me seva centers
-
‘మీ సేవ’లో దరఖాస్తు చేసుకున్నా.. జీహెచ్ఎంసీకి వెళ్లాల్సిందేనట..!
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట సర్కిల్లోని సైదాబాద్‌కు చెందిన ఓ బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. రాబోయే మార్చిలో పబ్లిక్ పరీక్షలకు అతను హాజరు కావాల్సి ఉంది. స్కూల్ యాజమాన్యం ఇచ్చిన సంబంధిత ఫారమ్‌లో పూర్తి వివరాలు నింపి జత చేయాల్సిన సర్టిఫికెట్లు బడిలో సమర్పించాడు. విద్యార్థి బర్త్ సర్టిఫికెట్లో తల్లి పేరు ఫారమ్‌లో తప్పుగా పేర్కొనడంతో స్కూల్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. బర్త్ సర్టిఫికెట్లో తల్లి పేరు సరిచేసుకొని సమర్పించాలని సూచించారు. బాలుడి తల్లిదండ్రులు జీహెచ్ఎంసీ కార్యాలయంలో సంప్రదించగా, మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఇంట్లో మరో సంతానం బర్త్ సరిఫికెట్‌లో తల్లిపేరు సరిగా ఉంటే సదరు బర్త్ సర్టిఫికెట్ జిరాక్స్ జతచేసి మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిచేస్తారని తెలిపారు. మీ–సేవలో ఇచ్చిన డిక్లరేషన్ ఫారమ్‌లో ఇద్దరు గెజిటెడ్ అధికారుల సంతకాలు పెట్టించడంతో పాటు, నోటరీ, విద్యార్థి తల్లి ఆధార్, పాన్‌కార్డు, తమ్ముడి బర్త్ సర్టిఫికెట్ సైతం జత చేస్తూ మీ సేవ కేంద్రం ద్వారా జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేశారు. వారం రోజులైనా దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నట్లు మీ–సేవలో పేర్కొన్నారు. దరఖాస్తు పరిష్కారానికి ఏం చేయాలని అడిగితే.. మేం చేసేదేమీ లేదని, జీహెచ్ఎంసీ నుంచి ఫోన్ రాలేదా? ఆని ప్రశ్నించారు. రాలేదని తెలపగా తామేం చేయలేమన్నారు. తెలిసిన వారి ద్వారా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సంబంధిత ఉన్నతాధికారిని సంప్రదించగా.. ఆన్లైన్లో పరిశీలించి దరఖాస్తు రిజెక్ట్ అయినట్లు తెలిపారు. కనీసం రిజెక్ట్ అయిన విషయం కానీ.. ఎందుకు రిజెక్ట్ చేశారో కానీ మొబైల్‌కు సమాచారం అందలేదు. సదరు ఉన్నతాధికారి సంబంధిత సర్కిల్ అధికారులను ఫోన్లో వివరణ కోరగా, దరఖాస్తుతో జత చేసిన జిరాక్స్‌ల ఒరిజినల్స్ కావాలని తెలిపారు. దాంతో విస్తుపోయిన అధికారి ఎందుకని ప్రశ్నిస్తే.. ఇటీవల కొందరు ఫోర్జరీ పత్రాలిస్తున్నందున.. తాము పరిశీలన కోసం ఒరిజినల్స్ కోరుతున్నామని తెలిపారు. కనీసం ఒరిజినల్స్ తేవాల్సిందిగా దరఖాస్తుదారుకు సమాచారం ఇచ్చారా అంటే లేదని చెప్పారు. మరి వారికెలా తెలుస్తుంది..? అంటే సమాధానం లేదు. ఇలా ఉంది జీహెచ్ఎంసీ, మీ–సేవల పని తీరు. చదవండి: Banjara Hills: కళ్లల్లో కారంకొట్టి బ్యాగ్ లాక్కొని ఉడాయింపు.. ట్విస్ట్ ఏంటంటే! స్కాన్ కాపీలు పంపినా.. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేందుకే ప్రభుత్వం అన్ని సర్వీసుల్ని ఆన్లైన్ ద్వారా అందిస్తోంది. అందులో భాగంగానే బర్త్ సర్టిఫికెట్ల కోసం.. సవరణల కోసం సైతం ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. అవసరమైన ఒరిజినల్ పత్రాలు మీ సేవలో స్కాన్ చేసి, సంబంధిత కార్యాలయాలకు పంపుతారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఒరిజినల్స్వే స్కాన్ చేసి ఆన్లైన్లో పంపినప్పుడు మళ్లీ ఒరిజినల్స్ కావాలనడం.. అది సైతం కనీసం సమాచారం తెలపకపోవడం వెనక మతలబేమిటన్నది అంతుచిక్కడం లేదు. పైసల కోసమే.. జీహెచ్ఎంసీ వ్యవహారాలు తెలిసిన వారు అది పైసల కోసమని చెబుతున్నారు. సర్టిఫికెట్ల అవసరం ఉన్నవారూ ఎలాగూ వారి పనికోసం నానా తంటాలు పడతారు. అలా తిరిగి తిరిగి తమ వద్దకే వస్తారు కాబట్టి.. అప్పుడు లేనిపోని కొర్రీలు పెట్టి.. ఇతరత్రా భయపెడతారని, అడిగినంత ఇచ్చుకుంటే మాత్రం పని చేస్తారని పేర్కొన్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అవకతవకలు జరుగుతున్నాయని, అవినీతికి పాల్పడుతున్నారనే ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వం ఒక విధంగా అవినీతిని కట్టడి చేయాలనుకుంటే.. అవినీతికి అలవాటు పడ్డవారు మరో విధంగా ఇలా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తనిఖీలు లేకనే.. