ఏ ప్రాంతమైనా అనువైనదే.. ఎదబెట్టి వరి సాగు చేసే విధానం కేవలం కోస్తా జిల్లాల రైతులకే కాక వర్షాభావ ప్రాంతమైన రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లోనూ అనుసరణీయమైన విధానమే అని ఫలితాలు రుజువు చేస్తున్నాయి. బావులు, చెరువులు, బోర్ల కింద మాగాణి సాగు చేసే తెలంగాణ జిల్లాల్లోనూ తొలకరి వర్షాలకు పొడి దుక్కి దున్నుకొని విత్తనం ఎదబెట్టి.. తరువాత అందే వర్షాలతో పూర్తిస్థాయి నీటి తడులు అందించి మెరుగైన దిగుబడులను సాధించేందుకు అవకాశం ఉంది. ప్రయోగశీలురైన రైతు సోదరులు ఈ విధానాన్ని ఆచరించి మిగతా రైతులకు మార్గదర్శకత్వం వహించవచ్చు. ఈ పద్ధతి కొత్తగా కనిపిస్తున్నప్పటికీ మూడు, నాలుగు దశాబ్దాల కింద మన పూర్వీకులు అనుసరించిన విధానమే. ఈ విధానానికి కొన్ని యంత్ర పరికరాల తోడ్పాటు తీసుకోవడం వలన మరింత మెరుగైన, ఖచ్చితమైన ఫలితాలు సాధ్యమయ్యాయి. ఎద పద్ధతిలో సాగు విధానం ఈ సాగు పద్ధతిలో అకాల వర్షాలు లేదా తొలకరి వర్షాల్లో పొడి దుక్కి చేసుకోవాలి. నాలుగుసాళ్లు దున్నిన తర్వాత విత్తనం వేయాలి. విత్తనాలను ఎద జల్లడం కాకుండా విత్తుకోవాలి. దీనికి విత్తన గొర్రును ఉపయోగించాలి. దీని వలన కనీసం రెండు నుంచి నాలుగు సెంటీ మీటర్ల వెడల్పు, నాలుగు నుంచి ఏడు సెంటీమీటర్ల లోతు సాళ్లు ఏర్పడుతాయి. గొర్రును ఉపయోగించడం వలన విత్తనం సమానలోతు, సమానదూ రంలో పడతాయి. సాళ్ల వెంట నీరు పెట్టినప్పుడు.. గింజకు సమానంగా నీరందుతుంది. ఈ పద్ధతిలో ఎకరానికి కేవలం పది నుంచి 15 కిలోల విత్తనం చాలు. అనుభవజ్ఞుడైన డ్రైవర్ ట్రాక్టర్‌తో గంటలో ఎకరం విత్తడం పూర్తిచేయగలుగుతాడు. మెట్టవరి సాగు విధానంలో ప్రధానమైనది కలుపు సమస్య. అయితే కొన్ని మెలకువలు పాటిస్తే కలుపును అదుపు చేయడం అంత కష్టమేమీ కాదు. వరి సాగుకు ముందు పచ్చిరొడ్డ పైరు అలికి, దాన్ని దుక్కిలో రోటవేటర్‌తో కలియదున్నితే పొలానికి బలం చేకూరడంతో పాటు ముందుగా మొలిచిన కలుపు మొక్కలు చనిపోతాయి. వరి విత్తిన రెండు, మూడు రోజుల్లోపు పెండి మిథాలిన్ (స్టాంప్) లీటరు లేదా ప్రిటిలాక్లోర్ + సేఫనర్ (సోఫిట్) 600 మిల్లీ లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే కలుపు మొలకెత్తదు. ఈ మందులు బాగా పని చేయాలంటే నేలలో తేమ అవసరం. విత్తిన 20 రోజుల నుంచి నెల లోపు సైహలోపాప్ బ్యుటైల్ (క్లించర్, రాప్ అప్) 400 మిల్లీ లీటర్లు మరియు బిస్ ఫైరిబ్యాక్ సోడియం (నామిని గోల్డ్) 80 నుంచి 100 మిల్లీ లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. దీని వల్ల పైరుతో పాటు