MCD Polls
-
ప్రధాని మోదీ ఆశీస్సులు కావాలి.. ఢిల్లీ విజయంపై అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులు, కేంద్రం సహకారం అవసరమని రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన అనంతరం కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అభివృద్ధి కోసం పనిచేయడానికి బీజేపీ, కాంగ్రెస్ సహకారాన్ని కోరుకుంటున్నామని తెలిపారు. ఈమేరకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి గొప్ప విజయాన్ని అందించినందుకు ఢిల్లీ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎంసీడీలో ఆప్ విజయం రాజధానిలో తొలిసారి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని అందించిందన్నారు. మనమందరం కలిసి ఢిల్లీ నగరాన్ని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ఎంసీడీని అవినీతి రహితంగా మార్చేందుకు అన్ని పార్టీలు, అభ్యర్థులు కలిసి పనిచేయాలని సూచించారు. చదవండి: కాంగ్రెస్ నాయకత్వంలో విపక్షాల భేటీకి హాజరై షాకిచ్చిన ఆ రెండు పార్టీలు మరోవైపు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయంపై ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీపై విశ్వాసం చూపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదని.. పెద్ద బాద్యత అని వ్యాఖ్యానించారు. ప్రజలతో తీర్పుతో అతిపెద్ద పార్టీని ఓడించగలిగామని అన్నారు. కాగా బుధవారం వెల్లడైన మున్సిపల్ ఫలితాల్లో ఆప్ విజయ దుందుభి మోగించింది. మొత్తం 250 వార్డులు ఉండగా మెజార్జీ మార్క్(126)ను దాటి 134 స్థానాలను కైవసం చేసుకుంది. ఆప్ విజయంతో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లో 15 ఏళ్ల బీజేపీ పాలనకు ఆమ్ ఆద్మీ పార్టీ గండికొట్టింది. దీంతో ఢిల్లీ మేయర్ పదవి ఆప్ వశమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 104 వార్డుల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ కేవలం 9 స్థానలకే పరిమితమైంది. మరో మూడు చోట్ల ఇతరులు విజయం సాధించారు. చదవండి: గుజరాత్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు ఇక ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల వద్ద ఆప్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పూలు చల్లుతూ, స్వీట్లు పంచుకుంటూ ఆనందంతో డ్యాన్స్‌లు చేశారు. -
సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
లక్నో: అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచీ కీలక నిర్ణయాలతో దూసుకుపోతున్న యోగి ఆధిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలతో గోరఖ్‌పూర్ లో శనివారం సమావేశమైన యోగి మాట్లాడుతూ.. 'ఈవీఎం అంటే ఎవ్రీ ఓట్ ఫర్ మోదీ' అని వ్యాఖ్యానించారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రతిపక్షాలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయగా, తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లోనూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ భారీ మోజార్టీతో విజయం సాధించడంపై యోగి ఈ విధంగా స్పందించారు. ఢిల్లీ ప్రజలు తమ పార్టీ బీజేపీపై నమ్మకం ఉంచారని, అందుకే 'ఈవీఎం.. ఎవ్రీ ఓట్ మోదీ' విధానాన్ని అనుసరించారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ దేశంలో వీఐపీల సంప్రదాయానికి అడ్డుకట్ట వేశారని కొనియాడారు. చట్టాలపై గౌరవం లేనివాళ్లు, రౌడీలు, గూండాలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోవాలని.. అది వారి మంచికోసమే తాను చెబుతున్నట్లు సీఎం యోగి పునరుద్ఘాటించారు. యూపీలో చట్టాల్లో, ప్రభుత్వ విధానాలలో ఎన్నో మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆఫీసు వేళల్లో ముఖ్యమంత్రి ఏ సమయంలో ఫోన్ చేసినా అధికారులు కచ్చితంగా స్పందించాలని లేని పక్షంలో వేటు వేస్తానని ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. శాంతిభద్రతలు, ప్రభుత్వ విధానాలపై తనకు స్పష్టమైన విజన్ ఉందని, భవిష్యత్తులోనూ ఎన్నో మార్పులకు శ్రీకారం చుడతానని గోరఖ్‌పూర్ సభలోనూ పేర్కొన్నారు. -
నాడు యోగి చేతిలో ఓడి.. నేడు సీఎంకు షాక్