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సర్కిల్ కార్యాలయాలను కనీసం తనిఖీలు చేయకపోవడం.. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్టించుకోకపోవడంతో సర్కిళ్లు, జోనల్ కార్యాలయాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఎన్ని సార్లు మొత్తుకున్నా వారికి చీమకుట్టినట్లయినా ఉండటం లేదు. ప్రజల ఈ ఇబ్బందులను సంబంధిత ఉన్నతాధికారి దృష్టికి తేగా, ఇకపై అలా జరగకుండా చూస్తామని మొక్కుబడి సమాధానమిచ్చారు. అంతేకాదు.. డబ్బులడిగినట్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతారట. జీహెచ్ఎంసీ సిబ్బందికి, మీ సేవ కేంద్రాల సిబ్బందికి మధ్య పరస్పర సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. మీ సేవలో దరఖాస్తు చేసినప్పుడే.. పని పూర్తయ్యేందుకు జీహెచ్ఎంసీలో కలవాల్సిన వారి గురించి చెబుతారని సమాచారం. ఇదీ.. జీహెచ్ఎంసీ.. మీ సేవ తంతు. -
కటాక్షించని ‘కల్యాణలక్ష్మి’!
బోథ్: పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, కొంతకాలంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామందికి చెక్కులు అందడం లేదు. చాలా వరకు దరఖాస్తులు ఆయా తహసీల్దార్ కార్యాయాల్లోనే మూలుగుతున్నాయనీ, వాటిని పట్టించుకునే వారే లేకుండా పోయారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులు మాత్రం పెళ్లి సమయంలో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ‘నవ్వ రాములు’లాగానే ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమకు ఆ చెక్కులేవో ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 18 మండలాలు, 467 పం చాయతీలు ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4,146 మంది కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,053 మందికి చెక్కులు అందగా, 31 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 1062 మందికి ఇంకా చెక్కులు అం దలేదు. అలాగే, షాదీముబారక్ కోసం 989 మం ది దరఖాస్తు చేసుకోగా, 568 మందికి చెక్కులు అందాయి. 17 దరఖాస్తులు తిరస్కరణకు గురవగా, 404 మందికి ఇంకా చెక్కులు అందలేదు. ఆఫీసుల్లోనే పెండింగ్.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కోసం లబ్ధిదారులు ‘మీసేవా’ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటారు. ఈ దరఖాస్తులు మీ సేవా కేంద్రం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి చేరతాయి. ఇక్కడ అధికారులు పరి«శీలించిన తరువాత ఆర్డీఓ కార్యాలయానికి అప్రూవల్ కోసం పంపించాలి. కానీ, చాలా దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాల్లోనే ఆగుతున్నాయి. కొన్ని రోజులుగా వరుసగా ఎన్నికలు రావడంతో అధికారులు ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ కారణంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తుల ప్రక్రియ నెమ్మదించింది. ఇప్పుడు కూడా అధికారులు లోక్‌సభ ఎన్నికల విధుల్లో తలమునకలై ఉన్నారు. దీంతో లబ్ధిదారులు వీఆర్వో, ఆర్ఐ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇదిలా ఉంటే, నిధులు కొరత వల్లే చెక్కులు రావడం లేదని అధికారులు చెప్పారని లబ్ధిదారులు పేర్కొనడం గమనార్హం! కాగా, మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయించినట్లు తెలుసనీ, అధికారులు కూడా దరఖాస్తుల ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తే తమకు ఆసరాగా ఉంటుందని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
మైనారిటీ రుణాలపై.. అధికార పెత్తనం