మొలిచి పెరిగిన ఊదా గడ్డితో పాటు ఇతర వెడల్పాటి ఆకుల కలుపు నశిస్తుంది. దిగుబడీ ఎక్కువే.. ఎద పద్ధతి వల్ల సాగు ఖర్చులు తొలి దశలోనే 5 వేల రూపాయల వరకు ఆదా అవుతాయి. తక్కువ నీటితో పంట పండుతుంది. సాధారణ పద్ధతి కంటే 10 రోజులు ముందుగానే కోతకు వస్తుంది. పైరు సాళ్ల క్రమంలో ఉండడం వలన చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. చదరపు మీటరుకు దుబ్బుల శాతం ఎక్కువగా ఉండడం వలన సాధారణ పద్ధతి కంటే దిగుబడి హెచ్చుగానే ఉంటుంది. - జిట్టా బాల్‌రెడ్డి, ‘సాగుబడి’ డెస్క్ (ఇన్పుట్స్: కోటిరెడ్డి, న్యూస్‌లైన్, కొరిటెపాడు, గుంటూరు) నాలుగేళ్లలో లక్ష ఎకరాలకు.. గుంటూరు సమీపంలోని జొన్నలగడ్డ గ్రామ పొలాలకు నాగార్జునసాగర్ ఎడమ కాలువ మిగులు నీరు తప్ప వేరే నీటి వనరు లేదు. ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో కాలువ మిగులు నీరు కొండవీటి వాగు ద్వారా అందుతుంది. ఈ గ్రామాన్ని వ్యవసాయ విశ్వ విద్యాల యం తరఫున దత్తత తీసుకొని నాలుగేళ్లుగా క్లైమా అడాప్ట్ పథకాన్ని అమలు చేస్తున్నాం. కాలువ నీరు ఆలస్య మౌతుండడంతో వరి విత్తనాలు ఎద జల్లే పద్ధతిని అనుస రించాలని రైతులకు సూచిస్తున్నాం. ఈ పద్ధతిని మెరుగు పరిచి ఇప్పుడు జిల్లాలోని ఇతర ప్రాంతాలకూ దాదాపు లక్ష ఎకరాలకు విస్తరింపజేశాం. - డాక్టర్ కోటపాటి గురవారెడ్డి (9849484398), ‘కై ్లమా అడాప్ట్’ పథకం సమన్వయకర్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాం ఫాం, గుంటూరు -522034, ఫోన్: 0863-2524017 ఇంకొన్ని సంగతులు..! - సిఫారసు చేసిన మోతాదు కంటే ఎక్కువ విత్తనం వాడితే దుబ్బులో కంకులు లేని పిలకలు ఎక్కువగా ఉంటాయి. వరి పడిపోవడానికి అవకాశం ఉంటుంది. మొక్కల సాంద్రత ఎక్కువ కావడం వల్ల పొడ తెగులు, దోమ ఉధృతి పెరుగుతుంది. నత్రజని లోపం కనిపిస్తుంది. విత్తేటప్పుడు గింజ ఎక్కువ లోతులో పడితే మొలక శాతం తగ్గుతుంది. అధిక దిగుబడి సాధనకు మెలకువలు: - పొలాన్ని మిట్టపల్లాలు లేకుండా చక్కగా చదును చేసుకోవాలి. ఠ నేలలో విత్తనం 3 సెం.మీ.ల కంటే లోతులోకి జారనివ్వకూడదు. ఠ విత్తనాన్ని నాటిన 2 రోజుల్లోపే కలుపు మందు పిచికారీ చేయాలి. ఠ విత్తనం మొలిచిన 10-15 రోజుల్లోపు వర్షాభావం ఉండకూడదు. ఠ విత్తనం పూర్తిగా మొలకెత్తిన తరువాత నేల స్వభావాన్ని బట్టి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో నీటి తడులు అందించాలి. ఠ పైరు దుబ్బు చేసే వరకు 3-7 రోజుల అంతరంతో ఆరుతడి పద్ధతిలో నీరు పెట్టవచ్చు. దుబ్బు కట్టిన తరువాత మాత్రం నీటి ఎద్దడి రానీయకూడదు.