MCR HRD
-
తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్ గా ఎంసీఆర్ హెచ్ఆర్ డీ..?
-
మంత్రి చందూలాల్‌కు చేదు అనుభవం
హోటల్ గేటు వద్దే అడ్డుకున్న భద్రతా సిబ్బంది సీఎం లోనికి వెళ్లేదాకా అక్కడే నిలిపివేత సాక్షి, హైదరాబాద్: కలెక్టర్ల సదస్సు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్‌కు చేదు అనుభవం మిగిల్చింది. సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మారియట్ హోటల్‌కు చేరుకున్న ఆయన్ను, సీఎం వస్తున్నారంటూ భద్రత సిబ్బంది గేటు వద్దే అడ్డుకుని రోడ్డుపై నిలిపివేశారు. కారు దిగి హోటల్ లోపలికి నడుచుకుంటూ వెళ్లబోయినా ఒప్పుకోలేదు. సీఎం కాన్వాయ్ సమీపించిందని, ఆయన లోపలకు వెళ్లేదాకా అక్కడే వేచి వుండాలని పోలీసులు స్పష్టం చేశారు. దాంతో, సీఎం కాన్వాయ్ వచ్చి హోటల్ లోపలికి వెళ్లేదాకా కొద్ది నిమిషాల పాటు చందూలాల్ అక్కడే వేచి చూడాల్సి వచ్చింది. అదే సమయంలో మంత్రి కేటీఆర్ వచ్చి రోడ్డుపైనే కారు దిగి హోటల్లోకి నడుస్తూ వెళ్లిపోవడంతో చందూలాల్ కూడా ఆయన్ను అనుసరించారు. ఇక సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఐపీఎస్‌లకు మాత్రం భద్రతా సిబ్బంది రాచబాట పరిచారు. ఐపీఎస్‌ల వాహనాలు హోటల్ లోపలిదాకా వెళ్లి వారిని ప్రవేశ ద్వారం వరకు దిగబెట్టి తిరిగొచ్చాయి. కానీ కలెక్టర్లతో సహా ఐఏఎస్‌ల వాహనాలను మాత్రం పోలీసులు హోటల్ ప్రధాన గేటు వద్దే రోడ్డుపై ఆపేశారు. దాంతో వారంతా అక్కణ్నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కలెక్టర్ల సదస్సు అధికారులు, ప్రజాప్రతినిధుల కోలాహాలంతో కిక్కిరిసిపోయింది. తొలి రోజు సదస్సు ఉదయం 10.30 నుంచి రాత్రి 8.30 గంటల దాకా సుదీర్ఘంగా సాగింది. -
పదవులు కాదు.. పని ముఖ్యం: కేసీఆర్
హైదరాబాద్: ఎంసీఆర్ హెచ్ఆర్డీ వేదికగా శుక్రవారం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పాలనపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత మనందిరిపైనా ఉందని చెప్పారు. పదవులు వస్తుంటాయి.. పోతూంటాయి.. ఎంతబాగా పనిచేశామనేది ముఖ్యమని తెలిపారు. పేదరిక నిర్మూలనే తెలంగాణ ప్రభుత్వ అతిపెద్ద ఎజెండాగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమనీ, అవీ లేకుంటే ఏమీ లేనట్లే లెక్క అంటూ కేసీఆర్ ఉద్ఘాంటించారు. -
17, 18 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్
⇒ పాల్గొననున్న సీఎం కేసీఆర్, అన్ని శాఖల మంత్రులు సాక్షి, హైదరాబాద్: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విభాగం(ఎంసీఆర్ హెచ్ఆర్డీ) వేదికగా ఈ నెల 17, 18 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ఈ మేర కు ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం ఉన్నతాధికారులు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 9, 10 తేదీల్లోనే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా, అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఉగ్రవాద ఘటనల నేపథ్యంలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ హామీలు, నెరవేర్చేం దుకు చేపట్టాల్సిన చర్యలు, క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వాస్తవ పరిస్థితులపై రెండ్రోజుల పాటు సమగ్రంగా చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు అన్ని శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ విభాగాల కమిషనర్లు, కార్పొరేషన్ల మేనేజింగ్ డెరైక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.