కర్నూలు నగరంలోని ఖడక్‌పురాకు చెందిన మైమున్ బేగం (బాధితురాలి విన్నపం మేరకు పేరు మార్చాం) శారీ బిజినెస్ కోసం రూ.లక్ష రుణం కావాలని దరఖాస్తు చేసుకుంది. రుణం ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు కూడా అంగీకరించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఆమె మైనారిటీ కార్పొరేషన్, మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల చుట్టూ నెలల తరబడి తిరుగుతూనే ఉంది. అయితే..ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు. అధికార పార్టీ నేతల సిఫారసు లేకపోవడమే ఇందుకు కారణం. కర్నూలుకు చెందిన అధికార పార్టీ చోటా నాయకుడు ఇటీవలే మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి తాను టీడీపీ ముఖ్య నేత అనుచరుడినని, అన్న చెప్పారు.. వీరికి రుణాలు మంజూరు చేయాలంటూ పాతిక మంది పేర్లతో కూడిన జాబితా ఇచ్చారు. ఇంత మందికి ఒకేసారి రుణాలు ఎలా మంజూరు చేయాలో తెలియని స్థితిలో అధికారులు తల పట్టుకున్నారు. కర్నూలు(రాజ్‌విహార్): జిల్లాలో మైనారిటీ కార్పొరేషన్ రుణాలపై అధికార పార్టీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. ఆర్థికాభివృద్ధి కోసం రుణాలకు దరఖాస్తు చేసుకుంటే మంజూరు కాకుండా అడ్డుపుల్ల వేస్తున్నారు. తాము చెప్పని వాళ్లకు రుణాలు ఇస్తే ఇక్కడ ఉద్యోగం చేసుకోలేరంటూ అధికారులను బెదిరించడానికీ వెనుకాడడం లేదు. వారి అనుచరులు, అనుయాయులకు మాత్రమే రుణాల మంజూరు కోసం సిఫారసు చేస్తున్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా 4,536 మందికి రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు రూ.46.02 కోట్ల సబ్సిడీ నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ ప్రభుత్వం అరకొరగానే నిధులు విడుదల చేస్తోంది. ఇప్పటివరకు రూ.16.07 కోట్లు విడుదల కాగా.. 2,269 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారు. మిగిలిన 2,267 మంది అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రుణాలు మంజూరైన వారిలో అత్యధిక శాతం అధికార పార్టీ నాయకుల నుంచి సిఫారసులు పొందిన వాళ్లే కావడం గమనార్హం. మంజూరు ప్రక్రియ ఇలా.. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ లింకేజీ రుణాలు మాత్రమే మంజూరు చేస్తున్నారు. ఇందుకోసం నిర్ణీత గడువులోపు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రింట్ కాపీ, ఇతర ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. మునిసిపాలిటీల్లో నివసించే వారైతే సంబంధిత మునిసిపల్ కార్యాలయం, గ్రామీణులైతే ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరై దరఖాస్తుకు ఆమోదముద్ర వేయించుకోవాల్సి ఉంటుంది. అడిగింది ఇస్తేనే సిఫారసు అధికార పార్టీ నేతలు, జన్మభూమి కమిటీల సిఫారసు ఉంటేనే రుణాలు మంజూరవుతున్నాయి. ఆన్లైన్ దరఖాస్తులు మునిసిపాలిటీలు/ మండల పరిషత్ కార్యాలయాల్లో అప్రూవ్ కావాలంటే అధికార పార్టీ నేతల అనుమతి తప్పనిసరిగా మారింది. అక్కడ ఎలాగో చెప్పుకుని దాటి వస్తే మైనారిటీ కార్పొరేషన్లో పెండింగ్ పెడుతున్నారు. అడిగినంత ఇస్తేనే సిఫారసు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఎంపీడీఓ, మునిసిపల్ కార్యాలయాల్లో నిర్వహించే ఇంటర్వ్యూల్లో ఎంపిక కోసం రూ.2వేల నుంచి రూ.5వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఐదేళ్లుగా అరకొరే జిల్లాలో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఐదేళ్లుగా రుణాలు అరకొరగానే మంజూరవుతున్నాయి. 2013–14 ఆర్థిక సంవత్సరంలో 2,165 మందికి గాను 1,304 మంది మాత్రమే మంజూరు చేశారు. అలాగే 2014–15లో కేవలం 360 మందికి, 2015–16లో 3,863 మందికి గాను 2,262 మందికి, 2016–17లో 2,395 మందికి గాను 1,323 మందికి మంజూరు చేశారు. 2017–18లో 2,578 మందికి, 2018–19లో 4,536 మందికి గాను ఇప్పటివరకు 2,269 మందికి మాత్రమే రుణాలిచ్చారు. -
షట్ డౌన్
సాక్షి, జనగామ: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మీ సేవ కేంద్రాల్లో వసూలు చేసే కమీషన్ రుసుం పెంచాలని మీ సేవ నిర్వాహకులు(ఆపరేటర్లు) ఆందోళన బాటపట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని పోరాటానికి సిద్ధమయ్యారు. ఆందోళనలో భాగంగా నవంబర్ 1వ తేదీ నుంచి సామూహికంగా మీ సేవా కేంద్రాలను బంద్ చేయాలని నిర్ణయిం చారు. ప్రభుత్వం కమీషన్ ధరలను సవరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. 500 రకాల సేవలు.. ధ్రువీకరణ పత్రాల జారీలో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు 2011లో మీ సేవ కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 662 కేంద్రాలు ఉన్నాయి. 