కేజ్రీవాల్‌ను కంగుతినిపించిన భోజ్‌పూరి స్టార్! న్యూఢిల్లీ: ఇది 2009 లోక్‌సభ ఎన్నికలనాటి ముచ్చట. ఆ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థిగా మనోజ్ తివారీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎస్పీ ఆయనకు గోరఖ్‌పూర్ టికెట్ ఇచ్చింది. గోరఖ్‌పూర్ స్థానంలో 1998 నుంచి యోగి ఆదిత్యనాథ్ గెలుస్తూ వచ్చారు. 2009లోనూ సీన్ మారలేదు. తివారీకి నిరాశే ఎదురైంది. కట్ చేస్తే 2017.. బుధవారం వెలువడిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వరుసగా మూడోసారి బీజేపీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ప్రధానంగా వెలుగులోకి వచ్చింది మాత్రం మనోజ్ తివారీయే. పాపులర్ భోజ్‌పూరి స్టార్ హీరో అయిన ఆయన ఢిల్లీ బీజేపీ చీఫ్‌గా తాజా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీలో బీజేపీ గెలుపు క్రెడిట్ ప్రధాని మోదీదేనని తివారీతో సహ పార్టీ నేతలంతా ముక్తకంఠంతో చెప్తున్నా.. కమలం శ్రేణులను సమన్వయంతో ముందుండి నడిపించి.. ఎన్నికల ప్రచారంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన తివారీ పాత్ర తోసిపుచ్చలేనిది. తివారీ రాజకీయ జీవితం ఇటీవలే మేలిమలుపు తిరిగిందని చెప్పవచ్చు. కేవలం ఆరు నెలల కిందటే ఆయనకు ఢిల్లీ బీజేపీ చీఫ్ పగ్గాలను అందజేశారు. పదేళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రజావ్యతిరేకతను దూరం చేసి.. పార్టీని విజయతీరాలకు చేర్చే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఢిల్లీలో ఉత్తరప్రదేశ్ పూర్వాంచల్‌కు చెందిన ఓటర్లు పెద్దసంఖ్యలో ఉన్నారు. భోజ్‌పూరి స్టార్‌గా వారిలో తివారీకి ఉన్న క్రేజ్ కలిసివస్తుందని బీజేపీ భావించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అకవింద్ కేజ్రీవాల్ ఘనవిజయం వెనుక కూడా పూర్వాంచల్ ఓటర్లే ఉన్నారు. ఈ వ్యూహం బాగానే కలిసివచ్చింది. ఈశాన్య ఢిల్లీ ఎంపీగా ఉన్న తివారీ తనకప్పగించిన బాధ్యతల్లో వెంటనే ఇమిడిపోయి నగరంలోని మురికివాడలు, నిరుపేద, మధ్యతరగతి నివాసాల్లో ఎక్కువగా తిరిగారు. రాత్రుళ్లు బస చేసి.. ఓటర్లతో మమేకమయ్యారు. ఢిల్లీలోని 270 వార్డులకుగాను 250 వార్డులలో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. హిందీ, భోజ్‌పూరి భాషలో పట్టు ఉండటంతో ఆయన సులువుగా ఓటర్లతో కలిసిపోయి వారిని ఆకట్టుకోగలిగారని, ఇది బీజేపీకి బాగా కలిసి వచ్చిందని పరిశీలకులు చెప్తున్నారు. -
ఆప్‌లో మొదలైన కల్లోలం!
కొనసాగుతున్న రాజీనామాల పర్వం ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీలో కల్లోలం రేగుతోంది. తాజా ఓటమితో పార్టీ నాయకత్వంపై అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా రాజనామాల బాట పడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ నేతలతో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. పార్టీలో పరిణామాలు మరింత నష్టం కలిగించకుండా నివారణ చర్యలు తీసుకునేందుకే ఈ భేటీ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ చిత్తయిన నేపథ్యంలో ఆ పార్టీ పంజాబ్ ఇన్చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్టు సీనియర్ నేత సంజయ్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు రాజీనామాను కేజ్రీవాల్‌కు పంపినట్టు ఆయన తెలిపారు. ఆయనతోపాటు పంజాబ్ సహ పరిశీలకులు దుర్గేష్ పాఠక్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలోని 70 సీట్లలో 67 స్థానాలు గెలుచుకున్న ఆప్.. తాజా మున్సిపల్ ఎన్నికల్లో 270 స్థానాలకు 48 సీట్లు గెలిచి ఘోరంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ పరాభవం నేపథ్యంలో నాయకత్వంపై నేతలు భగ్గుమంటున్నారు. బుధవారమే ఆప్ ఢిల్లీశాఖ కన్వీనర్ దిలీప్ పాండే తన పదవికి రాజీనామా చేశారు. ఆప్ ఢిల్లీ ఇన్చార్జి ఆశిష్ తల్వార్ సైతం తన పదవిని వీడుతున్నట్టు ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యే అయిన అల్కా లంబా సైతం తన శాసనసభ సభ్యత్వంతోపాటు పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేయాలనుకుంటున్నట్టు ప్రకటించారు. మొత్తానికి తాజా పరాభవం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్‌ను కుదిపేస్తున్నది. ఈ రాజీనామాల పర్వంతో ఆప్ అంతర్గత నిర్మాణం పూర్తిగా మారే అవకాశముంది. -
ఢిల్లీలో అఖిలేష్, డింపుల్ ప్రచారం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆయన భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. అఖిలేష్ దంపతులతో పాటు సినీ నటి, ఎంపీ జయా బచ్చన్, అఖిలేష్ బాబాయ్ రాంగోపాల్ యాదవ్, పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం 76 మంది ప్రచారం చేస్తారని ఢిల్లీ ఎస్పీ చీఫ్ ఉషా యాదవ్ చెప్పారు. ఏప్రిల్ 23న జరిగే ఎంసీడీ ఎన్నికలకు ఎస్పీ తరఫున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న ఎస్పీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఎంసీడీ ఎన్నికల్లో మాత్రం ఎస్పీ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. త్వరలో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు ఉషా యాదవ్ చెప్పారు. ఎంసీడీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఎస్పీ, బీఎస్పీ, జేడీయూ బరిలో ఉన్నాయి. బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తారు. 2007 నుంచి ఎంసీడీని బీజేపీ పాలిస్తోంది. ఎంసీడీలో మొత్తం 272 కార్పొరేటర్ల స్థానాలున్నాయి.