50 రకాల ప్రభుత్వ రంగ విభాగాలకు సంబంధించిన 500 రకాల సేవలను మీ సేవ ద్వారా అందిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న ఆర్జీదారులకు మీసేవ ద్వారా నిర్దిష్ట గడువులోగా ధ్రువీకరణ పత్రాలను అందిస్తున్నారు. కులం, ఆదాయం, నివా సం, పహాణీలు, జనన, మరణ పత్రాలతోపాటు పలు రకా ల ధ్రువీకరణ పత్రాలను మీసేవ ద్వారా జారీ చేస్తున్నారు. కమీషన్ కోసం ఆందోళన బాట.. మీ సేవ కేంద్రాల్లో జారీ చేస్తున్న ధ్రువీకరణ పత్రాల జారీలో ప్రభుత్వం చెల్లిస్తున్న కమీషన్ తక్కువగా ఉందని నిర్వాహకులు ఆందోళన బాటపడుతున్నారు. 2011లో ఖరారు చేసిన కమీషన్‌నే ఇప్పటికీ చెల్లిస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కమీషన్ రాకపోవడంతో నిర్వాహకులు ఇక్కట్లు పడుతున్నారు. పేపర్ ధరలు పెరగడంతో జీఎస్టీతో మరింత ఆర్థికభారం పడుతోంది. కమీషన్‌ను ప్రభుత్వం సవరించకపోవడంతో ఆందోళన మార్గం తప్ప మరోదారి లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీసేవ నిర్వాహకుల డిమాండ్లు ఇవే.. ప్రైవేటు ఎస్‌సీఏలను తొలగించి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి మీసేవ కేంద్రాలను తీసుకోవాలి. మీ సేవ నిర్వాహకుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పించాలి. యూజర్ చార్జీలను పెంచాలి. సేవలపై కమీషన్ 80 శాతం వచ్చేలా చూడాలి. మీ సేవ నిర్వాహకులకు వచ్చే కమీషన్‌పై జీఎస్టీ పడకుండా నిర్ణయం తీసుకోవాలి. ఫిజికల్ కాపీలను అడుగుతున్న అధికారులకు ప్రభుత్వపరంగా సూచనలు చేయాలి. ప్రతి సంవత్సరం మీ సేనను రెన్యూవల్ చేసుకునే విధానాన్ని తొలగించాలి. అప్లికేషన్లు తప్ప మిగితా కాపీలకు స్కానింగ్ చార్జీలను విధించాలి. నోటిఫికేషన్లు లేకుండా మీ సేవ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నోటిఫికేషన్లు లేకుండా అనుమతి ఇచ్చే అధికారులపై చర్య తీసుకోవాలి. మీ సేవ ఉన్న గ్రామాల్లో సమగ్ర సమాచార కేంద్రాలను మూసివేయాలి. మీ సేవ కేంద్రాలకు ఆధార్ సెంటర్లివ్వాలి. ప్రతి మీసేవ నిర్వాహకుడికి సీఎస్సీ లాగిన్ ఇవ్వాలి. స్టాంప్ వెండర్స్ విక్రయాలతోపాటు యూనివర్సిటీ ఫీజుల చెల్లింపునకు అవకాశమివ్వాలి. ప్రభుత్వం స్పందించకపోతే బంద్ పాటిస్తాం మీ సేవ నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి పలు సందర్భాల్లో నివేదించాం. ఇటీవల ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందించాం. నవంబర్ 1 నుంచి మీ సేవ కేంద్రాలను బంద్ చేసి మా కనీస హక్కులను సాధించుకుంటాం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కమీషన్ రాక కుటుంబాలను పోషించడం కష్టంగా మారింది. రూం రెట్లు, జీఎస్టీ భారంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. మా న్యాయపరమైన సమస్యలను తీర్చాలి. లేకపోతే కేంద్రాలను బంద్ చేసి ఆందోళన కార్యక్రమాలను చేపడుతాం. – రావిపాటి దేవేందర్, తెలంగాణ మీ సేవ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
ఆధార్ అవస్థలు
ఆధార్ కార్డులో చిరునామాల మార్పు, తప్పులను సరిచేసుకునేందుకు ఎక్కువ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఓ వైపు ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు. పలు కేంద్రాల వద్ద సర్వర్లు మొరాయిస్తుండటంతో ఆయా కేంద్రాల వద్ద ప్రజలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. చిన్నారుల ఫింగర్ ప్రింట్స్, ఫొటోల అప్లోడ్ తదితర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నెల్లూరు(వేదాయపాళెం): గతంలో ఆధార్, మీ సేవ కేంద్రాల వద్ద ఆధార్ కార్డులో మార్పులు, సవరణలు చేసేవారు. ఆధార్ కేంద్రాల నిర్వహణ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కొంతకాలంగా జిల్లాలోని మీ సేవ కేంద్రాల్లో ఆధార్ సేవలను నిలిపివేశారు. జిల్లాలో కేవలం రెండు మీ సేవ కేంద్రాల్లో మాత్రమే ఆధార్ సేవలను కొనసాగిస్తున్నారు. ఈ రెండు కేంద్రాలను కూడా జిల్లా కలెక్టర్ చొరవతోనే సాగుతున్నాయి. జిల్లాలోని పలు పోస్టాఫీసులు, పలు బ్యాంక్‌లలో ప్రత్యేకంగా ఆధార్ సేవా విభాగాలను ఏర్పాటు చేశారు. గతంలో జిల్లా కేంద్రంలోని గాంధీబొమ్మ సమీపంలో సండే మార్కెట్ వద్ద, నెల్లూరు తహసీల్దారు కార్యాలయం వద్ద ఆధార్ కేంద్రాలు కొనసాగుతుండేవి. సండేమార్కెట్ వద్ద ఉన్న కేంద్రాన్ని నిలిపివేశారు. తహసీల్దారు కార్యాలయం వద్ద ఉన్న ఆధార్ కేంద్రాన్ని సమీపంలోని ఎస్బీఐలోకి మార్పు చేశారు. ప్రస్తుతం ఎంపిక చేసిన బ్యాంక్‌లు, పోస్టాఫీసుల వద్ద మాత్రమే ఆధార్ సేవలు అరకొరగా అందుతున్నాయి. పడిగాపులు బ్యాంక్‌లు, పోస్టాఫీసుల వద్ద ఏర్పాటు చేసిన ఆధార్ విభాగాల వద్ద సర్వర్లు తరచూ మొరాయిస్తుండటంతో అక్కడకెళ్లేవారు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు ఆధార్ సేవలను పొందాలనుకునేవారు 40 నుంచి 50 మంది ఒక్కొక్క కేంద్రం వద్ద బారులు తీరుతున్నారు. అయితే ఒక్కో కేంద్రం వద్ద 15 దరఖాస్తులు మాత్రమే అందజేసి ఆరోజు వాటా అయిపోయిదంటూ మిగిలిన వారిని వెనక్కి పంపుతున్నారు. దీంతో ఆధార్ కార్డులో మార్పులు చేయించుకోవాలని వచ్చిన వారు తీవ్ర నిరాశతో వెనుదిరిగి వెళుతున్నారు. కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు ఒకే కుటుంబంలో వారికి రెండు, మూడు దరఖాస్తులు కావాల్సిన వారు పనులను వదులుకుని పదే పదే కౌంటర్ల వద్దకు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల వివిధ కులాలకు చెందిన వారికి సబ్సిడీ రుణాలను మంజూరు చేశారు. వీరికి ప్రస్తుతం ఉన్న చిరునామాతో ఆధార్ కలిగి ఉండాలి. చాలమందికి గతంలో నివాసం ఉన్న చోటే ఆధార్ ఉంది. ప్రస్తుతం చిరునామా ప్రకారం ఆ«ధార్‌లో సవరణ చేసుకునేందుకు అధిక సంఖ్యలో ప్రజలు కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. సకాలంలో సవరణలు జరిగితే తప్ప బ్యాంక్‌లలో డాక్యుమెంటేషన్ కార్యకలాపాలు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ప్రాజెక్టు వర్క్‌లకు సంబంధించి నగదు, బ్యాంక్‌లలో జమ అయ్యేందుకు అకౌంట్లు ఓపెన్ చేసుకునేందుకు ఆధార్ ఫింగరింగ్ తప్పనిసరిగా మారింది. హైస్కూల్ విద్యార్థులకు ఈ సమస్య ఇబ్బంది కలిగిస్తోంది. చిన్నతనంలో తీసిన ఆధార్‌తో సంబంధం లేకుండా ప్రస్తుత ఫింగరింగ్ను నమోదు చేయాలనే నిబంధన విద్యాశాఖలో, బ్యాంకుల్లో నెలకొని ఉంది. ప్రాజెక్టు వర్క్‌లకు సంబంధించి ప్రైవేటు పాఠశాలలో తరగతికి ఇద్దరు చొప్పున ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎంపిక చేసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపుతారు. ప్రాజెక్టు వర్క్‌ను బట్టి రూ.5 వేలు, రూ.10 వేలు చొప్పున విద్యార్థుల ఖాతాల్లో జమ అవుతాయి. ఈ తంతు కొనసాగాలంటే బ్యాంకులలో అకౌంట్లు ప్రారంభించి ఉండాలి. ఆధార్ ఫింగరింగ్ ఉంటే తప్ప బ్యాంకు అకౌంట్లు ప్రారంభించడం వీలుకాదని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు. ఆధార్ కౌంటర్ల వద్ద తీవ్ర జాప్యం జరుగుతుండటంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు అవస్థలు ఆధార్ సేవా కేంద్రాల వద్ద తమ ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ చేసుకునేందుకు వచ్చే విద్యార్థులు పడే అవస్థలు అంతా ఇంతా కాదు. మహిళలు చిన్నపిల్లలతో పడిగాపులు కాస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. –కె.వెంకటేశ్వర్లు, నెల్లూరు తీవ్ర జాప్యంతో ఇబ్బందులు బ్యాంక్‌లు, పోస్టాఫీ సులవద్ద ఏర్పాటు చే సిన ఆధార్ సేవా కేం ద్రాల వద్ద తరచూ స ర్వర్ డౌన్ కావడంతో కార్డుల్లో మార్పులు చేయించుకునేందుకు తీవ్ర జాప్యం జరుగుతోంది. గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. –సైదాపురం సతీష్, నెల్లూరు సమస్యను మా దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం ఆధార్ కేంద్రాల వద్ద సమస్యలను ఎవరైనా మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. సర్వర్ డౌన్ అనేది మా పరిధిలో ఏమి చేయలేం. కేంద్రాల వద్ద దరఖాస్తులు ఎక్కువ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. –డి.హరిత, ఆర్డీఓ, నెల్లూరు -
తహసీల్దార్ కార్యాలయాల్లో దళారీల దందా!
ప్రభుత్వ శాఖలన్నింటిలో ఎక్కువ అవినీతి రెవెన్యూ విభాగంలో ఉందని ప్రభుత్వం నిర్వహించిన సర్వేలు తేటతెల్లం చేశాయి. అవినీతి, దళారీ వ్యవస్థను రూపుమాపాలని మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేసినా అవినీతి రుచిమరిగిన అధికారులు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. ఏదైనా ధ్రువ పత్రం కోసం సరైన రికార్డులతో మీసేవలో దరఖాస్తు చేసుకుంటే కొద్ది రోజుల్లో సర్టిఫికెట్ వస్తుందని పాలకులు గొప్పలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం దరఖాస్తుదారులు తహసీల్దార్ కార్యాలయంలో చేయి తడిపితే పని వేగంగా పూర్తవుతుంది. లేదంటే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. కర్నూలు(అగ్రికల్చర్): మీసేవ కేంద్రాలు అందుబాటులోకి వచ్చినా ధ్రువ పత్రాల కోసం లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎటవంటి సర్టిఫికెట్ కావాలన్నా మీసేవ కేంద్రంలో తగిన పత్రాలు సమర్పించి ఆన్లైన్లో అప్లోడ్ చేయిస్తే నిర్ణీత గడువు తర్వాత మీసేవ కేంద్రం నుంచి సర్టిఫికెట్ పొందవచ్చనేది నిబంధన. అయితే ఇది ఎక్కడా అమలు కావడం లేదు. పలువురు తహసీల్దార్లు దళారీలను, ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. విచారణ జరిపి ఇవ్వాల్సిన వాటికి మాత్రం అడిగినంత ఇచ్చుకోక తప్పని పరిస్థితి. రెవెన్యూలో అడ్డగోలు వసూళ్లు.... మీసేవ కేంద్రాల్లో రెవెన్యూశాఖకు చెందినవే 70 వరకు సేవలు ఉన్నాయి. మ్యుటేషన్ కమ్ ప్యామిలి ఈ–పాసు పుస్తకం, ల్యాండ్ కన్వర్షన్, ఈబీసీ, ఓబీసీ సర్టిపికెట్లు, వ్యవసాయ ఆదాయపు ధ్రువపత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తదితర వాటి కోసం వీటిల్లో తగిన డాక్యుమెంట్లతో దరఖాస్తు చేయాలి. తహసీల్దారు వాటిపై వీఆర్ఓ, ఆర్ఐ ద్వారా విచారణ జరిపించి అన్ని సక్రమంగా ఉంటే నిర్ణీత గడువులోపు ఆమోదించి డిజిటల్ సిగ్నేచర్ ద్వారా సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇలా దాదాపు ఏ మండలంలో అమలు కావడం లేదు. మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే సర్టిఫికెట్ రాదని తహసీల్దార్లే పరోక్షంగా చెబుతున్నారు. మామూళ్లు ముట్టచెప్పకపోవడంతో తిరస్కరణకు గురవుతున్న దరఖాస్తులు అన్ని మండలాల్లో భారీగానే ఉంటున్నాయి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందడం గగనమే.. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందడం అతి కష్టంగా మారింది. కుటుంబ యజమాని మరణించినపుడు ఆయన భార్యకు వారసత్వ ( ఫ్యామిలీ మెంబర్) సర్టిఫికెట్ అవసరం. అన్ని డాక్యుమెంట్లతో మీసేవ కేంద్రంలో చేసుకుంటే 15 రోజుల్లో ఆమోదించాలి. ఇందుకు భిన్నంగా అన్ని స్థాయిల వారికి ముడుపులు ఇచ్చుకుంటేనే పని అవుతుంది. మ్యుటేషన్ కావాలంటే ఇచ్చుకోక తప్పదు... భూములు కొనుగోలు చేసినపుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిష్టర్ చేసిన తర్వాత రెవెన్యూ రికార్డులు, వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేసుకోవాలి. వీటినే మ్యుటేషన్‌గా వ్యవహరిస్తారు. ఇందుకు మీసేవ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్ కార్యాలయాల్లో ఇచ్చుకున్న వారి మ్యుటేషన్లు చేస్తూ మిగిలిన వాటిని తిరస్కరిస్తున్నారనే విమర్శలున్నాయి. మ్యుటేషన్ కమ్ ఈ–పాసుపుస్తకాలకు 59,500 దరఖాస్తులు మీసేవ కేంద్రాల ద్వారా వచ్చాయి. వీటిని 30 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంది. ఇందులో 36,000 దరఖాస్తులను మాత్రమే ఆమోదించారు.13,500 తిరస్కరించారు. ముడుపులు ఇవ్వకపోవడం వల్ల తిరస్కరించినవే ఎక్కువ ఉన్నట్లు సమచారం. -
‘మీ సేవ’లో నగదు
ఆదిలాబాద్‌అర్బన్: బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలంటే ఎటీఎంలు, బ్యాంకులకే వెళ్లాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్న మీ సేవ కేంద్రాల్లోనూ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకు అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. బ్యాంకు పేరు, ఆధార్ నంబర్ చెప్పి బయోమెట్రిక్ ఇస్తే సరిపోతుంది. డబ్బులు చేతికొస్తాయి. ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ సేవ కేంద్రాల ద్వారా నగదు చెల్లింపులకు ఆర్బీఐ కూడా ఆమోదం తెలపడంతో ప్రభుత్వం నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఆగస్టు 1 నుంచి ప్రారంభించింది. వచ్చే అక్టోబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలోని అన్ని మీ సేవ కేంద్రాల్లో ఈ విధానాన్ని అక్టోబర్ నుంచి ప్రారంభించే సాధ్యాసాధ్యాలపై మీసేవ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో ఏర్పడిన నగదు కొరత, పెద్దనోట్ల రద్దు తర్వాత వచ్చిన నగదు సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చింది. పనిచేసేదిలా.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇదే రీతిలో ఆధార్ సమన్వయంతో డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం’(ఏఈపీఎస్)ను ప్రవేశపెట్టింది. ఈ సిస్టం ద్వారా మీ సేవ కేంద్రానికి వెళ్లి డబ్బు డ్రా చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాటించే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ మార్గదర్శకాలను అనుసరించి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆధార్ నంబర్, బ్యాంకు పేరు చెప్పి బయోమెట్రిక్ వివరాలు ఇవ్వాలి. బ్యాంకు ఖాతా నంబర్ చెప్పకుండానే డబ్బు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. త్వరలో మీ సేవలో ఈ సిస్టం అందుబాటులోకి రానుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తికి వివిధ రకాల నాలుగు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయనుకుందాం.. డబ్బు డ్రా చేసేందుకు సదరు వ్యక్తి మీ సేవ కేంద్రానికి వచ్చినప్పుడు ఆధార్ వివరాలు చెప్పాలి. ఇదివరకే బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానమై ఉంది. మీ సేవ నిర్వాహకులు ఏఈపీఎస్ సిస్టంలో ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే ఆ వ్యక్తి పేరు మీద ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయనేది స్పష్టంగా కన్పిస్తాయి. వ్యక్తి అభిప్రాయం మేరకు సదరు బ్యాంకు ఖాతా నుంచి డబ్బు డ్రా చేసి రశీదుతోపాటు నగదును మీసేవ నిర్వాహకులు సదరు వ్యక్తికి అందజేస్తారు. ఇలా ఒక రోజులో ఒక వ్యక్తి గరిష్టంగా రూ.10 వేలు మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంది. జిల్లాలో ఇలా.. జిల్లాలో అన్ని చోట బ్యాంకు బ్రాంచీలు అందుబాటులో లేవు. కానీ.. మీ సేవ కేంద్రాలు పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నాయి. దీని దృష్ట్యా మీ సేవ కేంద్రాల ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసిస్తే.. నగదు కొరతను అధిగమించవచ్చనే దిశగా ప్రభుత్వ ఆలోచన చేస్తోంది. జిల్లాలోని 18 మండలాల పరిధిలో మొత్తం 93 వివిధ బ్యాంకు బ్రాంచీలు ఉన్నాయి. ఈ బ్రాంచీల పరిధిలో ప్రస్తుతం 12,86,171 మంది ఖాతాదారులు ఉన్నారు. జిల్లాలో 76 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. బ్యాంకు బ్రాంచీల కన్నా మీ సేవ కేంద్రాలు తక్కువగా ఉన్నా.. ఎక్కువ శాతం మీ సేవ సెంటర్లు గ్రామాల్లోనే ఉన్నాయి. మీసేవ కార్యకలాపాలు ఎక్కువగా నగదు రూపంలోనే జరుగుతుంటాయి. వివిధ రకాల సర్టిఫికెట్లు, ధ్రువపత్రాల జారీ, కరెంట్ బిల్లుల రూపంలో మీ సేవలకు వచ్చిన నగదును బ్యాంకు లావాదేవీలకు వాడనున్నారు. ఆధార్ ఆధారిత లావాదేవీలను ప్రవేశపెట్టడంతో ఇటు బ్యాంకులకు.. అటు మీ సేవ నిర్వాహకులకు ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి. బ్యాంకు తరఫున లావాదేవీలు నిర్వహించినందుకు మీ సేవ కేంద్రం ఆపరేటర్లకు అదనపు ఆధాయం లభిస్తుంది. మీ సేవలకు వివిధ రకాల సేవలు అందించినందుకు చార్జీల రూపంలో వచ్చిన మొత్తాన్ని ఈఎస్డీ విభాగానికి పంపేందుకు ఆపరేటర్లు బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ చేయాల్సి వస్తోంది. ఇలా డిపాజిట్ చేసినందుకుగాను సహజంగానే బ్యాంకు క్యాష్ హ్యాడ్లింగ్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. దీంతో ఆపరేటర్లు తమ కష్టార్జీతాన్ని ఈ రూపంలో కోల్పోవాల్సి వస్తోంది. తాజా విధానంతో వినియోగదారులకే సొమ్ము అందించడంతో బ్యాంకుకు చెల్లించే చార్జీలు తగ్గడంతోపాటు అదనపు ఆదాయం రానున్నదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అక్టోబర్ నుంచి ప్రారంభం కావచ్చు మీ సేవ కేంద్రాల్లో బ్యాంకు సేవలను అక్టోబర్ నుంచి ప్రారంభించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఆగస్టు 1 నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. ఈ విధానంతో నగదు కొరత అనేది ఉండదు. ఖాతాదారులకు బ్యాంకులు, ఏటీఎం చుట్టూ తిరిగే ఇబ్బందులు తప్పుతాయి. – రఘువీర్‌సింగ్, మీసేవ జిల్లా కో–ఆర్డినేటర్, ఆదిలాబాద్ -
పచ్చనోటిస్తేనే పాస్ అవుతోంది
♦ జేసీ ఫోన్ఇన్లో బాధితుల ఫిర్యాదులు ♦ మూడు రోజులకు ఒకసారి ఫోన్ ఇన్ - జాయింట్ కలెక్టర్ ఒంగోలు టౌన్ : జిల్లాలో జరుగుతున్న మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంపై మూడు రోజులకు ఒకసారి ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ వెల్లడించారు. శుక్రవారం తన చాంబర్లో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోర్టు పరిధిలో లేని భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలు వంటివి పారదర్శకంగా అందించేందుకు మీ సేవ కేంద్రాల ద్వారా ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా దళారీలను ఆశ్రయించకుండా నేరుగా మీ సేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఈనెల 10నుండి ప్రారంభమైన మీ ఇంటికి మీ భూమికి సంబంధించి ఇప్పటివరకు 14090అర్జీలు వచ్చాయని, అందులో 7213అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించినట్లు చెప్పారు. 826అర్జీలను తిరస్కరించినట్లు తెలిపారు. ఆర్ఎస్ఆర్కు సంబంధించి 93గ్రామాల్లో 2లక్షల 90వేల రికార్డులను నమోదు చేశామని, మరో 4లక్షల రికార్డులను నమోదు చేయాల్సి ఉందని వివరించారు. ఫోన్ ఇన్ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ ఏడీ నరసింహారావు, డీ సెక్షన్ సూపరింటెండ్ ప్రసాద్‌లు పాల్గొన్నారు. ఫిర్యాదుల పరంపర... పచ్చనోటిస్తేనే పాస్ బుక్కులు పాసవుతున్నాయని, అవినీతి రాజ్యమేలుతోందని పలువురు బాధితులు జాయింట్ కలెక్టర్ హరి జవహర్లాల్ తన చాంబర్లో శుక్రవారం నిర్వహించిన ఫోన్‌ఇన్‌కు ఫిర్యాదు చేశారు. టైటిల్ డీడ్ కోసం నాలుగు నెలల నుంచి దర్శి తహసీల్ధార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని దర్శి మండలం ముండ్లమూరుకు చెందిన అంబవరపు వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. టైటిల్ డీడ్ ఇప్పిస్తానంటూ వీఆర్ఓ ఆరువేల రూపాయలు తీసుకున్నా పని మాత్రం జరగలేదన్నారు. దీనికి జేసీ స్పందిస్తూ మీ సేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దర్శిలో ఉంటున్న తన అన్న తిరుపతిరెడ్డికి సర్వే నెం 3లో 2.70 ఎకరాల భూమి ఉందని, ఆయన ఇటీవల మరణించడంతో తన వదిన పేరున పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని తహసీల్ధార్‌ను కోరితే రూ.1500 డిమాండ్ చేశారని ప్రస్తావించగా వెంటనే తిరుపతిరెడ్డి భార్యకు పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని దర్శి తహసీల్ధార్‌ను ఆదేశించారు. ఇంకొల్లు తహసీల్ధార్ కార్యాలయంలో కరప్షన్ ఎక్కువైంది. ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారు. కరప్షన్‌ను అరికట్టాలని ఇంకొల్లు మండలం సుబ్బారెడ్డిపాలెంకు చెందిన రామకోటిరెడ్డి ఫిర్యాదు చేశాడు. తాను కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వ భూమిగా చూపిస్తున్నారని, న్యాయం చేయాలని కోమటిగుంట కృష్ణ అనే వ్యక్తి వేడుకోగా వెంటనే సమస్యను పరిష్కరించాలని జేసీ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. పాస్ పుస్తకానికి ఏడాది నుంచీ తిప్పుకుంటున్నారని పొన్నలూరు మండలం వెలటూరు గ్రామానికి చెందిన కొండేటి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశాడు. పొన్నలూరు తహసీల్ధార్ కల్యాణ్‌తో జేసీ ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. తన భూమి వివరాలను మీ సేవలో చూసుకుంటే ఒక్క సెంట్ కూడా తన పేరు లేకుండా ఆక్రమించేశారని అర్ధవీడు మండలం కాకర్లకు చెంధిన పెరికె లక్ష్మణబాబు వాపోయాడు. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికారిని ఆదేశించారు.